
ప్రియమైన వెలిగించబడిన వధువా,
కాలములన్నిటి గుండా ఆయనయొక్క వాక్యముతో నిలబడిన ఒక చిన్న గుంపు ఉన్నదని ప్రభువు మనకు ఏ విధంగా బయలుపరుస్తున్నాడు కదా. వారు శత్రువుయొక్క మోసకరమైన ఉచ్చులో పడలేదు కానీ, వారి దినమునకైన వాక్యమునకు నమ్మకముగాను మరియు విశ్వాసనీయముగాను ఉన్నారు.
కానీ మనకంటే దేవుడు గర్వకారణముగా పరిగణించినట్టి, లేదా ఎక్కువ నమ్మకము కలిగియున్నట్టి, ఒక గుంపు ప్రజలైనా, లేదా ఒక సమయమైనా, ముందెన్నడూ లేదు. మనము మోసపరచబడని, మరియు మరీ ముఖ్యంగా, మోసపరచబడలేని, ఆయనయొక్క ఎన్నుకోబడిన గౌరవనీయమైన వధువైయున్నాము; ఏలయనగా మనము కాపరియొక్క స్వరము విని మరియు ఆయనను వెంబడిస్తాము.
కాలములన్నిటి గుండా రెండు గుంపుల ప్రజలు ఉన్నారని, ఇరువురును తాము దేవునియొద్దనుండి ప్రత్యక్షతను పొందుకున్నారని మరియు దేవునితో సంబంధము కలిగియున్నారని చెప్పుకున్నారని ఆయన మనకు చూపించుచున్నాడు. అయితే ప్రభువు తనవారిని ఎరిగియున్నాడని, ఆయన మనతో చెప్పాడు. ఆయన మన ఆలోచనలను పరిశోధిస్తాడు. మన హృదయములలో ఏమున్నదో ఆయన ఎరిగియున్నాడు. ఆయనయొక్క ప్రవక్తతో మరియు ఆయనయొక్క వాక్యముతో నిలబడటంవంటి మన క్రియలను ఆయన చూస్తాడు, మరి అవి మనలోపల ఉన్న విషయముయొక్క ఖచ్చితమైన నెరవేర్పుయైయున్నవి. ఆయన మనయొక్క ప్రతీ క్రియను గమనిస్తుండగా మన ఉద్దేశాలు, మన లక్ష్యాలు ఆయనకు ఎరుకైయున్నవి.
ఆయన ప్రతీ కాలమునకు ఇచ్చిన వాగ్దానములు మనవేనని, ఆయన మనకు చెప్పుచున్నాడు. అంతమువరకు విశ్వాసనీయముగా ఆయన క్రియలను చేస్తూ ఉండే మనల్ని ఆయన చూస్తాడు. ఆయన మనకు రాజ్యముల మీద అధికారమును ఇచ్చాడు. మనము బలవంతులమని, సమర్థవంతులమని, ఏ పరిస్థితినైనా శక్తివంతముగా తట్టుకొని వ్యవహరించగల లొంగనటువంటి అధికారులమని ఆయన మనతో చెప్పుచున్నాడు. అవసరమైతే అత్యంత విపరీతమైన శత్రువు కూడా విరుగగొట్టబడతాడు. ఆయనయొక్క శక్తిచేతయైనట్టి మన పరిపాలనయొక్క దృష్టాంతం సరిగ్గా కుమారుని దాని వలెనే ఉంటుంది. మహిమ!!
మనము మన జీవితములో దేవునియొక్క లోతును అనుభవించాము. అది దేవునియొక్క ఆత్మ మనలో నివసించుట అనే ఒక వ్యక్తిగత అనుభవమైయున్నది. మన మనస్సులు దేవునియొక్క వాక్యము ద్వారా ఆయనయొక్క తెలివి మరియు జ్ఞానముతో వెలిగించబడినవి.
పెండ్లికుమారుడు ఎక్కడ ఉంటాడో మనము అక్కడికి వెళ్తాము. మనమెన్నడూ ఆయనచేత విడిచిపెట్టబడము. మనమెన్నడూ ఆయన ప్రక్కను విడిచిపెట్టము. మనమాయనతో సింహాసనమును పంచుకుంటాము. మనము ఆయనయొక్క మహిమతోను గౌరవముతోను కిరీటము ధరింపజేయబడతాము.
ప్రతికాలములోను శత్రువు ఎంత మోసపూరితముగా ఉన్నాడన్నది మరియు ఆయనయొక్క అసలైన వాక్యముతో నిలిచియుండటం ఎంత ప్రాముఖ్యము అనేది ఆయన మనకు బయలుపరిచాడు. ఒక్క మాటయైనా మార్చబడజాలదు. ప్రతి కాలములోను వాక్యమునకు తమ స్వంత అనువాదమును ఇచ్చుకొనుచు, దానికి కలిపియున్నారు మరియు దానినుండి తీసివేసారు; మరియు ఆ విధంగా చేయడం ద్వారా నిత్యముగా నశించిపోయారు.
