ఆదివారం
17 నవంబర్ 2024
60-1209
The Sardisean Church Age

ప్రియమైన టేపు ప్రజలారా,

“టేపు ప్రజలు” అని పిలువబడుటకు మనమెంత అతిశయపడుచున్నాము కదా. దేవుని స్వరము మనతో మాట్లాడుటను వినడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మనము కూడివస్తామని ఎరిగియుండి ప్రతీ వారము మన హృదయములు ఉత్సాహముతో వేగముగా కొట్టుకొనుచున్నాయి కదా.

ఆయనయొక్క బలిష్ఠుడైన ఏడవ దూత వర్తమానికుని ద్వారా ఆయనయొక్క స్వరమును వినుచు; ఆయనయొక్క వాక్యముతో నిలిచియుండటం వలన మనము దేవునియొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉన్నామని, ఒక్క సందేహపు ఛాయయైనా లేకుండా, మనము ఎరిగియున్నాము.

మన దినమునకై ఆయన ఎన్నుకున్న వర్తమానికుడు విలియమ్ మారియన్ బ్రెన్హామైయున్నాడు. అతడు లోకమునకు దేవునియొక్క దీపమైయుండి, దేవునియొక్క వెలుగును ప్రతిబింబించుచున్నాడు. ఆయన తాను ఎన్నుకొనిన స్వచ్ఛమైన వాక్య వధువును తనయొక్క దూత ద్వారా బయటకు పిలుచుచున్నాడు.

ఆయనను గూర్చిన బయలుపాటును మరియు మన దినమునకైన పరిచర్యను ఇవ్వడానికి ఆయన ఎన్నుకున్న దూత విలియమ్ మారియన్ బ్రెన్హామేనని, ఆయన వాక్యముయొక్క శ్రద్ధపూరితమైన అధ్యయనం ద్వారాను, ఆయనయొక్క పరిశుద్ధాత్మ ద్వారాను ఆయన మనకు బయలుపరిచాడు. తన వాక్యమును బయలుపరచుటకు మరియు తన వధువును బయటకు పిలచుటకు ఆయన అతనికి ఆయనయొక్క అధికారమును అప్పగిస్తుండగా, మనము ఆయనయొక్క దూతను, అనగా మన నక్షత్రమును, ఆయనయొక్క కుడి చేతిలో చూస్తాము.

ఆయన స్వయంగా తనను గూర్చిన పూర్తి బయలుపాటును మనకు ఇచ్చియున్నాడు. తన ఏడవ దూత వర్తమానికునియొక్క జీవితము ద్వారా; మన దినమునకై ఆయనయొక్క నేత్రములుగా ఉండుటకు ఆయన ఎన్నుకున్న దూత ద్వారా పరిశుద్ధాత్మ తననుతాను మనకు గుర్తింపజేసుకొనుచున్నాడు.

మనల్ని ఆయనయొద్దకు తెచ్చుకోవడమనేది ఆయనయొక్క ఉద్దేశమని; మనము ఆయనయొక్క వాక్య వధువైయున్నామని ప్రతి వర్తమానము ద్వారా ఆయన మనతో చెప్తుండగా మన హృదయములు మనలో ఏ విధముగా మండుచున్నవి కదా.

జగత్తుపునాది వేయబడకముందే ఆయన ఏ విధంగా మనల్ని ఆయనయందు ఎన్నుకున్నాడన్నది మళ్ళీ మళ్ళీ చెప్పుటకు ఆయన ఇష్టపడుచున్నాడు. ఏ విధంగా మనము ముందే ఆయనచేత ఎరుగబడి మరియు ప్రేమించబడ్డామని చెప్పుటకు ఇష్టపడుచున్నాడు.

ఆయన మనతో మాట్లాడి మరియు మనము ఆయనయొక్క రక్తముచేత విమోచించబడ్డామని మరియు ఎన్నడూ శిక్షావిధిలోనికి రామని మనతో చెప్పడాన్ని వినుటకు మనమెంతగా ఇష్టపడుచున్నాము కదా. మనమెన్నడూ తీర్పులోనికి రాలేము, ఎందుకనగా మనమీద పాపము ఆరోపించబడజాలదు.

