ఆదివారం
01 సెప్టెంబర్ 2024
65-0815
And Knoweth It Not

ప్రియమైన సహోదర సహోదరీలారా,

క్రీస్తుకు సమీపముగా ఉండండి. సువార్త సేవకునిగా, ఇప్పుడు దీని గురించి, మిమ్మల్ని హెచ్చరించనివ్వండి. ఎటువంటి బుద్ధిహీనతను తీసుకోకండి. దేనినీ ఊహించుకోకండి. మీరు సరిగ్గా క్రీస్తులోనే ఉన్నారని, ఈ అంతరంగములోనిది వాక్యమునకు లంగరు వేయబడేవరకు సరిగ్గా అక్కడే ఉండండి, ఎందుకనగా ఆ ఒక్కటి మాత్రమే…ఎందుకనగా, మనమెన్నడూ జీవించనటువంటి అత్యంత మోసకరమైన కాలములో మనము జీవిస్తున్నాము. “సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సైతం అది మోసపుచ్చుతుంది.” ఎందుకనగా వారు అభిషేకమును కలిగియున్నారు, వారు ఆ మిగతావారివలె దేనినైనా చేయగలరు.

తండ్రీ, అన్ని సమయాలలో కల్లా అత్యంత మోసపూరితమైన కాలములో మేము జీవిస్తున్నామని నీవు మమ్మల్ని హెచ్చరించావు. లోకములోని రెండు ఆత్మలు ఎంతో దగ్గరగా ఉంటాయని, సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సైతం, అది మోసపుచ్చుతుందని హెచ్చరించావు. అయితే ప్రభువునకు స్తుతి కలుగను గాక, నీ వధువైయున్న మమ్మల్ని, మోసపరచడం సాధ్యము కాదు; మేము నీ వాక్యముతో నిలిచియుంటాము.

మేము నీయొక్క నూతన సృష్టియైయున్నాము, మరియు మేము మోసపరచబడలేము. మేము నీ స్వరముతో నిలిచియుంటాము. ఎవరు ఏమి చెప్పినా గాని, మేము ప్రతీ మాటను ఊటంకిస్తూ మరియు ప్రతీ మాటకు వ్రేలాడియుంటాము. నీవు ఏర్పాటు చేసిన మార్గము తప్ప వేరే ఏ మార్గము లేదు; అది టేపులలో ఉన్న యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నది.

నీ ప్రవక్త ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు, పలుకబడిన ప్రతీ మాటను వినడము నీ వధువుకి ఎంత ప్రాముఖ్యమో ఆయన ఎరిగియున్నాడు, కావున టెలిఫోను-మాద్యమం ద్వారా ఆయన నీ వధువును ఐక్యపరిచాడు. నీయొక్క నిర్ధారించబడినట్టి పలుకబడిన వాక్యపు స్వరము చుట్టూ ఆయన మమ్మల్ని సమకూర్చాడు.

నీ స్వరము కంటే గొప్పదైన అభిషేకము ఏదియు లేదని ఆయన ఎరిగియున్నాడు.

బయట ఈ టెలిఫోను తరంగాల మీదుగా, ఆ గొప్ప పరిశుద్ధాత్మ ప్రతీ సంఘ సమూహములోనికి వెళ్ళును గాక. సంఘములో సరిగ్గా మేమిక్కడ చూస్తున్న అదే పరిశుద్ధ వెలుగు, అది ప్రతీ ఒక్కరి మీద కుమ్మరించబడును గాక,

నీ రాకడ కొరకు వధువుకు అవసరమైన ప్రతీది పలుకబడి, భద్రపరచబడి మరియు నీయొక్క దూత ద్వారా నీయొక్క వధువుకు బయలుపరచబడినది; అది నీ వాక్యమైయున్నది. మాకు ఏవైనా ప్రశ్నలు ఉన్నయెడల, టేపులయొద్దకు వెళ్ళమని నీవు మాకు చెప్పావు. విలియమ్ మారియన్ బ్రెన్హామ్ గారు మా కొరకైన నీ స్వరమని నీవు మాకు చెప్పావు. ఆమె వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరముగా నీ స్వరమునే ఉంచడము ఎంత ప్రాముఖ్యము అనేదాని గురించి నీ వధువుయొక్క మనస్సులో ఒక ప్రశ్న ఎలా ఉండగలదు? నీయొక్క వధువుకు, ప్రశ్న లేదు ప్రభువా.

“నేను ఈ మార్గమున మరొక్కసారి స్వారీ చేస్తాను,” అని నీ ప్రవక్త అన్నటువంటి ఒక కలను గూర్చి ఆయన మాకు చెప్పాడు. దాని భావము ఏమిటో మాకు తెలియదు, అయితే నిజముగా ప్రభువా, ఈనాడు నీ స్వరము మాటలాడుచు, మరియు ప్రపంచమంతటి నుండి నీ వధువును బయటకు పిలచుచు మరొక్కసారి వాయు తరంగాల మార్గము గుండా స్వారీ చేయుచున్నది.

ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా 12:00 P.M. గంటల సమయమప్పుడు, వాయు తరంగాలగుండా దేవునియొక్క స్వరము 65-0815 - "మరియు దానిని ఎరుగదు" అను వర్తమానమును అందించడాన్ని మేము వినుచుండగా, వచ్చి, బ్రెన్హామ్ ఆలయపువారమైన మాతో చేరమని, మీరు ఆహ్వానించబడ్డారు.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

చదువవలసిన లేఖనములు:

ప్రకటన 3:14-19
కొలస్సీ 1:9-20