
ప్రియమైన దాచబడిన మన్నాను తినువారలారా,
దేవుడు ఆయనయొక్క వధువును నడిపించుటకు తన ఏడవ దూత వర్తమానికుడిని పంపించాడు; వేరొక వ్యక్తిని కాదు, ఒక గుంపు పురుషులను కాదు, అయితే ఒక్క మానవుడిని పంపించాడు, ఏలయనగా వర్తమానము మరియు ఆయనయొక్క వర్తమానికుడు ఒక్కటే. దేవుని వాక్యమునకు ఎటువంటి అనువాదము అవసరములేదు. మానవ పెదవుల ద్వారా ఆయన దానిని తన వధువునకు పలికియున్నాడు మరియు ఆయన దానిని ఏ విధంగా చెప్పాడో సరిగ్గా అట్లే మేము దానిని నమ్ముచున్నాము.
మనల్ని ఏ స్వరము నడిపించుచున్నది అనేదాని గురించి, మరియు అది మనకు ఏమి చెప్పుచున్నది అనేదాని గురించి ఈనాడు మనము ఎంతో జాగ్రత్త వహించవలసియున్నాము. సరిగ్గా ఆ నిర్ణయము మీదనే మన నిత్యమైన గమ్యము ఆధారపదియుంటుంది; కావున మనము వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరము ఏదని మనము నిర్ణయించుకోవలసియున్నాము. ఏ స్వరము దేవునిచేత నిర్ధారించబడినది? ఏ స్వరము యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును కలిగియున్నది? అది నా స్వరమో, నా మాటలో, నా సిద్ధాంతమో అయ్యుండజాలదు, అయితే అది వాక్యమే అయ్యుండవలసియున్నది, కావున అది మనకు ఏమి చెప్పుచున్నదో చూడటానికి మనము వాక్యమునొద్దకు వెళ్ళవలసియున్నాము.
అంతమున మనల్ని నడిపించుటకు ఆయన ఐదు రకముల పరిచర్యను లేపుతాడని అది మనకు చెప్పుచున్నదా? అవి వాటి స్థానమును; అత్యంత ప్రాముఖ్యమైన స్థానములను కలిగియున్నవని మనము వాక్యములో తేటగా చూడగలము, అయితే వధువుగా ఉండుటకు మనము తప్పకుండా వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరములను అవి కలిగియుంటాయని వాక్యము ఎక్కడైనా చెప్పుచున్నదా?
అంత్య దినములలో దేవుని చిత్తము లేకుండా ఆయనకు సేవచేయడానికి ప్రయత్నించే అనేకమంది లేస్తారని ప్రవక్త మనకు చెప్పాడు. ఆయన వారి పరిచర్యను ఆశీర్వదిస్తాడు, కానీ తన వధువును నడిపించుటకు అది ఆయనయొక్క పరిపూర్ణమైన మార్గము కాదు. తనయొక్క నిర్ధారించబడిన ప్రవక్త స్వరమును విని మరియు దానిని నమ్ముటయే, ఆయనయొక్క ప్రరిపూర్ణమైన చిత్తమైయున్నదని, మరియు ఎల్లప్పుడూ అలాగే ఉండినదని ఆయన చెప్పాడు. ఏలయనగా అది, మరియు అది మాత్రమే, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును కలిగియున్నది. అందునుబట్టియే ఆయన తన దూతను పంపియున్నాడు; అందునుబట్టియే ఆయన అతడిని ఎన్నుకున్నాడు; అందునుబట్టియే ఆయన దానిని రికార్డు చేపించాడు. అది ఆయనయొక్క వధువుకు, రుతువునకు తగిన ఆత్మీయ ఆహారమైయున్నది, దాచబడిన మన్నాయైయున్నది.
ఏలయనగా ఏడు కాలములకు ఏడు కాలములలోను, మనుష్యులు నా మాటకంటే ఎక్కువగా తమ స్వంత మాటను గౌరవించుకోవడం తప్ప నేను మరిదేనిని చూడలేదు. కావున ఈ కాలముయొక్క ముగింపున నేను మిమ్మల్ని నా నోటనుండి ఉమ్మివేయుచున్నాను. అంతా అయిపోయినది. నేను బాగుగానే మాట్లాడబోవుచున్నాను. అవును, నేను ఇక్కడ సంఘము మధ్యన ఉన్నాను. దేవునియొక్క ఆమేన్ అనువాడు, నమ్మకమైన సత్యమైనవాడు తననుతాను బయలుపరచుకుంటాడు మరియు అది నా ప్రవక్తయైయుంటాడు.” ఓ అవును, అది ఆ విధంగానే ఉన్నది.
