భద్రము చేయబడిన ఉత్తరములు
1, నవంబర్ 2025, శనివారం

ప్రియమైన ప్రత్యక్షపరచబడిన వాక్యమా,

మనము దాని గురించి ఆలోచించగలమా! బైబిలు గ్రంథమును వ్రాసినట్టి ఆ మనుష్యుల మీదకు వచ్చిన అదే అగ్నిస్తంభము మనము అనుదినము వింటున్న అదే అగ్నిస్తంభమైయున్నది, అది మనకు బైబిలుయొక్క మర్మములన్నిటినీ అనువదించుచున్నది: దేవునియొక్క వాక్యము ప్రత్యక్షపరచబడినది!

దేవుడు ఆయనయొక్క వాక్యములను వారితో మాట్లాడుటకు తననుతాను పూర్వమందున్న తన ప్రవక్తలలో ముసుగు దాల్చుకున్నాడు. అప్పుడు ఆయన చేసినది అదేయైయున్నది. కానీ మన దినములో, మన ప్రవక్తయైన, విలియమ్ మారియన్ బ్రెన్హామ్ గారు ప్రజలకు అగ్నిస్తంభమును ముసుగుగా ధరించిన, సజీవమైన వాక్యమైయున్నాడు.

అభిషేకము ఒక వ్యక్తియైయున్నాడు. క్రీస్తు అనే పదమునకు “ఒక అభిషేకించబడినవాడు” అని అర్థము, చూడండి, “అభిషేకించబడినవాడు.” అలాగైతే, మోషే తన దినములలో క్రీస్తైయున్నాడు, అతడు అభిషేకించబడినవాడై యున్నాడు. యిర్మియా ఆ దినము కొరకైన వాక్య భాగమును కలిగియుండి, తన దినములలో క్రీస్తైయున్నాడు.

దేవుడే తన స్వంత వాక్యమును అనువదిస్తాడు. బ్రెన్హామ్ సహోదరుడు వాటిని పలికాడు; దేవుడు వాటిని అనువదించాడు. అతడు వాక్యమును కలిగియున్నాడు. ఒక గుంపు కాదు, విలియమ్ మారియన్ బ్రెన్హామ్! దేవుడు ఒక్క మనిషిని తీసుకున్నాడు. వివిధమైన ఆలోచనలను కలిగియున్న రెండు లేదా మూడు భిన్నమైన మనస్సులను ఆయన తీసుకోలేడు. ఆయన ఒక్క మనిషిని తీసుకుంటాడు, మరియు అతడు మానవ శరీరము వెనుక ముసుగు ధరించినట్టి సజీవమైన దేవుని వాక్యమయ్యాడు.

చిన్నవారలారా, మనము ఇక ఎంతమాత్రము ఆ ముసుగు వెనుక లేము. దేవుడు మీ యెదుట పూర్తి దృశ్యములోనికి వచ్చాడు. దేవునియొక్క వాక్యము పైనుండి ఆ పాత సంఘశాఖపరమైన మరియు మతాచారపరమైన ముసుగు చీల్చివేయబడినది, తద్వారా అది ప్రత్యక్షపరచబడుటకైయున్నది! ఈ అంత్య దినములో, మతాచారపరమైన ఆ తెర నడిమికి చీల్చివేయబడినది, మరియు ఇదిగో అగ్నిస్తంభము ఇక్కడ నిలబడియున్నది. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఈ దినము కొరకైన వాక్యమును ప్రత్యక్షపరచుచున్నాడు. తెర చీల్చివేయబడినది.

ఆ టేపులు వస్తుండగా వాటిని గమనించండి, ఒకొక్కదానిని గమనించండి, అది ఇంకెంత తేటగా మరియు ఇంకెంత తేటగా వచ్చినదో గమనించండి; వినడానికి మీకు చెవులుంటే, చూడండి, చూడటానికి కన్నులుంటే చాలును.

