ప్రియమైన తొలవబడిన-వధువా,
ఈనాడు, సంఘము తమ ప్రవక్తను మర్చిపోయారు. ఆయన వారి సంఘములలో బోధించడం వారికి ఇక ఎంతమాత్రమూ అక్కరలేదు. వారికి బోధించి మరియు వాక్యమును ఉటంకించి మరియు అనువాదమునిచ్చుటకు వారి సంఘకాపరులు వారికి ఉన్నారని వారు చెప్పుచున్నారు. వారి సంఘములలో టేపులలో ఉన్న దేవుని స్వరమును వినడంకంటే బోధించడమే ఎక్కువ ముఖ్యమైపోయినది.
కానీ దేవుడు తన ప్రవక్తను కలిగియుండవలసియున్నదని ఎరిగియున్నాడు; ఆయన ఎల్లప్పుడూ ఆ విధంగానే తన వధువును బయటకు పిలచి మరియు ఆమెను నడిపించాడు. ఆయన తన రెండంచులు గల ఖడ్గముచేత, తన పరిశుద్ధాత్మచేత, తన ప్రవక్త ద్వారా పలుకబడిన ఆయనయొక్క స్వరముచేత మిగిలిన దేశములన్నిటి నుండి మనలను తొలిచి వేరుచేశాడు.
ఆ స్వరము చేత ఆయన మనల్ని తొలిచాడు. అందునుబట్టియే ఆయన దానిని రికార్డు చేపించి మరియు టేపులో పెట్టించాడు. లేఖనము ఎంత పరిపూర్ణముగా ఉన్నదో ప్రత్యక్షత ద్వారా మనము చూస్తున్నాము! కుమారుడు దానిని పరిపక్వము చెందిస్తేనే తప్ప వధువు పరిపక్వము చెందజాలదు.
మీరెంతగా బోధించినా గానీ, మీరు ఏమి చేసినా గాని, అది పరిపక్వము చెందజాలదు, అది ప్రత్యక్షపరచబడజాలడు, అది నిర్ధారించబడజాలదు; “నేను లోకమునకు వెలుగైయున్నాను,” అని చెప్పినట్టి, వాక్యమైయున్న ఆయన ద్వారానే అది జరుగుతుంది.
నిర్ధారించడానికి, ఋజువు చేయడానికి మరియు తననుతాను ప్రత్యక్షపరచుకోడానికి, పరిశుద్ధాత్మ తానే వచ్చి మరియు మనలను పరిపక్వము చెందిస్తాడని వాక్యము మనకు చెప్పినది. సాయంకాల వెలుగు వచ్చినది. దేవుడు ఆయనయొక్క వధువును బయటకు పిలువడానికి తననుతాను చర్మములో ప్రత్యక్షపరచుకొనున్నాడు.
ఆయనయొక్క పరిశుద్ధాత్మ చేత, ఆయనయొక్క వాక్యము చేత, ఆయనయొక్క స్వరము చేత నిన్ను బయటకు పిలచినది ఆయనే. నిన్ను ఎన్నుకున్నది ఆయనే. నీకు ఉపదేశము చేస్తున్నది ఆయనే. నిన్ను నడిపిస్తున్నది ఆయనే. దేని ద్వారా చేస్తున్నాడు? ఆయనయొక్క పరిశుద్ధాత్మ, ఆయనయొక్క స్వరము నేరుగా నీతో మాట్లాడుట ద్వారా దానిని చేస్తున్నాడు.
కానీ ఈ దినములో వారికి అది చాలా పాత-కాలపుదైపోయినది. వారు తమ సంఘములలో టేపులను ప్లే చేసే విషయమును దాటివేశారు. వారు దానిని గుర్తించరు. ఆ కారణము బట్టియే వారు వారున్నట్టి స్థితిలో ఉన్నారు. కానీ మీకైతే, అది దేవుడు ఏర్పాటు చేసిన మార్గమైయున్నదని బయలుపరచబడినది, మీకు అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నది.
