ప్రియమైన ఎన్నుకోబడినవారలారా,
క్రొత్తజన్మ అనగా క్రీస్తైయున్నాడు; అది ఒక ప్రత్యక్షతయైయున్నది. దేవుడు మీకు ఈ గొప్ప మర్మమును బయలుపరిచాడు, మరి అదియే క్రొత్తజన్మయైయున్నది. ఇప్పుడు ప్రత్యక్షత పరిపూర్ణముగా సమాధానములో ఉన్న చోట, ఆ గుంపంతా కూడినప్పుడు మీరేమి చేయబోతున్నారు?
ఆయన తన వధువుకు ఆయనయొక్క వాక్యమును బయలుపరుస్తూ, దేవుడు తన పక్షిరాజు గుంపంతటినీ పరిపూర్ణమైన సమాధానములోనికి సమకూర్చుతున్నాడు.
దావీదు వలె, ఒక రాజును కలిగియుండాలన్న దేవుని విధానము, సరియైయున్నది, మరియు అందరూ ఒక్క ఆలోచన క్రింద కేంద్రీకృతమైయుంటారు. ఎలాగంటే ఒక్క నాయకుడైన బాతు మరియు ఒక బాతుల గుంపు, లేదా మొదలగువాటివలె ఉన్నది, మీరు వారిలో ఇద్దరు లేదా ముగ్గురిని తీసుకోలేరు. అప్పుడు, మీరు వారందరినీ కలగలుపు చేసి, మీరు ఏదో రకమైన ఆలోచనను తీసుకొస్తారు.
అలాగైతే ప్రభువా, మేము ఏమి చేయాలి?
మీరు చేయవలసిన ఒకేఒక్కటి ఏమిటంటే నా స్వరమును తెలియజేయడమే; వారు దానిని ఎరుగుదురు, ఏలయనగా నా గొర్రెలు నా స్వరమును ఎరిగియున్నవి.
ప్రభువా, ఈ దినమునకు నీ పరిపూర్ణమైన స్వరము ఏమిటి?
దానిని చెప్పడంవలన నేను మిమ్మల్ని అభ్యంతరపరచినట్లైతే, నన్ను క్షమించండి, అయితే, బహుశా అది కోపం తెప్పించియుండవచ్చని నాకు అనిపిస్తున్నది, కానీ, నేను మీకు దేవుని స్వరమునైయున్నాను.
మా హృదయమంతటితో మేము దానిని నమ్ముతున్నాము. ప్రభువా, మాకు ఈ విధంగా అనిపిస్తున్నది.
విజ్ఞానశాస్త్రపరంగా వారు దేనినీ ఋజువుచేయవలసిన అవసరం లేదు, లేదా దాని గురించి, ఏ సద్దూకయ్యుడినైనా లేదా పరిసయ్యుడినైనా, లేదా మరిదేనినైనా అడగనవసరంలేదు. నేను దానిని చెప్పాను, వారు దానిని నమ్ముతారు, ఏలయనగా నా గొర్రెలు నా స్వరమును వింటాయి.
నీ వధువునకు టేపులలో ఉన్న స్వరము అంటే ఏమిటి?
ఇది అక్షరరూపములో ఉన్న దేవుని స్వరమైయున్నది, ఎందుకంటే పాత మరియు క్రొత్త నిబంధన కలిపి, ఇది యేసుక్రీస్తుయొక్క సంపూర్ణ ప్రత్యక్షతయైయున్నది. ఆమేన్. విషయం అదేయైయున్నది.
టేపులు ఇంకను ఈ రోజుకి కూడా ప్రాముఖ్యమేనా?
నాకు అది తెలుసు, నేను ఈ భూమి మీదనుండి వెళ్ళిపోయిన తర్వాత, ఆ టేపులు మరియు ఆ పుస్తకాలు సజీవముగా ఉంటూనే ఉంటాయి, మరియు యవ్వనస్థులైన మీలో అనేకులు, రాబోయే దినములలో, ఇది ఖచ్చితంగా సత్యమైయున్నదని కనుగొంటారు,…
ప్రభువా, టేపులు మరియు పుస్తకాలు నీవు వధువు కొరకు ఉంచినట్టి నీయొక్క జీవిస్తున్న, సజీవమైన పరిచర్య అని మేము నమ్ముతున్నాము.
టేపులు ఎందుకని మేము వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరమైయున్నది?
మనము ముందెన్నడూ జీవించనట్టి అత్యంత మోసపూరితమైన కాలములో జీవిస్తున్నాము. “అది సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సైతం మోసపరుస్తుంది,” ఎందుకంటే వారు అభిషేకమును కలిగియున్నారు, వారు ఆ మిగతావారివలె దేనినైనా చేయగలరు.
“ఎవడైనను దీనికి ఒక్క మాటను కలిపినా, లేదా దీనినుండి ఒక్క మాటను తీసివేసినా.” మీరు ఎక్కడో ఒక దగ్గర ఒక అంతిమమును కలిగియుండవలసియున్నారు.
