ఆదివారం
07 డిసెంబర్ 2025
64-0213
అప్పుడు యేసు వచ్చి పిలిచాడు
కూడిక ఇంత సమయంలో ప్రారంభమవుతుంది:
0
రోజులు
19
గంటలు
40
నిమిషములు
35
క్షణములు

Sun Apr 26, 2020 10:00 AM EDT

ప్రియమైన వాక్య వధువా,

మనము గాఢాంధకారమైన ఘడియలలో జీవిస్తున్నాము, కానీ మనకు ఏ భయము లేదు, యజమానుడు వచ్చియున్నాడు. అంత్య దినములో ఆయన తన వాక్యమును నెరవేర్చడానికి వచ్చాడు. అప్పుడు ఆయన ఏమైయున్నాడో, ఈనాడు ఆయన అదేయైయున్నాడు. అప్పుడు ఆయనయొక్క ప్రత్యక్షపరచుకునే విషయం మరియు గుర్తింపు ఏమైయున్నదో, ఈనాడు అది అదేయైయున్నది. ఇంకనూ ఆయన దేవునియొక్క వాక్యమైయున్నాడు, ఆయనయొక్క బలమైన ఏడవ దూతలో మానవ చర్మములో తననుతాను ప్రత్యక్షపరచుకొనుచున్నాడు, మరియు మనము ఆయనయొక్క సజీవ వాక్య వధువైయున్నామని మనకు బయలుపరచినాడు.

వాగ్వివాదము పెట్టుకోవడాని లేదా తగువులాడటానికి మనకు సమయమే లేదు; మనము ఆ దినమును దాటియున్నాము; మనము ముందుకు సాగుతున్నాము, మనం అక్కడికి వెళ్ళవలసియున్నాము. పరిశుద్ధాత్మ మన మధ్యకు వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ రూపములో తనయొక్క ప్రవక్తగుండా తననుతాను ప్రత్యక్షపరచుకొని మరియు ఆయనే ఆయనయొక్క వధువునకు దేవునియొక్క స్వరమైయున్నాడని బయలుపరచుకున్నాడు.

ఆయన వస్తాడని ఆయన చెప్పాడు. ఆయన దీనిని చేస్తాడని ఆయన చెప్పాడు. మొదటిసారి ఆయన శరీరములో వచ్చినప్పుడు ఆయన చేసినట్లే ఆయన అంత్య దినములలో రంగం మీదకు వచ్చి మరియు ఈ కార్యములను చేస్తాడని ఆయన చెప్పాడు, మరియు ఇదిగో ఆయన వాటిని చేస్తూ ఇక్కడ ఉన్నాడు. మీరు దేని గురించి భయపడుతున్నారు? దేని గురించి భయపడటంలేదు!!!

మనము మన మహిమకు వెళ్ళే దారిలో ఉన్నాము! ఏదియు మనల్ని ఆపబోవడంలేదు. దేవుడు తన వాక్యమును నిర్ధారించబోతున్నాడు. ఏమి జరుగుతుందో నేను లెక్కచేయను. ఇప్పుడు చర్య తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. నమ్మడానికైనా లేదా నమ్మకపోవడానికైనా సమయం ఆసన్నమైనది. ప్రతీ పురుషునికి మరియు ప్రతీ స్త్రీకి సంభవించే ఆ వేర్పాటు గీత వచ్చియున్నది.

మీరు ఒక ఉద్దేశము కొరకు జన్మించారు. వెలుగు మిమ్మల్ని తాకినప్పుడు, అది మీలోనుండి చీకటినంతటినీ బయటకు తీసివేసినది. టేపులలో ఆయనయొక్క స్వరము మీతో మాట్లాడుటను మీరు వినినప్పుడు, ఏదో జరిగినది. అది మీ అంతరాత్మతో మాట్లాడినది. అది ఇట్లు చెప్పినది, “యజమాని వచ్చాడు మరియు నిన్ను పిలుస్తున్నాడు. అలసిపోకు, భయపడకు, నేను నిన్ను పిలుస్తున్నాను. నీవు నా వధువైయున్నావు”.