కాబట్టి, పరిపక్వము చెందించడానికి, లేదా నిర్ధారించడానికి, లేదా ఋజువు చేయడానికి, లేదా ఆయన ఈ దినమున ఏమి జరుగుతుందని ముందుగా చెప్పాడో దానిని ప్రత్యక్షపరచడానికి ఒక—ఒక—ఒక శక్తి, అనగా పరిశుద్ధాత్మ తానే రావలసియున్నాడు. సాయంకాల వెలుగు దానిని ఉత్పత్తి చేస్తుంది. ఎటువంటి ఒక సమయము!
ఆయనయొక్క ప్రవక్త ఒక దర్శనములో చూసినటువంటి దేవునియొక్క పరిపూర్ణ వాక్య వధువు మనమేయైయున్నాము. ఆయనయొక్క వాక్యము ద్వారా ఎవరిని బయటకు పిలువడానికి ఆయన తన ప్రవక్తను పంపించాడో ఆ ప్రజలము మనమే, మరియు ఇప్పుడు మనము ఒక ఉజ్జీవమును కలిగియుంటున్నాము, ఏలయనగా మనము ఎవరమన్నది ఇప్పుడు మనము ఎరిగియున్నాము.
ఉజ్జీవపరచడం, అక్కడ, మిగతా ప్రతి చోటా అదే పదము ఉపయోగించబడినది, నేను దాని అర్థమేంటో వెతికాను, “ఒక ఉజ్జీవము,” అని దాని అర్థము. “రెండు దినములైన తరువాత ఆయన మనలను ఉజ్జీవపరుస్తాడు.” మరి అది ఇట్లుంటుంది, “ఆయన మనల్ని చెదరగొట్టి, మరియు మనకు గ్రుడ్డితనము కలుగజేసి, మరియు మనలను చీల్చివేసిన తరువాత, మూడవ దినమందు ఆయన మనలను మరలా ఉజ్జీవపరుస్తాడు.”
మనము వరుస తప్పకుండునట్లు తండ్రి ఆయనయొక్క వధువును కాయుటకు ఆయనయొక్క ప్రవక్తను పంపించాడు. గుర్తుంచుకోండి, ఇది ఒక దర్శనమైయున్నది!
వధువు ఆమె ప్రారంభములో ఉన్న స్థితిలోనే వెళ్ళుచున్నది. అయితే నేను ఆమె వరుస తప్పుటను గమనించి, మరియు ఆమెను వెనుకకు లాగుటకు ప్రయత్నిస్తున్నాను.
అయితే ఈనాడు “ఆయన” ఆమెను ఎలా వెనుకకు లాగగలడు? “ఆయన”, అనగా ఆ వ్యక్తి, ఇక్కడ భూమి మీద లేడు. వాక్యము ద్వారాయైయున్నది! ఈ దినమునకు నిర్ధారించబడిన ఏకైక వాక్యము ఏమిటి? టేపులలో ఉన్న దేవునియొక్క స్వరమే.
సేవకులు సరిగ్గా ప్రవక్త పలికినదానిని ఉటంకించడం ద్వారా వాక్యమును బోధించడానికి మాత్రమే పిలువబడినారు. స్వయంగా ప్రవక్త ప్రకారంగా కూడా, వారు అంతకంటే ఎక్కువ ఏమియు చెప్పవలసినవారు కారు.
వాస్తవంగా, వారు ఆ వాక్యమును ఉపదేశించడానికి మరియు బోధించడానికి పిలివబడినారు. కానీ యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నదని నర్ధారించబడిన స్వరము ఒకే ఒక్కటి ఉన్నది.
యేసుక్రీస్తు నామములో, నేను కూడా అలాగే చెప్పుచున్నాను: మీరు ఒక్క విషయమును కూడా కలుపకండి, దేనినీ తీసివేయకండి, దానిలో మీ స్వంత ఆలోచనలను పెట్టకండి, మీరు కేవలం ఆ టేపులలో చెప్పబడినదానిని మాత్రమే చెప్పండి, దేవుడు మీకు ఏమి చేయమని ఆజ్ఞాపించాడో మీరు సరిగ్గా దానిని మాత్రమే చేయండి; దానికి కలుపకండి!