తద్వారా, మన అంతిమము దేవుని వాక్యమైయుండవలసియున్నది. దేవునియొక్క వాక్యము మరియు దేవునియొక్క స్వరము ఒక్కటేనని నీవు మాకు బయలుపరిచావు. నీవు బైబిలును వ్రాసినప్పుడు నీవు ప్రవక్తలతో చేసినట్లే, స్వరము అనగా స్వయంగా దేవునియొక్క పలుకబడిన తలంపులేయైయున్నవి; కానీ ఈ అంత్య దినమున, దానిని రికార్డు చేపించి మరియు టేపులో పెట్టడం ద్వారా, నీవు నీ వాక్యమును మరియు నీ స్వరమును భద్రపరిచావు. కాబట్టి, టేపులలో ఉన్న నీ పలుకబడిన స్వరము వధువుయొక్క అంతిమమైయున్నది.
ఈనాడు తమ సంఘములో ఆ స్వరమును ప్లే చేయడం ముఖ్యమని ప్రజలు అనుకోవడంలేదు. సంఘములో టేపులను ప్లే చేయమని సహోదరుడు బ్రెన్హామ్ గారు ఎన్నడూ చెప్పలేదని, వారు కేవలం సేవకుని పరిచర్యను మరియు వాక్యము ఊటంకించబడుటను వినాలని తమ సంఘములలో వారికి బోధించబడుతున్నది.
మరియు సంఘమే మీ అంతిమమైనట్లైతే, ఎవరు ఏమీ చెప్పినా మీరు పట్టించుకోరు. అదే మీ అంతిమమైయుంటుంది. ఓ దేవా, ఇది వారి హృదయలోతులోనికి వెళ్ళుటకు సహాయము చేయుము! నాకైతే, ఆ పూర్తి సంగతి తప్పైయున్నది, దేవుని వాక్యమే అంతిమమైయున్నది. వాక్యము ఏమి చెప్పినా సరే, అదే సరియైయున్నది.
వారు ఆయనను ఆహ్వానించడానికి ఆయన వేచియున్నాడు. ఈ రాత్రి కూడా ఆయన దాని కొరకే వేచియుంటున్నాడు, మీరు ఆయనను ఆహ్వానించడానికి వేచియుంటున్నాడు. గమనించండి, ఆ శిష్యులు బల్ల చుట్టూ వారి సహవాసమునొద్దకు ఆయనను లోపలికి ఆహ్వానించినప్పుడు,
మరి ఈ అంత్య-కాల వర్తమానమును నమ్ముతున్నామని చెప్పుకునే ఎవరైనా గానీ, స్వయంగా దేవుని స్వరమునే వినే అవకాశమును కలిగియుండి తమ సంఘములలో టేపులను ప్లే చేయకుండా ఉండటం సరియని ఎలా చెప్పగలరు, ఎలా తీర్పు తీర్చగలరు, లేదా ఎలా సాకులు చెప్పగలరు? అది దేవుడు తన అభిషేకించబడిన ప్రవక్త ద్వారా మానవ పెదవులగుండా పలికినట్టి మాటలైయున్నవి. అది ఈ తరమునకు దేవుని స్వరమైయున్నది, అగ్నిస్తంభము ద్వారా నిర్ధారించబడి, హృదయ రహస్యములను ఎరుగుట ద్వారా నిరూపించబడి, సూచకక్రియలు మరియు అద్భుతముల ద్వారా ఋజువుచేయబడిన ఏకైక స్వరము అదేయైయున్నది.
ఎవరైనా ఏ సాకుయైనా, ఏ వివరణయైనా ఎలా చెప్పగలరు, లేదా వారు కూడుకున్న ప్రతిసారీ దేవుని స్వరమును వినడానికి కోరిక లేకుండా ఎలా ఉండగలరు?
ప్రభువా, టేపులలో ఉన్న నీ స్వరమును నేను ఎన్నడూ నిర్లక్ష్యం చేయకుండా ఉందునుగాక. వారు వినవలసిన స్వరము అది మాత్రమేనని నేను లోకమునకు ఎల్లప్పుడూ చాటి చెప్పుదును గాక. వారికి అవసరమైనదంతా టేపులలో ఉన్న దేవుని స్వరమేనని, నేను నీ వధువుకు ప్రకటించెదను గాక.
మేము సహవాసము చేయడానికి ఇష్టపడుతున్నాము. నీ గురించి మాట్లాడటానికి మరియు నీ వాక్యమును ఊటంకించడానికి మేము ఇష్టపడుతున్నాము, అయితే మాకు నీ వాక్యముపై వాక్యమును ఇచ్చి, నీ స్వరముయొక్క ప్రత్యక్షతను ఇచ్చి, మరియు పిదప మేము ఎవరమనేదానిని, నీయొక్క విశ్వాసనీయమైన వధువైయున్నాము అనేదానిని తెలియజేయడంకంటే నీవు నీ వధువు కొరకు చేయగల మరొక గొప్ప కార్యము ఏదియు లేదు.