ఈనాడు ఇంకనూ ప్రజలకు గ్రుడ్డితనము కలుగజేసేది అదేయైయున్నది. దేవునియొక్క ప్రవక్త వాక్యమును తెచ్చాడని నమ్ముతున్నాము కానీ, ఇప్పుడు మనల్ని నడిపించడానికి ఆ అభిషేకము ప్రవక్త మీద కాకుండా, ఇతరుల మీద ఉన్నది అని వారు చెప్పాలనుకుంటారు.

దేవుడు తన వాక్యమును బ్రద్దలు చేయలేడని ప్రవక్త మనతో చెప్పాడు. అంత్య దినములలో, అది మరల అదే కార్యమైయుండవలసియున్నది. దేవుడు తన విధానమును మార్చుకోలేడు, లేదా తన వాక్యమునైనా మార్చుకోలేడు. ఆయన మారనివాడని అతడు చెప్పాడు. ఆయనయొక్క వాక్యమును తెచ్చుటకు మాత్రమే కాదు గాని, ఆయనయొక్క వధువును నడిపించడానికి ఆయన ఎల్లప్పుడూ తన ప్రవక్తలను పంపించాడు.

ప్రతి కాలములో జరిగినట్లే, దైవత్వము మానవ శరీరమును ముసుగుగా ధరించినది. గమనించండి, ఆయన అలా చేశాడు. ప్రవక్తలు అనగా, దైవత్వము ముసుగు ధరించుటయైయున్నారు. వారు దేవునియొక్క వాక్యము (అది సరియేనా?) మానవ శరీరమును ముసుగుగా ధరించుటయైయున్నారు. కావున, చూడండి, మన మోషేయైయున్న యేసును కూడా, వారు గుర్తించలేదు.

ఇప్పుడు మనకు అది కేవలం వ్రాయబడిన వాక్యము మాత్రమే కాదు, అది ఒక వాస్తవమైయున్నది. మనము ఆయనలో ఉన్నాము. ఇప్పుడు మనము సంతోషిస్తున్నాము. ఇప్పుడు మనము ఆయనను చూస్తున్నాము. ఇప్పుడు మనము, వాక్యమైయున్న ఆయన, తననుతాను ప్రత్యక్షపరచుకోడాన్ని చూస్తున్నాము.

అప్పుడు, మనము ఆయనలో భాగమవుతాము. ఆయనకు ముసుగుగా ఉండే తెర మనమేయైయున్నాము. క్రీస్తు దేవునిలో ఉన్నలాగున, క్రీస్తు మీలో ఉన్నంతవరకు; మనము ఆయనలో భాగమైయున్నాము.

మనము మన మానవ శరీరపు తెర వెనుక క్రీస్తుకు ఆలయముగా-ఉంటున్నాము. మనము వ్రాయబడిన పత్రికలమైయున్నాము, వ్రాయబడిన వాక్యమైయున్నాము. మనము వ్రాయబడిన వాక్యము, ప్రత్యక్షపరచబడుటయైయున్నాము.

మరియు వాక్యము ప్రత్యక్షపరచబడటాన్ని మీరు చూసినప్పుడు, మీరు తండ్రియైన దేవుడిని చూస్తారు, ఎందుకంటే వాక్యము తండ్రియైయున్నాడు. వాక్యము దేవుడైయున్నాడు. మరియు వాక్యము, ప్రత్యక్షపరచబడుట అనగా, దేవుడు తానే తన స్వంత వాక్యమును తీసుకొని మరియు దానిని విశ్వాసుల మధ్య నెరవేర్చడమైయున్నది. విశ్వాసులు, విశ్వాసులే తప్ప దానిని మరేదియు జీవింపజేయలేదు.

