
ప్రియమైన టేపు వధువా,
ఇప్పుడు టేపులలో వింటూ ఉన్న ప్రజలైన మీరు.
ప్రభువా, యేసుక్రీస్తు యొక్క వధువైయున్న మాకు, ఈ ఆరు చిన్న పదాలు ఎంత విలువైనవో వ్యక్తపరచడాన్ని మేము ఎలా మొదలుపెట్టగలము? అది మాకు ఈ ఘడియ వర్తమానముయొక్క ప్రత్యక్షతయైయున్నది. అది దేవుడు తన వర్తమానికుడైన దూత ద్వారా మాట్లాడుతూ తన వధువుతో ఇట్లు చెప్పడమైయున్నది, “నీవు నా స్వరముతో నిలిచియుంటావని నాకు తెలుసు. టేపులలో ఉన్న నా మాట నీకు ఎంత విలువైనదో నాకు తెలుసు. టేపులలో నేను మాట్లాడిన ఈ వర్తమానములు ఈ దినమునకు నా గురుతైయున్నవి అనే ప్రత్యక్షతను నీవు కలిగియుంటావని నాకు తెలుసు.”
“ఈ అయస్కాంతపు టేపులలో నేను నా స్వరమును ఉంచాను; ఏలయనగా ఈ వర్తమానములు పూర్తి వాక్యమును నెరవేర్చవలసియున్నవి. టేపులలో ఉన్న నా స్వరమును విని మరియు ఇది నా పరిచర్య అనే ప్రత్యక్షతను కలిగియుండేవారు వేవేలకొలదిగా ఉంటారు. అది ఈ దినమునకు పరిశుద్ధాత్మయైయున్నది. అది నా గురుతు వర్తమానమైయున్నది”
“నా పరిచర్యను ప్రకటించడానికి ప్రపంచమంతటా అనేకమంది విశ్వసనీయమైన సేవకులను నేను పంపించాను. వారు తిరిగి వచ్చినప్పుడు, వారు నాతో ఇట్లు చెప్పారు, ‘మేము నీ టేపులను ప్లే చేయడం ద్వారా నీ ఆజ్ఞకు లోబడ్డాము. ప్రతీ మాటను నమ్మిన ప్రజలను మేము కనుగొన్నాము. నీ వర్తమానమును స్వీకరించడానికి వారు తమ స్వంత ఇంటినే ఒక సంఘమువలె మార్చారు. నీ గురుతు క్రిందకు, అనగా ఈ ఘడియయొక్క వర్తమానము క్రిందకు వచ్చిన ప్రతియొక్కరూ రక్షించబడతారని, మేము వారికి చెప్పాము.’”
ఇది ఈ దినమునకు దేవునియొక్క పరిపూర్ణమైన మార్గము ఏమిటి? అని ప్రతి మనిషి పరీక్షించుకొని మరియు తననుతాను ప్రశ్నించుకోవలసిన సమయమైయున్నది. ప్రవక్తయొక్క మాట ఒక్కసారైనా విఫలమవ్వలేదు. అది మాత్రమే ఏకైక సత్యమని, అది మాత్రమే ఆయనయొక్క వధువును ఐక్యము చేసే ఏకైక విషయమని ఋజువు చేయబడినది.
ఆయన చెప్పిన ప్రతీది సరిగ్గా ఆయన దానిని చెప్పిన ప్రకారంగానే జరిగినది. అగ్నిస్తంభము ఇంకనూ ఇక్కడ మనతో ఉన్నాడు. టేపులలో దేవునియొక్క స్వరము ఇంకనూ మనతో మాట్లాడుచున్నది. దేవుడు తాను గురుతును చూసినప్పుడు మాత్రమే దాటిపోతాడని ప్రవక్త మనతో చెప్పాడు. ఇది అందరూ ఆ గురుతు వర్తమానము క్రిందకు రావడానికి ఒక తీవ్రమైన అవసరతగల సమయమైయున్నది.
ఈ అంత్య-కాలములో మనము దేవునియొక్క గొప్ప హస్తమును చూశాము. ఆయన తన వాక్యముయొక్క నిజమైన ప్రత్యక్షతను మనకు ఇచ్చాడు మరియు అది గురుతుయొక్క సూచన క్రింద వచ్చినది. ఇప్పుడు, మనము గురుతుయొక్క సూచన క్రింద ఉండగా, మనము కూడివచ్చి మరియు తీవ్రమైన తపనతో ప్రభురాత్రి భోజనమును తీసుకుందాము; ఏలాయనగా దేవుడు తీర్పుతో తాకబోవుచున్నాడని మనకు తెలుసు.
ఈ ఆదివారము మేము: తీవ్రమైన తపన 63-0901E అను వర్తమానమును వినుచుండగా, మీరు విని మరియు ప్రభురాత్రి భోజనమును తీసుకొని మరియు పాదపరిచర్యను కలిగియుండాలని మీలో ప్రతియొక్కరినీ ఆహ్వానించుటకు నేను ఇష్టపడుచున్నాను.
వర్తమానము మరియు ప్రభురాత్రి భోజనపు కార్యక్రమము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా సాయంత్రం 5:00 గంటల సమయమప్పుడు వాయిస్ రేడియోలో ప్రసారమవుతుంది. విదేశీయ విశ్వాసులలో అనేకులకు ఆ సమయానికి మీ కూడికను ప్రారంభించడం కష్టమవుతుందని నాకు తెలుసు గనుక, మీరు కోరినట్లైతే మీ స్థానిక కాలమానం ప్రకారంగా మీ కూడికను నిర్వహించుకోడానికి సంకోచించకండి. కూడికను డౌన్లోడ్ చేసుకోడానికి సంబధించిన ఫైలుకు లింకు ఇవ్వబడుతుంది.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
కూడికకు ముందు చదువవలసిన లేఖనములు:
నిర్గమకాండము 12:11
యిర్మియా 29:10-14
పరిశుద్ధ. లూకా 16:16
పరిశుద్ధ. యోహాను 14:23
గాలతి 5:6
పరిశుద్ధ. యాకోబు 5:16