మీ సంఘకాపరి లేదా మీ సేవకుడు చెప్పే ప్రతీ మాటకు మీరు “ఆమేన్” చెప్తే, మీరు తప్పిపోయినట్లే. కానీ దేవుడు ఆయనయొక్క ప్రవక్త ద్వారా టేపులలో పలికిన ప్రతీ మాటకు మీరు “ఆమేన్” చెప్పినట్లైతే, మీరు వధువైయుంటారు మరియు నిత్యజీవమును కలిగియుంటారు.
దేవునియొక్క ప్రవక్త దేవుడు అతనిగుండా మాట్లాడటానికి ఎన్నుకున్నట్టి వ్యక్తియైయున్నాడు. ఆయనయొక్క వాక్యమును పలుకడానికి అతడిని వాడుకోవడము మరియు వధువు ఎల్లప్పుడూ వినడానికి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును కలిగియుండుటకు దానిని టేపులలో ఉంచడము దేవునియొక్క ఎన్నిక ద్వారా జరిగినది.
ఇతరులు చెప్పినదాని మీదనైనా, లేదా ఆయనయొక్క వాక్యమునకు వారు ఇచ్చే అనువాదము మీదనైనా ఆయనయొక్క వధువు ఆధారపడాలని ఆయన కోరడంలేదు. ఆయనయొక్క వధువు ఆయనే నేరుగా వారితో మాట్లాడుటను వినాలని ఆయన కోరుచున్నాడు. ఆయనయొక్క వధువు స్వయంగా ఆయన మీద తప్ప మరెవ్వరి మీద ఆధారపడాలని ఆయన కోరడంలేదు.
మనము ఉదయము లేచినప్పుడు, ఆయన మనతో ఇట్లు చెప్పుటను వినడాన్ని ప్రేమిస్తాము, “స్నేహితులారా శుభోదయము. ఈ రోజు నేను మీతో మాట్లాడి మరియు నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మరియు మీరు నేను ఏ విధంగా ఒక్కటైయున్నామో మీకు తెలియజేయబోవుచున్నాను. నేను నిత్యజీవమునిచ్చే అనేకులు ఉన్నారు, కానీ మీరు మాత్రమే నా చేత-ఎన్నుకోబడిన వధువైయున్నారు. జగత్తుపునాది వేయబడకముందే నేను ప్రత్యక్షతను ఇచ్చినది మీకు మాత్రమేయైయున్నది.
నేను చెప్పేది వినడానికి ఇతరులు అనేకమంది ఇష్టపడతారు, కానీ నా వధువుగా ఉండుటకు నేను మిమ్మల్ని మాత్రమే ఎన్నుకున్నాను. ఏలయనగా మీరు నన్ను గుర్తించి మరియు నా వాక్యముతో నిలిచియున్నారు. మీరు రాజీపడలేదు, మీరు ఎవరితోనూ సరసమాడలేదు, అయితే మీరు నా వాక్యమునకు నమ్మకముగా నిలబడ్డారు.
సమయము ఆసన్నమైనది. అతి త్వరలో నేను మీ కొరకు వచ్చుచున్నాను. మొదట, ఇప్పుడు నాతో ఉన్నవారిని మీరు చూస్తారు. ఓ, మిమ్మల్ని చూసి మరియు మీతో ఉండటానికి వారెంతగా పరితపించుచున్నారో. చిన్నవారలారా చింతించకండి, సమస్తమూ సరిగ్గా సమయానుసారముగా జరుగుచున్నది, కేవలం ముందుకు కొనసాగుతూనే ఉండండి.”
ఒక సువార్త సేవకునిగా, వధువు వెళ్ళిపోవడం తప్ప ఏ ఒక్క విషయము కూడా మిగిలియున్నట్లు నాకు కనబడటంలేదు.
సహోదరుడు. జోసెఫ్ బ్రెన్హామ్
వర్తమానము: 64-0726M "నీ దినమును దాని వర్తమానమును గుర్తించుట"
సమయము: 12:00 P.M., జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా
వర్తమానమును వినడానికిముందు చదువవలసిన లేఖనములు:
హోషేయ: అధ్యాయము 6
యెహెజ్కేలు: అధ్యాయము 37
మలాకీ: 3:1 / 4:5-6
II తిమోతి: 3:1-9
ప్రకటన: అధ్యాయము 11