దేవుడు, మానవ శరీరములో ముసుగు ధరించి, దినదినము ఆయనయొక్క వాక్యమును పలుకుతూ మరియు మనకు దానిని బయలుపరచుచున్నాడు. దేవుడు మానవ శరీరములో మనలో ప్రతి ఒక్కరిలో జీవించుచున్నాడు.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

వర్తమానము: 64-0614M - "దేవునియొక్క ముసుగు తొలగించబడుట"
సమయము: జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటలకు

*డే లైట్ సేవింగ్ సమయమును గుర్తుంచుకోండి

 

 

25, అక్టోబర్ 2025, శనివారం

టేపును వినే ప్రియమైనవారలారా,

ప్రతియొక్కరూ తమనుతాము ఈ విధంగా ప్రశ్నించుకోవలసిన సమయము వచ్చినది: “నేను టేపులను వింటున్నప్పుడు, నేను ఏ స్వరమును వింటున్నాను? అది కేవలం విలియమ్ మారియన్ బ్రెన్హామ్ యొక్క స్వరమా, లేదా నేను వినేది ఈ దినము కొరకైన దేవునియొక్క స్వరమైయున్నదా? అది ఒక మనుష్యుని మాటనా, లేదా నేను యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును వింటున్నానా? నేను వింటున్నదానిని ఎవరో ఒకరు అనువదించాల్సిన అవసరము ఉన్నదా, లేక దేవుని వాక్యమునకు ఎటువంటి అనువాదము అవసరంలేదా?”

మన జవాబు ఏమిటంటే: మనము శరీరధారియైనట్టి పలుకబడిన వాక్యమును వింటున్నాము. మనము అల్ఫా ఓమెగను వింటున్నాము. ఆయన మన దినములో చేస్తాడని చెప్పినట్లుగా, ఆయన, అనగా ఆ అగ్నిస్తంభము మానవ పెదవులగుండా మాట్లాడుటను మనము వింటున్నాము.

మనము ఒక మనిషి మాటలను వినడంలేదు, నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటేరీతిగా ఉన్న, దేవుడు మాట్లాడటాన్ని మనము వింటున్నాము. సజీవమై, రెండంచులు-గల ఖడ్గము కంటెను ఎంతో బలముగలదై, మూలుగను సైతం విభజించునంతమట్టుకు దూరుచు, హృదయములోని తలంపులను వివేచించునట్టి దేవుని స్వరమును వింటున్నాము.

ఆయన గలిలయలో నడచినప్పుడు ఏమైయున్నాడో ఈ రాత్రి జఫర్సన్విల్ లో కూడా ఆయన అదేయైయున్నాడని; బ్రెన్హామ్ ఆలయము వద్ద ఆయన అదేయైయున్నాడని మనకు బయలుపరచబడినది. అది దేవునియొక్క వాక్యము శరీరధారి అవ్వడమైయున్నది. ఆయన అప్పుడు ఏమైయున్నాడో, ఆయన ఈ రాత్రి అదేయైయున్నాడు, మరియు ఎప్పటికీ అదేయైయుంటాడు. ఆయన ఏమి చేస్తానని చెప్పాడో, ఆయన దానిని చేశాడు.

ఆ మనుష్యుడు దేవుడు కాదు, అయితే దేవుడు ఇంకనూ సజీవుడైయుండి ఆ మనిషి ద్వారా తన వధువుతో మాట్లాడుచున్నాడు. మనము ఆ మనుష్యుడిని ఆరాధించడానికి ధైర్యము చేయము, కానీ ఆ మనిషిలో ఉన్న దేవుడిని ఆరాధిస్తాము; ఏలయనగా ఈ చివరి దినములలో ఆయనయొక్క స్వరముగా ఉండి మరియు ఆయనయొక్క వధువును నడిపించడానికి అతడు దేవుడు ఎన్నుకున్నట్టి మనిషియైయున్నాడు.

ఆయన ఈ గొప్ప అంత్యకాల ప్రత్యక్షతను మనకు ఇచ్చాడు గనుక, ఇప్పుడు మనమెవరమన్నది మనము గుర్తించగలము, మన దినములో శరీరధారియైన వాక్యమైయున్నాము. సాతానుడు మనల్ని ఇక ఎంతమాత్రము మోసము చేయలేడు, ఏలయనగా మనము ఆయనయొక్క పూర్తిగా పునరుద్ధరించబడిన కన్యక వాక్య వధువైయున్నామని మనకు తెలుసు.

