ఆదివారం
25 ఆగస్టు 2024
65-0801E
ప్రవచనము ద్వారా తెలియపరచబడిన సంఘటనలు

ప్రియమైన పక్షిరాజులారా,

శరీరము ఎక్కడున్నదో, అక్కడ పక్షిరాజులు కూడుకొనుచున్నవి. ఇది సాయంకాల సమయమైయున్నది, మరియు ప్రవచనము మన కన్నులయెదుట నెరవేర్చబడుచున్నది. మనము మన సంఘములలోనికి, మన గృహములలోనికి, మరియు బయట పొదలలోనున్న మన మట్టి గుడిసెలలోనికి ఆయనను ఆహ్వానించియుండగా మన హృదయములు మనలో మండుచున్నవి. ఆయన మనతో మాటలాడి మరియు తన వాక్యమును మనకు బయలుపరచబోవుచున్నాడు. మనము దేవునిలో ఇంకా అధిక భాగం కొరకు ఆకలిగొనుచు దప్పిగొనుచున్నాము.

ఆయన తన వాక్యము మన వద్దకు వచ్చే మార్గమును ఎన్నుకున్నాడు; అది ఆయన ముందుగా నిర్ణయించుకొని మరియు ముందుగా ఏర్పరచుకున్న, తన ప్రవక్త ద్వారాయైయున్నది. ఆయనయొక్క ఎన్నుకోబడిన ప్రజలమైయున్న, మనలను, అనగా ఆయనయొక్క వధువును పట్టుకునే వ్యక్తిగా ఉండుటకు ఆయన విలియమ్ మారియన్ బ్రెన్హామ్ గారిని ఎన్నుకున్నాడు.

అతని స్థానమును తీసుకోగలిగే మరే వ్యక్తి కూడా లేడు. అతడు తనను తాను వ్యక్తపరచుకునే విధానమును మనము ప్రేమిస్తున్నాము; హేయింట్, టోట్, క్యారీ, ఫెచ్, అది దేవుడు నేరుగా మనతో మాట్లాడుటయైయున్నది. దేవుడు, మానవ పెదవులగుండా మాటలాడుచు, సరిగ్గా ఆయనేమి చేస్తానని చెప్పాడో దానినే చేయుచున్నాడు. మరదే దానిని స్థిరపరుస్తుంది!

దేవుడు దర్శనములలో అతని చేతులను మరియు కన్నులను కదిలించాడు. తానేమి చూస్తున్నాడో అది గాక మరిదేనిని అతడు చెప్పలేకుండెను. దేవుడు అతని నాలుక మీద, వ్రేలి మీద పూర్తి ఆధీనమును కలిగియున్నాడు, అతని శరీరములోని ప్రతి అవయవము కూడా పూర్తిగా దేవునియొక్క నియంత్రణలో ఉండినది. అతడు స్వయంగా దేవునియొక్క బూరయైయున్నాడు.

ఈ కాలములో సంఘము కలగలుపు అయిపోతుందని దేవుడు ముందుగానే ఎరిగియున్నాడు. అందునుబట్టి, ఆయనయొక్క నిర్ధారించబడిన వాక్యము ద్వారా ఆయనయొక్క ఎన్నుకోబడిన వధువును బయటకు పిలిచి మరియు ఆమెను నడిపించుటకై, మన కాలము కొరకు ఆయన తన ప్రవక్తను సిద్ధపరిచాడు.

ఆయనయొక్క గొప్ప ప్రణాళికలో, ఆయనయొక్క రాకడకు ముందు ఆయన తన ప్రవక్తను గృహమునకు తీసుకెళ్తాడని కూడా ఆయన ఎరిగియున్నాడు, కావున ఆయన అతని స్వరమును రికార్డు చేపించి మరియు దానిని భద్రము చేపించాడు, తద్వారా ఆయనయొక్క ఎన్నుకోబడిన వధువు ఎల్లప్పుడూ వారియొక్క వేళ్ళమీదనే యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును కలిగియుండుటకైయున్నది. అప్పుడు వారు ఎన్నడూ ఒక ప్రశ్నను కలిగియుండరు. ఎటువంటి అనువాదము అవసరముండదు, అన్నివేళలా వారు వినగలిగే స్వచ్ఛమైన కన్యక వాక్యము మాత్రమే ఉంటుంది.

