ఆదివారం
03 నవంబర్ 2024
60-1207
The Pergamean Church Age

ప్రియ పవిత్రమైన కన్యక వధువా,

ఏడు సంఘకాలములను మీరు ఆనందిస్తున్నారా? ముందెన్నడూ లేని విధంగా దేవుడు తన వధువునకు ఉజ్జీవమును ఇస్తున్నాడు. మనమెవరమనియు, మరియు ఈ దినమునకై ఆయనయొక్క ఏర్పాటు చేయబడిన మార్గమైనటువంటి, వాక్యముతో నిలిచియుండుట ద్వారా మనము ఏమి చేస్తున్నామనియు ఎరిగియుండే విషయములో ఆయన మనకు ఎక్కువ బయలుపాటును, ఎక్కువ విశ్వాసమును, మరియు ఎక్కువ నిశ్చయతను ఇస్తున్నాడు.

ఇప్పుడు ఆయన మనకు ఇట్లు చెప్పుచున్నాడు: “ఆదివారపు కూడిక మొదలుకొని దానంతటి గురించి, ఆత్మసంబంధముగా ఆలోచించండి. పరిశుద్ధాత్మ దానిని నాంచి మరియు నేను చేయబోవుదానంతటిలో ఆత్మ సంబంధమైన అన్వయింపును పట్టుకొనునట్లు చేయును గాక. అది మలాకి 4 లోని నా ప్రవక్త ద్వారా పలుకబడినటువంటి నా ఆత్మచేత-పురిగొల్పబడిన వాక్యమైయున్నది”.

మనము ఆయన మాటలలో కొన్నిటిని చదివి మరియు వాటిని పట్టుకొని మరియు వాటికి మన ఆత్మ సంబంధమైన ఆలోచనను అన్వయించుదాము.

దేవుడు తన ఆత్మ-నింపుదలగల గుంపు కొరకు తన ఆత్మ-నింపుదలగల నాయకుడిని; తన దూతను ఏర్పాటు చేసాడు; మరియు అది అతని మీద ఒక నామముయొక్క ముద్రను ఉంచినది, కానీ అతడు దానిని బయలుపరచకూడదు. అతడు దానిని తనమట్టుకే ఉంచుకోవలసియున్నది, చూడండి. “అతడు గాక ఏ మనుష్యుడును ఎరుగడు.”

కావున దేవుడు తన ఆత్మ-నింపుదలగల గుంపుకు తన ఆత్మ-నింపుదలగల ఒక నాయకుడిని ఇచ్చాడు. తన ఆత్మ-నింపుదలగల గుంపుకు నాయకులను కాదుగాని, నాయకుడిని ఇచ్చాడు.

మన వద్దకు వచ్చి, మనలను బయటకు నడిపించేగొప్పవెలుగు దూత త్వరలో లోకమునకు వచ్చుచున్నాడు, ఒక గొప్ప పరిశుద్ధాత్మ, శక్తిలో వచ్చి, మరియు మనలను ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు నడిపిస్తాడు.

ఒక గొప్ప వెలుగు దూత. ఈ చివరి కాలమునకు ఆ గొప్ప వెలుగు దూత ఎవరు? విలియమ్ మారియన్ బ్రెన్హామ్. ఆయన పరిశుద్ధాత్మ గురించి మాట్లాడటంలేదు. ఆయన ఇదివరకే వచ్చియున్నాడు మరియు ఆయనేమో రాబోవువాని గురించి చెప్పుచున్నాడు.

ఆయన మనల్ని బయటకు నడిపించువాడు. మనల్ని నడిపించుచున్నది పరిశుద్ధాత్మేనని మనము నిజముగా ఎరిగియున్నాము మరియు దానిని నమ్ముచున్నాము, అయితే ఆయన తేటగా ఆయనయొక్క దూతను మరియు పరిశుద్ధాత్మను ఒక్కటిగా పెట్టి మరియు ఆయన (ఆయనయొక్క పరిశుద్ధాత్మ) ఆయనయొక్క గొప్ప వెలుగు దూత (ద్వారా) మనల్ని నడిపిస్తాడని చెప్పుచున్నాడు.