ఆ స్వరము మనకు ఇట్లు చెప్పినది: మనకు అవసరమైయున్న ప్రతీది ఇదివరకే మనకు ఇవ్వబడినది. వేచియుండాల్సిన అవసరము లేదు. అది పలుకబడినది, అది మనదే, అది మనకు చెందియున్నది. సాతానుడికి మన మీద ఎటువంటి అధికారములేదు; వాడు ఓడించబడినాడు.

నిశ్చయంగా, సాతానుడు వ్యాధిని, మనోవేదనను, మరియు గుండెపోటులను మనమీదకు విసురగలడు, కానీ వాడిని బయటకు తరమడానికి సామర్థ్యతను తండ్రి ఇదివరకే మనకు ఇచ్చాడు…మనము కేవలం మాటను పలుకుతాము, మరియు వాడు వెళ్ళాల్సిందే…మనము దానిని పలుకుచున్నందుకు కాదు, కానీ దేవుడు దానిని పలికినందుకైయున్నది.

ఉడతలే లేనప్పుడు, ఉడతలను సృష్టించిన అదే దేవుడు. సహోదరి హ్యాట్టీకి ఆమె హృదయ కోరికయైయున్న: ఆమెయొక్క ఇద్దరు కుమారులను అనుగ్రహించిన అదే దేవుడు. వైద్యుని హస్తము ఆమెను తాకడానికిముందే, ఒక కణితినుండి బ్రెన్హామ్ గారి భార్యను స్వస్థపరచిన అదే దేవుడు. ఆయన మనతో ఉన్న దేవుడు మాత్రమే కాదు గాని, ఆయన మనలో జీవించుచు మరియు నివసించుచున్నాడు. మనము శరీరధారియైన వాక్యమైయున్నాము.

మనము టేపులలో ఉన్న స్వరమును వినుచు మరియు చూస్తున్నప్పుడు, దేవుడు తననుతాను మానవ శరీరములో బయలుపరచుకోడాన్ని మనము చూస్తాము మరియు వింటాము. మనల్ని వాగ్దాన దేశమునకు నడిపించడానికి దేవుడు ఎవరినైతే పంపాడో ఆయనను మనము చూస్తాము మరియు వింటాము. వధువు మాత్రమే ఆ ప్రత్యక్షతను కలిగియుంటుందని మనము గుర్తిస్తున్నాము, తద్వారా మనము భయము లేనివారిగా మారినాము. ఉద్రిక్తతతో, బాధతో, చిరాకుతో, ప్రశ్నతో లేదా చింతతో ఉండాల్సిన పనిలేదు…మనము వధువైయున్నాము.

విని బ్రతుకుము, నా సహోదరుడా, బ్రతుకుము!
ఇప్పుడు యేసు మాటలను విని బ్రతుకుము;
ఏలయనగా అది టేపులలో రికార్డు చేయబడినది, హల్లెలూయా!
మనము కేవలం విని బ్రతుకడమే.

ఓ, యేసుక్రీస్తు యొక్క వధువా, మనము ఎటువంటి ఒక గొప్ప దినములో జీవిస్తున్నాము కదా. క్షణక్షణము, మనము ఎటువంటి దానికొరకు ఎదురుచూస్తున్నాము కదా. ఈ దినములలో ఏ రోజైనా మనము మన ప్రియులను చూడబోవుచున్నాము, పిదప, కనురెప్పపాటున, మనము ఇక్కడనుండి వెళ్ళి ఆవలివైపున వారితో ఉంటాము. అది మనము దానిని అనుభూతిచెందగలిగేంత సమీపముగా ఉన్నది…మహిమా!

