మంగళవారం
31 డిసెంబర్ 2024
62-1231
పోరాటము

ప్రియమైన వధువా,

మీలో ప్రతి ఒక్కరూ మీ స్నేహితులతోను మరియు కుటుంబములతోను కలిసి ఒక అద్భుతమైన క్రిస్మసును కలిగియున్నారని నేను నమ్ముచున్నాను. ఈనాడు లోకము ఆయనను చూస్తున్న విధంగా మన ప్రభువైన యేసు ఒక పశులతొట్టిలోనే ఉండిపోలేదు గాని, ఆయన సజీవుడై మరియు తన వధువు మధ్యన ఉన్నాడని, ముందెన్నడూ లేనంతగా ఆయనయొక్క స్వరము ద్వారా తననుతాను బయలుపరచుకొనుచున్నాడని ఎరిగియుండుటకు నేను ఈ దినమున ఎంతో కృతజ్ఞుడనైయున్నాను, దేవునికి స్తోత్రం.

నేను ఇదివరకు ప్రకటించినట్లుగా, నూతన సంవత్సరమునకు ముందు దినమున, అనగా డిసెంబరు 31వ తేదీన, మరొకసారి మన గృహములలో/సంఘములలో ప్రభురాత్రి భోజనమును కలిగియుండగోరుచున్నాను. పాల్గొనాలని ఇష్టపడుచున్నవారికి చెప్పుచున్నాను, మేము, 62-1231 పోటీ, అనే వర్తమానమును వింటాము, మరియు పిదప నేరుగా ప్రభురాత్రి భోజనమును ప్రారంభిస్తాము, దానిని సహోదరుడు బ్రెన్హామ్ గారు వర్తమానముయొక్క ముగింపులో పరిచయం చేస్తారు.

స్థానిక విశ్వాసుల కొరకు, సాయంకాలం 7:00 గంటల సమయమప్పుడు మేము టేపును ప్రారంభిస్తాము. ఏదేమైనను, ఇతర కాలమండలములలో ఉన్నవారు, దయచేసి మీకు అనుకూలమైన సమయములో వర్తమానమును ప్రారంభించండి. సహోదరుడు బ్రెన్హామ్ గారు నూతన సంవత్సరమునకు ముందు దినపు వర్తమానమును అందించిన తర్వాత, 59 వ పేరా ముగింపులో మేము టేపును కొంత సమయం ఆపుతాము, మరియు మేము ప్రభురాత్రి భోజనమును తీసుకొనుచుండగా సుమారు 10 నిమిషాలపాటు పియానో సంగీతం వాయించబడుతుంది. పిదప సహోదరుడు బ్రెన్హామ్ గారు కూడికను ముగించుచుండగా మేము టేపును మరలా ప్లే చేస్తాము. ఈ టేపులో, ఆయన పాదపరిచర్య కార్యక్రమ భాగమును విడిచిపెడతారు, మేము కూడా దానిని విడిచిపెడతాము.

ద్రాక్షరసమును ఎలా పొందుకోవాలి, మరియు ప్రభురాత్రి భోజనపు రొట్టెను ఎలా కాల్చాలి అనేదానికి సూచనలు క్రింద ఇవ్వబడిన లింకులలో కనుగొనబడతాయి. మీరు వెబ్సైటు నుండి ఆడియోను ప్లే చేసుకొనవచ్చును లేదా డౌన్లోడు చేసుకొనవచ్చును, లేదా మీరు సులువుగా లైఫ్ లైన్ యాప్ లోని వాయిస్ రేడియో నుండి ఈ కూడికను ప్లే చేసుకొనవచ్చును (అది జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా సాయంత్రం 7:00 గంటల సమయమప్పుడు ఆంగ్లములో ప్లే చేయబడుతుంది.)

మన ప్రభువుయొక్క సేవలో మరొక సంవత్సరమును మనము సమీపిస్తుండగా, మొదటిగా ఆయన స్వరమును వినుట ద్వారా మనము మన ప్రేమను ఆయనకు వ్యక్తపరచుదాము, మరియు పిదప మనము ఆయనయొక్క భోజనములో పాలుపొందుదాము. మన జీవితములను ఆయనయొక్క సేవకై మరలా ప్రతిష్ఠించుకొనుచుండగా అది ఎటువంటి ఒక మహిమకరమైన పవిత్రమైన సమయముగా ఉంటుంది కదా.

దేవుడు మిమ్మును దీవించును గాక,

సహోదరుడు జోసఫ్