
Sun Apr 26, 2020 10:00 AM EDT
ప్రియమైన ఐక్యపరచబడిన వధువా,
దేవుడు మన దినములో చేస్తున్న దానంతటిలో భాగమైయుండుటకు, నేను ఎంతో ఉత్సాహముతో ఉన్నాను, మరియు ఎంతో గొప్ప ఎదురుచూపుతో ఉన్నాను. ఆదియందున్న దేవుని తలంపులు ఇప్పుడు మన కన్నులయెదుట నెరవేర్చబడుచున్నవి, మరియు మనము దానిలో భాగమైయున్నాము.
బైబిలు గ్రంథమంతటిలోను, జరుగనైయున్నదాని గురంచి ప్రవక్తలు ప్రవచించి మరియు పలికియున్నారు. కొన్నిసార్లు ఆ ప్రవచనములు కొన్ని వందల సంవత్సరాల వరకు నెరవేరలేదు, కానీ కాలము సంపూర్ణమైనప్పుడు, అది నెరవేరినది; ఏలయనగా ఆయనయొక్క ప్రవక్త ద్వారా పలుకబడిన దేవునియొక్క తలంపు తప్పక నెరవేరవలసియున్నది.
ప్రవక్తయైన యెషయా, “కన్యక గర్భవతియగును” అని పలికాడు. ప్రతీ హెబ్రీ కుటుంబము ఈ బిడ్డను కనడానికి తమ కుమార్తెను సిద్ధపరిచారు. వారు ఆ బిడ్డ కొరకు చెప్పులను మరియు బూట్లను, మరియు మెత్తటి వస్త్రములను కొన్నారు, మరియు ఆ బిడ్డ వచ్చుటకు సిద్ధపరిచారు. తరములు గడిచిపోయినవి, అయితే చివరికి దేవునియొక్క వాక్యము నెరవేరినది.
ఒక యవ్వనస్థుడిగా ఎదుగుతున్న సమయంలో నేను ఎల్లప్పుడూ ఇట్లనుకునేవాణ్ణి, ప్రభువా, నీ వాక్యమును నెరవేర్చడానికి నీవు ఎల్లప్పుడూ నీ ప్రజలను ఐక్యపరిచావని నేను నీ వాక్యములో చూస్తున్నాను. మోషే అనబడే ఒక్క వ్యక్తి ద్వారా, నీ హెబ్రీ పిల్లలను నీవు ఐక్యపరిచావు, అతడు అగ్నిస్తంభము ద్వారా వారిని వాగ్దాన దేశమునకు నడిపించాడు.
నీవు శరీరధారియై మరియు ఇక్కడ భూమి మీద నివసించినప్పుడు, నీవు నీ శిష్యులను ఐక్యపరిచావు. నీవు వారికి నీ వాక్యమును బయలుపరచడానికి వారిని ప్రతిదాని నుండి మరియు ప్రతియొక్కరి నుండి వేరుచేశావు. పెంతెకొస్తు దినమున, నీవు వచ్చి మరియు వారికి నీ పరిశుద్ధాత్మను ఇవ్వగలుగుటకు ముందు, నీవు మరొకసారి నీ సంఘమును, ఏకమనస్సులో మరియు ఏక ఆత్మలో ఒక్క చోట చేర్చావు.
నేను ఇట్లనుకున్నాను, ఈ దినమున అది ఎలా సాధ్యమవుతుంది ప్రభువా? నీ వధువు ప్రపంచమంతటా వ్యాపించియున్నది. వధువు అంతయు జఫర్సన్విల్ కి వస్తుందా? అది జరగడాన్ని నేను చూడలేకపోతున్నాను ప్రభువా. కానీ, ప్రభువా, నీవెన్నడూ నీ ప్రణాళికను మార్చుకొనవు. అది నీ నియమమైయున్నది, దానిని ఆపడానికి ఏ మార్గమూ లేదు. నీవు దానిని ఎలా చేస్తావు?
మహిమా…ఈ రోజు, మనము మన స్వంత కన్నులతో చూడగలుగుతున్నాము, మరియు మరీ ముఖ్యంగా, దానిలో భాగమైయున్నాము: దేవునియొక్క నిత్యమైన వాక్యము నెరవేర్చబడుట. భౌతికముగా మనము ఒక్క స్థలములో లేము, మనము ప్రపంచమంతటా వ్యాపించియున్నాము, కానీ పరిశుద్ధాత్మ ఇప్పుడు దేవునియొక్క స్వరము ద్వారా ఆయనయొక్క వధువును ఐక్యపరిచాడు. పలుకబడి మరియు టేపులలో రికార్డు చేయబడిన ఆయనయొక్క వాక్యము, ఈ దినము కొరకైన దేవునియొక్క సంపూర్ణత, ఆయనయొక్క వధువును సమకూర్చి ఐక్యపరచుచున్నది…మరియు దానిని ఆపగలిగేది ఏదియు లేదు.