వధువా రమ్ము, ఈ ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమునకు, ఆయన నిత్యజీవపు మాటలను మనతో చెప్పడాన్ని వినుచుండగా మరొకసారి దేవుని స్వరము చుట్టూ ఐక్యమవుదాము.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

వర్తమానము: 63-1229E యేసు వైపు చూడుము

లేఖనములు:
సంఖ్యాకాండము 21:5-19
యెషయా 45:22
జెకర్యా 12:10
పరిశుద్ధ. యోహాను 14:12

 

 

సంబంధిత కూడికలు
18, అక్టోబర్ 2025, శనివారం

ప్రియమైన క్రీస్తుయొక్క వధువా, ఈ ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, 63-1229M వెలుగును ప్రసరింపజేయగల ఒకాయన ఇక్కడ ఉన్నాడు అను వర్తమానమును వినడానికి మనము కూడివద్దాము.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

 

11, అక్టోబర్ 2025, శనివారం

ప్రియమైన టేపు వధువా,

ఇప్పుడు టేపులలో వింటూ ఉన్న ప్రజలైన మీరు.

ప్రభువా, యేసుక్రీస్తు యొక్క వధువైయున్న మాకు, ఈ ఆరు చిన్న పదాలు ఎంత విలువైనవో వ్యక్తపరచడాన్ని మేము ఎలా మొదలుపెట్టగలము? అది మాకు ఈ ఘడియ వర్తమానముయొక్క ప్రత్యక్షతయైయున్నది. అది దేవుడు తన వర్తమానికుడైన దూత ద్వారా మాట్లాడుతూ తన వధువుతో ఇట్లు చెప్పడమైయున్నది, “నీవు నా స్వరముతో నిలిచియుంటావని నాకు తెలుసు. టేపులలో ఉన్న నా మాట నీకు ఎంత విలువైనదో నాకు తెలుసు. టేపులలో నేను మాట్లాడిన ఈ వర్తమానములు ఈ దినమునకు నా గురుతైయున్నవి అనే ప్రత్యక్షతను నీవు కలిగియుంటావని నాకు తెలుసు.”

“ఈ అయస్కాంతపు టేపులలో నేను నా స్వరమును ఉంచాను; ఏలయనగా ఈ వర్తమానములు పూర్తి వాక్యమును నెరవేర్చవలసియున్నవి. టేపులలో ఉన్న నా స్వరమును విని మరియు ఇది నా పరిచర్య అనే ప్రత్యక్షతను కలిగియుండేవారు వేవేలకొలదిగా ఉంటారు. అది ఈ దినమునకు పరిశుద్ధాత్మయైయున్నది. అది నా గురుతు వర్తమానమైయున్నది”

“నా పరిచర్యను ప్రకటించడానికి ప్రపంచమంతటా అనేకమంది విశ్వసనీయమైన సేవకులను నేను పంపించాను. వారు తిరిగి వచ్చినప్పుడు, వారు నాతో ఇట్లు చెప్పారు, ‘మేము నీ టేపులను ప్లే చేయడం ద్వారా నీ ఆజ్ఞకు లోబడ్డాము. ప్రతీ మాటను నమ్మిన ప్రజలను మేము కనుగొన్నాము. నీ వర్తమానమును స్వీకరించడానికి వారు తమ స్వంత ఇంటినే ఒక సంఘమువలె మార్చారు. నీ గురుతు క్రిందకు, అనగా ఈ ఘడియయొక్క వర్తమానము క్రిందకు వచ్చిన ప్రతియొక్కరూ రక్షించబడతారని, మేము వారికి చెప్పాము.’”

ఇది ఈ దినమునకు దేవునియొక్క పరిపూర్ణమైన మార్గము ఏమిటి? అని ప్రతి మనిషి పరీక్షించుకొని మరియు తననుతాను ప్రశ్నించుకోవలసిన సమయమైయున్నది. ప్రవక్తయొక్క మాట ఒక్కసారైనా విఫలమవ్వలేదు. అది మాత్రమే ఏకైక సత్యమని, అది మాత్రమే ఆయనయొక్క వధువును ఐక్యము చేసే ఏకైక విషయమని ఋజువు చేయబడినది.

