ఆదివారం
01 డిసెంబర్ 2024
60-1211M
The Ten Virgins, And The Hundred And Forty-Four Thousand Jews

స్నేహితులారా శుభోదయము,

పరలోకము నుండి ఒక శబ్ధము, అనగా స్వయంగా దేవునియొక్క స్వరమే, లోపలికి రాగలిగియుండగా, ప్రపంచమంతటినుండి క్రీస్తుయొక్క వధువు వచ్చి ఏకమనస్సు కలిగి ఏకముగా కూడుకోగలిగే సమయము చరిత్రలో ముందెన్నడూ లేదు.

లేఖనములు నెరవేర్చబడుచున్నవి. ఇది ఐక్యమయ్యే సమయముయొక్క విత్తనపు సూచనయైయున్నది. మనము కుమారునియొక్క సన్నిధిలో కూర్చొని, పరిపక్వము చెందుతుండగా, స్వయంగా దేవునియొక్క స్వరమునే వినుచు ఆమె తననుతాను సిద్ధపరచుకొనుచుండగా క్రీస్తు వధువుయొక్క అదృశ్యమైన ఐక్యత సంభవించుచున్నది.

ఆయనయొక్క ఐదు-రకముల పరిచర్య ద్వారా మనము పరిపూర్ణము చేయబడుతున్నాము.

వరములు మరియు పిలుపులు పశ్చాత్తాపం లేకున్నను కలుగునని ఎంతమంది నమ్ముతారు? సంఘములో ఐదు వరములు ఉన్నాయని బైబిలు గ్రంథము చెప్పినది. దేవుడు సంఘములో అపొస్తలులను, లేదా మిషనరీలను, అపొస్తలులను, ప్రవక్తలను, ఉపదేశకులను, సువార్తికులను, సంఘకాపరులను పెట్టాడు.

బోధకుడు: నేను వీధిలోనికి వెళ్తాను. ఎవరో ఇట్లంటారు, “నీవు ఒక బోధకుడవా?” నేను ఇట్లు చెప్తాను, “అవును, అయ్యా. ఓ అవును, నేను ఒక బోధకుడను.”

ఉపదేశకుడు: మరియు నేను ఈ ఉదయమున బోధించడానికి అసలు తీసుకోకపోవుటకు కారణమేదనగా, కేవలం ఒక అంశమును తీసుకొని మరియు దానిని దాటివేస్తూ వెళ్ళేదానికంటే, ఉపదేశించుటలో మనము దానిని బాగుగా అర్థము చేసుకోగలమని, నేను తలంచాను. మేము కేవలం దానిని ఉపదేశిస్తాము.

అపొస్తలుడు: “మిషినరీ” అనే పదమునకు “పంపబడినవాడు” అని అర్థము. “అపొస్తలుడు” అనగా “పంపబడినవాడు.” ఒక మిషినరీ ఒక అపొస్తలుడైయున్నాడు. మీరు ఎరిగియున్నట్లే, నేను—నేను, ఒక మిషినరీయైయున్నాను, సుమారు ఏడుమార్లు విదేశాలలో, ప్రపంచమంతటా, సువార్తిక పనిని, మిషినరీ పనిని చేశాను.

ప్రవక్త: నేను దేవునియొక్క ప్రవక్తనని మీరు నమ్ముతున్నారా? అలాగైతే వెళ్ళి నేను మీకు ఏమి చేయమని చెప్పానో దానిని చేయండి.

సంఘకాపరి: నేను మీకు చేసినది ఏమిటో మీకు తెలుసా? మీరు నన్ను మీ సంఘకాపరి అని పిలిచారు, మరియు మీరు సరిగ్గానే చెప్పారు, ఏలయనగా నేను అదేయైయున్నాను.

