

నిర్ధారించబడిన వాక్యము మాత్రమేయైయున్న వధువా,
ఈ దినమునకు ఆయనయొక్క నిర్ధారించబడిన వాక్యమును గూర్చిన నిజమైన ప్రత్యక్షతకై పరిశుద్ధాత్మకు మనమెంత కృతజ్ఞులమైయున్నాము కదా. సహోదరుడు బ్రెన్హామ్ గారు తన గురించి వాగ్దానము లేఖనములను నెరవేర్చే దేవుని ప్రవక్తయని తాము నమ్ముతున్నారని అనేకులు చెప్పుకుంటారు, కానీ వాక్యమును గూర్చిన నిజమైన ప్రత్యక్షత మరియు దేవుని ప్రణాళిక వారికి మరుగుచేయబడియున్నది.
వధువు వింటున్న ప్రతి ప్రేమ లేఖ వర్తమానముతో, ఈ దినమునకై ఆయన ఏర్పాటు చేసిన మార్గమును, అనగా టేపులలో ఉన్న దేవుని స్వరమును వినడం ద్వారా మనము ఆయనయొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉన్నామని దేవుడు మనకు ధృవీకరిస్తున్నాడు.
మరియు మనము తప్పక ఆయనను వెంబడించవలసియున్నాము, నిత్యజీవమును పొందుకోడానికి గల ఒకే ఒక్క మార్గము అదేయైయున్నది. కావున దేవునియొక్క నాయకత్వము ఏమిటంటే: పరిశుద్ధాత్మ ద్వారా ఘడియయొక్క నిర్ధారించబడిన వాక్యమును వెంబడించడమే.
నిత్యజీవమునకు ఒకేఒక్క మార్గమేదనగా: పరిశుద్ధాత్మ మిమ్మల్ని నిర్ధారించబడిన వాక్యమును వెంబడించునట్లుగా నడిపించడమే. ఈ దినమునకు నిర్ధారించాబడిన వాక్యమును ఎవరు కలిగియున్నారు? దేవుడు తన వాక్యమును అనువదించడానికి ఎవరిని ఎన్నుకున్నాడు? ఈ దినమునకు ఎవరు తన స్వరముగా ఉన్నారని దేవుడు చెప్పాడు? ఈ దినమున ఆయనయొక్క వధువును నడిపించడానికి నిర్ధారించబడిన నాయకుడు ఎవరని దేవుడు చెప్పాడు? ఏ పరిచర్య?
సరిగ్గా నేను చెప్పినట్లే, ఆ చిన్న పక్షిరాజు అతడు పెండ్లికుమారుని స్వరమును వినినప్పుడు, అతడు దాని దగ్గరకు వెళ్ళాడు, చివరి దినమునకు దేవునియొక్క అభిషేకించబడిన, నిర్ధారించబడిన వాక్యము దగ్గరకు వెళ్ళాడు.
నోవహు తన దినమునకైన నిర్ధారించబడిన వాక్యమైయున్నాడు.
మోషే తన దినమునకైన నిర్ధారించబడిన వాక్యమైయున్నాడు.
యోహాను నిర్ధారించబడిన వాక్యమైయున్నాడు
వారు దానిని తాము కోరిన ఏ విధంగానైనా మలచగలరు లేదా అనువదించగలరు, కానీ:
విలియమ్ మారియన్ బ్రెన్హామ్ ఈ దినమునకు దేవునియొక్క నిర్ధారించబడిన వాక్యమైయున్నాడు!!
కావున దేవునియొక్క నాయకత్వము ఏమిటంటే: పరిశుద్ధాత్మ ద్వారా ఘడియయొక్క నిర్ధారించబడిన వాక్యమును వెంబడించడమే.
మరియు దేవునియొక్క నిర్ధారించబడిన స్వరమును మీ సంఘములో ప్లే చేయడమనేది వధువు చేయగల అత్యంత ముఖ్యమైన కార్యము కాదా? ఒక భిన్నమైన స్వరమును వినడం ఇంకా ప్రాముఖ్యమైన కార్యమా?
