ఆదివారం
14 డిసెంబర్ 2025
64-0719M
The Feast Of The Trumpets

ప్రియమైన పరిపూర్ణమైన వధువా,

స్నేహితులారా, ఇది కేవలం ఒక కల్పితము కాదు. ఇది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నది, లేఖనమైయున్నది.

ప్రతీ క్రైస్తవుడు వధువైయుండాలని కోరుకుంటాడు, కానీ ఆయనయొక్క వధువు కేవలం ఎన్నుకోబడిన కొద్దిమంది మాత్రమేనని మనకు తెలుసు. ఆయన అనుమతిపూర్వకమైన చిత్తమును కలిగియుంటాడని మనకు తెలుసు, కానీ ఆయన వధువు ఆయనయొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉండవలసియున్నది. కాబట్టి, మనము దేవుడిని ఆయనయొక్క వాక్యములో వెదకవలసియున్నాము, మరియు పిదప ఆయనయొక్క వధువుగా ఎలా అవుతాము అనేదాని విషయంలో ఆయనయొక్క పరిపూర్ణమైన చిత్తము ఏమిటన్నదానిని, ప్రత్యక్షత ద్వారా మనం తెలుసుకుంటాము.

మనము లేఖనములను పరిశోధించవలసియున్నాము, ఏలయనగా దేవుడు తన వాక్య విషయమై ఎన్నడూ తన మనస్సు మార్చుకోడని మనకు తెలుసు. దేవుడు తన ప్రణాళికను ఎన్నడూ మార్చడు. ఆయన దేనినీ ఎన్నడూ మార్చడు. ఆయన మొదటిసారి దానిని చేసిన విధానమే పరిపూర్ణమైనది. ఆయన నిన్న ఏమి చేశాడో దానినే ఆయన ఈ రోజు చేస్తాడు.

ప్రారంభమునుండి ఆయన ఒక మనిషిని ఏ విధంగా రక్షించాడో, ఆయన ఈనాడు ఒక మనిషిని అదే విధంగా రక్షించవలసియుంటుంది. ఆయన మొదటి మానవుడిని ఏ విధంగా స్వస్థపరిచాడో, ఆయన ఈనాడు దానిని ఆ విధంగానే చేయవలసియుంటుంది. దేవుడు ఆయనయొక్క వధువును పిలచి మరియు నడిపించడానికి ఏ విధానమును ఎన్నుకున్నాడో, ఆయన ఈ రోజు దానిని ఆ విధంగానే చేస్తాడు; ఏలయనగా ఆయన దేవుడైయున్నాడు మరియు ఆయన మారజాలడు. యేసుక్రీస్తు నిన్నా, నేడు మరియు నిరంతరము ఒక్కటేరీతిగా ఉన్నాడని వాక్యము మనకు చెప్తుంది.

కాబట్టి, మనము ఆయనయొక్క వాక్యమును చదివినప్పుడు, ప్రతి కాలములో ఆయనయొక్క వధువును పిలిచి మరియు నడిపించుటకు ఆయన ఏ విధానమును ఎన్నుకున్నాడనేది మనము స్పష్టముగా చూడగలము. ఆయన ఒక్క మనిషిని ఎన్నుకున్నాడు. వారి దినమునకు వారే వాక్యమైయున్నారని ఆయన చెప్పాడు. ఆయన ఒక గుంపు మనుష్యులను ఎన్నడూ కలిగియుండలేదని ప్రవక్త మనకు చెప్పాడు; వారు భిన్నమైన మార్గములను, భిన్నమైన ఆలోచనలను కలిగియుంటారని చెప్పాడు, మరియు మరీ ముఖ్యంగా, దేవుని వాక్యమునకు ఎటువంటి అనువాదము అవసరములేదని, ఆయన చెప్పాడు.

అందునుబట్టి, ప్రతి కాలములో ప్రతి ప్రవక్త పలికినదానికి ఏదియు కలుపబడరాదు మరియు దానినుండి ఏదియు తీసివేయబడరాదు. ఆయన పలికిన ప్రతీ మాట సరిగ్గా అలాగే ఉండవలసియున్నది. దేవుడు ఏర్పాటు చేసిన మార్గమేదని మీరు నన్ను అడిగితే అది చాలా సులభము....ప్రవక్తతో స్థిరముగా నిలిచియుండండి.