అంత్య దినములలో అనేక స్వరములు ఉంటాయని మరియు ఎంతో గందరగోళం ఉంటుందని ఆయన ఎరిగియున్నాడు.

గడిచిన మూడు వారములు ఆయన మనతో మాట్లాడి మరియు మనము జీవించుచున్న ఘడియను స్థానములో ఉంచాడు. లేచి మరియు సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సైతం మోసముచేసే అబద్ధ ప్రవక్తల గురించి, ఆయన మనకు చెప్పాడు.

ఈ యుగపు దేవుడు ఏ విధంగా ప్రజల హృదయములకు గ్రుడ్డితనము కలుగజేసాడో చెప్పాడు. ఈ లవొదికయ కాలములో ఈ సంగతులు జరుగునని దేవుడు తానే తన ప్రవచనములలో ఏ విధంగా తెలియజేసాడో చెప్పాడు. ముగించబడకుండా విడిచిపెట్టబడిన ఒక్క కార్యము కూడా లేదని ఆయన మనకు చెప్పాడు.

ఈ దినమున ఆయన ఏ సంగతులను చేస్తాడని ఆయన గురించి ప్రవచింపబడినదో వాటి ద్వారా అయన తనను తాను మనయెదుట గుర్తింపజేసుకున్నాడు. ఆయన నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడని ఆయన స్వంత క్రియలే మనకు ఋజువు చేసినవి. అది ఆయనయొక్క వధువుతో మాట్లాడుచు, ఆమెలో జీవించుచున్న, దేవునియొక్క స్వరమైయున్నది.

ఈ వర్తమానము హెబ్రీ 13:8 అయ్యున్నదని మీరు నమ్ముచున్నారా? అది సజీవ వాక్యమైయున్నదా? అది మనుష్య కుమారుడు తనను తాను మానవ శరీరములో బయలుపరచుకొనుటయేనా? అటువంటప్పుడు మీరు నమ్మి లోబడితే ఈ ఆదివారము ప్రవచనము నెరవేరుతుంది.

ప్రపంచ చరిత్రలోనే ముందెన్నడూ సాధ్యపడని ఒక విషయము ప్రపంచవ్యాప్తంగా సంభవించును. దేవుడు మానవ పెదవుల గుండా పలుకుచు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన వధువతంటితో ఒకే సమయములో మాట్లాడుతుంటాడు. ఆయన మనందరి కొరకు ప్రార్థిస్తుండగా మనము ఒకరిపై ఒకరము చేతులుంచుకొనునట్లు ఆయన చేస్తాడు.

అక్కడ బయట టెలిఫోనులో కనెక్టు అయ్యున్న మీరు, మీరు మీ హృదయమంతటితో నమ్మియున్నయెడల, సేవకులు మీ మీద చేతులుంచుతుండగా, మరియు మీ ప్రియమైనవారు మీపై చేతులుంచుతుండగా, అది ముగించబడినదని మీరు మీ హృదయమంతటితో నమ్మినయెడల, అది ముగించబడినది.

మనకేది అవసరమున్ననూ, మనము కేవలం నమ్మినయెడల, దేవుడు దానిని మనకు అనుగ్రహిస్తాడు…మరియు మనము నమ్ముచున్నాము. మనము ఆయనయొక్క విశ్వాసముగల వధువైయున్నాము. అది సంభవిస్తుంది. మనమెక్కడ కూడుకున్నను అగ్నిస్తంభము అక్కడ ఉండి మరియు మనకు అవసరమైనదానిని మనకు అనుగ్రహిస్తాడు, అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నది.