వధువును ఐక్యపరచి మరియు నడిపించేది ఒక గుంపు మనుష్యులా? పరిచర్య ఏమి చెప్తుంది అనేదాని ద్వారా వధువు ఐక్యపరచబడుతుందా? వారందరూ భిన్నమైనవాటిని చెప్తారు, కావున మనము ఎవరిని వెంబడించాలి?
ఈ వర్తమానమునకు వారు ఇచ్చే అనువాదము ద్వారా మనము తీర్పుతీర్చబడతామా? వారి పరిచర్యను ఒక అగ్నిస్తంభము నిర్ధారిస్తున్నదా? వాక్యమునకు వారు ఇచ్చే అనువాదమే మీ సంపూర్ణతైయున్నదా?
వధువు ఐక్యపరచబడుతుంది అని ప్రవక్త చెప్పాడు. ప్రభువు వచ్చి మరియు తన వధువును కొనిపోవునట్లు ఈ ప్రవచనమును నెరవేర్చేది ఏమిటని, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి?
మరియు పిదప, దేవుని ప్రజలు తిరిగి కూడుకోవడం ప్రారంభించినప్పుడు, అక్కడ ఐక్యత ఉంటుంది, అక్కడ శక్తి ఉంటుంది. చూశారా? మరియు ఎప్పుడైతే దేవుని ప్రజలు పూర్తిగా సమకూర్చబడతారో, అప్పుడు పునరుత్థానము సంభవిస్తుందని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ దానిని సమకూర్చడం ప్రారంభించినప్పుడు ఒక ఎత్తబాటు సమయం ఉంటుంది. మరి అవును, వారు—వారు అల్ప సంఖ్యలో ఉంటారు, కానీ ఒక గొప్ప కూడిక ఉంటుంది.
దేవునిచేత నిర్ధారించబడిన ప్రవక్త పరిచర్య చుట్టూ కాకుండా, ఎవరో ఒక మనుష్యుని పరిచర్య చుట్టూ ఒక గొప్ప కూడిక జరుగుతుందా? ఐదు రకముల పరిచర్య సేవకులు దేవునియొక్క స్వరమును మీ సంఘములో ఎన్నడూ ప్లే చేయకూడదని, అది తప్పని చెప్తున్నారు గనుక అది ఒక సేవకుల గుంపు యైయుంటుందా. అలాగైతే వారు వధువును నడిపిస్తారా?
దయచేసి నాకు సహాయము చేయండి! ఆ గొప్ప కూడికలో నేను ఐక్యపరచబడాలని కోరుతున్నాను కాబట్టి, నేను ఏ సేవకుడిని వెంబడించాలి.
ఏడు ఉరుములయొక్క ఐదు రకముల పరిచర్య సేవకులు వధువును పరిపూర్ణము చేస్తారని కొందరు చెప్తారు. ఒక్క-వ్యక్తి పరిచర్య రోజులు గతించిపోయినవని కొందరు ఐదు రకముల పరిచర్య సేవకులు చెప్తారు. మనము తిరిగి పెంతెకొస్తునకు వెళ్ళాలని కొందరు ఐదు రకముల పరిచర్య సేవకులు చెప్తారు. ఈ వర్తమానము సంపూర్ణత కాదని కొందరు చెప్తారు. మీరు టేపులను ప్లే చేస్తే మీరు ఆయనను దైవముగా భావిస్తున్నారని కొందరు అంటారు. వారందరూ ఏదో ఒక భిన్నమైనదానిని చెప్తారు, మరియు అందరూ భిన్నమైన అనువాదములను, భిన్నమైన ఆలోచనలను కలిగియుంటారు, మరైనను వారు పరిశుద్ధాత్మచేత నడిపించబడుతున్నారని ప్రతి ఒక్కరూ చెప్తారు.