దేవుడు మనకు ఇచ్చిన గొప్ప ప్రత్యక్షతను గూర్చి సహవాసము చేస్తూ, నేను ఇంకా ఇంకా ఎంతగా మాట్లాడగలనో. దానికి అంతే లేదు; అయితే నేను చేయగల గొప్ప విషయము ఏమిటంటే ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయానికి, మేము 65-0815 – దానిని ఎరుగదు అనే వర్తమానమును వినుచుండగా వచ్చి వధువుయొక్క భాగముతో కలిసి స్వయంగా మీరే దేవుని స్వరమును వినమని మిమ్మల్ని ఆహ్వానించడమే.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
చదువవలసిన లేఖనములు:
ప్రకటన 3:14-19
కొలస్సీ 1:9-20
సంబంధిత కూడికలు
ప్రియమైన క్రీస్తు వధువా, ఈ ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, 65-0801E ప్రవచనము ద్వారా తేటపరచబడిన సంఘటనలు అనే వర్తమానమును వినడానికి మనము కూడివద్దాము.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
సంబంధిత కూడికలు
క్రీస్తుయొక్క ప్రియమైన చిన్న కన్యక, వాక్యపు, మంద, వధువా:
మనము ఆయనయొక్క స్వరమును వెంబడించడం తప్ప మరొకటి చేయలేనట్టి దేవునియొక్క ముందుగా నిర్ణయించబడిన విత్తనమైయున్నామని ఆయనయొక్క బలమైన దూత ప్రకటించి మనకు చెప్పడాన్ని మనం విన్నప్పుడు మన హృదయములు ఎంతగా ఆనందించాయి కదా. అది మనకు జీవము కంటే విలువైనది. మీరు మా ప్రాణములను తీసుకోవచ్చు, కానీ మీరు ఆయన స్వరమును తీసుకోలేరు. మేము ఆయనయొక్క వాక్యముతో ఒక్కటైయున్నాము. మేము ఆయనయొక్క స్వరముతో ఒక్కటైయున్నాము. మేము ఆయనతో ఒక్కటైయున్నాము.
టేపులను ప్లే చేయడాన్ని; అది ఆయనయొక్క వధువుతో మాట్లాడుతున్న దేవుని స్వరమైయున్నదని నమ్ముతున్నామని మనము చెప్తున్నందుకు మనము ఎంతగానో అపార్థము చేసుకోబడి మరియు ఎగతాళి చేయబడటం అనేది మనకు ఎంతో వింతగా అనిపిస్తున్నది. సాతానుడు ప్రజలను ఎంతగా మోసము చేశాడంటే మనము ఒక టేపు సంఘమైయున్నామని మనము చెప్పడంవలన, అది వాక్యమునకు వెలుపల ఉన్న ఏదో ఒక విషయమని, అది తప్పని, మరియు మనము తప్పుగా నడిపించబడుతున్నామని వారు అనుకుంటున్నారు, మరి అన్నివేళలా అది ఆయనయొక్క వధువు కొరకు దేవుడు ఏర్పాటుచేసిన పరిపూర్ణమైన మార్గమైయున్నది.
అది వేరే ఏ విధంగానైనా ఎలా ఉండగలదు? పలుకబడిన ఒక్క మాటను మీరు తప్పుగా అనువదించినా గానీ, మీరు తప్పిపోయినట్లే. వారు సరియైన ఉద్దేశమును మరియు లక్ష్యమును కలిగియుడవచ్చును, కానీ తప్పైయుండవచ్చును. ఒకరు పరిశుద్ధాత్మతో అభిషేకించబడి కూడా తప్పైయుండవచ్చును.
వధువు స్వయంగా తామే ప్రతీ మాటను వినడానికి దేవుడు ఒక మార్గమును ఏర్పాటు చేసియుండకపోతే, అప్పుడు వేరొక మార్గము ఉండేది. కానీ ఎటువంటి అనువాదము, వివరణ, లేదా స్పష్టీకరణ కొరకు ఎటువంటి అవసరత లేకుండా నేరుగా వాక్యము తమతో మాట్లాడటాన్ని వినే అవకాశమును కలిగియుండుటకు, ఆయన భూమి మీదనున్న ప్రతీ మానవునికి ఒక మార్గమును కలుగజేశాడు. అదంతా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నది…ఇక అంతే!
ఆయనయొక్క వధువుగా ఉండుటకు మనము వాక్యముతో నిలిచియుండాలని మనమందరమూ ఏకీభవిస్తాము.
మనకు అవసరమైన ప్రతీది సరిగ్గా ఇక్కడే వ్రాయబడియున్నదని, కేవలం పరిశుద్ధాత్మ ద్వారా అనువదింపబడటం అవసరమైయున్నదని నేను నమ్ముతాను. వాక్యమునకు తన స్వంత అనువాదమును ఇచ్చుటకు భూమి మీదనున్న ఏ మనిషికైనా హక్కున్నదని నేను నమ్మను. ఆయనయొక్క వాక్యమును అనువదించడానికి దేవునికి ఎవ్వరూ అవసరంలేదు. ఆయనే తన స్వంత అనువాదకుడు. ఆయన దానిని చేస్తానని చెప్తే, మరి ఆయన దానిని చేస్తాడు.
ఆయనయొక్క ఎన్నుకోబడిన వధువుగా ఉండటానికి ఆయనయొక్క వాక్యముతో నిలిచియుండటం తప్ప వేరే ఏ మార్గమూ లేదని, స్పష్టముగా ప్రభువు తన వధువుతో మాట్లాడి మరియు ఆమెకు బయలుపరిచాడు. దేవుడు స్వయంగా తానే తన స్వంత వాక్యము అనువదించుకుంటాడు, మరియు దానికి తమ అనువాదమును జతచేయడానికి ఎవరికీ హక్కు లేదు.
