ఆదివారం
24 నవంబర్ 2024
60-1210
The Philadelphian Church Age

ప్రియమైన శ్రీమతి. యేసుక్రీస్తు,

యేసుక్రీస్తు యొక్క వధువు కొరకు ఈ ఆదివారము ఏమి కలిగియున్నదో కదా? పరిశుద్ధాత్మ మనకు ఏ విషయమును బయలుపరుస్తాడో కదా? పరిపూర్ణమైన గ్రహింపు. ఇప్పుడు బయలుపాటు ద్వారా మనము ముంగుర్తుతో పోల్చబడిన అసలైనదానిని మరియు ఛాయతో పోల్చబడిన నిజస్వరూపమును పూర్తిగా అర్థం చేసుకోగలము. యేసే నిజమైన జీవాహారమైయున్నాడు. అది పూర్తిగా ఆయనేయైయున్నాడు. ఆయన ఒక్క దేవుడైయున్నాడు. ఆయన హెబ్రీ 13:8 అయ్యున్నాడు. ఆయన ఉన్నవాడు.

క్రీస్తు, శరీరములో ప్రత్యక్షమై మరియు తన స్వంత రక్తమును చిందించుట ద్వారా, తననుతాను అర్పించుకొనుట ద్వారా మన పాపములను ఒక్కసారే ఎన్నటెన్నటికీ దూరపరిచాడు; కావున ఇప్పుడు ఆయన మనలను పరిపూర్ణులుగా చేశాడు. స్వయంగా ఆయనయొక్క జీవమే మనలో ఉన్నది. ఆయన రక్తము మనలను పవిత్ర పరచినది. ఆయనయొక్క ఆత్మ మనల్ని నింపుచున్నది. ఆయన పొందిన దెబ్బలు ఇదివరకే మనల్ని స్వస్థపరచినవి.

ఆయనయొక్క వాక్యము మన హృదయములోను మరియు నోటిలోను ఉన్నది. ఆయన మరియు ఆయనయొక్క వాక్యము తప్ప, మన జీవితములలోనున్న ప్రతీది అప్రాముఖ్యమైనదిగా మారుతుండగా, ఇక మన జీవితములలోనున్నది క్రీస్తే గాని మరేదియు కాదు.

ఆయన తనయొక్క దైవీకమైన నిర్ణయము ద్వారా, ఖచ్చితంగా ఎవరు ఆయనయొక్క వధువైయుంటారని ఆయన ముందుగా ఎరిగియున్నాడని మనకు చెప్తుండగా మన హృదయము సంతోషముతో నిండిపోతుంది. ఆయన మనల్ని ఎలా ఎన్నుకున్నాడు కదా. ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఆయన మన కొరకు మరణించాడు. ఆయన మన కొరకు వెల చెల్లించాడు మరియు మనము ఆయనకు చెందినవారము, మరియు ఆయనకు మాత్రమే చెందియున్నాము. ఆయన మాట్లాడుతాడు, మరియు మనము విధేయులమౌతాము, ఏలయనగా అది మనయొక్క సంతోషమైయున్నది. మనమే ఆయనయొక్క ఏకైక ఆస్తియైయున్నాము మరియు మనము గాక ఆయనకు వేరెవ్వరూ లేరు. ఆయనే మన రాజుల రాజైయున్నాడు మరియు మనము ఆయనయొక్క రాజ్యమైయున్నాము. మనము ఆయనయొక్క నిత్యమైన స్వాస్థ్యమైయున్నాము.

ఆయనయొక్క వాక్యపు స్వరము ద్వారా ఆయన మనల్ని బలపరచి మరియు మనల్ని వెలిగిస్తాడు. ఆయన తేటగా వివరించి మరియు ఆయనే గొర్రెలు పోవు ద్వారమైయున్నాడని బయలుపరుస్తాడు. ఆయనే అల్ఫాయు ఓమెగయునైయున్నాడు. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, మరియు ఆయనే పరిశుద్ధాత్మయైయున్నాడు. ఆయన ఒక్కటైయున్నాడు, మరియు మనము ఆయనయందు, ఆయనతో ఒక్కటైయున్నాము.

ఆయన అబ్రాహముకు నేర్పించినట్లే, మనము ఏ వాగ్దానమునైనా పొందుకోగోరినయెడల మనము ఏ విధంగా సహనముతో వేచియుండి మరియు ఓర్పుతో ఉండవలెనో ఆయన మనకు నేర్పిస్తాడు.