ఆయన చెప్పిన ప్రతీది సరిగ్గా ఆయన దానిని చెప్పిన ప్రకారంగానే జరిగినది. అగ్నిస్తంభము ఇంకనూ ఇక్కడ మనతో ఉన్నాడు. టేపులలో దేవునియొక్క స్వరము ఇంకనూ మనతో మాట్లాడుచున్నది. దేవుడు తాను గురుతును చూసినప్పుడు మాత్రమే దాటిపోతాడని ప్రవక్త మనతో చెప్పాడు. ఇది అందరూ ఆ గురుతు వర్తమానము క్రిందకు రావడానికి ఒక తీవ్రమైన అవసరతగల సమయమైయున్నది.

ఈ అంత్య-కాలములో మనము దేవునియొక్క గొప్ప హస్తమును చూశాము. ఆయన తన వాక్యముయొక్క నిజమైన ప్రత్యక్షతను మనకు ఇచ్చాడు మరియు అది గురుతుయొక్క సూచన క్రింద వచ్చినది. ఇప్పుడు, మనము గురుతుయొక్క సూచన క్రింద ఉండగా, మనము కూడివచ్చి మరియు తీవ్రమైన తపనతో ప్రభురాత్రి భోజనమును తీసుకుందాము; ఏలాయనగా దేవుడు తీర్పుతో తాకబోవుచున్నాడని మనకు తెలుసు.

ఈ ఆదివారము మేము: తీవ్రమైన తపన 63-0901E అను వర్తమానమును వినుచుండగా, మీరు విని మరియు ప్రభురాత్రి భోజనమును తీసుకొని మరియు పాదపరిచర్యను కలిగియుండాలని మీలో ప్రతియొక్కరినీ ఆహ్వానించుటకు నేను ఇష్టపడుచున్నాను.

వర్తమానము మరియు ప్రభురాత్రి భోజనపు కార్యక్రమము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా సాయంత్రం 5:00 గంటల సమయమప్పుడు వాయిస్ రేడియోలో ప్రసారమవుతుంది. విదేశీయ విశ్వాసులలో అనేకులకు ఆ సమయానికి మీ కూడికను ప్రారంభించడం కష్టమవుతుందని నాకు తెలుసు గనుక, మీరు కోరినట్లైతే మీ స్థానిక కాలమానం ప్రకారంగా మీ కూడికను నిర్వహించుకోడానికి సంకోచించకండి. కూడికను డౌన్లోడ్ చేసుకోడానికి సంబధించిన ఫైలుకు లింకు ఇవ్వబడుతుంది.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

కూడికకు ముందు చదువవలసిన లేఖనములు:

నిర్గమకాండము 12:11
యిర్మియా 29:10-14
పరిశుద్ధ. లూకా 16:16
పరిశుద్ధ. యోహాను 14:23
గాలతి 5:6
పరిశుద్ధ. యాకోబు 5:16

 

 

సంబంధిత కూడికలు
4, అక్టోబర్ 2025, శనివారం

గురుతును కలిగియున్న ప్రియమైన వధువా,

మనం కూడి వచ్చినప్పుడు, మనం వర్తమానము గురించి మాత్రమే మాట్లాడము, మనం రక్తమును అన్వయించుకోడానికి, గురుతును అన్వయించుకోడానికి కూడి వస్తాము; మరియు గురుతు ఏదనగా ఘడియయొక్క వర్తమానమే! అది ఈ దినముయొక్క వర్తమానమే! అది ఈ కాలముయొక్క వర్తమానమే.

మనం స్వయంగా మనకు, మరియు మన ఇండ్లకు, మరియు మన కుటుంబాలకు ఆ గురుతును అన్వయించుకున్నాము. మనము సిగ్గుపడటంలేదు. అది ఎవరికి తెలుసు అనేది మనం లెక్కచేయము. దానిని ప్రతియొక్కరు తెలుసుకోవాలని మనం కోరుతున్నాము, దారినవెళ్ళే ప్రతియొక్కరూ చూసి మరియు దీనిని తెలుసుకోవాలని కోరుతున్నాము: మనం టేపును వినే ప్రజలము. మనం ఒక టేపు ఇంటివారము. మనం దేవునియొక్క టేపు వధువైయున్నాము.