ఇట్లు చెప్పుట ద్వారా వారిరువురిని ఒక్కటిగా కట్టుటను ఆయన కొనసాగిస్తాడు:

ఆయనకది తెలియకపోవచ్చును,

అది ఎవరన్నది పరిశుద్ధాత్మకు తెలియదని ఆయన చెప్పడంలేదు, కానీ మనలను బయటకు నడిపించడానికి ఆయన ఎన్నుకున్న భూమి మీదనున్న దూతకు తెలియకపోవచ్చునని చెప్పుచున్నాడు.

అయితే ఒకానొక ఈ దినములలో అతడు ఇక్కడుంటాడు. అతడు...దేవుడు అతడిని తెలియజేస్తాడు. అతడు తననుతాను తెలియజేసుకోవలసిన అవసరంలేదు, దేవుడే అతడిని తెలియజేస్తాడు. దేవుడు తన స్వంతవారిని ఋజువుచేస్తాడు.

మరలా, ఒకానొక ఈ దినములలో, పరిశుద్ధాత్మ ఇక్కడుంటాడని ఆయన చెప్పడంలేదు కానీ ఆయనయొక్క వధువును నడిపించుటకు ఆయనయొక్క గొప్ప వెలుగు దూత ఇక్కడ ఉంటాడని చెప్పుచున్నాడు. అతడు తననుతాను తెలియజేసుకోవలసిన అవసరంలేదు, దేవుడు స్వయంగా తానే బయలుపాటు ద్వారా తనయొక్క వధువునకు ఆయనయొక్క గొప్ప నాయకుడిని తెలియజేస్తాడు.

ఆత్మసంబంధమైన అన్వయింపును మీరు పట్టుకుంటున్నారా? దేవుడు తన వధువును నడిపించుటకు ఎన్నుకున్న ఆ వెలుగు దూత ఎవరన్నది మీరు చూస్తున్నారా? ఆ సంగీతపు కర్ర ఇతర నాయకులకు అందించబడినదని ఇక్కడ చెప్పబడుచున్నదా?

మీరెన్నడూ మీ సంఘకాపరికంటె ఉన్నతముగా జీవించలేరు. మీరు కేవలం దానిని గుర్తుంచుకోండి, చూడండి.

ఇతరులు అర్థము చేసికొనక మరియు మనల్ని ఎగతాళి చేస్తుండగా, విలియమ్ బ్రెన్హామ్ మా సంఘకాపరి, అని చెప్పుటకు బయలుపాటును కలిగియున్నందుకు మనము ఎంతో సంతోషమును మరియు నిజమైన కృతజ్ఞతను కలిగియున్నాము.

ఇప్పుడు ఈ సమస్త వర్తమానములు ఆ “దూతకు” నిర్దేషించబడియున్నవి గనుక — (మానవ దూత) ఒక గొప్ప భాద్యత అలాగే ఒక అద్భుతమైన భాగ్యము అతనియొక్క భాగమైయున్నది.

వర్తమానము ఆయనయొక్క దూతకు నిర్దేషించబడినది, పిదప ఆయనయొక్క దూత దానిని వధువుకు ఇచ్చుచున్నాడు; కేవలం పరిచర్య మాత్రమే కాదు, కానీ ఆయనయొక్క వధువందరికీ అయ్యున్నది మరియు అందరూ వినుటకు అది టేపులో ఉన్నది. దానికి కలపబడజాలదు లేదా దానినుండి తీసివేయబడజాలదు, మరియు దానికి ఎటువంటి అనువాదము అవసరంలేదు.

