
ప్రియమైన ఒక్క భాగమా,
మనము గొప్ప ఎదురుచూపులతో మరియు గొప్ప ఆశలతో ఉన్నాము. మనము దానిని అనుభూతి చెందగలుగుచున్నాము, ఏదో సంభవించబోవుచున్నది. నీ స్వరమును వినడానికి; నీవు చెప్పే ప్రతిదానిని మరియు దేనినైనా పొందుకొనుటకు మేము ఐక్యపరచబడగోరుచున్నాము. మాకు అది కావాలి. మేము దానిలో భాగమయ్యుండగోరుచున్నాము. మేము ప్రతీ వాక్యమును నమ్ముచున్నాము.
ఏమి జరుగుచున్నది? దేవుడు చరిత్రను సృష్టించుచున్నాడు. దేవుడు ప్రవచనమును నెరవేర్చుచున్నాడు. అది ఎల్లప్పుడూ ఒక ఆకర్షణను కలుగజేస్తుంది. అది పోయిన ఆదివారము మనము ఎవరి గురించియైతే విన్నామో అటువంటి విమర్శకులను, వర్తమానములో ఉన్న రాబందులను తీసుకొనివస్తుంది, అయితే అది ఆయనయొక్క పక్షిరాజులను కూడా సమకూర్చుతుంది. ఏలయనగా శరీరము ఎక్కడున్నదో, పక్షిరాజులు అక్కడ పోగవును.
ఇదిగో నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును, అన్నటువంటి ప్రవక్తయొక్క ప్రవచనమునకు అది జవాబైయున్నది. దేవుడు తన ప్రవక్తను నిర్ధారించుచున్నాడు. అది దేవుడే ప్రవచనమును నెరవేర్చుటయైయున్నది. దేవుడు తన వాక్యమును నెరవేర్చుతూ, చరిత్రను సృష్టిస్తున్నాడు. అది మూడవ ఈడ్పు నెరవేర్చబడటమైయున్నది.
నేను చేసేదంతయూ సంఘపు నాయకులతో ఏకీభవించకుండా, మరియు వారు చేసే ప్రతిదానిని ఖండించడమే అన్నట్లుగా అగుపిస్తుందని నాకు తెలుసు, అయితే మనము ప్లేను నొక్కి మరియు ఆ వర్తమానమును, ఆ స్వరమును విని, మరియు దానిని వెంబడించుటకు ముందుగా ఏర్పరచబడిన ఆ నిర్దిష్టమైన ప్రజల గుంపుయైయున్నామని నేను నమ్ముచున్నాను.
మనము జనసమూహములను పట్టించుకోము. మనము అవిశ్వాసియొక్క విమర్శను పట్టించుకోము. మనము వారితో ఎటువంటి వాదనను కలిగియుండము. మనము చేయవలసినది ఒకే ఒక్కటి ఉన్నది, అదేమిటనగా, నమ్మి మరియు దానిలో మనము పొందుకోగల ప్రతి చిన్నదానిని కూడా పొందుకొని; యేసు పాదాల వద్ద కూర్చున్న మరియ వలె దానిని నాన్చబడనివ్వవలసి యున్నాము.
మనము మరిదేనిలోను ఆసక్తి కలిగిలేము. మనకు మరేదియు అక్కరలేదు. మనము వినవలసిన ప్రతీది టేపులలో ఉన్నదని మనము నమ్ముచున్నాము. దేవుని వాక్యమునకు ఎటువంటి అనువాదము అవసరములేదు.
వాగ్దానము నెరవేర్చబడినది. అయ్యా, ఎంత వేళయైనది, మరియు ఈ ఆకర్షణ ఏమిటి? దేవుడు తన వాక్యమును నెరవేర్చుచున్నాడు! ఆయన నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు.
ఆకర్షణ ఏమిటి? దేవుడు, మరొక్కసారి, తన వాక్యమును నెరవేర్చుచున్నాడు, దేశమంతటినుండి, పశ్చిమ తీరములో, పైన ఆరిజోనా కొండలలో, టెక్సస్ మైదానములలో, దూరాన్న తూర్పు తీరములోనుండి; దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా సంఘములలో, పెట్రోలు బంకులలో, గృహములలో చిన్న మైకుల చుట్టూ కూడియున్న తన ప్రజలను సమకూర్చుచున్నాడు.
సమయములో మేము అనేక గంటల వ్యత్యాసమును కలిగియున్నాము, అయితే ప్రభువా, మేము ఒక్క భాగముగా, విశ్వాసులుగా కలిసియున్నాము, మెస్సీయా యొక్క రాకడ కొరకు వేచియున్నాము. నీ ప్రవక్త ఇక్కడ ఉన్నప్పుడు నీ వధువును ఐక్యపరచుటకు ఆయన ఏమి చేసాడో దానిని వెంబడిస్తూ మరియు సరిగ్గా దానిని చేయుటకే నేను ప్రయత్నిస్తున్నాను. ఆయన ఏమి చేసాడో అదియే నాకు ఉదాహరణగా ఉన్నది.
ఇక్కడ బ్రెన్హామ్ టెబర్నికల్ వద్ద అందరినీ కూర్చోబెట్టుటకు మాకు సరిపడా స్థలము లేదు, కావున ఆయన అప్పుడు చేసినట్లే, మేము వారికి టెలిఫోన్ అనే మాధ్యమము ద్వారా వాక్యమును పంపవలసియున్నది. ప్రభువు రాకడ కొరకు వేచియుంటూ, ఇక్కడ జఫర్సన్విల్ లో, మేము మా స్థానిక సంఘములలో కూడుకుంటాము.
