
ప్రియమైన పరిపూర్ణులారా,
ఏదెను తోటలో, సినాయి కొండమీద, మరియు రూపాంతరపు కొండమీద ఆయన వాక్యమును పలికిన అదే స్వరమును మనము టేపులలో వింటున్నాము. యేసుక్రీస్తు యొక్క సంపూర్ణమైన మరియు ఆఖరి ప్రత్యక్షతతో ఈనాడు అది పలుకుచున్నది. అది ఆయన వధువును బయటకు పిలుస్తూ, ఎత్తబడుట కొరకు ఆమెను సిద్ధపరుస్తున్నది. వధువు దానిని వినుచున్నది, దానిని స్వీకరించుచున్నది, దాని ప్రకారం జీవించుచున్నది, మరియు దానిని నమ్ముట ద్వారా తననుతాను సిద్ధపరచుకున్నది.
ఎవరునూ మనయొద్ద నుండి దానిని తీసివేయలేరు. మన జీవితములు వంకర చేయబడలేవు. ఆయనయొక్క ఆత్మ మనలో మండుచూ ప్రకాశించుచున్నది. ఆయన మనకు ఆయనయొక్క జీవమును, ఆయనయొక్క ఆత్మను ఇచ్చాడు, మరియు ఆయన మనలో ఆయనయొక్క జీవమును ప్రత్యక్షపరచుచున్నాడు. మనము దేవునిలో దాచబడియున్నాము మరియు ఆయనయొక్క వాక్యముచేత పోషించబడుచున్నాము. సాతానుడు మనల్ని ముట్టలేడు. మనము కదల్చబడలేము. ఏదియు మనల్ని మార్చలేదు. ప్రత్యక్షత ద్వారా, మనము ఆయనయొక్క వాక్య వధువు అయ్యాము.
సాతానుడు మనల్ని క్రిందికి తెచ్చుటకు ప్రయత్నించినప్పుడు, మనము కేవలం దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడన్నది వాడికి గుర్తు చేస్తాము. ఆయన క్రింద మనవైపుకు చూసినప్పుడు, ఆయనకు కనబడేదంతా శుద్ధ సువర్ణమేయై యున్నది. ఆయన నీతియే మన నీతియైయున్నది. ఆయన స్వంత మహిమకరమైన గుణలక్షణములే మన గుణలక్షణములై యున్నవి. మన గుర్తింపు ఆయనలో కనుగొనబడినది. ఆయన ఏమైయున్నాడో, దానిని మనమిప్పుడు ప్రతిబింభిస్తున్నాము. ఆయన ఏమైయుండెనో, దానిని మనమిప్పుడు ప్రత్యక్షపరుస్తున్నాము.
సాతానుడితో ఇట్లు చెప్పడానికి ఆయన ఎంతగా ఇష్టపడతాడో గదా, “నాకు ఆమెలో ఏ తప్పిదము కనబడుటలేదు; ఆమె పరిపూర్ణముగా ఉన్నది. నాకైతే, ఆమె నా వధువైయున్నది, లోపటనుండి వెలుపటనుండి మహిమకరముగా ఉన్నది. ఆదినుండి అంతము వరకు, ఆమె నా చేతి పనియైయున్నది, మరియు నా చేతి పనులన్నియు పరిపూర్ణమైయున్నవి. వాస్తవానికి, నా నిత్యమైన జ్ఞానము మరియు ఉద్దేశ్యము ఆమెలోనే ఉండి మరియు ఆమెలోనే ప్రత్యక్షపరచబడియున్నవి.”
“నేను నా ప్రియమైన వధువును అర్హురాలిగా కనుగొన్నాను. సువర్ణము మలచబడుటకు కొట్టబడునట్లుగా, ఆమె నా నిమిత్తము బాధననుభవించినది. ఆమె రాజీ పడలేదు, లొంగిపోలేదు, లేదా పగులగొట్టబడలేదు, అయితే సౌందర్యమైనదానిగా మలచబడినది. ఈ జీవితములోని ఆమెయొక్క పరీక్షలు మరియు శోధనలు ఆమెను నాయొక్క ప్రియమైన వధువుగా తయారు చేసినవి.”
అదియే కదా మన ప్రభువు? సరిగ్గా మనలను ఎలా ప్రోత్సాహపరచాలో ఆయనకు తెలుసు. “ఎన్నడూ నిరుత్సాహపడకండి గాని, ఉత్సాహపరచబడి యుండండి,” అని ఆయన మనకు చెప్తాడు. ఆయన కొరకైనట్టి మనయొక్క ప్రేమపూర్వకమైన క్రియలను ఆయన చూస్తాడు. మనము దేనిగుండా వెళ్ళవలసియున్నదో ఆయన చూస్తాడు. మనము ఓర్చుకోవలసిన అనుదిన పోరాటములను ఆయన చూస్తాడు. ప్రతిదానిలోనూ ఆయన మనలను ప్రేమించుచున్నాడు.