ఆయన భూమి మీద తనయొక్క దావీదు సింహాసనమును తీసుకుంటుండగా మనము ఏ విధంగా ఆయనతో కూర్చుంటాము కదా, మరియు సరిగ్గా ఆయన పరలోకమందు చేసినట్లే; శక్తితోను మరియు భూమియంతటిపై అధికారముతోను, మనము ఆయనతో కలిసి పరిపాలిస్తాము. అప్పుడు ఈ జీవితముయొక్క పరీక్షలు మరియు శోధనలు ఏమియు కానట్లుగా అగుపిస్తాయి.

అయితే మనమెంత జాగ్రత్తగా ఉండవలెనని కూడా ఆయన మనల్ని హెచ్చరించాడు. కాలములగుండా ఆ రెండు ద్రాక్షావల్లులు ప్రక్కప్రక్కనే ఎదిగాయని హెచ్చరించాడు. ఏ విధంగా శత్రువు ఎల్లప్పుడు ఎంతో దగ్గరగా ఉన్నాడనియు; ఎంతో మోసపూరితముగా ఉన్నాడనియు చెప్పాడు. యూదా సహితం దేవునిచేత ఎన్నుకోబడి, మరియు సత్యములో నిర్దేషించబడినవాడే. అతడు మర్మములను గూర్చిన జ్ఞానమును పంచుకున్నవాడు. అతడు అతనికివ్వబడిన శక్తివంతమైన పరిచర్యను కలిగియున్నాడు మరియు అతడు యేసు నామములో రోగులను స్వస్థపరచి మరియు దయ్యములను వెళ్ళగొట్టాడు. కానీ అతడు ముగింపువరకు వెళ్ళలేకపోయాడు.

మీరు కేవలం వాక్యంలో కొంత భాగముతో మాత్రమే వెళ్ళలేరు, మీరు పూర్తి వాక్యమును తీసుకోవలసియున్నది. దేవునియొక్క కార్యములలో దాదాపుగా వంద శాతము పాలుపొందుచున్నట్లు అగుపించే ప్రజలు ఉన్నారు, కానీ వారు ఆ విధంగా లేరు.

ఆయన స్వయంగా తానే సంఘమంతటితో సహవాసము కలిగియున్నది, లేదా ఎఫెసీ నాలుగులోని ఐదు రకముల పరిచర్యతో సైతం సహవాసము కలిగియున్నది కూడా సరిపోలేదని చెప్పాడు. ప్రతి కాలములోను సంఘము దారితప్పిపోతుందని ఆయన మనల్ని హెచ్చరించాడు, మరియు అది కేవలం ప్రజలు మాత్రమే కాదు గాని మతపెద్దలు కూడాయైయున్నారు — గొర్రెలతో పాటు గొర్రెలకాపరులు కూడా తప్పైయున్నారు.

కావున ఆయనయొక్క స్వంత సంకల్పము ద్వారా నిర్ణయించబడిన ఆలోచన ప్రకారము, మన కాలములో ఆయనయొక్క ప్రజలను తిరిగి సత్యమునొద్దకు మరియు ఆ సత్యముయొక్క సమృద్ధియైన శక్తియొద్దకు నడిపించడానికి ఆయనయొక్క ఏడవ దూత వర్తమానికుని పరిచర్యలో ప్రధాన కాపరిగా ఆయన తననుతాను రంగం మీదికి తెచ్చుకున్నాడు.

ఆయన తన వర్తమానికునిలో ఉన్నాడు మరియు ఆ వర్తమానికుడు ఆయనయొక్క వాక్యము ద్వారా ప్రభువును వెంబడిస్తున్న వాడైయుండుటను బట్టి ఆ వర్తమానికుడిని దేవునియొక్క సంపూర్ణత వెంబడిస్తుంది.

నేను దేవునియొక్క సంపూర్ణతను కలిగియుండి మరియు ఆయనయొక్క వర్తమానికుడిని వెంబడించగోరుచున్నాను. కావున, మనకైతే, అనగా బ్రెన్హామ్ గుడారమునకైతే, ఆయనయొక్క వాక్యము ద్వారా ఆ వర్తమానికుడు ప్రభువును వెంబడిస్తుండగా మనము ఆ వర్తమానికుడిని వెంబడించుటకుగల ఒకే ఒక్క మార్గమేదనగా ప్లేను నొక్కి మరియు దేవునియొక్క స్వచ్ఛమైన స్వరము తప్పిపోని వాక్యములను మనతో మాట్లాడుటను వినుటయేయైయున్నది.

మనము వినుచున్నదానిని ఊహించనక్కర్లేదు లేదా సరిచూసుకోనక్కర్లేదు, మనము కేవలం ప్లేను నొక్కి మరియు మనము వినుచున్న ప్రతీ మాటను నమ్మవలసియున్నది.