ఆయనయొక్క ప్రవక్తయే ఆయనయొక్క వాక్యమునకు అనువాదకుడని కూడా వాక్యము చెప్తున్నది. ప్రజలకు ఆయనే దేవుని స్వరమైయున్నాడు. ఆయన చెప్పేది మన దినమునకు వాక్యమైయున్నది.
టేపులలో ఉన్న దేవుని స్వరమును వినడం ద్వారా, మనము నెరవేర్చబడుచున్న ప్రవచనమైయున్నాము.
దేవునియొక్క నిర్ధారించబడిన స్వరము మీతో మాట్లాడటాన్ని వినడం కంటే ఎక్కువ శక్తిగలది, ఎక్కువ పవిత్రమైనది, ఎక్కువ తృప్తినిచ్చేది, ఎక్కువ పరిపూర్ణమైనది మరేదియు లేదు.
బహుశా ఇతరులు దానిలో ఏమీ లేదు అని చెప్తుండగా, పక్షిరాజులు కూడుకొనుచు, వారు దేవుని వాక్యమును పాటిస్తున్నారన్న నిశ్చయతతో అత్యానందభరితులై సంతోషిస్తున్నారు. మీకు ఒక టేపు యంత్రము ఉన్నట్లైతే, ఒక గుంపు ప్రజలను పోగుచేసి, మరియు దానిని ప్లే చేసి, మరియు జాగ్రత్తగా వినండి అని ఆయన మనతో చెప్పాడు. ఆయనయొక్క కృప మరియు కనికరము ద్వారా, మనము సరిగ్గా దానినే చేస్తున్నాము.
దేవుడు ఆయన నామము కొరకు ఈ దుష్టయుగములో నుండి మనల్ని బయటకు పిలిచాడు. మనము ముందెన్నడూ లేనంతగా అనేకమైన పరీక్షలు మరియు శ్రమలలోనుండి వెళ్తున్నాము. వాడి సమయం ముగింపునకు వచ్చిందని వాడికి తెలుసు గనుక సాతానుడు యుద్ధమార్గములో ఉన్నాడు. నేను ఆయనయొక్క వధువైయుండగా, మరి నేను ఎందుకని ఈ శ్రమలన్నిటిగుండా వెళ్తున్నాను? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవచ్చును.
మీరు ప్రత్యక్షపరచబడుతూ, పరీక్షించబడుతూ, మరియు మనము ఆయనయొక్క వధువైయున్నామని, సాతానుడికి ఋజువు చేయబడుతున్నారు. మనము శరీరములో ఉన్న వాక్యమైయున్నాము. మనము వాక్యమును పలుకగా అది నెరవేరుతుంది. అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నది.
దేవునియొక్క స్వరము నేరుగా సాతానుడితో మాట్లాడి మరియు వాడికి ఇట్లు చెప్పడాన్ని మనము కలిగియున్నాము:
సాతానా, నీవు ఓడించబడ్డావు. నీవు ఒక అబద్ధికుడవు. మరియు నీవు దేవుని వాక్యమునకు లోబడి, మరియు ప్రజలనుండి బయటకు వెళ్ళాలని, దేవునియొక్క సేవకునిగా, మరియు సేవకులుగా, యేసుక్రీస్తు నామములో మేము ఆజ్ఞాపిస్తున్నాము, ఎందుకనగా “నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు,” అని వ్రాయబడియున్నది.
ఏదైనా సరే…మనకు ఏది అవసరమున్నా సరే, మనము కేవలం అడిగి, నమ్ముతూ మరియు సరిగ్గా అక్కడే ఉండవలసియున్నాము. అది అప్పటికప్పుడే జరుగవచ్చును; ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం పట్టవచ్చును. మనకు ఏమి కనిపిస్తున్నది లేదా ఏమి అనిపిస్తున్నది అనేది ముఖ్యం కాదు, సరిగ్గా అప్పుడే అది జరిగింది.
మనము కూడుకునే ప్రతీ కూడిక దేవుని పక్షిరాజులకు మరింత గొప్పగా మరింత గొప్పగా మారుచున్నది. మనము ఏకమనస్సుతో ఏకాత్మతో కూడియున్నాము, మనము కలిసి పరలోకస్థలములలో కూర్చొనియున్నాము, ఆ స్వరము మనతో మాట్లాడి మరియు వాక్యము ద్వారా మనల్ని పరిపూర్ణము చేయడాన్ని వినుచున్నాము.