ఈ చివరి దినములలో నీ పరిపూర్ణ చిత్తము కాకుండా నీకు సేవచేయ ప్రయత్నించువారు అనేకులు ఉంటారని నీవు మాకు చెప్పావు. నిజమైన పరిశుద్ధాత్మతో నింపబడినవారు అనేకులు ఉంటారు కానీ, వారు తప్పుడు బోధకులుగా ఉంటారని చెప్పావు. ప్రభువా, మేము నిశ్చయత కలిగియుండుటకు మాకు తెలిసిన ఒకేఒక్క మార్గమేదనగా వాక్యముతో నిలిచియుండటమే, టేపు బోధనతో నిలిచియుండటమే, నీయొక్క నిర్ధారించబడిన స్వరముతో నిలిచియుండటమే.
మేము వెంబడించడము తప్ప మరేదియు చేయలేనటువంటి నీయొక్క ముందుగా ఏర్పరచబడిన విత్తనమైయున్నామని మేము నమ్ముచున్నాము; అది మాకు జీవముకంటే విలువైనది. మా ప్రాణములను తీసివేసుకొనుము, కానీ దానిని తీసుకొనవద్దు.
ఈ ఆదివారము ఏమి జరుగబోవుచున్నది? దేవుడు తన వాక్యమును నెరవేర్చుతుంటాడు. దేశవ్యాప్తంగా, టెలిఫోను అనే మాధ్యమము ద్వారా వింటూ, దేశమంతటా, ఒక తీరమునుండి మరొక తీరము వరకు, ఉత్తరము నుండి దక్షిణము వరకు, తూర్పు నుండి పశ్చిమము వరకు, వందలకొలది ప్రజలు ఒకరిపై మరొకరు తమ చేతులనుంచుతారు.
ప్రపంచ వ్యాప్తంగా విదేశాలలో కూడా, మేమంతా ఒకరిపై ఒకరము చేతులనుంచుతాము. “మాకు ఒక ప్రార్థనా కార్డు అవసరము లేదని, మేము ఒక వరుస గుండా రావలసిన అవసరం లేదని, మాకు విశ్వాసము మాత్రమే అవసరమైయున్నదని,” నీవు మాతో చెప్పావు.
మేము మా చేతులనెత్తి మరియు, “నేను ఒక విశ్వాసిని,” అని చెప్తాము. ఏమి జరుగబోవుచున్నది?
సాతానా, నీవు ఓడించబడ్డావు. నీవు ఒక అబద్ధికుడవు. మరియు, “నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు,” అని వ్రాయబడియున్నది గనుక, దేవుని వాక్యమునకు లోబడి, మరియు ఈ ప్రజలలోనుండి బయటకు వెళ్ళమని, ఒక దేవుని సేవకునిగా, మరియు సేవకులుగా, యేసుక్రీస్తు నామములో మేము నీకు ఆజ్ఞాపించుచున్నాము.
ప్రియమైన దేవా. నీవు ఆ దినమున కల్వరి కొండపైన ఒక ఆకర్షణతో, అనారోగ్యమంతటినీ మరియు వ్యాధులన్నిటినీ మరియు అవపాదియొక్క సమస్త కార్యములను ఓడించినట్టి పరలోకపు దేవుడవైయున్నావు. నీవు దేవుడవైయున్నావు. మరియు నీవు పొందిన గాయములచేత ప్రజలకు స్వస్థత కలుగుచున్నది. వారు స్వతంత్రులుగా ఉన్నారు. యేసుక్రీస్తు నామములో. ఆమేన్.
దేవుడు తన వాక్యమును నెరవేర్చుతాడు!
మేము ఈ వర్తమానమును వినుచుండగా, ఆయనయొక్క వధువులో ఒక భాగమైయున్న మాతో కలిసి వినడానికి, మిమ్మల్ని ఆహ్వానించుటకు నేను ఇష్టపడుచున్నాను: 65-0725E ఆ పర్వతము మీద ఆకర్షణ ఏమిటి? మేము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా ఆదివారము 12:00 P.M., గంటల సమయమప్పుడు కూడుకుంటాము.
కూడుకొని, ఒకే సమయములో ఒకే వర్తమానమును వినడంవలన మేము ఒక సంఘశాఖయని కొంతమందికి అనిపించవచ్చును, అయితే సహోదరుడు బ్రెన్హామ్ గారు ఇక్కడ ఉండియుంటే, ప్రపంచమంతటి నుండి వధువును సమకూర్చుతూ, ఈయన మాట వినుడి అని చెప్పబడినదానిని ఒకే సమయములో వింటూ, మేము దేనిని చేస్తున్నామో, ఆయన సరిగ్గా దానినే చేస్తాడని నేను నమ్ముచున్నాను.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
లేఖనములు:
పరిశుద్ధ. మత్తయి 21:1-4
జెకర్యా 9:9 / 14:4-9
యెషయా 29:6
ప్రకటన 16:9
మలాకీ 3:1 / 4th Chapter
పరిశుద్ధ. యోహాను 14:12 / 15:1-8
పరిశుద్ధ. లూకా 17:22-30