ఇప్పుడు, ప్రారంభమునుండి దేవుడు ఏర్పాటుచేసిన మార్గము సరిగ్గా ఏమైయున్నదో మనకు తెలియడం మాత్రమే కాదు గాని, దేవుడు ఆయనయొక్క ప్రణాళికను మార్చుకొనడని, మరొక్కసారి ఋజువుచేయడానికి, ప్రభువు ఆయనయొక్క దూత ద్వారా మాట్లాడి మరియు భవిష్యత్తులో ఆయన ఏమి చేస్తాడో కూడా మనకు చెప్తాడు.

ఆయనయొక్క వధువు (మనము) భూమిని విడిచిపెట్టి మరియు పెండ్లి విందుకు పిలువబడిన తర్వాత, దేవుడు ఆ 144,000 మందియైన ఎన్నుకోబడిన యూదులను ఎలా పిలువబోతున్నాడు? మనుష్యుల గుంపు ద్వారానా?

ఇప్పుడు, ఈ సంఘము (అనగా వధువు) సమకూర్చబడిన వెంటనే, ఆమె పైకి తీసుకొనిపోబడుతుంది; మరియు ఆ ఏడవ ముద్రయొక్క మర్మము, లేదా ఏడవ ముద్ర, వెళ్ళిపోవుటను గూర్చిన మర్మము. మరియు యూదులు ఏడవ బూర మర్మముచేత పిలువబడతారు, మరది ఇద్దరు ప్రవక్తలు, ఏలీయా మరియు మోషేలైయున్నారు, మరియు వారు తిరిగి వస్తారు.

కావున వధువు సమకూర్చబడిన వెంటనే, మనం పైకి తీసుకొనిపోబడతాము. వధువును సమకూర్చగలిగేది ఒకేఒక్కటి ఉన్నదని మనకు తెలుసు, అది పరిశుద్ధాత్మయే, మరి పరిశుద్ధాత్మ ఆయనయొక్క వాక్యమైయున్నాడు, మరియు ఈ దినమునకైన ఆయనయొక్క వాక్యము దేవునియొక్క స్వరమైయున్నది, మరియు దేవునియొక్క స్వరము...

దానిని చెప్పడంవలన నేను మిమ్మల్ని అభ్యంతరపరచినట్లైతే, నన్ను క్షమించండి, అయితే, బహుశా అది కోపము తెప్పించియుండవచ్చని నాకు అనిపిస్తున్నది, మరైనను, నేను మీకు దేవుని స్వరమునైయున్నాను. చూశారా? నేను దానిని మరలా చెప్పాను, ఆ సమయంలో అది ప్రేరేపణ క్రింద వచ్చినది, మీరు చూడండి.

సరిగ్గా ఇక్కడే ఆపి మరియు నన్ను ఒక విషయమును చెప్పనివ్వండి, ఈ అంత్యకాల వర్తమానములో విశ్వాసులమని చెప్పుకునే నామకార్థ-విశ్వాసులు తమ సంఘకాపరితో, తమ సంఘములో ప్లే ను నొక్కమని లేదా వారు దేవునియొద్దనుండి నిజమైన ప్రత్యక్షతను కలిగియున్న ఒక సంఘకాపరిని ఎన్నుకోగలుగునట్లు అతణ్ణి విరమించుకోమని చెప్పడానికి, దేవునియొక్క నిర్ధారించబడిన దూత వర్తమానికుడినుండి వచ్చిన ఈ ఒక్క కొటేషను సరిపోతుంది.

కాబట్టి, బూర మ్రోగినప్పుడు ఆ ఇద్దరు ప్రవక్తలు ప్రత్యక్షమవుతారు ఏలాయనగా వారు వచ్చిన అదే సమయసములో ఆయన తనయొక్క ఏడవ దూత వర్తమానికుడిని మరియు తనయొక్క వధువును ఇక్కడ భూమిమీద కలిగియుండలేడు. కావున ఆయన యూదులను ఎలా పిలుస్తాడు? ఆయన తన అన్య వధువును పిలిచిన విధంగానే పిలుస్తాడు.

మరియు యూదులు ఏడవ బూర మర్మము ద్వారా పిలువబడతారు, మరది ఇద్దరు ప్రవక్తలైయున్నారు...