ఈ ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, దేవుని స్వరము మరొకసారి మాతో మాట్లాడి ఆయన స్వంత వాక్యమునకు అనువాదమును ఇవ్వడాన్ని మేము వినుచుండగా మీరు వచ్చి మాతో చేరితే మేమెంతో సంతోషిస్తాము.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానము: ఈ దుష్టయుగపు దేవుడు 65-0801M
వర్తమానమును వినడానికిముందు చదువవలసిన లేఖనములు:
పరిశుద్ధ. మత్తయి 24వ అధ్యాయము / 27:15-23
పరిశుద్ధ. లూకా 17:30
పరిశుద్ధ. యోహాను 1:1 / 14:12
అపొస్తలుల కార్యములు 10:47-48
1 కొరింథీ 4:1-5 / 14వ అధ్యాయము
2 కొరింథీ 4:1-6
గలతి 1:1-4
ఎఫెసీ 2:1-2 / 4:30
2 థెస్సలొనీకయులు 2:2-4 / 2:11
హెబ్రీ 7వ అధ్యాయము
1 యోహాను 1వ అధ్యాయము / 3:10 / 4:4-5
ప్రకటన 3:14 / 13:4 / 6-8 మరియు 11-12 అధ్యాయములు / 18:1-5
సామెతలు 3:5
యెషయా 14:12-14
సంబంధిత కూడికలు
కూడుకొనుచున్న ప్రియమైన పక్షిరాజులారా,
ప్రపంచమంతటా చోటుచేసుకుంటున్న ఈ గొప్ప ఆకర్షణ ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు కూడుకొని, గొప్ప ఎదురుచూపుతో తమ గృహములలో మరియు తమ సంఘములలో కూర్చొని, దేవునియొక్క స్వరము తమతో మాట్లాడటాన్ని వినడానికి వేచియుంటున్నారు.
కేవలం టేపులను వినడం ప్రపంచానికి ఎంతో వింతగా మరియు అసంబద్ధంగా అనిపిస్తున్నది. మనం టేపులను ఏ సమయములోనైనా వినవచ్చు అని వారంటారు. ఒకే సమయములో వినడంలో విషయమేమీ లేదని అంటారు. మీరు టేపులను మాత్రమే కాదు గానీ, ఒక ప్రత్యక్ష పరిచర్యను, ఒక బోధకుడు ప్రసంగించుటను తప్పకుండా వినాలని అంటారు. వారు వారి ఆచారములలో చిక్కుకొనియున్నారు.
ప్రపంచ చరిత్రలో ఇటువంటిది ఎన్నడూ చోటుచేసుకోలేదు. ఆ స్వరము ఆయనయొక్క వధువును పిలువడాన్ని వినుటకు అందరూ ఒకే సమయములో ఐక్యమవ్వడానికి ఈ ప్రజలను ఆకర్షించినది ఏమిటి? అది దేవుడు లూకా 17:30 ని నెరవేర్చడమైయున్నది. అది దేవుడు ప్రకటన 10:7 ను నెరవేర్చడమైయున్నది. అది దేవుడు హెబ్రీ 13:8 ని బయలుపరచడమైయున్నది, ఆయన అబ్రాహామునకు చేసినట్లే, మెల్కీసెదెకు మానవ శరీరములో ఉండుటయైయున్నది.
ఆయన ఏమి చెప్తాడు? ఆయన మాట్లాడటం ప్రారంభించినప్పుడు ఏమి జరుగుతుంది? అని వారు వేచియుంటున్నారు మరియు ఆశ్చర్యపోతున్నారు. ఆయన చెప్పే దేనినైనా పొందుకోడానికి వారు అనుసంధానములో ఉండగోరుతున్నారు. వారికి అది కావాలి. వారు ప్రపంచవ్యాప్తముగానున్న వధువుతో కలిసి అందరూ ఒకే సమయములో దానిని వినగోరుతున్నారు. ఏలయనగా తన వధువును బయటకు పిలిచి మరియు ఆమెను నడిపించడానికి తనయొక్క స్వరముగా ఉండుటకు దేవుడు ఎన్నుకున్న స్వరము ఆయనేయని వారు నమ్ముచున్నారు.
కాలవ్యవధిలో వారు అనేక గంటల వ్యత్యాసములో ఉన్నారు, అయినను వారందరూ ఒక్కటిగా ఉన్నారు, అనుసంధానమైయున్నారు, ఆ స్వరము వారితో మాట్లాడటాన్ని తమ స్థానిక సంఘములోనుండి వింటున్నారు. వారు కుమారుని సన్నిధిలో కూర్చొనియున్నారు, పరిపక్వము చెందుతూ మెస్సీయా యొక్క రాకడ కొరకు వేచియుంటున్నారు.
వారి గుండెలు వేగముగా కొట్టుకుంటున్నాయి. ఏమి జరుగుతున్నదో పరిశుద్ధాత్మ వారికి బయలుపరుస్తున్నాడు. ఆయనయొక్క వాక్యమును ప్రత్యక్షపరచడానికి మరియు ఆయనయొక్క వధువును సమకూర్చడానికి దేవుడు ఈ దినము వరకు వేచియున్నాడు. అది సంభవించుచున్నది, మరియు వారు దానిలో భాగమైయున్నారు. సంభవించుచున్నదానియొక్క వాస్తవికత వారి హృదయములలో నాటబడుచున్నది. శతాబ్దాలుగా వారు దాని గురించి లేఖనములలో చదివారు, కానీ ఇప్పుడు అది ఒక వాస్తవమైయున్నది. వాక్యముయొక్క ప్రత్యక్షత వారిలో ప్రత్యక్షపరచబడుచున్నది. ప్రవక్తయొక్క ప్రవచనాలు నెరవేర్చబడుచున్నవి.
