ఆదివారం
15 మార్చి 2026
65-0220
దేవుడు ఏర్పరచుకొన్న ఆరాధనా స్థలము

ప్రియమైన శ్రీమతి. యేసుక్రీస్తు,

ఇదియే దినము. ఇదియే సమయము. తనయొక్క శ్రీమతి. యేసుక్రీస్తును బయటకు పిలిచి, ఆమెతో మాట్లాడి మరియు, “నేను ఎన్నుకున్నది నిన్నే. నేను ప్రేమించుచున్నది నిన్నే. నీవు నాయొక్క పరిపూర్ణ వాక్యపు కన్యక వధువైయున్నావు. మనము ఒక్కటైయున్నాము,” అని ఆమెతో చెప్పడానికి దేవుడు తనయొక్క బలమైన పక్షిరాజును భూమి మీదకు పంపించాడు.

కేవలం ఆ మాటలు వినడంతోనే, మన హృదయములు ఆనందముతో గంతులు వేస్తాయి. ప్రపంచమంతటిలో, మిలియన్లు మరియు మిలియన్ల కొలది ప్రజలు ఉండగా, ఒకే ఒక్క శ్రీమతి. యేసుక్రీస్తు ఉన్నది, మరియు ఆయన ఎవరికొరకైతే వస్తున్నాడో, అట్టి ఆమె మీరేయైయున్నారు అనేది ఆలోచించడానికే ఎలాగున్నది కదా.

ఎన్నుకోబడిన ఆరాధనా స్థలము ఒకే ఒక్కటి ఉన్నది. ఎన్నుకోబడిన పరిపూర్ణమైన వర్తమానము ఒకే ఒక్కటి ఉన్నది. ఎన్నుకోబడిన ఒకే ఒక్క పరిపూర్ణమైన వధువు ఉన్నది…మరియు అది మనమేయైయున్నాము!!

తండ్రి ఎన్నుకున్న ఒకే ఒక్క ఆరాధనా స్థలమును కలిగియున్నాడు, అది ప్రభువైన యేసుక్రీస్తుయైయున్నాడు; ఆయన వాక్యమైయున్నాడు. ఈ రోజు, ఆత్మసంబంధమైన మరణము తాకలేని స్థలము ఒకే ఒక్కటి ఉన్నది: అది వాక్యమైయున్నది. వాక్యమును మరణము తాకలేదు, ఎందుకనగా అది దేవునియొక్క సజీవ వాక్యమైయున్నది.

ఆ సజీవ వాక్యముయొక్క సంపూర్ణ ప్రత్యక్షత శ్రీమతి. యేసుక్రీస్తుకు మాత్రమే బయలుపరచబడినది. ఎక్కడికైతే శ్రీమతి. యేసుక్రీస్తు వెళ్ళి మరియు పరిపూర్ణ వాక్యము పలుకబడుటను వినగలదో అట్టి స్థలము ఒకే ఒక్కటి ఉన్నది. దేవునియొక్క స్వరముగా ఉండుటకు ఎన్నుకోబడిన ప్రవక్త ఒకే ఒక్కడు ఉన్నాడు. శ్రీమతి. యేసు వెళ్ళి మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును వినగల స్థలము ఒకే ఒక్కటి ఉన్నది: అది ప్లే ను నొక్కడమేయైయున్నది.

అస్తమయ కాలమున వెలుగు కలుగును, ఆరాధించడానికి దేవుడు ఎన్నుకున్న ఒకే ఒక్క స్థలము. ఓ, ఈ వర్తమానము ఎందుకు వచ్చినది, ఆయన ఏమి చేయబోతున్నాడు? మరియు ఆయన దినములో అస్తమయ కాలమున వెలుగు కలుగును, మరియు (ఏమిటి?) అరణ్యముగుండా ఇశ్రాయేలీయులను నడిపించిన అదే అగ్నిస్తంభము యొక్క సూచన ద్వారా, ఆయనయొక్క పిల్లలను తిరిగి గృహమునకు అసలైన వాగ్దాన దేశమునకు స్వాగతించుటకైయున్నది.

ఆమె భర్తయొక్క స్వరము ఆమెతో మాట్లాడుటను వినుచు మరియు వెంబడించడానికి ఆయనయొక్క వధువు ఎంత జాగ్రతగా ఉండవలసియున్నది కదా. మనము ఎక్కడికైతే వెళ్ళి మరియు 100% నిశ్చయతను కలిగియుండగలమో అట్టి స్థలము ఒకే ఒక్కటి ఉన్నది. మనము మన నిత్యమైన గమ్యమును ఆధారము చేసుకున్నట్టి స్వరము ఒకే ఒక్కటి ఉన్నది.

శ్రీమతి. యేసుక్రీస్తు తాను టేపులలో వింటున్న మాటలు ఆమె భర్తయొక్క మాటలని నమ్ముతుంది. ఆయనయొక్క మాటలకు ఎటువంటి అనువాదము అవసరంలేదని ఆమె నమ్ముతుంది. కావున, తాను ఎక్కడికైతే వెళ్ళి మరియు ప్రతీ మాటకు ఆమేన్ చెప్పగలదో అట్టి ఏర్పాటుచేయబడిన స్థలము ఒకే ఒక్కటి ఉన్నదని, అది టేపులలో ఉన్న ఆమె భర్తయొక్క స్వరమని ఆమె నమ్ముతుంది.

మరొకసారి, ప్రపంచమంతటి నుండి, శ్రీమతి. యేసుక్రీస్తు, ఇట్లు చెప్పగలదు, “ఈ దినము, ఈ పలుకబడిన వాక్యము, నెరవేరుచున్నది”.

ప్రియమైన దేవా, ఆ దిగువున టూసాన్ ఎడారులలో, ఇంకా క్యాలిఫోర్నియాలో, పైన నవాడాలో మరియు ఐడహోలో, ఆ తూర్పు ప్రాంతమున మరియు చుట్టుప్రక్కల, దిగువున టెక్సాస్ లో; ఈ ఆహ్వానము ఇవ్వబడుతుండగా, ప్రజలు చిన్న సంఘములలో, పెట్రోల్ బంకులలో, గృహములలో కూర్చొని, వింటున్నారు.

దేవుడు తన వధువుతో మాట్లాడుతూ: "దేవుడు ఎన్నుకున్న ఆరాధనా స్థలము" 65-0220 అనే వర్తమానమును పలుకడాన్ని మేము వినుచుండగా, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా, మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, మీరు బ్రెన్హామ్ టెబర్నికల్ తో కలిసి వినడానికి ఆహ్వానించబడుతున్నారు.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

లేఖనములు: ద్వితియోపదేశకాండము16:1 to 3.