ప్రియమైన క్రీస్తుయొక్క వధువా, ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M., గంటల సమయమప్పుడు, దీనిని వినుటకు మనము కూడివద్దాము 65-0718E ఋతువునకు తగిన ఆత్మీయ ఆహారము.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
సంబంధిత కూటములు
ప్రియమైన క్రీస్తు వధువా, మనము ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M., గంటల సమయమప్పుడు, దీనిని వినుటకు కూడివద్దాము 65-0718M – దేవుని చిత్తము లేకుండా దేవునికి ఒక సేవ చేయ ప్రయత్నించుట
సహోదరుడు. జోసెఫ్ బ్రెన్హామ్
ప్రియమైన సిగ్గుపడని వధువా,
ఈ దినము వంటి సమయమైనా లేదా ప్రజలైనా ఎన్నడూ లేరు. మనము ఆయనలో ఉన్నాము, ఆయన మన కొరకు కొన్నదానంతటికీ వారసులమైయున్నాము. ఆయన తన పరిశుద్ధతను మనతో పంచుకుంటున్నాడు, ఎంతగా అంటే, ఆయనలో మనము స్వయంగా దేవునియొక్క నీతి అయ్యాము.
మనము ఆయనయొక్క వధువు అవుతామని, దైవ నిర్ణయము ద్వారా ఆయన మనలను ముందుగానే ఎరిగియున్నాడు. ఆయన మనలను ఎన్నుకున్నాడు, మనమెన్నడూ ఆయనను ఎన్నుకోలేదు. మనంతట మనము రాలేదు, అది ఆయనయొక్క ఎన్నికయైయున్నది. ఇప్పుడు ఆయన తన వాక్యమును గూర్చిన సంపూర్ణ ప్రత్యక్షతను మన హృదయములోను మరియు మన అంతరాత్మలోను పెట్టాడు.
దినము వెంబడి దినము, ఆయన మనకు తన వాక్యమును బయలుపరచుచున్నాడు, తన ఆత్మను మనపై కుమ్మరించుచున్నాడు, స్వయంగా ఆయనయొక్క జీవమునే మనలో ప్రత్యక్షపరచుచున్నాడు. ఆయనయొక్క వాక్యముతో నిలిచియుండుట ద్వారా, ఆయన స్వరమును వినుట ద్వారా, వారు ఆయనయొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉన్నారని ఎరిగియుండి ఆయనయొక్క వధువు ఇంత కంటె ఎక్కువగా ఎన్నడూ లంగరు వేయబడిలేదు.
దేవునియొక్క ప్రేమ మరియు ఈ వర్తమానము పొంగి పొర్లుచుండెంతగా మన హృదయములలో నిండుచున్నవి. ఇది గాక మనము వినగోరేది, మాట్లాడగోరేది, సహవాసము కలిగియుండగోరేది మరేదియు లేదు, లేదా మనమప్పుడే వినిన ఒక కొటేషన్ ను పంచుకొని మరియు ప్రభువును స్తుతించాలన్న ఇది గాక మరేదియు లేదు.
మనము మోషేవలె ఎడారి వెనుక భాగమున ఉన్నాము. మనము సర్వశక్తిమంతుడైన దేవుని సముఖమునకు వచ్చాము, మరియు ఆ స్వరము మనతో మాట్లాడుటను మనము చూస్తున్నాము; అది వాక్యముతోను మరియు ఈ ఘడియయొక్క వాగ్దానముతోను ఖచ్చితంగా సరితూగుచున్నది. అది మనకు దేనినో చేసినది. మనము దాని విషయమై సిగ్గుపడటంలేదు. దానిని లోకానికి ప్రకటించుటకు మనము ఇష్టపడుచున్నాము. ప్రభువైన యేసు ఈ ఘడియయొక్క వర్తమానమైయున్నాడని మరియు మనము ఆయనయొక్క వధువైయున్నామని మనము నమ్ముచున్నాము.