ఆయనయొక్క బలిష్ఠమైన స్వరముయొక్క గొప్ప అభిషేకము క్రింద వారు కూర్చుండగా, సిద్ధపడమని ఆయన వారికి చెప్తాడు; ఏలయనగా ఈ రాత్రి ఆయన వారిలో ప్రతియొక్కరి కొరకు ప్రార్థించబోవుచున్నాడు. వారెక్కడున్నా గాని: టెక్సాస్ లో ఉన్నా, క్యాలిఫోర్నియాలో ఉన్నా, పైన ఆరిజోనాలో ఉన్నా, దక్షిణ అమెరికాలో ఉన్నా, చివరికి ప్రపంచముయొక్క అవతలి వైపున అడవులలోని గుడిసెలలో ఉన్నా గానీ, అంతటా వ్యాపించియుండే దేవుని సన్నిధి వారితో కూడా ఉంటుంది గనుక, ఆయన ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు, వెళ్ళి రోగుల మీద చేతులుంచమని ఆయన మనకు చెప్తాడు. ఎక్కడనుండి అనుసంధానమై వింటున్నాగాని, మనము ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు ఒకరిపై ఒకరు చేతులుంచండి, మరియు వారు నమ్మినట్లైతే దేవుడు వారిలో ప్రతీ ఒక్కరిని స్వస్థపరుస్తాడు, ఏలయనగా అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నది.
ప్రతీ కాలములోను మరియు గతంలో వచ్చినట్టి లేదా భవిష్యత్తులో రాబోవునట్టి ప్రతీ ప్రవక్త ద్వారానూ, ఆ వర్తమానమును వినడానికి ముందుగా నిర్ణయించబడిన కొంతమంది ప్రజలు ఉంటారని, మరియు వారు దానిని వెంబడిస్తారని ఇప్పుడు వారు గ్రహిస్తారు. వారు గుంపులను లెక్కచేయరు. అది తప్పు లేదా అది దేవుడు ఏర్పాటుచేసిన మార్గము కాదు అని చెప్పే అవిశ్వాసియొక్క విమర్శను వారు లెక్కచేయరు. వారు వారితో ఎటువంటి వాదన పెట్టుకోరు. వారు తప్పకుండా చేయవలసిన ఒకే ఒక్కటి ఉన్నది, అదేమిటనగా నమ్మికయుంచి మరియు దానిలో వారు పొందుకోగల ప్రతిదానిని పొందుకోవడమైయున్నది, యేసు పాదముల దగ్గర కూర్చున్న మరియవలె అంతరంగములో పూర్తిగా దానితో నిండిపోవాలి. వారు సిగ్గుపడరు, వారు ప్లే ను నొక్కే టేపు అబ్బాయి లేదా టేపు అమ్మాయి అని చెప్పుకోడానికి వారు ఎంతో అతిశయిస్తారు.
అంత్యకాలములో ఒక గొప్ప అభిషేకమును, పరిశుద్ధాత్మను కలిగియుండే అభిషిక్తులు ఉంటారని ఆ స్వరము వారిని ఇదివరకే హెచ్చరించినది. వారు ప్రవక్తను మరియు ఈ ఘడియయొక్క వర్తమానమును ఉల్లేఖిస్తారు; విశ్వాసులని చెప్పుకుంటారు, కానీ అబద్ధపు అభిషిక్తులైయుంటారు.
వారు అసలైన అభిషేకమునకు ఎంత దగ్గరగా ఉంటారంటే సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సైతం అది మోసపరుస్తుంది, కానీ వారు మోసపరచబడలేరని వారికి తెలుసు, ఏలయనగా వారు వాక్యమైయున్నారు. వారు దేవుని స్వరముతో నిలబడిన అసలైన వధువైయున్నారు.
ఈ దినమున అది ఒక నిమ్మకాయనో, లేదా ఒక దబ్బనారింజనో అయ్యుండదని ఆ స్వరము వారికి ప్రకటిస్తుంది. వాటి మధ్య వ్యత్యాసమును గుర్తుపట్టడటం తేలికగా ఉంటుంది. అయితే అది ఒక సంకరజాతి నారింజయై యుంటుంది, అది సగం నిమ్మకాయ, సగం నారిజయై యుంటుంది, అది కలగలుపు చేయబడిన జాతియైయున్నది. అది చూడటానికి సరిగ్గా నారింజ వలెనే ఉంటుంది, కానీ అది కాదు, ఏలయనగా ఆ క్రొత్త కొమ్మ 100% అసలైనదాని వలెనే ఉంటుంది. వారు ఆ అసలైన వాక్యస్వరముతో నిలిచియుంటారు. వారు నిర్లక్ష్యంగా ఉండరు. స్వయంగా దేవుడే ఎవరినైతే అగ్నిస్తంభము ద్వారా నిర్ధారించబడిన ఆయనయొక్క స్వరమని, ఆయనయొక్క వాక్యమని ప్రకటించాడో, ఆయనతో వారు నిలిచియుంటారు.
ఏమి జరుగుతున్నది?
దేవునియొక్క ముందుగా నిర్ణయించబడిన విత్తనము దానిని వెంబడిస్తూ మరియు ఆ స్వరమును వినడం తప్ప మరొకటి చేయలేదు, ఏలయనగా అది వారికి జీవముకంటే విలువైనది. మీరు వారి ప్రాణములను తీసుకోవచ్చు, కానీ మీరు ఆ స్వరమును తీసుకోలేరు.