ఏడు కాలములకు ఏడు కాలములలోను మనుష్యులు నా మాట కంటే వారి మాటను గౌరవించుకున్నారు. మిమ్మల్ని మీరు ఇట్లు ప్రశించుకోవలసియున్నారు, సరిగ్గా ఇప్పుడు ఇది మన మధ్యన జరగడంలేదా? “సంఘములో టేపులను ప్లే చేయవద్దు కానీ, మీరు మీ సంఘకాపరి చెప్పేది వినవలసియున్నారు, టేపులను కేవలం మీ ఇంటివద్ద ప్లే చేసుకోండి.” టేపులో ఉన్న ఆయనయొక్క స్వరమును కాదు గాని, వారియొక్క స్వరమును వారు అత్యంత ప్రాముఖ్యమైన స్వరముగా ఉంచుతారు.
వారు ప్రజలకు తమనుతాము చూపించుకొనుచున్నారు, వారి పరిచర్యయొక్క ప్రాముఖ్యతను, వధువును నడిపించుటకై, వాక్యమును తెచ్చుటకై వారికున్న పిలుపుయొక్క ప్రాముఖ్యతను చూపించుకొనుచున్నారు, అయితే వధువు దానికి నిలబడలేదు. వారు దానిని అంగీకరించరు. వారు దానిని చేయరు. వారు దానిపై రాజీపడరు; దేవునియొక్క స్వరమే తప్ప మరేదియు ముఖ్యమైనది కాదు. వాక్యము దానినే చెప్పుచున్నది.
ఈనాడు ప్రజల మనస్సులలో ఉన్న ప్రశ్న ఏమిటంటే: తన వధువును నడిపించుటకు దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు, టేపులనా లేదా ఐదు రకముల పరిచర్యనా? పరిచర్య వధువును పరిపూర్ణము చేస్తుందా? పరిచర్య వధువుకు మార్గదర్శకత్వము చేస్తుందా? దేవుని వాక్యప్రకారంగా, అది ఎన్నడూ ఆయనయొక్క మార్గముగా ఉండలేదు.
సంవత్సరాల తరబడి ఈ వర్తమానమును వెంబడిస్తూ దీనిని నమ్మియున్నారని చెప్పుచున్న అనేకమంది ఈనాడు ఉన్నారు, అయితే ఇప్పుడు పరిచర్యను మీరు వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరముగా ఉంచుచున్నారు.
అటువంటప్పుడు మీరు ఏ పరిచర్యను వెంబడిస్తారు? మీ నిత్యమైన గమ్యమును మీరు ఏ పరిచర్యపై ఉంచుతారు? వర్తమానమును బోధించుటకు వారు దేవునిచేత పిలువబడ్డారని వారందరూ చెప్తారు. నేను దానిని నిరాకరించుటలేదు లేదా దానిని ప్రశ్నించుటలేదు, అయితే ఐదు రకముల పరిచర్యకు చెందినవారైన కొంతమంది అత్యంత పలుకుబడిగల సేవకులు ఇట్లు చెప్పుచున్నారు, “అది దేవుని స్వరము కాదు, అది కేవలం విలియమ్ బ్రెన్హామ్ యొక్క స్వరమైయున్నది”. ఇతరులు ఇట్లు చెప్పుచున్నారు, “ఒక్క-వ్యక్తి వర్తమానము వంటి దినములు గతించిపోయినవి”, లేదా “ఈ వర్తమానము సంపూర్ణత కాదు”. మిమ్మల్ని నడిపించేది వారేనా?
వారియొక్క వందలకొలది సమావేశాలలో ప్రసంగించిన వ్యక్తులు; ఐదు రకముల పరిచర్యలో గొప్ప నాయకులు, ఇప్పుడు ఈ వర్తమానమును నిరాకరించి మరియు ఇట్లంటున్నారు, “ఇది తప్పుడు వర్తమానము”.
దాదాపు ఈనాడు ఉన్నట్టి పరిచర్య అంతా కూడా ఇట్లు చెప్పుచున్నది, “మీరు దేవుని దూతయొక్క స్వరమును సంఘములో వినకూడదు, మీ గృహములలో మాత్రమే వినవలసియున్నారు.” “సంఘములో టేపులను ప్లే చేయమని సహోదరుడు బ్రెన్హామ్ గారు ఎన్నడూ చెప్పలేదు.”