మరియు ఆ మిలియన్లమంది అక్కడ నిలబడియుండటాన్ని నేను చూశాను, నేను ఇట్లన్నాను, “వారంతా బ్రెన్హామువారా?” ఇట్లన్నాడు, “కాదు.” ఇట్లు చెప్పాడు, “వారు నీ ద్వారా మార్చబడినవారు.” మరియు నేను ఇట్లన్నాను, నేను—నేను ఇట్లన్నాను, “నేను యేసును చూడగోరుచున్నాను.” ఆయన ఇట్లన్నాడు, “ఇప్పుడే కాదు. ఆయన రావడానికిముందు కొంచెం సమయం పడుతుంది. అయితే ఆయన మొదటిగా నీయొద్దకు వస్తాడు మరియు నీవు బోధించిన వాక్యంచేత నీవు తీర్పు తీర్చబడతావు,

అప్పుడు మనమందరము మన చేతులనెత్తి మరియు ఇట్లన్నాము, “మేము దానిపై విశ్రాంతి తీసుకొనుచున్నాము!”

ఏదో జరుగబోవుచున్నది. ఏమి జరుగుచున్నది? నా చుట్టూ క్రీస్తునందు మృతులైనవారు లేచుచున్నారు. నా శరీరములో ఒక మార్పు రావడాన్ని నేను అనుభూతి చెందుతున్నాను. నా తెల్ల వెంట్రుకలు, పోయినవి. నా ముఖమును చూడుము…నా ముడతలన్నీ మాయమైపోయినవి. నా వేధనలు మరియు నొప్పులు…అవి పోయినవి. నా నిరాశ నిస్పృహ అంతయు ఇప్పటికిప్పుడే మాయమైపోయినది. ఒక్క క్షణములోనే, కనురెప్పపాటున నేను మార్పు చెందియున్నాను.

పిదప మనము మన చుట్టూ చూడటం ప్రారంభించి మరియి మన ప్రియులను కనుగొంటాము. ఓ మై, అదిగో అమ్మా నాన్న అక్కడున్నారు…మహిమ, నా కుమారుడు…నా కుమార్తె. తాతయ్య, నానమ్మ, ఓ, నాకు మీ ఇద్దరూ లేని లోటు బాగా తెలిసింది. హే…అదిగో నా పాత స్నేహితుడు అక్కడున్నాడు. ఓ చూడుము, సహోదరుడు బ్రెన్హామ్, మన ప్రవక్త, హల్లెలూయా!! ఇది వచ్చేసింది. ఇది జరుగుచున్నది!

పిదప మనము కలిసి, అందరమూ ఒకేసారి, భూమికి ఆవలిన శూన్యములో ఎక్కడికో ఎత్తబడతాము. ప్రభువు దిగివచ్చు మార్గములో మనము ఆయనను కలుసుకుంటాము. మనము ఈ భూమియొక్క కక్షపై అక్కడ ఆయనతో కలిసి నిలబడతాము మరియు విమోచనా గీతములను పాడతాము. ఆయన మనకు అనుగ్రహించిన ఆయనయొక్క విమోచనా కృపకై మనము పాటలు పాడుతూ ఆయనను స్తుతిస్తాము.

ఆయనయొక్క వధువు కొరకు ఏమి దాచబడియున్నదో కదా. నిత్యత్వమంతా మనము మన ప్రభువైన యేసుతోను, మరియు ఒకరితోనొకరమును ఎటువంటి సమయమును కలిగియుండబోవుచున్నాము కదా. ప్రభువా, మేము మా హృదయములలో ఎటువంటి భావన కలిగియున్నామన్నది, మర్త్యమైన పెదవులు వ్యక్తపరచలేవు.

ఆయన మిమ్మల్ని తన వధువు అని పిలచి, మరియు ఆయనతో ఉండడం ఎలాగుంటుందో చెప్పడాన్ని మీరు వినగోరినయెడల, వచ్చి ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, మాతోకలిసి కూడుకొనండి, మరియు మీరు కొలతకు మించి ఆశీర్వదించబడతారు.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

60-1211M పదిమంది కన్యకలు, మరియు ఒక లక్షా నలుబది నాలుగు వేలమంది యూదులు