పరిశుద్ధాత్మ = గురుతు = వర్తమానము. అవన్నీ ఒక్కటే. మీరు వాటిని వేరుచెయ్యలేరు. తండ్రీ, కుమార, పరిశుద్ధాత్మ = ప్రభువైన యేసు క్రీస్తు. మీరు వారిని వేరుచెయ్యలేరు. వర్తమానము = వర్తమానికుడు. విమర్శకులు ఏమన్నా లెక్కలేదు, ప్రవక్త ఇలా చెప్పాడు, మీరు వారిని వేరుచెయ్యలేరు.

దేవుడే మీ ఆనందము. దేవుడే మీ శక్తి. ఈ వర్తమానమును తెలుసుకోవడం, అది మాత్రమే సత్యమని తెలుసుకోవడం, అదియే గురుతైయున్నదని తెలుసుకోవడం, అదే మనకు చాలినది. కొందరు ఇట్లనవచ్చును, “నేను దానిని నమ్ముతున్నాను. నేను దానిని నమ్ముతున్నాను. అది సత్యమని నేను నమ్ముతున్నాను. అది సత్యమని నేను అంగీకరించుచున్నాను.” అదంతా మంచిదే, మరి అయినను అది అన్వయించబడవలసి యున్నది.

ఈ వర్తమానము ఈ దినము కొరకైన గురుతైయున్నదని ప్రవక్త చెప్పాడు. ఈ వర్తమానమే పరిశుద్ధాత్మ. మీకు గనుక ఈ వర్తమానము గూర్చి కొంచెమైనా ప్రత్యక్షత ఉన్నయెడల మనం జీవిస్తున్న ఘడియను మీరు తేటగా చూడగలరు. “నేను దానిని నమ్ముతున్నాను. దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. అది ఈ ఘడియయొక్క వర్తమానమైయున్నది,” అని చాలామంది చెప్పుచున్నారు, కానీ సాక్షాత్తు గురుతైయున్న అదే స్వరమును తమ సంఘములలో ప్లే చేయడంలేదని, మరియు ప్లే చేయరని చెప్తూ ప్రగల్భాలు పలుకుచున్నారు.

దానికి ఒక అర్థం ఉంటేనే తప్ప దేవుడు ఆయనయొక్క బలమైన దూత ద్వారా మాట్లాడి మరియు ఊరకే ఏదైనా చెప్పలేదు. ఆయన గురుతుల ద్వారా మరియు ఛాయల ద్వారా మనకు బోధించాడని ఆయన చెప్పాడు. ఈ వర్తమానములో, రాహాబు మరియు ఆమె కుటుంబము రక్షించబడుటకు, వధువుగా ఉండుటకు ఏమి చేశారన్నది మనకు చెప్పడానికి ప్రవక్త చాలా లోతైన వివరణలోనికి వెళ్తాడు. ఆమె ఏమి చేసినది అన్నదానిని ఆయన స్పష్టంగా వివరించాడు.

టేపు అబ్బాయిలు “టేపును” ప్లే చేసినప్పుడు…ఒక్క నిమిషం ఆగండి, వర్తమానికుడు ఏమి చేశాడు? ఒక టేపును ప్లే చేశాడు. అప్పుడు ఆమె ఏమి చేసినది? తన ఇంటిని ఒక టేపు సంఘముగా మార్చినది. “ఆ ఎర్రని దారమును చూస్తున్నారా, నేను ఒక టేపు సంఘమైయున్నానని దాని అర్థం,” అని చెప్పడానికి ఆమె సిగ్గుపడలేదు.