అది నమ్మసఖ్యంగా లేదు. తాము ఈ వర్తమానమును నమ్ముచున్నారనియు, సహోదరుడు బ్రెన్హామ్ గారు దేవునియొక్క ఏడవ దూత వర్తమానికుడనియు, మనుష్యకుమారుడు మాటలాడుటయై యున్నదని నమ్ముచున్నారని చెప్పుచున్న ఒక సహోదరుడు లేదా సహోదరి, అంతటి ఒక మోసపూరితమైన ప్రకటనకు పడిపోతారని నేను నమ్మలేకపోవుచున్నాను. అది మీకు బాధ కలిగించవలసియున్నది. మీరు వధువైనయెడల, అది అట్లు చేస్తుంది.
దేవుడు తన వాక్య విషయమై తన మనస్సును ఎన్నడూ మార్చుకొనడు. తన ప్రజలను నడిపించుటకు ఆయన ఎల్లప్పుడూ ఒక్క వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఇతరులు వారి స్థానమును కలిగియున్నారు, అయితే ప్రజలను నడిపించుటకు ఆయన ఎవరినైతే ఎన్నుకున్నాడో అతనియొద్దకు ప్రజలను నడిపించుటకు మాత్రమే వారు ఉన్నారు. ప్రజలారా మేల్కొనండి. ఈ సేవకులు మీకు ఏమి చెప్పుచున్నారో ఆలకించండి. ప్రవక్త పరిచర్యకంటే వారి పరిచర్యను ముందు పెట్టుటకు వారు ఉపయోగిస్తున్న కొటేషన్లను చూడండి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నదని ఆయన ఋజువుచేసి మరియు నిర్ధారించినట్టి దేవునియొక్క నిర్ధారించబడిన స్వరము కంటే వినవలసిన ప్రాముఖ్యమైన స్వరముగా ఏ సేవకునియొక్క పరిచర్యయైనా ఎలా ఉండగలదు?
నిజమైన పరిశుద్ధాత్మను తమపై కలిగియున్నవారై, నిజముగా అభిషేకించబడినవారై, తప్పైయున్న వ్యక్తులు ఉండగలరని, ఆయన మనకు మళ్ళీ మళ్ళీ చెప్పియున్నాడు. నిశ్చయతను కలిగియుండుటకు ఒకే ఒక్క మార్గమున్నది, అసలైన వాక్యముతో నిలిచియుండటమే, ఏలయనగా ఈ వర్తమానము మరియు వర్తమానికుడు ఒక్కటే. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుగా ఉండుటకు దేవుడు ఎన్నుకున్న ఒకే ఒక్క స్వరమున్నది…ఒకే ఒక్కటి.
టేపులో ఉన్న దేవునియొక్క స్వరమునుండి దేవునియొక్క వాక్యమును వినుటకంటే ప్రాముఖ్యమైనది ఏదియు లేదని నిజమైన పరిచర్య మీకు చెప్తుంది. వారు ప్రసంగించవచ్చు, బోధించవచ్చు, లేదా వారేమి చేయుటకు పిలువబడ్డారో దానిని చేయవచ్చు, అయితే వారు దేవునియొక్క స్వరమును మొదటి స్థానములో ఉంచవలసియున్నారు; కానీ వారు దానిని చేయడంలేదు, అయితే వారు వారి పరిచర్యను మొదటి స్థానములో ఉంచుకొనుచున్నారు. వారేమి నమ్ముచున్నారనేదానిని వారి క్రియలే ఋజువు చేస్తున్నాయి.
సహోదరుడు జోసఫ్ సేవకులయందు నమ్మికయుంచడు అని చెప్పడం ద్వారా, దేవుని స్వరమును వారియొక్క ప్రసంగ వేదికలలో ఉంచాలి అనేదానిని గూర్చిన ప్రశ్నను వారు తప్పించుకుంటారు. అతడు సంఘమునకు వెళ్ళుటను నమ్మడు. వారు ఒక మనుష్యుడిని ఆరాధిస్తారు. వారు ఆ జోసఫ్ సిద్ధాంతమును వెంబడించుచున్నారు. అవే టేపులను ప్లే చేసి వినుట ద్వారా అతడు ఒక సంఘశాఖను తయారు చేస్తున్నాడు అని అంటారు. కేవలం ముఖ్యమైన ప్రశ్ననుండి ప్రజల దృష్టిని మళ్ళిస్తున్నారు. మొదట వారి పరిచర్య అంటూ, వారు ప్రజలకు బోధించేదానినిబట్టి వారి క్రియలే వారేమి నమ్ముచున్నారనేదానిని ఋజువు చేస్తున్నాయి.