ఇప్పుడు పైకి వెళ్ళడానికి, వధువు ప్రక్కకు తొలగవలసియున్నది; తద్వారా ఇద్దరు సేవకులు, ప్రకటనలో ఉన్న, దేవునియొక్క ఇద్దరు సేవకులు, ఆ ఇద్దరు ప్రవక్తలు, రంగం మీద ప్రత్యక్షమై, వారికి ఏడవ బూరను ఊదుటకైయున్నది, క్రీస్తును వారికి తెలియజేయుటకైయున్నది.

దేవుడు తన ప్రణాళికను మార్చడనేది, ఎంతో స్పష్టంగా ఉన్నది. ఆయన తన ప్రవక్తలను పంపాడు. తద్వారా, ఆయనయొక్క వధువు ఆయన ఏర్పాటుచేసిన మార్గముతో, అనగా ఆయనయొక్క దూతయైన ప్రవక్తతో, టేపులలో ఉన్న దేవునియొక్క స్వరములో నిలిచియుంటుంది.

పిదప దానిని స్పటికమంత తేటగా చేయడానికి, దేవుడు మరొకసారి మాట్లాడి మరియు తన వధువుతో ఇట్లు చెప్తాడు: నీవు నాకును మరియు నేను ఏర్పాటుచేసిన మార్గమునకును నమ్మకముగా ఉన్నావు, కావున నీ దినమునకై నేను ఏర్పాటుచేసిన మార్గము నీతో ఇట్లు చెప్తుంది:

ఏడవ దూత, వర్తమానికుడు, ఇట్లు చెప్పుచున్నాడు, “ఇదిగో లోకపాపమును మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల!”

ఆ స్వరము; ఆయనయొక్క ఏడవ దూత ద్వారా టేపులలో మాట్లాడుతున్న దేవునియొక్క స్వరము ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుడు ఆ స్వరమును, ఆయనయొక్క ఏడవ దూత స్వరమును, ఉపయోగించబోతున్నాడు. ఒక గుంపును కాదు...నన్ను కాదు...మీ సంఘకాపరిని కాదు గాని...స్వయంగా తనకు, మన ప్రభువైన యేసుక్రీస్తుకు, మనల్ని పరిచయం చేయడానికి, ఆయనయొక్క ఏడవ దూత వర్తమానికుని స్వరమును ఉపయోగించబోతున్నాడు.

తద్వారా, మనకు ఇది తెలుస్తుంది:

• మనము ఆయనయొక్క వధువైయున్నాము.

• మనము ఆయనయొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉన్నాము.

• ప్లే ను నొక్కడం ద్వారా మనము ఈ దినమునకై ఆయన ఏర్పాటుచేసిన మార్గమును వెంబడిస్తున్నాము.

ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు వధువులోని ఒక భాగము కూడుకొని, మా సంఘకాపరియును, దేవునియొక్క దూత వర్తమానికుడునుయైన, విలియమ్ మారియన్ బ్రెన్హామ్ గారు చెప్పేది వింటూ ఉంటుంది, మరియు ఆయన మాట్లాడి మరియు ఏకముగా కూడుకొని మరియు దేవుని స్వరము నేరుగా మనతో మాట్లాడుటను వినుటకు మనము కలిగియున్న అవకాశమును జగత్తుపునాది మొదలుకొని వేరే ఏ సంఘము, వేరే ఏ మనుష్యుల గుంపు ఎన్నడూ కలిగిలేదని మనకు బయలుపరుస్తాడు.

మనము ఎంతగా ఆశీర్వదించబడిన ప్రజలము కదా. మనం ఎంతో సంతోషంగా ఉన్నాము. మనమెంతో కృతజ్ఞులమైయున్నాము. వధువు పెండ్లి కుమారునితో ఒక్కటగుచ్చున్నది.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

బూరల పండుగ 64-0719M.

వర్తమానము వినడానికి ముందు చదువవలసిన లేఖనములు:

లేవీయకాండము 16
లేవీయకాండము 23:23-27
యెషయా 18:1-3
యెషయా 27:12-13
ప్రకటన 10:1-7
ప్రకటన 9:13-14
ప్రకటన 17:8