సరిగ్గా మనము జీవిస్తున్న దినమును ఆయన మనకు తేటగా చూపిస్తాడు. సార్వత్రిక కదలిక రాజకీయ పరంగా ఎంతో బలంగా మారి, మరియు చట్టములోనికి ప్రవేశపెట్టబడిన నిబంధనలకు అందరూ కట్టుబడియుండుట ద్వారా దానిలో చేరుటకు ప్రభుత్వాన్ని ఏ విధంగా ఒత్తిడి చేస్తుందో చూపిస్తాడు, తద్వారా ప్రత్యక్షంగానైనా లేదా పరోక్షంగానైనా వారి సమైఖ్యయొక్క అధికారము క్రింద ఉంటేనే తప్ప ఏ ప్రజలైనా సంఘముగా గుర్తించబడకుండా ఉండుటకైయున్నది.

తాము దేవుడిని సేవిస్తున్నారని అనుకొనుచు సంఘశాఖయొక్క నియమాలలో, ఎంతమంది కొనసాగుతారో ఆయన బయలుపరుస్తాడు. అయితే “వధువు మోసపరచబడదు గనుక, భయపడవద్దని, మనము ఆయనయొక్క వాక్యముతో, ఆయనయొక్క స్వరముతో నిలిచియుంటామని,” ఆయన మనకు చెప్తాడు.

ఆయన ఈ విధంగా మనకు చెప్పడాన్ని వినడం ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుంది కదా, “గట్టిగా పట్టుకొనియుండండి, పట్టుదలతో ఉండండి. ఎన్నడూ నిష్క్రమించకండి, అయితే దేవునియొక్క సర్వాంగ కవచమును ధరించుకోండి, ప్రతి ఆయుధము, నేను మీకిచ్చిన ప్రతి వరము మన అధికారములోనున్నది. ప్రియా ఎన్నడూ నిరుత్సాహపడకుము, కేవలం సంతోషముతో ముందుకు చూస్తూనే ఉండుము ఎందుకనగా నీ రాజుల రాజును మరియు ప్రభువుల ప్రభువును, నీయొక్క భర్తనుయైన నాచేత నీకు కిరీటము ధరింపజేయబడుతుంది.”

నీవు నా నమ్మకమైన సంఘమైయున్నావు; నీలో నివసించుచున్న నాయొక్క పరిశుద్ధాత్మ వలన, నీవు స్వయంగా దేవునియొక్క ఆలయమైయున్నావు. క్రొత్త ఆలయములో మీరు స్తంభములవుతారు; స్వయంగా ఆ మాహాకట్టడను నిలిపియుంచే పునాదియౌతారు. వాక్యమును గూర్చిన, అనగా స్వయంగా నన్ను గూర్చిన బయలుపాటును నేను మీకు ఇచ్చాను గనుక, అపొస్తలులతోను మరియు ప్రవక్తలతోను మిమ్మల్ని జయించినవారిగా నిలబెడతాను.

జగత్తుపునాది వేయబడకముందే మన పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథములో వ్రాయబడియున్నవని ఆయన మనకు తేటగా బయలుపరుస్తాడు. తద్వారా మనము ఆయనయొక్క ఆలయములో ఆయనను సేవించడానికి రాత్రింబవళ్ళు ఆయనయొక్క సింహాసనము ఎదుట ఉంటాము. మనము ప్రభువుయొక్క ప్రత్యేకమైన శ్రద్ధయైయున్నాము; మనము ఆయనయొక్క వధువైయున్నాము.

ఆయన నామమును తీసుకొనుట ద్వారా మనము ఒక క్రొత్త నామమును పొందుకుంటాము. అది ఆయన మనలను తనకై తీసుకున్నప్పుడు మనకివ్వబడిన నామమైయుంటుంది. మనము శ్రీమతి. యేసుక్రీస్తు అవుతాము.

తన భర్త కొరకు అలంకరింపబడిన ఒక వధువు, పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుచున్న ఆ నూతన యెరూషలేమైయుంటాము. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినవి గనుక వేదనయైనను ఇక ఉండదు. దేవునియొక్క అద్భుతమైన వాగ్దానముల్నీ నెరవేర్చబడియుంటాయి. మార్పు అనేది పూర్తవుతుంది. గొర్రెపిల్ల మరియు ఆయనయొక్క వధువు దేవునియొక్క సమస్త పరిపూర్ణతలలో ఎన్నటెన్నటికీ స్థిరపరచబడియుంటారు.

ప్రియమైన శ్రీమతి. యేసుక్రీస్తు, దాని గురించి కలగనండి. అది మీరు ఎన్నడైనా ఊహించగలిగేదానికంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది.

ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా, మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, మన భర్తయైన యేసుక్రీస్తు, ఆయనయొక్క బలిష్ఠుడైన ఏడవ దూత ద్వారా మాట్లాడి మరియు మనకు ఈ సంగతులన్నిటినీ చెప్తుండగా, వచ్చి మాతో చేరవలెనని నేను అందరినీ ఆహ్వానిస్తున్నాను.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

వర్తమానము: ఫిలదెల్ఫియ సంఘకాలము 60-1210