ఆయన దృష్టిలో మనము పరిపూర్ణముగా ఉన్నాము. కాలముయొక్క ఆరంభమునుండి ఆయన మన కొరకు వేచియున్నాడు. మన మేలు కొరకైతేనే తప్ప ఆయన మనకు ఏదియు జరుగనివ్వడు. సాతనుడు మన ముందుంచే ప్రతీ అడ్డంకును మనము దాటివస్తామని ఆయన ఎరిగియున్నాడు. మనము ఆయనయొక్క వధువైయున్నామని వాడికి ఋజువు చేయుటకు ఆయన ఇష్టపడతాడు. మనము కదల్చబడలేము. ఆది నుండి ఆయన వేచియున్నది మన కొరకేయైయున్నది. ఆయన నుండి మరియు ఆయనయొక్క వాక్యమునుండి మనలను ఏదియు వేరు చేయలేదు.
ఆయన మనతో నేరుగా మాట్లాడుటకు తనయొక్క బలిష్ఠుడైన దూత వర్తమానికుడిని మనకు పంపించాడు. ఆయన ఏమి చెప్పాడని ఎటువంటి ప్రశ్నలు ఉండకుండా ఆయన దానిని రికార్డు చేపించాడు. ఆమె కొరకు ఆయన వచ్చేదాకా ఆమె తినడానికి ఏదైనా కలిగియుండునట్లు ఆయన దానిని భద్రము చేపించాడు.
మనము “టేపు ప్రజలము,” అని చెప్పుచున్నందుకు ఇతరులు మనలను అపార్థము చేసుకొని మరియు వేదించినాగాని, మనము సంతోషిస్తాము, ఏలయనగా దీనిని చేయమనే ఆయన మనకు బయలుపరిచాడు. ఇతరులు వారు ఏమి చేయుటకు నడిపించబడితే దానిని చేయాలి, కానీ మనకైతే, మనము ఒక్క స్వరము క్రింద, టేపులలో ఉన్న దేవునియొక్క నిర్ధారించబడిన స్వరము క్రింద ఐక్యమవ్వవలసి యున్నాము.
మనము మరి దేనిని గ్రహించలేము. మనకు మరేదియు అర్థం కాదు. మనము మరి దేనిని చేయలేము. మనము మరిదేనిని అంగీకరించలేము. ఇతర విశ్వాసులు ఏమి చేయుటకు ప్రభువుచేత నడిపించబడ్డారని వారికి అనిపించుచున్నదో దానికి మనము వ్యతిరేకముగా లేము, అయితే దీనిని చేయుటకే దేవుడు మనల్ని నడిపించాడు, మరియు మనము ఇక్కడే నిలిచియుండవలసి యున్నాము.
మనము తృప్తిపరచబడ్డాము. మనము దేవునియొక్క స్వరముచేత పోషించబడుచున్నాము. మనము వినే ప్రతీ మాటకు మనము “ఆమేన్” అని చెప్పగలము. ఇది దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన మార్గమైయున్నది. మనము ఇంకేమి చేయలేము.
మాతో ఐక్యమవ్వడానికి అందరినీ ఆహ్వానించుటకు నేను అసలు ఎంతగానో ఇష్టపడుచున్నాను. సహోదరుడు బ్రెన్హామ్ గారు ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఆయన వాటిని ఎలా చేసాడో సరిగ్గా అదే విధంగా మేము కూడికలను జరిగించుచున్నాము. ఆయన ఇక్కడ శరీరములో లేకపోయినా గాని, దేవుడు టేపులో తన వధువుతో ఏమి చెప్పాడన్నదే ముఖ్యమైన విషయమైయున్నది.
టెలిఫోన్-ద్వారా వినేదానిలో భాగమైయుండుటకు ఆయన ప్రపంచమంతటినీ ఆహ్వానించాడు, అయితే అది కేవలం వారు అట్లు చేయగోరితేనే. దేవునియొక్క స్వరము వారితో మాట్లాడుటను అందరూ ఒకే సమయంలో వినగలుగుటకు వారికి సాధ్యమైన చోట ఆయన వారిని కూడుకొనునట్లు చేసాడు. అప్పుడు దేవుని ప్రవక్త చేసినది అదేయైయున్నది, కావున నాకు మాదిరి చూపించుటకు ఆయన ఏమి చేసాడో నేను కేవలం దానిని చేయుటకే ప్రయత్నించుచున్నాను.
కావున, ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా, 12:00 P.M. గంటల సమయమప్పుడు, దేవుని వర్తమానికుడు: ఈ దుష్టయుగపు దేవుడు 65-0801M అను వర్తమానమును మనకు అందించడాన్ని మేము వినుచుండగా అనుసంధానము-విధానములో మాతో చేరవలెనని మీరు ఆహ్వానించబడ్డారు.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానము వినుటకు ముందు చదువవలసిన లేఖనములు:
పరిశుద్ధ. మత్తయి 24వ అధ్యాయము / 27:15-23
పరిశుద్ధ. లూకా 17:30
పరిశుద్ధ. యోహాను 1:1 / 14:12
అపొస్తలుల కార్యములు 10:47-48
1 కోరింథీ 4:1-5 / 14వ అధ్యాయము
2 కోరింథీ 4:1-6
గలతి 1:1-4
ఎఫెసీ 2:1-2 / 4:30
2 థెస్సలొనీకయ 2:2-4 / 2:11
హెబ్రీ 7వ అధ్యాయము
1 యోహాను అధ్యాయము 1 / 3:10 / 4:4-5
ప్రకటన 3:14 / 13:4 / అధ్యాయములు 6-8 మరియు 11-12 / 18:1-5
సామెతలు 3:5
యెషయా 14:12-14