తుయతైర సంఘకాలములో, ఆ మోసపరచు ఆత్మ పోపులోనుండి మాట్లాడి మరియు ఆయనయొక్క వాక్యమును మార్చివేసినది. వాడు దానిని “(మానవులకి కాదు గాని) మానవునికి దేవునికి మధ్య ఒకేఒక్క మధ్యవర్తి” అన్నట్లుగా చేసాడు. కావున ఇప్పుడు వాడు ఆ మధ్యవర్తికి మరియు మనుష్యులకు మధ్య మధ్యవర్తిత్వము చేస్తుంటాడు. తద్వారా, దేవునియొక్క ప్రణాళిక అంతయు మార్పుచేయబడినది; ఒక పదమును మార్చుటవలన కాదు గాని, ఒక్క అక్షరమును మార్చుటవలనైయున్నది. సాతానుడు ఒక “ల” ను ఒక “ని” గా మార్చాడు.
ప్రతి వాక్యము టేపులలో పలుకబడినట్టి ఆయనయొక్క అసలైన వాక్యముతో తీర్పు తీర్చబడుతుంది. కావున, ఆయనయొక్క వధువు టేపులతో నిలిచియుండవలసియున్నది. శత్రువు ప్రజలకు ఒక భిన్నమైన ప్రణాళికను, ఒక భిన్నమైన ఆలోచనను, ఒక భిన్నమైన అక్షరమును ఇచ్చుట ద్వారా వారిని నిరుత్సాహపరచడానికి ప్రయత్నిస్తుండగా, వధువు మాత్రం అసలైన వాక్యముతో నిలిచియుంటుంది.
యేసు ప్రతికాలములోను ఆ కాలపు వర్తమానికుడితో తననుతాను గుర్తింపజేసుకుంటాడు. వారు ఆయననుండి వారి కాలమునకైన వాక్యముయొక్క ప్రత్యక్షతను పొందుకుంటారు. ఈ ప్రత్యక్షత అనే మాట దేవునియొక్క ఎన్నుకోబడినవారిని లోకమునుండి బయటకు తెచ్చి మరియు యేసుక్రీస్తుతో సంపూర్ణ ఐక్యతలోనికి తీసుకొనివెళ్తుంది.
సంఘమునకు ఒక ఆశీర్వాదముగా ఉండుటకు ఆయన అనేకులను పిలిచి మరియు నియమించాడు, కానీ ఆయనయొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆయనయొక్క సంఘమును నడిపించుటకు మాత్రం ఆయన ఒకేఒక్క వర్తమానికుణ్ణి కలిగియున్నాడు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతో ఒకేఒక్క స్వరమున్నది. ఒక్క స్వరము ద్వారా ఆయన మనకు తీర్పు తీరుస్తాడని ఆయన మనతో చెప్పాడు. ఆయనయొక్క వధువు తన నిత్యమైన గమ్యమును నిలుపుచున్నట్టి ఒకేఒక్క స్వరము ఉన్నది. అదియే టేపులలో ఉన్న దేవునియొక్క స్వరమైయున్నది.
వధువా, మన కొరకైన దేవుని చిత్తము పరిపూర్ణతయైయున్నది, మరియు ఆయన దృష్టిలో, మనము పరిపూర్ణులమైయున్నాము. మరియు ఆ పరిపూర్ణతయే సహనమైయున్నది, దేవునిపై ఆనుకోవడమైయున్నది…మరియు దేవుని కొరకు వేచియుండటమైయున్నది. అది మన గుణలక్షణమును మెరుగుచేసే ప్రక్రియ అని ఆయన మనతో చెప్పుచున్నాడు. మనము అనేక పరీక్షలను, శోధనలను మరియు శ్రమలను కలిగియుండవచ్చును, కానీ మనము సంపూర్ణులును మరియు అనూనాంగులును, ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లుగా ఆయన వాక్యముపట్ల మనకున్న విశ్వసనీయత మనలో ఓర్పును పుట్టించుచున్నది.
వినుట వలన, వాక్యమును వినుటవలన విశ్వాసము కలుగునని, మరియు వాక్యము ప్రవక్తయొద్దకు వచ్చునని మనమెన్నడూ మర్చిపోము.
జఫర్సన్విల్ కాలమానం ప్రకారముగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, దేవునియొక్క స్వరము: తుయతైర సంఘకాలము 60-1208 పై వాక్యమును అందించడాన్ని మేము వినుచుండగా, వచ్చి మరియు మీరు మాతోకలిసి పరలోక స్థలములలో కూర్చొని మరియు మీ జీవితములోని అత్యంత గొప్ప సంతోషమును అనుభవించండి.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్