ఆకర్షణ ఏమిటి?
దేవుడు, ఎప్పటిలాగానే, ఆయనయొక్క వాక్యమును నెరవేరుస్తున్నాడు.
ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, లేఖనము ప్రత్యక్షపరచబడటాన్ని మేము వినుచుండగా, వచ్చి మాతో చేరి ప్రవక్త ప్రవచనముయొక్క నెరవేర్పులో భాగము కండి.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానము: 65-0725E "ఆ పర్వతము మీద ఆకర్షణ ఏమిటి?"
లేఖనములు:
పరిశుద్ధ. మత్తయి 21:1-4
జెకర్యా 9:9 / 14:4-9
యెషయా 29:6
ప్రకటన 16:9
మలాకి 3:1 / 4వ అధ్యాయము
పరిశుద్ధ. యోహాను 14:12 / 15:1-8
పరిశుద్ధ. లూకా 17:22-30
సంబంధిత కూడికలు
కూడుకుంటున్న ప్రియమైన పక్షిరాజులారా,
ఈ వారపు వర్తమానము పేరే వధువుకు పరిశుద్ధాత్మను గూర్చిన గొప్ప అవగాహనను బయలుపరుస్తుంది. మన ప్రవక్తపై ఉండిన అదే పరిశుద్ధాత్మయొక్క నిజమైన అభిషేకమును కలిగియుండి కూడా, తప్పైయ్యుండే నిజమైన అభిషిక్తులు, ఈ దినమున ఉద్భవిస్తారని ఆలోచించడానికే ఎట్లున్నది కదా.
అదే వర్షమును పొందుకోవడం ద్వారా, ఒక నిజమైన ప్రవక్తవలె అవే ఆశీర్వాదములను పొందుకోవడం ద్వారా, వారు సూచనలను మరియు అద్భుతకార్యములను చేస్తారని వాక్యము మనకు చెప్తున్నది. ప్రజలు ఈ దినముయొక్క నిర్ధారించబడిన నిజమైన వాక్యమునుండి తమ స్వంత కామముల తట్టునకు తిరుగుతారు, దురద చెవులుగలవారై, తమకు నచ్చిన బోధకులను ఏర్పరచుకుంటారు. అది నిజమైన వాక్యమునకు ఎంత దగ్గరగా ఉంటుందంటే అది దాదాపు ఎన్నుకోబడినవారిని సైతం మోసగించగలదు.
ఆ అభిషేకము అసలు ఎంత దగ్గరగా ఉంటుంది? సత్యమేదో అబద్ధమేదో వివేచించడం తేలికగా ఉంటుందా? రాజైన దావీదు, దేవుని స్వంత హృదయానుసారుడు, తనపై ఒక అభిషేకమును కలిగియుండి, ఒక ప్రత్యక్షతను పొందుకున్నాడు; కానీ అది తప్పైయున్నది అని ప్రవక్త మనకు చెప్పాడు.
ఏమిటి!! ఒక్క క్షణం దానిని మీ మనస్సులోతులోకి వెళ్ళనివ్వండి. దేవునియొక్క ఎన్నుకోబడిన రాజు ఒక నిజమైన అభిషేకమును మరియు ఒక నిజమైన ప్రత్యక్షతను కలిగియున్నాడు, కానీ తప్పైయున్నాడు! వారు వింటున్నది నిజమైన అభిషేకమా లేదా తప్పుడు అభిషేకమా అనేది తెలుసుకోడాని దేవుని గొర్రెపిల్లలు చాలా అప్రమత్తంగా ఉండాలి; ఏలయనగా వారి నిత్యమైన గమ్యము ఈ నిర్ణయముల మీద ఆధారపడియున్నది.
ఆయనయొక్క వధువుకు మార్గదర్శకత్వము చేసి మరియు ఆమెను వాక్యములో ఉంచడానికి సహాయపడుటకు దేవుడు నిజముగా అభిషేకించబడిన అనేకమంది సేవకులను నియమించాడని మనకు తెలుసు. ఆయనయొక్క వాక్యము దానిని చెప్తున్నది, మరియు వారిలో ప్రతియొక్కరి కొరకు మనము ప్రభువునకు కృతజ్ఞులమైయున్నాము. వారు తమ మందలపై కాపరులుగా ఉండటానికి పిలువబడ్డారు. వారు వారిని వాక్యములో ఉంచడం కొరకైయున్నారు. దానిని చేస్తున్నప్పుడు, వారి మందలకు దేవునియొక్క ఏకైక నిర్ధారించబడిన స్వరమును ప్లే చేసి వినిపించడంలో వారు విఫలమవ్వకూడదు.
నిజమైన అభిషేకమును మరియు నిజమైన ప్రత్యక్షతను కలిగియుండి కూడా, ప్రతీ మనిషి ఏ విధంగా తప్పులోకి వెళ్ళగలడో మనము ఈ మధ్యనే విన్నాము. కానీ వధువు నిశ్చయతతో ఉండవచ్చును, ఎందుకంటే వారు ఎల్లప్పుడు కూడా ఆ నిజమైన అభిషేకమును, నిజమైన ప్రత్యక్షతను, నిజమైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును వినడానికి దేవుడు ఒక పరిపూర్ణమైన మార్గమును ఏర్పాటుచేశాడు; కేవలం ప్లే ను నొక్కడమే.
