Sun Apr 26, 2020 10:00 AM EDT
ప్రియమైనవారలారా,
దేవుడు మారడు. ఆయనయొక్క వాక్యము మారదు. ఆయనయొక్క ప్రణాళిక మారదు. మరియు ఆయనయొక్క వధువు మారదు, మనము వాక్యముతో నిలిచియుంటాము. అది మనకు ప్రాణముకంటే విలువైనది; అది జీవజలముల ఊటయైయున్నది.
మనము చేయాలని మనకు ఆజ్ఞాపించబడిన ఒకే ఒక్కటి వాక్యమును వినడమైయున్నది, మరది రికార్డు చేయబడి మరియు టేపులలో ఉంచబడినట్టి నిర్ధారించబడిన దేవుని స్వరమేయైయున్నది. మనము చూసే ఒకే ఒక్క విషయము ఒక మతాచారము కాదు, మనుష్యుల గుంపు కాదు, మనము యేసును తప్ప మరిదేనిని చూడము, మరియు ఆయన మన దినములో శరీరధారియైన వాక్యమైయున్నాడు.
దేవుడు మన శిబిరములో ఉన్నాడు మరియు మనము అగ్నిస్తంభముచేత నడిపించబడుతూ మహిమకై మన దారిలో ఉన్నాము, మరది స్వయంగా దేవుడే మలాకి 4 లోని ఆయనయొక్క నిర్ధారించబడిన ప్రవక్త ద్వారా మాట్లాడుటయైయున్నది. వధువు మాత్రమే తినగల జీవజలములైనట్టి, ఆ దాచబడిన మన్నాను మనము తినుచున్నాము.
దేవుడు ఆయనయొక్క విధానములను మార్చుకొనడు, మరియు అపవాది కూడా వాడి విధానములను మార్చుకొనడు. 2000 సంవత్సరాల క్రితం వాడు ఏమి చేశాడో, ఈనాడు కూడా వాడు దానినే చేస్తున్నాడు, ఒకటే విషయం ఏమిటంటే వాడు మరింత కుయుక్తి గలవాడయ్యాడు.
ఇప్పుడు, నాలుగువందల సంవత్సరాల తర్వాత, ఒక దినమున దేవుడు నేరుగా వారి మధ్యకు నడిచివచ్చాడు. లేఖనము ప్రకారంగా, ఆయన శరీరధారియై వారి మధ్యన నివసించవలసియున్నాడు. “ఆయనకు ఆలోచనకర్త, సమాధానకర్తయగు అధిపతి, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టబడును.” మరియు ఆయన ప్రజల మధ్యకు వచ్చినప్పుడు, వారు ఇట్లన్నారు, “ఈ మనుష్యుడు మమ్మల్ని ఏలడానికి మేము ఒప్పుకోము!...”
లేఖనము ప్రకారంగా, మనుష్యకుమారుడు మరొకసారి వచ్చి మరియు జీవించి మరియు తననుతాను మానవ శరీరములో బయలుపరచుకుంటాడు, మరియు ఆయన దానిని చేశాడు, మరియు వారు అలాగే అంటున్నారు. నిశ్చయంగా, వారు వర్తమానమును ఉటంకించి మరియు ప్రసంగిస్తారు, కానీ ఆ మనుష్యుడు వారిని ఏలాడనికి వారు ఒప్పుకోరు.
జరుగుచున్నది సరిగ్గా అదేయైయున్నది:
మరియు అది అప్పుడున్నట్లే, ఇప్పుడు కూడా ఉన్నది! లవొదికయ సంఘము ఆయనను బయట పెడుతుందని, మరియు ఆయన లోపలికి వచ్చుటకు ప్రయత్నిస్తూ, తట్టుచున్నాడని బైబిలు గ్రంథము చెప్పినది. ఎక్కడో ఏదో తప్పున్నది. ఇప్పుడు, ఎందుకు? వారు తమ స్వంత శిబిరమును తయారుచేసుకున్నారు.
“బ్రెన్హామ్ సహోదరుడు ఒక ప్రవక్త అని నాకు తెలుసు మరియు నేను దానిని నమ్ముతున్నాను. ఆయన ఏడవ దూతయైయున్నాడు. ఆయన ఏలీయా అయ్యున్నాడు. మేము ఈ వర్తమానమును నమ్ముతాము,” అని ఒక వ్యక్తి చెప్పవచ్చును. పిదప వారి సంఘములో దేవునియొక్క నిర్ధారించబడిన ఏకైక స్వరమును ప్లే చేయకుండా ఉండటానికి, అదేమైనను, ఏదో ఒక విధమైన సాకును చెప్తారు... ఎక్కడో ఏదో తప్పున్నది. ఇప్పుడు, ఎందుకు? వారు తమ స్వంత శిబిరమును తయారుచేసుకున్నారు.
సంఘమును వేరుచేయడానికి నేను ఈ విషయములను చెప్పడంలేదు, దేవుని వాక్యమే దానిని చేస్తుంది. మనము ఐక్యమవ్వాలని, ఆయనతోను మరియు ఒకరితోనొకరము కూడా ఒక్కటైయ్యుండాలని నేను కోరుతాను, అయితే దానిని చేయడానికి ఒకే ఒక్క మార్గమున్నది: టేపులలో ఉన్న దేవునియొక్క స్వరము చుట్టూ కూడుకొనుట ద్వారానే దానిని చేయగలము. దేవునియొక్క యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అది మాత్రమేయైయున్నది.