ఒకే సమయములో ప్రజలు ఒకే టేపును వినునట్లు చేయడమనేది ఒక సంఘశాఖ అని, వారంటారు. సహోదరుడు బ్రెన్హామ్ గారు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన చేసినది సరిగ్గా అది కాదా; అందరూ ఒకేసారి వినునట్లు ప్రజలకు వివిధ మార్గాలలో కనెక్షన్-ఏర్పాటు చేయలేదా?
మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, ఈనాడు సహోదరుడు బ్రెన్హామ్ గారు శరీరములో ఇక్కడ ఉండియుంటే, ఆయన చెప్పేదానిని అందరూ ఒకే సమయములో వినడానికి వధువు అంతా టెలిఫోన్ మొదలగువాటిలో కనెక్ట్-అయ్యి ఉండేలా ఆయన చూసుకోడా? దేవుడు ఆయనను గృహమునకు తీసుకొనివెళ్ళడానికి ముందు ఆయన చేసినట్లే వధువును ఆయనయొక్క పరిచర్య చుట్టూ పోగుచేయుటకు ఆయన ప్రయత్నించడా?
నన్ను ఇక్కడ ఒక విషయమును జొప్పించనివ్వండి. విమర్శకులు ఇట్లంటారు, చూడండి, అతడు మొదలుపెట్టాడు, మనుష్యునిపై ఎంతో ఎక్కువ ఉంచుతారు; వారు, విలియమ్ మారియన్ బ్రెన్హామ్ అనే ఒక మనుష్యుడిని వెంబడించుచున్నారు!! దాని గురించి వాక్యము ఏమి చెప్పుచున్నదో కూడా మనము చూద్దాము:
పౌలుకు బయలుపరచబడినరీతిగానే, ఏడవ వర్తమానికుని దినములలో, లవొదికయ కాలపు దినములలో, దానియొక్క వర్తమానికుడు దేవునియొక్క మర్మములను బయలుపరుస్తాడు. ఆయన పలుకుతాడు, మరియు ఆ ప్రవక్తను ప్రవక్త అని చేర్చుకొనువారు ఆ ప్రవక్త పరిచర్యయొక్క ఫలమును పొందుకుంటారు.
మరేదియు కలుగజేయని విధంగా ఇది అపవాదికి కోపమును కలుగజేస్తుంది, మరియు వాడు ఇంకా ఎక్కువగా నా మీద దాడి చేస్తాడు, కానీ ప్రజలారా, మీరు దీనిని వాక్యముతో సరిచూసుకోవడం మంచిది. నేను దానిని చెప్పినందువలన కాదు, అందుకు కాదు, అప్పుడు నేను కూడా ఏ ఇతర వ్యక్తిలాగానే అవుతాను, అయితే మీ హృదయములను మీ మనస్సులను తెరచి మరియు దానిని వాక్యముతో సరిచూసుకోండి. ఏ ఇతర వ్యక్తియైనా మీకు ఏమి చెప్పుచున్నాడు లేదా ఏమి అనువాదమిస్తున్నాడు అనేది కాదు గాని, దేవుని ప్రవక్త ఏమి చెప్పాడన్నదే విషయమైయున్నది.
ఈ ఉత్తరము తరువాత వారు మీకు కొటేషన్ వెంబడి కొటేషన్ వెంబడి కొటేషన్ ను ఇస్తారు, మరియు నేను ప్రతీ కొటేషన్ కు ఆమేన్ చెప్పుచున్నాను, కానీ అలసు ముఖ్యమైన విషయము సంగతి ఏమిటి? ప్రవక్త చెప్పింది వినడమే మీరు చేయవలసిన విషయము అని మీకు చెప్పుటకు వారు కొటేషన్లను ఉపయోగిస్తున్నారా, లేదా వారి పరిచర్యకై ఉపయోగిస్తున్నారా? వర్తమానము, ప్రవక్త అని వారంటే, అప్పుడు మీ సంఘములో మొదట ఆ స్వరమును ఉంచమని వారికి చెప్పండి.
కేవలం మానవ ప్రవర్తన ఆధారంగా, అనేకమంది ప్రజలు ఉన్నచోట వారందరూ పట్టుకొనియున్నట్టి ఒక పెద్ద సిద్ధాంతముకు సంబంధించిన చిన్న చిన్న విషయాలపై విభాగింపబడిన ఆలోచనలు ఉంటాయని ఎవరికైనా తెలుసు.