ఆయనయొక్క వాక్యముతో ఆయన మనకు కంచెను వేశాడు. ఇదే దేవుడు ఏర్పాటు చేసిన మార్గమైయున్నదనుటలో ఎటువంటి సందేహము లేదు. దేవుడు తన వాక్య విషయమై తన మనస్సును ఎన్నడూ మార్చుకోడు. ఆయనయొక్క వధువును బయటకు పిలిచి, మరియు పిదప ఆమెను వాక్య వరుసలో ఉంచుటకు ఆయన ఏడవ దూత వర్తమానికుణ్ణి ఎన్నుకున్నాడు.
ఆయన మరియు ఆయనయొక్క వాక్యము తప్ప ఈ జీవితములో ఇంకేదియు లేదు. మనము దానిని ఎంతగానో ప్రేమించుచున్నాము. అది మనకు జీవము కంటే విలువైనది. సర్వశక్తిమంతుడైన దేవుని శక్తి మరియు సువార్త ముందెన్నడూ లేనివిధంగా ప్రపంచమంతటికీ వ్యాపించినది. వాక్యము ఇప్పుడు వధువుయొక్క చేతులలో ఉన్నది మరియు ఆమె చెవిన పడినది. దేవుడు ఒక వధువును పిలుచుచు, మరియు దయ్యము ఒక సంఘమును పిలుచుచున్న, వేర్పాటు సమయము ఇప్పుడు జరుగుచున్నది.
ప్రభువా, మేము నిన్ను మరియు నీ వాక్యమును ప్రేమించుచున్నాము. మాకు అది ఎంతైనా సరిపోదు. మేము అనుదినము నీ వాక్యముయొక్క సన్నిధిలో కూర్చొని, పరిపక్వము చెందుతూ, నీ యొక్క త్వరితమైన రాకడ కొరకు సిద్ధపడుచున్నాము. తండ్రీ, అది అతిత్వరలోయై యుండవలసియున్నది. ప్రభువా, మేము దానిని అనుభూతి చెందగలుగుచున్నాము. గొప్ప ఎదురుచూపుతో మేము వేచియుంటున్నాము.
తండ్రీ, మేము ఇంకా యదార్థంగా ఉండి మరియు మా ప్రమాణాలను పునఃప్రారంభం చేయుదుము గాక. నీ వాక్యమందు మాకున్న విశ్వాసము మా హృదయములో మండుచున్నదని మాకు తెలియును. నీవు సందేహములన్నిటినీ తొలగించివేసితివి. నీ వాక్యము తప్ప మరేదియు లేదు. మేము నిశ్చయతను కలిగియున్నాము, మరియు మేము నీయొక్క టేపు వధువైయున్నామని, లోకానికి చెప్పుటకు మేము సిగ్గుపడటంలేదు.
ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M., గంటల సమయమప్పుడు మేము ఈ వర్తమానమును వింటుండగా, వచ్చి మాతో కలిసి వినవలెనని నేను ప్రపంచమును ఆహ్వానించగోరుచున్నాను: సిగ్గుపడుట 65-0711.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానమును వినుటకు ముందు చదువవలసిన లేఖనములు:
పరిశుద్ధ. మార్కు 8:34-38
సంబంధిత కూటములు
ప్రియమైన పరిపూర్ణ చిత్తపు వధువా,
దినము ఆలస్యమైనది మరియు ప్రభు రాకడ సమీపములో ఉన్నది. అది ఇదివరకే కానియెడల, ద్వారము మూసివేయబడుచున్నది మరియు సమయము అయిపోవుచున్నది. చుట్టూ తిరుగుతూ; గాలికి కదులు రెళ్ళు వలెనుండి; దురద చెవులు కలిగియుండుటకు సమయమిక లేదు. ఇది ఒక సూటియైన నిర్ణయమును తీసుకొను సమయమైయున్నది. నేను ఆయన వధువుగా ఉండుటకు ఏమి చేయాలి?