దేవుడు తన వధువును ఐక్యపరచుచున్నాడు. ఆమె తూర్పునుండి మరియు పశ్చిమము నుండి, మరియు ఉత్తరమునుండి మరియు దక్షిణము నుండి కూడివచ్చుచున్నది. ఒక ఐక్యమయ్యే సమయమున్నది, మరియు అది సరిగ్గా ఇప్పుడేయైయున్నది. ఆమె దేనికొరకు ఐక్యమగుచున్నది? ఎత్తబడుట కొరకైయున్నది. ఆమేన్!
ఐక్యమయ్యే సమయము సరిగ్గా ఇప్పుడు జరుగుతున్నది!!! మనల్ని ఏది ఐక్యపరచుచున్నది? పరిశుద్ధాత్మ ఆయనయొక్క వాక్యము ద్వారా, ఆయనయొక్క స్వరము ద్వారా ఐక్యపరుస్తున్నాడు. మనము దేనికొరకు ఐక్యమవుతున్నాము? ఎత్తబడుట కొరకైయున్నది!!! మరియు మనమందరమూ వెళ్తున్నాము మరియు మనము ఒక్కరిని కూడా విడిచిపెట్టబోవడంలేదు.
దేవుడు ఆమెను సిద్ధపరుస్తున్నాడు. అవును, అయ్యా, ఐక్యపరుస్తున్నాడు! ఆమె దేనితో ఐక్యమగుచున్నది? వాక్యముతో!
మన దినమునకైన వాక్యము ఏమిటి? ఆయనయొక్క వధువునకు దేవునియొక్క స్వరమైయున్న, ఈ వర్తమానమే, ఆయనయొక్క స్వరమే. ఒక మనిషి కాదు. మనుషులు కాదు. ఒక గుంపు కాదు. అగ్నిస్తంభముచేత, నిర్ధారించబడి, టేపులలో ఉన్న దేవునియొక్క స్వరమే.
“ఏలయనగా భూమ్యాకాశములు గతించును గాని, నా వాక్యము ఎన్నడూ గతించిపోదు.” ఏ సంఘశాఖ ఏమి చెప్పినా లేదా ఎవ్వరు ఏమి చెప్పినా గాని ఆమె యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతో తననుతాను ఐక్యపరచుకుంటున్నది.
ఎవ్వరు ఏమి చెప్పినా గాని, మన దినమునకు ఋజువు చేయబడి, నిర్ధారించబడిన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు స్వరముతో, మనము ఐక్యమవుతున్నాము. ఎవరో ఒకరి అనువాదముతో కాదు; మనము అలా ఎందుకు చేస్తాము? అది ప్రతి వ్యక్తితో మారిపోతుంది, కానీ టేపులలో ఉన్న దేవునియొక్క స్వరము ఎన్నడూ మారదు మరియు అది దేవునియొక్క వాక్యమైయున్నదని మరియు దేవునియొక్క స్వరమైయున్నదని స్వయంగా అగ్నిస్తంభముచేత ప్రకటించబడినది.
దాని విషయములో, మనిషితో ఉన్న సమస్య ఏమిటంటే, అతడు అతని నాయకుణ్ణి ఎరుగడు. అవును, అయ్యా. వారు ఒక సంఘశాఖ చుట్టూ గుమిగూడుతారు, వారు ఒక బిషప్పు చుట్టూ లేదా ఒక వ్యక్తి చుట్టూ గుమిగూడుతారు, కానీ వారు నాయకుడు, అనగా వాక్యములో ఉన్న పరిశుద్ధాత్మ చుట్టూ గుమిగూడరు. చూశారా? “ఓ, సరి, నేను కొద్దిగా మూఢభక్తిలోకి వెళ్ళిపోతానేమోనని నేను భయపడుతున్నాను; నేను తప్పుడు దారిన వెళ్ళిపోతానేమోనని నేను భయపడుతున్నాను,” అని వాంటారు. ఓ, విషయం అదే!
దీనినే విమర్శకులు వారి సంఘసమాజములకు చూపించి మరియు, “చూడండి, వారు ఒక మానవుణ్ణి, బ్రెన్హామ్ సహోదరుడిని, హెచ్చిస్తున్నారు. వారు ఆయనను దేవుడిగా నమ్మేవారైయున్నారు మరియు పరిశుద్ధాత్మ చుట్టూ కాదు గాని, అతని చుట్టూ, ఆ మనిషి చుట్టూ గుమిగూడుతున్నారు,” అని చెప్తారు.