విషయం అదే. అది ఒక ప్రజల గుంపు అయ్యుండజాలదని, అట్లు ఉండదని, ఈ ఒక్క కొటేషనే మీకు చెప్పుచున్నది. ప్రజలను ఐక్యము చేసేది పరిచర్య కాదు ఎందుకంటే మానవ ప్రవర్తన ఆధారంగానే, పెద్ద సిద్ధాంతములయొక్క చిన్న అంశాలపై వారు విభాగింపబడియున్నారు, వారందరూ ఏకీభవించలేరు, కావున మీరు అసలైన వాక్యమునొద్దకు తిరిగి వెళ్ళవలసియున్నారు.
అటువంటప్పుడు ఈ అంత్య కాలము తిరిగి స్వచ్ఛమైన వాక్య వధువును ప్రత్యక్షపరచనైయున్నది గనుక, ఈ అంత్యకాలమున పునరుద్ధరించబడవలసియున్న విఫలమవ్వజాలని శక్తిని ఎవరు కలిగియుంటారు?
మనల్ని ఎవరు నడిపిస్తారు? విఫలమవ్వజాలని శక్తిని కలిగియున్న ఒక్క స్వరము వధువును నడిపించవలసియుంటుంది.
దాని అర్థమేమిటనగా పౌలు దినములలో ఎలాగైతే వాక్యము పరిపూర్ణముగా ఇవ్వబడి, మరియు పరిపూర్ణముగా గ్రహించబడినదో అదే విధంగా వాక్యమును మనము మరొక్కసారి పొందుకుంటాము.
మహిమ…అది పరిపూర్ణముగా ఇవ్వబడి మరియు పరిపూర్ణముగా గ్రహించబడినది. అది పరిపూర్ణముగా ఇవ్వబడినది గనుక, దానికి ఎటువంటి అనువాదము అవసరంలేదు, మరియు, వధువైయున్న మనము, ప్రతీ వాక్యము పరిపూర్ణముగా గ్రహించి మరియు నమ్ముతాము.
విషయం అదే. ఒక నిర్ధారించబడిన ప్రవక్తను ఆయన పంపుచున్నాడు.
దాదాపు రెండువేల సంవత్సరాల తరువాత ఒక ప్రవక్తను ఆయన పంపుచున్నాడు.
పాతకాలపు బాప్తిస్మమిచ్చు యోహానువలె మరియు ఏలీయావలె సంఘసంస్థ, విద్య, మరియు మతప్రపంచమునకు ఎంతో దూరముగానున్న ఒకరిని ఆయన పంపుచున్నాడు,
దేవుని నుండి మాత్రమే అతడు వింటాడు
అతడు “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు” ను కలిగియుంటాడు మరియు దేవుని కొరకు మాట్లాడుతాడు.
అతడు దేవునియొక్క నోరుగా ఉంటాడు
అతడు, మలాకీ 4:6 లో ప్రకటించబడినట్లు, పిల్లల హృదయములను తండ్రుల తట్టుకు త్రిప్పుతాడు.
అతడు అంత్య దినములో ఎన్నుకొనబడినవారిని తిరిగి తీసుకొనివస్తాడు మరియు పౌలుతో అది ఉన్నట్లే ఒక నిర్ధారించబడిన ప్రవక్త ఖచ్చితమైన సత్యమును ఇచ్చుటను వారు వింటారు.
వారు కలిగియున్న విధంగా అతడు సత్యము పునరిద్ధరిస్తాడు.
మరియు ఆ దినమున అతనితో ఉండే ఆ ఎన్నుకొనబడినవారే నిజముగా ప్రభువును ప్రత్యక్షపరిచి మరియు ఆయన శరీరముగాను మరియు ఆయన స్వరముగాను ఉండి మరియు ఆయన క్రియలను వెల్లడిచేస్తారు. హల్లెలూయా! మీరు దానిని చూస్తున్నారా?
మనము దానిని చూస్తున్నాము. మనము దానిని నమ్ముచున్నాము. మనము దానిపై విశ్రాంతి పొందుచున్నాము.
జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా, 12:00 P.M., గంటల సమయమప్పుడు, దేవునియొక్క నోరు, యేసుక్రీస్తు యొక్క వధువును ఐక్యపరిచే స్వరము, ఆయనయొక్క నిర్ధారించబడిన ప్రవక్త, ఆయన ఖచ్చితమైన సత్యమును ఇచ్చుటను మేము వినుచుండగా వచ్చి మాతో చేరవలెనని మీరు ఆహ్వానించబడ్డారు.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
65-0725M — అంత్యకాలమందు అభిషక్తులు