దేవుడు తన వాక్యవిషయమై తన మనసు మార్చుకుంటాడా? ఎన్నడూ మార్చుకోడు. అటువంటప్పుడు ఆయనయొక్క పరిపూర్ణ చిత్తములో ఉండుటకు మనము అనుదినము మన పూర్ణహృదయముతో మరియు అంతరాత్మతో ప్రయత్నించవలసియున్నాము. ఆయన చిత్తమునకు మరియు ఆయన వాక్యమునకు మనల్ని మనము సమర్పించుకోవలసియున్నాము. దానిని ఎన్నడూ ప్రశ్నించకుండా, కేవలం దానిని నమ్మి మరియు దానిని స్వీకరించావలసియున్నాము. దానిని తప్పించుక్కొని వచ్చుటకు ఒక దారిని కనుగొనడానికి ప్రయత్నించవద్దు. కేవలం అది ఉన్న విధంగానే దానిని తీసుకోవలసియున్నాము.
దేవుడు దేవునిగా ఉండుటకు తన వాక్యమును నిలబెట్టుకోవలసియున్నాడని చూపించుటయే తన పూర్తి ఉద్దేశ్యమైయున్నదని, అయితే అనేకులు దానిని తప్పించుకొని వెళ్ళి, మరియు ఇంకేదో మార్గములో వెళ్ళగోరతారని ఈ వర్తమానములో ప్రవక్త మనకు చెప్తాడు. వారట్లు చేసినప్పుడు, వారు కొనసాగుచుండుటను, మరియు దేవుడు వారిని ఆశీర్వదించుటను వారు కనుగొంటారు, కానీ వారు ఆయనయొక్క అనుమతిపూర్వకమైన చిత్తములో పనిచేయుచున్నారని మరియు ఆయనయొక్క పరిపూర్ణమైన, దైవీక చిత్తములో పనిచేయడంలేదని చెప్తాడు.
ప్రవక్త మనలను తిరిగి వాక్యమునొద్దకు తీసుకొనివెళ్ళి మరియు దేవుడు తన మనస్సునైనా, లేదా తన విధానమునైనా మార్చుకోడని, ఆయన దేవుడైయున్నాడు మరియు ఆయన మారడని మనము చూడటానికి, ధ్యానించడానికి, మరియు మనకు జ్ఞాపకము చేయడానికి ఉదాహరణలను ఇస్తాడు.
ఇప్పుడు, ఈ ఇద్దరూ ఆత్మసంబధమైన వ్యక్తులని, ఇద్దరూ ప్రవక్తలని, ఇద్దరూ పిలువబడినవారని మనము గమనిస్తాము. మరియు మోషే, సరిగ్గా విధి నిర్వహణలో ఉన్నాడు, అనుదినము తనకు ముందుగా తాజా అగ్నిస్తంభమును కలిగియుండి, దేవుని ఆత్మను తనపై కలిగియుండి, విధి నిర్వహణలో ఉన్నాడు. ఇక్కడ మరొక దేవుని సేవకుడు వచ్చుచున్నాడు, దేవునిచేత పిలువబడి, దేవునిచేత అభిషేకించబడి, ఎవరి యొద్దకైతే దేవుని వాక్యము వస్తుందో అట్టి ప్రవక్త వచ్చుచున్నాడు. ఇక్కడే ప్రమాదకరమైన విషయము ఉన్నది. అతడు దైవ—దైవజనుడు కాదని ఎవరునూ వివాదించలేరు, ఎందుకనగా దేవుని ఆత్మ అతనితో మాట్లాడెనని బైబిలు గ్రంథము చెప్పినది, మరియు అతడు ఒక ప్రవక్తయైయున్నాడు.
ప్రభువా, అది ఎంత సమీపముగా ఉన్నది? ఇద్దరూ ప్రవక్తలైయుండగా, నేను ఎట్లు తెలుసుకొందును? ఇద్దరును దేవునిచేత పిలువబడిన ఆత్మ-నింపుదల గలవారు, దేవునిచేత అభిషేకించబడినవారు; దేవుని వాక్యము ఎవరియొద్దకు వస్తుందో అట్టి ప్రవక్తలైయున్నారు. ఇద్దరును పరిశుద్ధాత్మ వారిని నడిపించుచున్నాడని చెప్పుచున్నారు.