సరిగ్గా ఇక్కడ సంఘములో మేము చూసే అదే పరిశుద్ధమైన వెలుగు, అది ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడును గాక, మరియు ఈ సమయములో వారు స్వస్థపరచబడుదురు గాక. క్రీస్తుయొక్క సన్నిధిలో, మేము శత్రువును, అనగా అపవాదిని గద్దిస్తున్నాము; మాకు బదులుగా పొందిన ఆ—ఆ శ్రమ ద్వారా, ప్రభువైన యేసుయొక్క మరణము ద్వారా మరియు మూడవ దినమున విజయోత్సవముతో నిండిన పునరుత్థానము ద్వారా; మరియు పంతొమ్మిది వందల సంవత్సరాల తరువాత, ఈ రాత్రి ఆయన మా మధ్య సజీవుడిగా ఉన్నాడని ఆయనయొక్క ఋజువు చేయబడిన సాక్షాధారము ద్వారా, వాడు ఓడించబడ్డాడని మేము శత్రువుతో చెప్పుచున్నాము. సజీవ దేవునియొక్క ఆత్మ ప్రతీ హృదయమును విశ్వాసముతోను మరియు శక్తితోను యేసుక్రీస్తుయొక్క పునరుత్థానము నుండి వచ్చిన స్వస్థతా ప్రభావముతోను నింపును గాక, ఆయనయొక్క సన్నిధిలో, సంఘమును ఆవరించుచున్న ఈ గొప్ప వెలుగు ద్వారా ఆయన ఇప్పుడు గుర్తింపజేయబడ్డాడు. యేసుక్రీస్తు నామములో, దేవుని మహిమార్థమై దానిని అనుగ్రహించుము.

మీరు ఆయనయొక్క వధువైయున్నారు. ఏదియు దానిని మీ యొద్దనుండి తీసివేయలేదు, ఏదియు తీసివేయలేదు. సాతానుడు ఓడించబడ్డాడు. మీరు ఆయనను ఒక చెంచాడు మాత్రమే కలిగియున్నారని మీకు అనిపించవచ్చును, మీకు అవసరమైయున్నదంతా అదియే, అది వాస్తవమైనది. అది ఆయనే. మీరు ఆయనవారు. ఆయన వాక్యము విఫలమవ్వజాలదు.

దానిని నమ్మండి, దానిని అంగీకరించండి, దానిని పట్టుకొనియుండండి, అది విఫలము కానేరదు. మీరు శక్తిని కలిగిలేరు గాని మీరు ఆయనయొక్క అధికారమును కలిగియున్నారు. ఇట్లు చెప్పండి, “ప్రభువా నేను దానిని తీసుకొనుచున్నాను, అది నాది, నీవే దానిని నాకు ఇచ్చావు మరియు సాతానుడు దానిని తీసుకొనిపోవుటకు నేను అనుమతించను.”

మనము ఎటువంటి సమయమును కలిగియుంటాము కదా. నేను ఉండగోరునట్టి వేరే ఏ చోటును లేదు. పరిశుద్ధాత్మ మన చుట్టూ ఆవరించియుంటాడు. అధిక ప్రత్యక్షత మనకు ఇవ్వబడుతుంది. విరిగిన హృదయములు బాగుచేయబడతాయి. ప్రతియొక్కరు స్వస్థపరచబడతారు. మనము ఇట్లు చెప్పకుండా ఎలా ఉండగలము, “మన హృదయములు మనలో మండలేదా, మరియు ఇప్పుడు మనము పునరుత్థానుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో ఉన్నామని తెలుసుకొనుటకు, ఇప్పుడు మన హృదయములు మండుటలేదా, ఆయనకే యుగయుగములకు ఘనత మరియు మహిమ చెల్లును గాక.”

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్.

 

మాతో చేరమని మేము ప్రపంచమును ఆహ్వానిస్తున్నాము:

సమయము: 12:00 P.M. జఫర్సన్విల్ కాలమానం
వర్తమానము: 65-0801E ప్రవచనము ద్వారా తేటపరచబడిన సంగతులు

 

వర్తమానము వినుటకుముందు చదువవలసిన లేఖనములు:

ఆదికాండము: 22:17-18
కీర్తనలు: 16:10 / అధ్యాయము 22 / 35:11 / 41:9
జెకర్యా 11:12 / 13:7
యెషయా: 9:6 / 40: 3-5 / 50:6 / 53:7-12
మలాకి: 3:1 / 4వ అధ్యాయము
పరిశుద్ధ. యోహాను 15:26
పరిశుద్ధ. లూకా: 17:30 / 24:12-35
రోమా: 8:5-13
హెబ్రీ: 1:1 / 13:8
ప్రకటన: 1:1-3 / అధ్యాయము 10