“శరీరము ఎక్కడ ఉండునో,” ఆ మన్నా, ఆ వాక్యము ఎక్కడ ఉండునో, “అక్కడ పక్షిరాజులు పోగవుతాయి.”
శరీరము ఎక్కడ ఉండునో, అక్కడే పక్షిరాజులమైన మనము కూడుకుంటాము. ఆ తాజా మాంసము, ఋతువునకు తగిన వాక్యము, ఘడియయొక్క వర్తమానము ఎక్కడున్నదో అక్కడే కూడుకుంటాము. మరియు స్వయంగా దేవునియొక్క స్వరమే మాట్లాడటాన్ని వినడంకంటే ఆ మన్నాను తినడానికి తాజా స్థలము వేరేదేదియు లేదు.
అది ఆయనయొక్క వాక్యమైయున్నది. “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు, కానీ ప్రతీ మాటవలన బ్రతుకును.” చూశారా? ముందుగా నిర్ణయించబడినవారు దీనిని ఎరిగియుంటారు. “ఒక భిన్నమైన మాటను, లేదా ఒక భిన్నమైన స్వరమును, వారు వెంబడించరు.”
మనము మోసపరచబడము, మరియు మోసపరచబడలేము అనడానికి కారణమేమిటంటే, మనము ఈ ప్రత్యక్షతను కలిగియున్న వాక్యమైయున్నాము. మనము వేరే దేనిగా ఉండలేము. మనము వేరే దేనినీ వినలేము. మనకు వేరేది ఏదియూ తెలియదు.
“నేను ఉన్నవాడను!” “నేను ఇదివరకు ఉన్నవాడను, లేదా ఉండబోవువాడను” కాదు. “నేను ఉన్నవాడను,” వర్తమానకాలము, ఇప్పుడున్న వాక్యము. ఇదివరకున్న వాక్యము కాదు, రాబోవు వాక్యము కాదు; ఇప్పుడున్న వాక్యము. చూశారా? మీకు అది అర్థమైందా? “నేను ఉన్నవాడను!” “నేను ఉన్నవాడను” అనువాడు వాక్యమైయున్నాడు. “ఆదియందు వాక్యముండెను, మరియు వాక్యము దేవునియొద్ద ఉండెను.” అది సరియేనా? “నేను ఉన్నవాడను.” “ఇది సత్యమని నిర్ధారించడానికి, దేవుడు నన్ను తన ప్రవక్తగా పంపించాడు. ఈ వాక్యమునకు నేను జవాబునైయున్నాను, ఇక్కడికి వచ్చి మరియు దీనిని చేయమని నాతో చెప్పాడు.”
మరియు అతడు దానిని చేసినప్పుడు, “మంచిది, దానిని చేయగల కుర్రవాళ్ళు మా గుంపులో కూడా, అనేకమంది ఉన్నారు,” అని ఫరో అన్నాడు, అనుకరణకర్తలు.
యేసు ఇట్లు చెప్పాడు, “ఇప్పుడు, అది మరలా అంత్యదినములలో పునరావృతం అవ్వబోతుంది,” చూడండి, అదే విషయమును చెప్పుకుంటూ వస్తారు.
ప్రభువునకు స్తోత్రం. వధువు కొరకైన ఒక నిశ్చయతను గూర్చి మాట్లాడండి. మీరు ఈ ప్రత్యక్షతను కలిగియున్నప్పుడు, అప్పుడు మీరు ఆయనయొక్క ఎన్నుకోబడిన, ముందుగా నిర్ణయించబడిన, ప్రియమైన వధువైయున్నారని మీకు తెలుస్తుంది.
టేపులలో ఉన్న దేవుని స్వరమును వినడం ద్వారా, క్రీస్తైయున్న మనుష్యుకుమారుని మాటను, మనము వింటున్నాము. మనము పోషించబడుతున్నది ఆయన మీదేయైయున్నది. మనము ఒక మనుష్యుని మీద పోషించబడటంలేదు; ఒక మనుష్యుడు, అతని మాటలు విఫలమవుతాయి. కానీ మనము మనుష్యకుమారుని యొక్క విఫలమవ్వని వాక్య-దేహముపై పోషించబడుతున్నాము.
మీరు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును వింటున్నారని 100% నిశ్చయతను కలిగియుండాలనుకుంటే, అంత్యకాలమందు అభిషిక్తుల గురించి సమస్తమును దేవుని స్వరము మాకు బయలుపరచడాన్ని మేము వినుచుండగా, ఈ ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు వచ్చి వధువులోని ఒక భాగముతో చేరండి.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానము: అంత్యకాలమందు అభిషిక్తులు 65-0725M
లేఖనములు:
పరిశుద్ధ. మత్తయి 5:44-45 / 7:21 / 24:15-28
పరిశుద్ధ. లూకా 17:30 / 18:1-8
పరిశుద్ధ. యోహాను 14:12
ఎఫెసీ 1:5
II తిమోతి 3:1-8
హెబ్రీ 6:1-8 / 11:4
ప్రకటన 10:1-7 / 16:13-14
మలాకి 4:5
I రాజులు 22:1-28
యిర్మియా: 27 & 28 అధ్యాయములు