దేవునియొక్క ఏడవ దూత వర్తమానికుడు చెప్పుచున్నదానిని గూర్చి మనము కొన్ని కోటేషన్లను చదివి మరియు జాగ్రత్తగా ధ్యానించుదాము. సంఘము ఏమి చెప్పుచున్నదని కాదు, డాక్టర్. జోన్స్ ఏమి చెప్పుచున్నాడన్నది కాదు, లేదా ఇంకెవరైనా ఏమి చెప్పుచున్నారన్నది కాదు గాని, ఆయన ఏమి చెప్పుచున్నాడన్నది మనకు కావలెను. తన ప్రవక్త ద్వారా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనునది ఏమి చెప్పుచున్నదో మనకు కావలెను.
మోషే, దేవుని వాక్యముతో అభిషేకించబడిన ప్రవక్తయైయ్యుండి, అతడు ఆ గడియకు వారి నాయకునిగా ఉండుటకై ఎన్నుకొనబడినవాడని నిర్ధారించబడినాడు, మరియు అబ్రాహాము ఈ కార్యములన్నిటిని వాగ్దానము చేశాడని,...
ఎవరునూ మోషే స్థానమును తీసుకోలేరు. ఎంతమంది కోరహులు, మరియు ఎంతమంది దాతానులు లేచినా; ఏది ఏమైనా, దేవుడు పిలచినది మోషేనే యైయున్నది.
ప్రజలను నడిపించుటకు దేవుడు ఎన్నుకున్నది మోషేనే. ఇతరులు లేచి మరియు వారు కూడా అభిషేకించబడినవారని, పరిశుద్ధాత్మచేత నింపబడినవారని చెప్పారు. నడిపించుటకే దేవుడు వారని కూడా పిలిచాడని చెప్పారు. కానీ వారిని నడిపించుటకు మోషేనే దేవునియొక్క అసలైన పరిపూర్ణ చిత్తపు నాయకుడైయున్నాడు.
అయితే, మరి ప్రజలు ఆయనయొక్క పరిపూర్ణ చిత్తములో నడవనియెడల, మీరు నడుచుటకు అనుమతించుటకై ఆయన ఒక అనుమతిపూర్వకమైన చిత్తమును కలిగియున్నాడు. గమనించండి, ఆయన దానిని అనుమతిస్తాడు, సరియే, అయితే ఆయనయొక్క పరిపూర్ణ చిత్తములో ఆయనయొక్క మహిమార్ధమై అది పనిచేయునట్లు చేస్తాడు. ఇప్పుడు మీరు కోరినయెడల...
ఎవ్వరునూ దేవునియొక్క అనుమతిపూర్వకమైన చిత్తములో ఉండాలని కోరరు. నిజమైన వధువు, ఏది ఏమైనప్పటికీ, అన్నివేళలా, ఆయనయొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉండుటకు ఇష్టపడుతుంది.
టేపులను ప్లే చేయవలసిన ప్రాముఖ్యత విషయములో, అనేక విభేదాలు, ఆలోచనలు, అభిప్రాయాలు, ఎంతో గందరగోళము ఉన్నది.
ఈనాడు వర్తమాన విశ్వాసులను వేరుచేసినది ఈ విషయమేనని మనందరికీ తెలుసు. వధువు తప్పక ఐక్యపరచబడాలని, మరియు ఐక్యపరచబడుతుందని మనకు తెలుసు; అది వాక్యమైయున్నది.
ఆత్మచేత-నింపబడి, దేవునిచేత-పిలువబడిన పురుషులు ఈనాడు సంఘములో ఉన్నారు. వారు ఈ వర్తమానమును ప్రకటించుటకు దేవునిచేత అభిషేకించబడి పిలువబడిన పురుషులైయున్నారు. అయితే మనమందరము ఏకాభిప్రాయం వ్యక్తం చేయగలిగే ఒక్కరూ కూడా వారిలో లేరు.