ఆయన త్వరగా వచ్చుచున్నాడు, మరియు ఆయన వచ్చినప్పుడు ఆయన మొదటిగా మీయొద్దకు వచ్చును, మరియు మీరు ప్రకటించిన సువార్త ప్రకారము మీరు తీర్పు తీర్చబడతారు, మరియు మేము నీ జనులమైయుంటాము.” నేను ఇట్లన్నాను, “నేను వీటన్నిటికీ భాద్యుడనైయున్నానని నీ భావమైయున్నదా?” ఆయన ఇట్లన్నాడు, “ప్రతీ ఒక్కరూ. నీవొక నాయకుడిగా జన్మించావు.”

ఆ గొప్ప న్యాయతీర్పు దినము వచ్చినప్పుడు, ఆయన మొదటిగా తనయొక్క వెలుగు దూత వద్దకు వచ్చి, మరియు మొదటిగా అతడిని తాను ప్రకటించిన సువార్త ప్రకారము తీర్పు తీరుస్తాడు. మనము ఆయన ప్రజలమైయున్నాము. అతడు దేవునిచేత ఎన్నుకోబడిన నాయకుడు గనుక అతడు మనలో ప్రతిఒక్కరి విషయములో భాద్యుడైయున్నాడు.

దానికి మీయొక్క ఆత్మ సంబంధమైన అన్వయింపును జోడించండి. దేవునియొక్క దూత చెప్పినదాని ప్రకారము మనము తీర్పు తీర్చబడతాము. కావున, నేరుగా అతని యొద్దనుండే మీరు వినగలిగినప్పుడు, అతడేమి చెప్పాడని ఇంకెవరో చెప్పుచున్నదానిపై మీరు మీయొక్క నిత్యజీవమును ప్రమాదంలో పెట్టగోరుచున్నారా?

టేపులలో ఉన్నదానికంటె ఎక్కువ ప్రాముఖ్యమైన పరిచర్య ఉన్నదని ఎవరైనా ఎలా నమ్మగలరు. మీరు దానిని నమ్మినట్లైతే, లేదా హేతుబుద్దితో అలా ఒప్పించబడినట్లైతే, మీరు తిరిగి అసలైన వాక్యము నొద్దకు రావడం మంచిది; ఏలయనగా టేపులలో ఉన్న మాటల ద్వారా మీరు తీర్పు తీర్చబడబోవుచున్నారు. అది పలుకబడినట్లుగానే ఆ వాక్యముతో నిలిచియుండండి.

ఈ ప్రవక్త వస్తాడు, మరియు, “ఇదిగో లోక పాపములను మోసుకొనిపోవు, దేవుని గొర్రెపిల్ల,” అని మొదటిరాకడను పరిచయము చేయువాడు కేక వేసినట్లు, ఇతడు కూడా ఎటువంటి సందేహము లేకుండా, “ఇదిగో మహిమలో వచ్చుచున్న దేవుని గొర్రెపిల్ల” అని కేక వేస్తాడు. అతడు దానిని చేస్తాడు, ఏలయనగా యోహాను ఎలాగైతే ఎన్నుకొనబడినవారికై సత్యమునకు వర్తమానికుడిగా ఉన్నాడో, ఈ చివరి వర్తమానికుడు కూడా ఎన్నుకోబడినవారికి మరియు వాక్యము-ద్వారా జన్మించిన వధువుకు అలాగేయున్నాడు.

ప్రభువైన యేసుకు మనల్ని ఎవరు పరిచయం చేస్తారు? ఆయనయొక్క గొప్ప వెలుగు దూత, విలియమ్ మారియన్ బ్రెన్హామ్.

ఆయనయొక్క గొప్ప వర్తమానికుడైన దూత చెప్పేది మేము వినుచుండగా వచ్చి ఒక పవిత్రమైన కన్యక వధువుగా ఉండండి, ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, 60-1207 - "పెర్గమ సంఘకాలము" ను మేము వినుచుండగా అట్లు చేయండి.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్