మీరు ఇట్లనుకుంటున్నారా, “అవును, నేను వర్తమానికుడిని మరియు వర్తమానమును నమ్ముతున్నాను, కానీ మేము ఇక మా సంఘములో టేపులను ఎంతమాత్రమూ ప్లే చేయడంలేదు. వద్దు అని చెప్పే ఒక సంఘకాపరిని నేను కలిగియున్నాను, మరియు టేపులు చెప్పుచున్నవాటిని అతడు మాత్రమే బోధించి మరియు ఉటంకించవలసియున్నాడు” అని ఆమె చెప్పియుంటే. ఆమె రక్షించబడియుండేదని మీరు అనుకుంటున్నారా...???

ఆమె గురుతును అన్వయించుకున్నది, మరియు ఆమె ఇంటివారు రక్షించబడ్డారు, లేదంటే ఆమె ఉన్నచోటే ఆమె నశించిపోయి యుండేది.

అనేకమంది సేవకులు టేపులను ప్లే చేయడం గురించి అనేక సాకులను చెప్పడాన్ని మీరు విన్నారు, అయితే దాదాపు చాలామంది ఇట్లంటారు: “సంఘములో టేపులను ప్లే చేయండి అని ప్రవక్త ఎన్నడూ చెప్పలేదు.”

రాహాబు తన ఇంటిని ఒక సంఘముగా చేసినదని ప్రవక్త చెప్పాడు, మరియు తన సంఘము టేపులను ప్లే చేసినది. మరియు ఆమె u>తన సంఘములో టేపులను ప్లే చేసినది గనుక, ఆమె, మరియు ఆమెయొక్క టేపు సంఘమంతయు, గురుతు క్రింద ఉండి మరియు రక్షించబడినారు.

సహోదరులారా మరియు సహోదరీలారా, దయచేసి వినండి, ఒక సంఘకాపరి ఈ వర్తమానమును బోధించకూడదని, లేదా అతడు అలా చేస్తే అది తప్పని నేను చెప్పడంలేదు. నా స్వంత విధానములో, ఇప్పుడు ఈ లేఖ ద్వారా నేను బోధిస్తున్నాను, కానీ ప్రవక్త ఏమి చెప్తున్నాడు మరియు దేని గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు అనేదానిని మీ హృదయమును తెరిచి వినండి. మీ సంఘకాపరి గనుక, అదేమైనప్పటికినీ, ఏదో ఒక విధమైన సాకును చెప్తూ మీ సంఘములో టేపులను ప్లే చేయకుండా, లేదా మీదటికి కూడా వాటిని ప్లే చేయబోవడంలేనియెడల; “నేను ఈ ఘడియయొక్క వర్తమానమును నమ్ముతున్నాను” అని అతడు ఎంతగా చెప్పినను, వాక్య ప్రకారంగా, వాక్యము ఏమి చెప్పుచున్నదని నేను నమ్ముచున్నదాని ప్రకారంగా, గురుతు, ఈ ఘడియయొక్క వర్తమానము అన్వయించబడటంలేదు.

ఈ ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, వచ్చి బ్రెన్హామ్ ఆలయముతో కలిసి, ఈ వర్తమానమును వినాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను: గురుతు 63-0901M. మీరు మాతో చేరలేనియెడల, గురుతు వర్తమానములలో దేనినైనా ప్లే చేసుకొని, మరియు దానిని అన్వయించుకోండి.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

వర్తమానమును వినడానికిముందు చదువవలసిన లేఖనములు:

ఆదికాండము 4:10
నిర్గమకాండము 12వ అధ్యాయము
యెహోషువ గ్రంథము 12వ అధ్యాయము
అపొస్తలుల కార్యములు 16:31 / 19:1-7
రోమా 8:1
1 కొరింథీ 12:13
ఎఫెస్సీ 2:12 / 4:30
హెబ్రీ 6:4 / 9:11-14 / 10:26-29 / 11:37 / 12:24 / 13:8, 10-20
పరిశుద్ధ. యోహాను 14:12

 

 

సంబంధిత కూడికలు