ఆదివారం
05 అక్టోబర్ 2025
63-0901M
గురుతు

గురుతును కలిగియున్న ప్రియమైన వధువా,

మనం కూడి వచ్చినప్పుడు, మనం వర్తమానము గురించి మాత్రమే మాట్లాడము, మనం రక్తమును అన్వయించుకోడానికి, గురుతును అన్వయించుకోడానికి కూడి వస్తాము; మరియు గురుతు ఏదనగా ఘడియయొక్క వర్తమానమే! అది ఈ దినముయొక్క వర్తమానమే! అది ఈ కాలముయొక్క వర్తమానమే.

మనం స్వయంగా మనకు, మరియు మన ఇండ్లకు, మరియు మన కుటుంబాలకు ఆ గురుతును అన్వయించుకున్నాము. మనము సిగ్గుపడటంలేదు. అది ఎవరికి తెలుసు అనేది మనం లెక్కచేయము. దానిని ప్రతియొక్కరు తెలుసుకోవాలని మనం కోరుతున్నాము, దారినవెళ్ళే ప్రతియొక్కరూ చూసి మరియు దీనిని తెలుసుకోవాలని కోరుతున్నాము: మనం టేపును వినే ప్రజలము. మనం ఒక టేపు ఇంటివారము. మనం దేవునియొక్క టేపు వధువైయున్నాము.

పరిశుద్ధాత్మ = గురుతు = వర్తమానము. అవన్నీ ఒక్కటే. మీరు వాటిని వేరుచెయ్యలేరు. తండ్రీ, కుమార, పరిశుద్ధాత్మ = ప్రభువైన యేసు క్రీస్తు. మీరు వారిని వేరుచెయ్యలేరు. వర్తమానము = వర్తమానికుడు. విమర్శకులు ఏమన్నా లెక్కలేదు, ప్రవక్త ఇలా చెప్పాడు, మీరు వారిని వేరుచెయ్యలేరు.

దేవుడే మీ ఆనందము. దేవుడే మీ శక్తి. ఈ వర్తమానమును తెలుసుకోవడం, అది మాత్రమే సత్యమని తెలుసుకోవడం, అదియే గురుతైయున్నదని తెలుసుకోవడం, అదే మనకు చాలినది. కొందరు ఇట్లనవచ్చును, “నేను దానిని నమ్ముతున్నాను. నేను దానిని నమ్ముతున్నాను. అది సత్యమని నేను నమ్ముతున్నాను. అది సత్యమని నేను అంగీకరించుచున్నాను.” అదంతా మంచిదే, మరి అయినను అది అన్వయించబడవలసి యున్నది.

ఈ వర్తమానము ఈ దినము కొరకైన గురుతైయున్నదని ప్రవక్త చెప్పాడు. ఈ వర్తమానమే పరిశుద్ధాత్మ. మీకు గనుక ఈ వర్తమానము గూర్చి కొంచెమైనా ప్రత్యక్షత ఉన్నయెడల మనం జీవిస్తున్న ఘడియను మీరు తేటగా చూడగలరు. “నేను దానిని నమ్ముతున్నాను. దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. అది ఈ ఘడియయొక్క వర్తమానమైయున్నది,” అని చాలామంది చెప్పుచున్నారు, కానీ సాక్షాత్తు గురుతైయున్న అదే స్వరమును తమ సంఘములలో ప్లే చేయడంలేదని, మరియు ప్లే చేయరని చెప్తూ ప్రగల్భాలు పలుకుచున్నారు.

దానికి ఒక అర్థం ఉంటేనే తప్ప దేవుడు ఆయనయొక్క బలమైన దూత ద్వారా మాట్లాడి మరియు ఊరకే ఏదైనా చెప్పలేదు. ఆయన గురుతుల ద్వారా మరియు ఛాయల ద్వారా మనకు బోధించాడని ఆయన చెప్పాడు. ఈ వర్తమానములో, రాహాబు మరియు ఆమె కుటుంబము రక్షించబడుటకు, వధువుగా ఉండుటకు ఏమి చేశారన్నది మనకు చెప్పడానికి ప్రవక్త చాలా లోతైన వివరణలోనికి వెళ్తాడు. ఆమె ఏమి చేసినది అన్నదానిని ఆయన స్పష్టంగా వివరించాడు.