ఓ, ప్రజలారా, నిశ్చయతను కలిగియుండండి! దాని విషయమై నిర్లక్ష్యంగా ఉండకండి. దేవుడు ఒక ప్రణాళికను కలిగియున్నాడు: ఆయన తన వాక్యమును టేపులలో రికార్డు చేశాడు. యజమానుడు వచ్చాడు మరియు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు ఏర్పాటుచేసిన మార్గములో రా.

యజమానుడు ఆయనయొక్క స్వరముతో మరొక్కసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వధువును ఐక్యపరచబోతున్నాడు. ఆయన మనల్ని ప్రోత్సాహపరచి, మరలా నిశ్చయతను ఇచ్చి, స్వస్థపరచి, మనల్ని ఆయనయొక్క మహోన్నతమైన సన్నిధిలోనికి తీసుకొనివచ్చి మరియు ఇట్లు చెప్పబోతున్నాడు:

యజమానుడు వచ్చి మరియు ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఓ, పాపీ, ఓ, వ్యాధితోనున్న వ్యక్తీ, యజమానుడు, విశ్వాసుల మధ్య, మానవులలో ప్రత్యక్షపరచబడుటను నీవు చూడటంలేదా? ఆయన తనయొక్క నమ్ముచున్న పిల్లలను తిరిగి ఆరోగ్యమునకు పిలవడానికి వచ్చాడు. ఆయన పాపిని పశ్చాత్తాపమునకు పిలవడానికి వచ్చాడు. భక్తి విడచినవాడా, సంఘసభ్యుడా, యజమానుడు వచ్చాడు మరియు నిన్ను పిలుస్తున్నాడు.

దేవుడు మరొక్కసారి తన పిల్లలను సమకూర్చి మరియు మన గృహములలోనికి, మన సంఘములలోనికి, మన కూడికలలోనికి ప్రవేశించి, మరియు మనల్ని పిలిచి మరియు “యజమానుడు వచ్చాడు మరియు పిలుస్తున్నాడు. మీకు ఏది అవసరమున్ననూ, అది మీదే” అని చెప్తుండగా, ఈ ఆదివారము వధువు ఆయనయొక్క పరిశుద్ధాత్మయొక్క కుమ్మరింపును ఎంతగా కలిగియుంటుందో.”

సహోదరులారా మరియు సహోదరీలారా, ఆ మాటలను మీ హృదయ లోతులోనికి వెళ్ళనివ్వండి. మనకు ఏది అవసరమున్నను, యజమానుడు వచ్చాడు మరియు దానిని మీకు ఇస్తాడు.

పరలోకపు తండ్రీ, ఓ దేవా, దానిని మరలా జరుగనిమ్ము. “యేసు వచ్చాడు మరియు నిన్ను పిలుస్తున్నాడు,” అని నేను చెప్పిన ఈ సంగతులన్నీ ఉన్నాయి. ఆయన వచ్చినప్పుడు ఆయన ఏమీ చేస్తాడు? ఆయన పిలుస్తాడు. మరియు ప్రభువా, దానిని మరలా జరుగనిమ్ము. ఈ రాత్రి నీ పరిశుద్ధాత్మను, అనగా ప్రభువైన యేసును ఆత్మయొక్క—యొక్క రూపములో ప్రజల మధ్యకు రానిమ్ము. ఆయన వచ్చి మరియు తననుతాను బయలుపరచుకోనిమ్ము, మరియు పిదప తననుతాను ప్రత్యక్షపరచుకోనిమ్ము.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

వర్తమానము: 64-0213 అప్పుడు యేసు వచ్చి పిలిచెను
సమయం: 12:00 P.M. జఫర్సన్విల్ కాలమానం
లేఖనములు: పరిశుద్ధ. యోహాను 11:18-28