ఒక ఉదయమున తెల్లవారుజామున వాయిస్ రేడియోలో సహోదరుడు బ్రెన్హామ్ గారు ఈ కొటేషన్ ను చెప్పడం నేను విన్నాను. నేను దానిని విన్నప్పుడు, మనము ఈ విధంగా చెప్పడం గురించి నేను / మనము భావించేది సరిగ్గా ఇదేనని నా హృదయములో అనిపించినది:

మేము కేవలం ప్లేను నొక్కి మరియు టేపులను వింటాము.

నాకైతే అది మన విశ్వాసమును గూర్చిన ఒక వాక్యమువలె వినిపించినది.

ఆ కారణముచేతనే నేను ఈ వర్తమానమును నమ్ముతాను, ఎందుకనగా అది దేవునియొక్క వాక్యము నుండి వచ్చుచున్నది. మరియు దేవుని వాక్యమునకు వెలుపలనున్న దేనినైనా, నేను నమ్మను. అది ఆ విధంగా ఉండవచ్చును, కానీ అయినను నేను కేవలం దేవుడు చెప్పినదానితో నిలిచియుంటాను, మరియు పిదప నేను సరియేనన్న నిశ్చయతను కలిగియుంటాను. ఇప్పుడు, దేవుడు తాను కోరినదానిని చేయవచ్చును. ఆయన దేవుడైయున్నాడు. అయితే నేను ఆయనయొక్క వాక్యముతో నిలిచియున్నంతకాలం, అప్పుడు అంతా బాగానే ఉన్నదని నాకు తెలుసు. నేను దానిని నమ్ముచున్నాను.

మహిమ, ఆయన దానిని ఎంతో పరిపూర్ణముగా చెప్పాడు. ఇతర పరిచర్యలన్నీ ఉండవచ్చును, ఎందుకనగా దేవుడు తాను కోరినవారితో, తాను కోరినదానిని చేయగలడు, ఆయన దేవుడు. కానీ నేను ఆయన వాక్యముతో, ఆయన స్వరముతో, అనగా టేపులతో నిలిచియున్నంతకాలం, అప్పుడు అంతా బాగానే ఉన్నదని నాకు తెలుసు. నేను దానిని నమ్ముచున్నాను.

అనేకులు నా ఉత్తరాలను చదివి మరియు నేను చెప్పుచున్నదానిని మరియు మన సంఘమునకై దేవునియొక్క చిత్తము ఏమిటని నేను నమ్ముచున్నానో దానిని అపార్థము చేసుకుంటారని నాకు తెలుసు. ప్రవక్త చెప్పినట్లే మరలా నేను దీనముగా చెప్పుచున్నాను: “ఈ ఉత్తరాలు నా సంఘము కొరకు మాత్రమేయైయున్నవి. బ్రెన్హామ్ టెబర్నికల్ ను తమ సంఘమని పిలుచుకోగోరిన వారికేయైయున్నవి. టేపు ప్రజలని గుర్తించబడి మరియు అట్లు పిలువబడుటకు ఇష్టపడేవారికి మాత్రమేయైయున్నవి”.

నేను చెప్పేదానితో మరియు నమ్మేదానితో మీరు ఏకీభవించనియెడల, నా సహోదరులారా మరియు సహోదరీలారా అది 100% మంచిదే. నా ఉత్తరాలు మీ కొరకు కావు లేదా మీకు వ్యతిరేకముగానైనా లేదా మీ సంఘములకు వ్యతిరేకముగానైనా కావు. మీ సంఘము స్వతంత్ర్యము గలది మరియు మీరు ఏమి చేయుటకు నడిపించబడుచున్నారని మీకు అనిపించుచున్నదో మీరు దానిని చేయవలసియున్నది, అయితే అది వాక్యప్రకారము ఉండవలసియున్నది, మాది కూడా ఆ విధంగానే ఉన్నది, మరియు మా కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గము ఇదేనని మేము నమ్ముచున్నాము.

ప్రతి ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు మాతో ఐక్యమవ్వడానికి అందరికీ ఎల్లప్పుడూ స్వాగతం. ఈ వారము, మన కాలమునకైన దేవుని నక్షత్రము, అనగా విలియమ్ మారియన్ బ్రెన్హామ్ గారు, మనకు, 60-1209 సార్దీసు సంఘకాలము అను వర్తమానమును అందిస్తారు.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్