టేపు అబ్బాయిలు “టేపును” ప్లే చేసినప్పుడు…ఒక్క నిమిషం ఆగండి, వర్తమానికుడు ఏమి చేశాడు? ఒక టేపును ప్లే చేశాడు. అప్పుడు ఆమె ఏమి చేసినది? తన ఇంటిని ఒక టేపు సంఘముగా మార్చినది. “ఆ ఎర్రని దారమును చూస్తున్నారా, నేను ఒక టేపు సంఘమైయున్నానని దాని అర్థం,” అని చెప్పడానికి ఆమె సిగ్గుపడలేదు.

మీరు ఇట్లనుకుంటున్నారా, “అవును, నేను వర్తమానికుడిని మరియు వర్తమానమును నమ్ముతున్నాను, కానీ మేము ఇక మా సంఘములో టేపులను ఎంతమాత్రమూ ప్లే చేయడంలేదు. వద్దు అని చెప్పే ఒక సంఘకాపరిని నేను కలిగియున్నాను, మరియు టేపులు చెప్పుచున్నవాటిని అతడు మాత్రమే బోధించి మరియు ఉటంకించవలసియున్నాడు” అని ఆమె చెప్పియుంటే. ఆమె రక్షించబడియుండేదని మీరు అనుకుంటున్నారా...???

ఆమె గురుతును అన్వయించుకున్నది, మరియు ఆమె ఇంటివారు రక్షించబడ్డారు, లేదంటే ఆమె ఉన్నచోటే ఆమె నశించిపోయి యుండేది.

అనేకమంది సేవకులు టేపులను ప్లే చేయడం గురించి అనేక సాకులను చెప్పడాన్ని మీరు విన్నారు, అయితే దాదాపు చాలామంది ఇట్లంటారు: “సంఘములో టేపులను ప్లే చేయండి అని ప్రవక్త ఎన్నడూ చెప్పలేదు.”

రాహాబు తన ఇంటిని ఒక సంఘముగా చేసినదని ప్రవక్త చెప్పాడు, మరియు తన సంఘము టేపులను ప్లే చేసినది. మరియు ఆమె u>తన సంఘములో టేపులను ప్లే చేసినది గనుక, ఆమె, మరియు ఆమెయొక్క టేపు సంఘమంతయు, గురుతు క్రింద ఉండి మరియు రక్షించబడినారు.

సహోదరులారా మరియు సహోదరీలారా, దయచేసి వినండి, ఒక సంఘకాపరి ఈ వర్తమానమును బోధించకూడదని, లేదా అతడు అలా చేస్తే అది తప్పని నేను చెప్పడంలేదు. నా స్వంత విధానములో, ఇప్పుడు ఈ లేఖ ద్వారా నేను బోధిస్తున్నాను, కానీ ప్రవక్త ఏమి చెప్తున్నాడు మరియు దేని గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు అనేదానిని మీ హృదయమును తెరిచి వినండి. మీ సంఘకాపరి గనుక, అదేమైనప్పటికినీ, ఏదో ఒక విధమైన సాకును చెప్తూ మీ సంఘములో టేపులను ప్లే చేయకుండా, లేదా మీదటికి కూడా వాటిని ప్లే చేయబోవడంలేనియెడల; “నేను ఈ ఘడియయొక్క వర్తమానమును నమ్ముతున్నాను” అని అతడు ఎంతగా చెప్పినను, వాక్య ప్రకారంగా, వాక్యము ఏమి చెప్పుచున్నదని నేను నమ్ముచున్నదాని ప్రకారంగా, గురుతు, ఈ ఘడియయొక్క వర్తమానము అన్వయించబడటంలేదు.

ఈ ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, వచ్చి బ్రెన్హామ్ ఆలయముతో కలిసి, ఈ వర్తమానమును వినాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను: గురుతు 63-0901M. మీరు మాతో చేరలేనియెడల, గురుతు వర్తమానములలో దేనినైనా ప్లే చేసుకొని, మరియు దానిని అన్వయించుకోండి.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

వర్తమానమును వినడానికిముందు చదువవలసిన లేఖనములు:

ఆదికాండము 4:10
నిర్గమకాండము 12వ అధ్యాయము
యెహోషువ గ్రంథము 12వ అధ్యాయము
అపొస్తలుల కార్యములు 16:31 / 19:1-7
రోమా 8:1
1 కొరింథీ 12:13
ఎఫెస్సీ 2:12 / 4:30
హెబ్రీ 6:4 / 9:11-14 / 10:26-29 / 11:37 / 12:24 / 13:8, 10-20
పరిశుద్ధ. యోహాను 14:12