ఆదివారం
07 సెప్టెంబర్ 2025
63-0630M
The Third Exodus
కూటము ఇంత సమయంలో ప్రారంభమగును:
0
రోజులు
19
గంటలు
40
నిమిషాలు
35
క్షణములు

Sun Apr 26, 2020 10:00 AM EDT

ప్రియమైన మూడవ నిర్గమ వధువా,

మీరు ఆత్మసంబంధమైన నేత్రమును కలిగిలేనియెడల, మీకు అది అర్థం కాదు. అయితే అది లేఖనముతో ఖచ్చితంగా సరితూగుతున్నది గనుక ఆత్మసంబంధమైన కన్ను దేవుని శక్తి కదలాడుటను చూడగలదు. అది వాక్యమైయున్నది, మరియు దేవుని వాక్యము ఎన్నడూ మారదు. ఆయన ఆదిలో ఏమి చేసాడో, ఆయన ఇప్పుడు కూడా దానినే చేస్తున్నాడు మరియు ఆత్మసంబంధమైన కన్ను దానిని చూస్తుంది, దానిని నమ్ముతుంది, మరియు దానిని వింటుంది.

ఈ దినమనకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గము ఏదని నేను నమ్ముతున్నానో దాని విషయములో లోకము నాతో విబేధించవచ్చును: మీరు వినవలసిన అత్యంత ముఖ్యమైన స్వరము టేపులలో ఉన్న దేవుని స్వరమే. మీ సంఘములలో మీరు టేపులను తప్పక ప్లే చేయాలి, అయితే ఒకవేళ మీరు నిజంగా ఈ వర్తమానమును నమ్ముచున్నట్లైతే, అప్పుడు దేవుని ప్రవక్త చెప్తున్నవాటితో మీరు విబేధించలేరు.

రాత్రివేళ కురిసి, రాబోయే దినమంతా వారిని పోషించే మన్నాను పొందుకోడానికి హెబ్రీ పిల్లలు చేసినట్లే ఈ ఆదివారము మనము కూడివస్తాము. త్వరలో రాబోయే మన నిర్గమము కొరకు మనకు బలమును ఇచ్చే మన ఆత్మీయ మన్నా కొరకు మనము కూడివస్తాము.

స్వయంగా తానే, తన గురించి దానిని చెప్పడానికి, దేవునియొక్క స్వరమునకు అనుమతించడం కంటే శ్రేష్ఠమైన ఏ మార్గము లేదు, మరియు మనము వినబోయే ఈ వర్తమానము నిండియున్నది!

దేవుడు అరణ్యములో ఒక మనుష్యుడిని పట్టుకున్నాడు, అతనికి తర్ఫీదు ఇచ్చాడు. మరియు అతణ్ణి వెనుకకు తీసుకొనివచ్చాడు, మరియు ఆ కార్యమును స్వాధీనములోకి తీసుకున్నాడు, మరియు ఆ ప్రజలను బయటకు తీసుకొనివచ్చాడు. నా భావమేమిటో చూస్తున్నారా? ఆయన తన ప్రణాళికను మార్చుకోలేడు. ఆయన దేవుడైయున్నాడు.

కాబట్టి ఆయన తన ప్రణాళికను ఎన్నడూ మార్చుకోడని ఆయన ఇక్కడ స్పష్టంగా మనకు చెప్తున్నాడు. ఆదినుండి ఆయన ఏమి చేసాడో, అంతమున ఆయన మరలా దానినే చేస్తాడని, ఆయన వాగ్దానం చేశాడు. కావున అప్పుడు ఆయనయొక్క ప్రణాళిక ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకోవలసియున్నాము ఎందుకనగా ఇప్పుడు కూడా అది అదే ప్రణాళికయై యుంటుంది.

ఆయన ఒక గుంపుతో ఎన్నడూ వ్యవహరించడు. ఆయన ఎన్నడూ వ్యవహరించలేదు. ఆయన ఒక్క వ్యక్తితో వ్యవహరిస్తాడు; మరియు ఆయన వ్యవహరించాడు, మరియు ఆయన వ్యవహరిస్తాడు. ఆయన దానిని చేస్తాడని, మలాకీ 4 లో కూడా, ఆయన వాగ్దానము చేశాడు.