వధువును ఐక్యపరిచేవారిగా వారు ఎలా ఉండగలరు? మనము వారి పరిచర్య చుట్టూ ఐక్యమవ్వగలమా? నిజముగా వారు తమ మందను నడిపించుట కొరకు పిలువబడినారు, అయితే వారిని తిరిగి దేవునియొక్క అసలైన ప్రణాళికవద్దకు నడిపించుటకైయున్నది. ఆయన నాయకునివద్దకు. ఆయన ప్రవక్తయొద్దకు నడిపించుటకైయున్నది. తమ పరిచర్య వద్దకు నడిపించడానికి కాదు.
టేపులలో ఉన్న స్వరము మీరు వెంబడించవలసిన స్వరమైయున్నదని, మరియు మీరు వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరమైయున్నదని మీరు నమ్మవలసియున్నారని వారు మీకు బోధించనియెడల, అప్పుడు వారు కేవలం ఆయనయొక్క అనుమతిపూర్వకమైన చిత్తములో ఉన్నారు.
అది అత్యంత ప్రాముఖ్యమైన స్వరమని వారు మీకు చెప్తూ, మరియు వారు దానిని నిజంగా నమ్ముచున్నయెడల, అప్పుడు మీరు కూడుకున్న ప్రతిసారి వారు ప్లే నొక్కకుండా ఎలా ఉండగలరు?
మీరు నిశ్చయంగా, ఆయనయొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉన్నారన్న నిశ్చయతను, మీరు కలిగియుండగోరితే, ఒకే ఒక్క నిశ్చయమైన మార్గము ఉన్నది. అది టేపులలో ఉన్నట్టి నిర్ధారించబడిన దేవుని స్వరమును వినుటయేయైయున్నది.
మొదటి విషయమేమిటో మీకు తెలుసా, వారి ఇంటిలో ఒక టేపు పడుతుంది. అప్పుడు, అది వారిని పట్టుకుంటుంది. అతడు ఒక గొర్రెయైన యెడల, అతడు నేరుగా దానితో వస్తాడు. అతడు ఒక మేకయైన యెడల, అతడు ఆ టేపును బయటకు తన్నివేస్తాడు.
నేను నిశ్చయతను కలిగియుండాలి. నా నిత్య గమ్యము విషయమును, నేను కొంచెం కూడా తేలికగా తీసుకోలేను, మరియు తీసుకోను. టేపులలో ఉన్న స్వరము వధువు కొరకైనటువంటి దేవుని స్వరమని నాకు తెలుసు. అది పొరపాట్లు చేయదని నాకు తెలుసు. అది అగ్నిస్తంభముచేత నిర్ధారించబడినదని నాకు తెలుసు. దేవుడు తన వధువును నడిపించుటకు దానిని ఎన్నుకున్నాడని నాకు తెలుసు. ఆ స్వరము మాత్రమే వధువును ఐక్యము చేసేదైయున్నదని మరియు ఐక్యము చేస్తుందని నాకు తెలుసు. అది “ఇదిగో, దేవుని గొర్రెపిల్ల,” అని చెప్పే స్వరముగా ఉంటుందని నాకు తెలుసు.
నేను ప్లేను నొక్కి మరియు ఆ స్వరమును వినవలసియున్నాను. ఈ ఆదివారమునాడు, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా, 12:00 P.M., గంటల సమయమప్పుడు మేము దీనిని వినుచుండగా మీరు వచ్చి మాతో చేరుటకు మీరు ఆహ్వానించబడ్డారు: 65-0418E వాక్య విషయంలో దేవుడెన్నడైనా తన మనస్సును మార్చుకొనునా?
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
మనము వర్తమానమును 61 వ పేరా వద్ద ప్రారంభించుకుంటాము.
వర్తమానమును వినుటకు ముందు చదువవలసిన లేఖనములు:
నిర్గమకాండము 19వ అధ్యాయము
సంఖ్యాకాండము 22:31
పరిశుద్ధ. మత్తయి 28:19
లూకా 17:30
ప్రకటన 17వ అధ్యాయము
క్రీస్తుయొక్క ప్రియమైన వధువా, ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M., గంటల సమయమప్పుడు దీనిని వినుటకు మనము కూడుకుందాము 65-0221E - "ఈ మెల్కీసెదెకు ఎవరు?"
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్