దేవుడు ఆయనయొక్క పరిపూర్ణమైన మార్గమును మనకు బయలుపరిచాడు. అది ఎంతో మహిమకరమైనది మరైనను ఎంతో సామాన్యమైనది. ప్రతీ వర్తమానములోను ఆయన మనతో మనము ఆయనయొక్క వధువైయున్నామని చెప్పి, మనకు మరలా నిశ్చయతను ఇచ్చి, మరియు మనల్ని ప్రోత్సహించడాన్ని మనము వింటున్నాము. మనము ఆయనయొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉన్నాము. మనము ఆయన చెప్పేదానిని వినడం ద్వారా మనల్ని మనము సిద్ధపరచుకున్నాము.
రేపటి వార్తాపత్రిక కంటే ఈ వర్తమానమే ఎంతో తాజాదైయున్నది. మనము నెరవేర్చబడుచున్న ప్రవచనమైయున్నాము. మనము ప్రత్యక్షపరచబడిన వాక్యమైయున్నాము. మనం వినే ప్రతీ వర్తమానము ద్వారా, ఈ దినము ఈ లేఖనము నెరవేర్చబడుచున్నదని దేవుడు మనకు ఋజువు చేస్తున్నాడు.
దేశములలోను, ప్రపంచవ్యాప్తంగాను, ఈ టేపు వారిని తమ గృహములలో లేదా తమ సంఘములలో కలుసుకొనునట్టి కొందరు ప్రజలు ఉండవచ్చును. ప్రభువా, కూడిక జరుగుచుండగా, ఎక్కడైతే—ఎక్కడైతే...లేదా టేపు ప్లే చేయబడుచుండగా, లేదా మేము ఏ స్థానములో ఉన్నా, లేదా—లేదా ఏ స్థితిలో ఉన్నా, ఈ ఉదయము మా హృదయముల యొక్క ఈ యథార్థతను ఆ గొప్ప పరలోకపు దేవుడు గౌరవించును గాక, మరియు అవసరత గలవారిని స్వస్థపరచి, వారి అవసరతను వారికి దయచేయును గాక అని మేము ప్రార్థించుచున్నాము.
కేవలం ఒక్క నిమిషం ఆగండి....లోకమునకైన దేవుని స్వరము ప్రవచించి ఏమి చెప్పినది?....ప్రజలు తమ గృహములలో లేదా తమ సంఘములలో టేపులను ప్లే చేస్తారు.
కానీ మనము గృహ టేపు సంఘమును కలిగియుండలేమని విమర్శించబడి మరియు గద్దించబడుచున్నామా? మీ సంఘములలో టేపులను ప్లే చేయమని సహోదరుడు బ్రెన్హామ్ ఎన్నడూ చెప్పలేదా?
దేవునికి మహిమ కలుగును గాక, దానిని వినండి, దానిని చదవండి, అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నది. మరియు ఆయన దానిని మాత్రమే కాదు గాని, మీ గృహములలో మరియు సంఘములలో టేపులను ప్లే చేయడం ద్వారా, ఆ గొప్ప పరలోకపు దేవుడు మన హృదయములయొక్క యథార్థతను గౌరవించి మరియు అవసరత గలవారిని స్వస్థపరిచి మరియు మనకు అవసరమైయున్న ప్రతిదానిని మనకు అనుగ్రహిస్తాడని చెప్పాడు!!
ప్రజలు తమ సంఘకాపరులు చెప్పేదానిని వింటున్నారని మరియు వాక్యమును వినడంలేదని ఈ ఒక్క కొటేషన్ ఋజువుచేస్తుంది, లేదంటే వారు వారిని సవాలు చేసి మరియు మనము ఆయనయొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉన్నామని, మరియు వారి సంఘములలో టేపులను ప్లే చేయాలన్నది ఆయనయొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉన్నది అనే విషయమును వాక్యము ద్వారా వారికి ఋజువుచేస్తారు.
నేను ఆ విధంగా చేస్తున్నానని అనేకులు చెప్తున్నట్లు నేను వాక్యమును దాని స్థానములో గాక మరొక స్థానములో పెట్టడంలేదు లేదా తప్పుగా ఉటంకించడంలేదు. స్వయంగా మీరే దానిని వినండి మరియు దానిని చదవండి.
అది ఎంతో సులువుగా ఉన్నది మరియు ఎంతో పరిపూర్ణముగా ఉన్నది, కేవలం ప్లే ను నొక్కి మరియు దేవునియొక్క స్వరము మీతో మాట్లాడటాన్ని వినండి. మీరు వినే ప్రతీ మాటకు “ఆమేన్” అని చెప్పండి. మీరు దానిని అర్థం చేసుకోవాల్సిన అవసరము కూడా లేదు, మీరు కేవలం దానిని నమ్మవలసియున్నారు.
“నేను శిబిరమును దాటి వెళ్ళగోరుచున్నాను. దాని కొరకు నేను ఏమి కోల్పోవాల్సివచ్చినా లెక్కలేదు, నేను నా సిలువను తీసుకొని మరియు ప్రతి రోజు దానిని మోస్తాను. నేను శిబిరమును దాటి వెళ్తాను. ప్రజలు నా గురించి ఏమన్నాగాని, శిబిరము వెలుపలకు నేను ఆయనను వెంబడించగోరుచున్నాను. నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను.”
ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, వచ్చి మరియు మాతోకలిసి ధ్వని అవరోధమును దాటివేసి దేవుని వాక్యములోనికి ప్రవేశించండి. ఒక మానవునియొక్క శిబిరమును దాటివెళ్ళడానికి సిద్ధంగా ఉన్న ఒక వ్యక్తితో దేవుడు ఏమి చేయగలడు మరియు ఏమి చేస్తాడన్నదానికి అవధులు లేవు.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానము: 64-0719E శిబిరము వెలుపలికి వెళ్ళుట
లేఖనములు: హెబ్రీ పత్రిక 13:10-14 / మత్తయి 17:4-8