ఆయన ఒక గుంపుతో ఎన్నడూ వ్యవహరించడు. కావున, మలాకీ 4 ప్రకారముగా, మన దినములో ఆయన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతో ఒక్క వ్యక్తిని పంపిస్తాడని, ఆయన వాగ్దానము చేశాడు.

అది నిజము. కావున ఆయన ఏమైయున్నాడు, అనే వాగ్దానము; ఆయన ఏమి చేస్తానని చెప్పాడో ఆ వాగ్దానము అక్కడున్నవి, మరియు ఇదిగో మనము అక్కడే ఉన్నాము. మనము, ఎంత సంతోషముగా ఉండవలసిన, ప్రజలమైయున్నామో; ఆయనయొక్క వాగ్దానము చేయబడిన వాక్యపు సూచన ద్వారా, వాగ్దాన వాక్యము ద్వారా, వారికి సూచనను ఇస్తున్నాడు. ఆయన దానిని చేస్తాడని ఆయన వాగ్దానము చేశాడు.

అప్పట్లో ఆయనయొక్క వధువును ఎలా నడిపించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు?

దేవుడు ఎన్నుకున్నాడు, నిర్గమపు దినములలో, ఆయన ఒక గుంపును బయటకు పిలిచాడు. మరియు ఆ గుంపులోనుండి, మీరు ఒక విషయమును గమనించాలని నేను కోరుతున్నాను, వాగ్దాన దేశమునకు వెళ్ళిన ఇద్దరిని మాత్రమే ఆయన కలిగియున్నాడు. వారిని దేని ద్వారా బయటకు తీయాలని ఆయన ఎన్నుకున్నాడు?

ఇదిగో అది ఇక్కడున్నది. ఆత్మసంబంధమైన మనస్సు దీనిని గ్రహించడం చాలా ముఖ్యమైయున్నది. వధువును ఎలా నడిపించి మరియు వాగ్దాన దేశమునకు ఎలా తీసుకెళ్ళాలని దేవుడు నిర్ణయించాడు?

రాజకీయము ద్వారానా? సంఘసంస్థ ద్వారానా? ప్రజలు పొరబడకుండునట్లు, అగ్నిస్తంభము అనే ఒక సహజాతీతమైన సూచనను కలిగిన, ఒక ప్రవక్తను ఆయన ఎన్నుకున్నాడు. ఆ ప్రవక్త చెప్పినది సత్యమైయున్నది. మరియు దేవుడు, ఒక అగ్నిస్తంభములో దిగి వచ్చి, మరియు తననుతాను నిర్ధారించుకొని, తన వాక్యమును చూపించుకున్నాడు. అది సరియేనా? ఆ విధంగానే, ఆయన తన మొదటి నిర్గమమును జరిగించాడు. తన రెండవ నిర్గమము…

కావున, ప్రజలు పొరబడకూడదని నిశ్చయంగా చూసుకొనుటకు, వారియొక్క గొప్ప నిర్గమము కొరకు అగ్నిస్తంభము అనే ఒక సహజాతీతమైన సూచనతో ఒక ప్రవక్తను ఆయన వారికి పంపించాడు.

మొదటి నిర్గమములో, ఆయన ఏమి చేశాడు? అగ్నిస్తంభముతో అభిషేకించబడిన, ఒక ప్రవక్తను ఆయన పంపించాడు, మరియు ఆయన ఆ ప్రజలను బయటకు పిలిచాడు. అది ఆయనయొక్క మొదటి నిర్గమమైయున్నది…

రెండవ నిర్గమము, అభిషేకించబడిన, ఒక ప్రవక్తను ఆయన తీసుకొనివచ్చాడు, మరి ఆయన తన కుమారుడైయున్నాడు, దైవ-ప్రవక్తయైయున్నాడు. ఆయన ఒక ప్రవక్తయైయుంటాడని మోషే చెప్పాడు; మరియు అగ్నిస్తంభమును కలిగియున్నాడు, మరియు సూచక క్రియలను మరియు అద్భుతాలను చేశాడు…

మరియు అంత్య దినములలోని నిర్గమములో ఆయన ఇక్కడ అదే కార్యమును వాగ్దానము చేశాడు, మరియు ఆయన దానిని మార్చలేడు…

అవును, వధువును బయటకు పిలవడానికి ఆయన ఒక ప్రవక్తను పంపించాడు, కానీ ఇప్పుడు పరిచర్య ద్వారా పరిశుద్ధాత్మ వధువును నడిపిస్తాడు అని చెప్తూ అనేకులు ఏకీభవిస్తారు; కానీ ఆయన దానిని చెప్పలేదు…మనము చదవడాన్ని కొనసాగించుదాము.