అర్థంలేని మాటలు, ఆ వ్యక్తి ద్వారా పలుకబడినట్టి నిర్ధారించబడిన దేవుని స్వరము చుట్టూ మేము ఐక్యమవుతున్నాము. గుర్తుంచుకోండి, ఈ దినమున ఆయనయొక్క వధువును బయటకు పిలిచి మరియు ఆమెను నడిపించడానికి దేవునియొక్క స్వరముగా ఉండుటకు ఎన్నుకోబడిన వ్యక్తి అతడేయైయున్నాది. స్వయంగా దేవునిచేత నిర్ధారించబడిన ఏకైక స్వరము అది మాత్రమేయైయున్నది.
అయితే దానికి విరుద్ధంగా, వారు మనుష్యుల చుట్టూ ఐక్యమవుతున్నారు. వారు టేపులలో ఉన్న దేవుని స్వరమును వారి సంఘములలో ప్లే చేయరు. మీరు దానిని ఊహించగలరా??? ఒక సేవకుడు ఈ వర్తమానము ఈ ఘడియయొక్క వర్తమానమని, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నదని నమ్ముతున్నాను అని చెప్పుకుంటూ, అయినను ఆ స్వరమును తమ సంఘములో ప్లే చేయకుండా ఉండటానికి ఏదో ఒక విధమైన సాకును కనుగొని, అయితే వారు చెప్పేదానిని మరియు ఇతర సేవకులు వాక్యమును బోధించడాన్ని తప్పక వినాలని ప్రజలకు చెప్పడం...పిదప మనము ఒక మానవుడిని వెంబడిస్తున్నామని వారు అంటారు!!!
ఆ మనుష్యులకు దేవుడు ఏమి చేసాడో మనము పోయిన ఆదివారమే విన్నాము!!
మనము ఒక పెండ్లి కొరకు సిద్ధపడుచున్నాము. మనము ఆయనతో ఒక్కటగుచున్నాము. వాక్యము నీవుగా మారుతుంది, మరియు నీవు వాక్యముగా మారతావు. యేసు ఇట్లు చెప్పాడు, “ఆ దినమున మీరు దానిని ఎరుగుదురు. తండ్రి ఏమైయున్నాడో, అదంతయు నేను అయ్యున్నాను; మరియు నేను ఏమైయున్నానో, అదంతయు మీరు అయ్యున్నారు; మరియు మీరు ఏమైయున్నారో, అదంతయు నేను అయ్యున్నాను. నేను తండ్రియందును, తండ్రి నాయందును, నేను మీయందును, మీరు నాయందును ఉన్నారని ఆ దినమున మీరు ఎదుగుదురు.”
ప్రభువా మా దినములో, నిన్ను గూర్చియు, మమ్మల్ని గూర్చియునైన ప్రత్యక్షత కొరకు నీకు కృతజ్ఞతలు. నీయొక్క పలుకబడిన వాక్యము ద్వారా నీ వధువు తననుతాను సిద్ధపరచుకుంటున్నది. నీయొక్క రికార్డుచేయబడిన వాక్యముతో నిలిచియుండుట ద్వారా మేము నీయొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉన్నామని మేము ఎరిగియున్నాము.
ఈ ఆదివారమున మన దినమునకైన ఒకేఒక్క నిర్ధారించబడిన దేవునియొక్క స్వరమును వినడానికి నేను ప్రపంచమును ఆహ్వానిస్తున్నాను. ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, మేము: 63-0818, ఐక్యమగు కాలము మరియు సూచన అనుదానిని వింటుండగా మాతో చేరడానికి మీరు స్వాగతించబడుచున్నారు. మీరు అనుసంధానమై మాతో కలిసి వినలేనియెడల, ఒక టేపును ఎన్నుకోండి, ఏ టేపైనా పర్వాలేదు; అవన్నీ యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నవి, మరియు దేవుని వాక్యము మిమ్మల్ని పరిపూర్ణము చేస్తూ మరియు ఆయనయొక్క త్వరితమైన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచడాన్ని వినండి.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
కీర్తన 86:1-11
పరిశుద్ధ. మత్తయి 16:1-3
ఆమె తననుతాను ఐక్యపరచుకొనుచున్నది. ఆమె సిద్ధపడుచున్నది. ఎందుకు? ఆమె వధువైయున్నది. అది నిజము. మరియు ఆమె తననుతాను తన పెండ్లికుమారునితో ఐక్యపరచుకొనుచున్నది, చూడండి, మరియు పెండ్లికుమారుడు వాక్యమైయున్నాడు. “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, మరియు వాక్యము దేవుడైయుండెను. మరియు ఆ వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను.”