ఐదు రకముల పరిచర్యలోని ఏ సేవకుడిని నేను వెంబడించాలి? ఐదు రకముల పరిచర్యలోని “నా” సంఘకాపరిని నేను వెంబడించినంతకాలం, నేను వధువుగా ఉంటానా? ఐదు రకముల పరిచర్య సేవకులలో అనేక భిన్నమైన “గుంపులు” ఉన్నాయి. ఈ 20 మంది సేవకులు కూడుకొని వారి కూటములను నిర్వహించుకుంటారు, కానీ వేరే కూటములను కలిగియుంటున్న ఇతర 20 మంది సేవకులతో పూర్తిగా విబేధిస్తారు…పరిపూర్ణము చేయబడుటకు మరియు ఐక్యపరచబడుటకు నేను ఏ కూటములకు వెళ్ళాలి…వాటిలో కొన్నిటికా…వాటిలో అన్నిటికా?
మరి ఈ గందరగోళం వధువును ఐక్యపరచబోతుందని మరియు పరిపూర్ణము చేయబోతుందని ప్రజలు నమ్ముతున్నారా? వారు దేవునిచేత పిలువబడిన నిజమైన ఐదు రకముల పరిచర్య సేవకులని వారందరూ చెప్పుకుంటారు. కానీ వారు మిమ్మల్ని పరిశుద్ధాత్మ ద్వారా నిజమైన నాయకత్వము దగ్గరకు నడిపించడంలేదు, వారు మిమ్మల్ని తమ దగ్గరకు మరియు తమ పరిచర్య దగ్గరకు నడిపించుకుంటున్నారు.
నా ప్రకారమైతే, అది ఎన్నడూ వధువు అంతటినీ ఐక్యపరచలేదని లేదా నడిపించలేదని తెలుసుకోడానికి మీకు ప్రత్యక్షత కూడా అవసరంలేదు. టేపులలో ఉన్న దేవుని స్వరము ద్వారా, వాక్యము మాత్రమే వధువును ఐక్యపరుస్తుంది.
సహోదరులారా మరియు సహోదరీలారా, అది అద్భుతమైనదైయుండి మరియు ఖచ్చితంగా అతడు చేయవలసిన విషయమేయైయుండగా, కేవలం వాక్యమును బోధిస్తూ మరియు దానిని ఉటంకిస్తున్నాడు గాని, టేపులలో ఉన్న దేవునియొక్క స్వరమును ప్లే చేయమని మీతో చెప్పకుండా, మరియు అతి ముఖ్యంగా, మీ సంఘములో దానిని ప్లే చేయకపోవటంవలన, దానిని చేయనటువంటి ఒక సంఘకాపరిని మీరు వెంబడిస్తున్నట్లైతే, మీరు మేల్కోవడం మంచిది.
సహోదరుడు బ్రెన్హామ్ గారు మనకు ఇట్లు చెప్పారు:
ఇప్పుడు, మనకు విడిచిపెట్టబడిన భౌతికమైన దైవిక క్రమములు మూడు మాత్రమే ఉన్నవి: వాటిలో ఒకటి ప్రభురాత్రి భోజనము, పాద-పరిచర్య, నీటి బాప్తిస్మము. ఆ మూడు మాత్రమే ఉన్నవి. అది మూడులోని, పరిపూర్ణతైయున్నది, చూడండి.
ప్రభువు చిత్తమైతే, ఈ ఆదివారము మనము ప్రభురాత్రి భోజనమును మరియు పాద-పరిచర్యను కలిగియుండాలని నేను కోరుతున్నాను. మనము గతంలో చేసినట్లే, మీ స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభించమని నేను మీకు చెప్తాను. అపొస్తలులు వారు కూడివచ్చిన ప్రతిసారి ప్రభురాత్రి భోజనమును తీసుకున్నారని సహోదరుడు బ్రెన్హామ్ గారు చెప్పరు, అయితే ఆయన దానిని సాయంకాలము తీసుకోడానికి ఇష్టపడ్డారు, మరియు దానిని ప్రభువు భోజనము అని పిలిచేవారు.
వర్తమానము మరియు ప్రభురాత్రి భోజనపు పరిచర్య వాయిస్ రేడియోలో ప్రసారం అవుతుంది, మరియు ఆదివారం సాయంత్రం వాయిస్ రేడియో వినలేనివారి కొరకు, డౌన్లోడ్ చేసుకోగల ఫైల్ కు సంబంధించిన లింకు కూడా అందుబాటులో ఉంటుంది.
సహోదరుడు జోసఫ్ బ్రెన్హామ్