గమనించండి వారిని బయటకు పిలచిన అగ్నిస్తంభము, ఒక ప్రవక్తయొక్క అభిషేకము క్రింద, వారిని వాగ్దాన దేశములోనికి నడిపించినది. వారు చూడగలిగేటటువంటి ఒక అగ్నిస్తంభము, అభిషేకించబడిన ప్రవక్త క్రింద, వారిని వాగ్దాన దేశమునకు నడిపించినది. మరియు వారు స్థిరముగా అతడిని తిరస్కరించారు. అది నిజమేనా? నిశ్చయంగా.

ఇదే అగ్నిస్తంభము మరలా ప్రజలను ఒక వాగ్దాన దేశమునకు, వెయ్యేండ్లపాలనలోనికి నడిపించుచున్నది.

అగ్నిస్తంభము, దేవునియొక్క నాయకత్వము క్రింద…దేవుడు అగ్నియైయున్నాడు, మరియు అగ్నిస్తంభము ప్రవక్తను మాత్రమే అభిషేకించినది. మోషే బయటకు పిలువబడినాడనుటకు ఒక పరలోకపు సాక్ష్యముగా నిలువడానికి అగ్నిస్తంభము ఉన్నది

ఇప్పుడు, గుర్తుంచుకోండి, మోషే అగ్నిస్తంభము కాదు. ఆ అగ్నిస్తంభము క్రింద, అతడు అభిషేకించబడిన నాయకుడైయున్నాడు, మరియు అగ్నిస్తంభము కేవలం సూచక క్రియలతో మరియు అద్భుతములతో అతని వర్తమానమును నిర్ధారించినది.

స్నేహితులారా, ఎటువంటి పొరపాటు లేదు. అది నేను చెప్తున్నది కాదు; నేను కేవలం మీ సహోదరుడనైయున్నాను. కానీ దేవుడు మీకు ఋజువుచేస్తున్న విషయమే, దానిని సత్యముగా స్థిరపరచుచున్నది. మిగతా రెండిటికీ ఆయన ఉపయోగించిన అదే అగ్నిస్తంభము, దానిని ఆయన ఈ రోజు మీ మధ్యకు తీసుకొనివచ్చాడు, మరియు విజ్ఞాశాస్త్రముచేత దానిని ఋజువుచేశాడు.

దేవుడు తన ప్రణాళికను ఎన్నడూ మార్చడు. ఈ దినమున దేవుడు తన వధువు కొరకు ఒక ఏర్పాటు చేయబడిన మార్గమును కలిగియున్నాడు: అగ్నిస్తంభము, దేవునియొక్క నాయకత్వము క్రింద…దేవుడు అగ్నియైయున్నాడు, మరియు అగ్నిస్తంభము ప్రవక్తను మాత్రమే అభిషేకించినది.

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ను కలిగియున్న, ఒకే ఒక్క స్వరము ఉన్నది, ఒకే ఒక్క ప్రవక్త ఉన్నాడు, ఆయనే విలియమ్ మారియన్ బ్రెన్హామ్. అతడు అగ్నిస్తంభము కాదు, కానీ అతడు ఆ అగ్నిస్తంభము క్రింద అభిషేకించబడిన నాయకుడైయున్నాడు,

మనమందరము దేవునియొక్క పరిపూర్ణ చిత్తములో ఉండాలని కోరుతాము. ఆయనయొక్క వాక్యమే ఆయనయొక్క పరిపూర్ణ చిత్తమైయున్నది. మన దినమునకై నిర్ధారించబడిన వాక్యము ఈ వర్తమానమేయై యున్నది. ఆయనయొక్క వధువును నడిపించడానికి ఆయనయొక్క ప్రవక్త ఎన్నుకోబడ్డాడు. మీరు దానిని నమ్మకపోతే, మీరు ఆయనయొక్క వధువైయ్యుండలేరు.

ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా, మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు మేము: తృతీయ నిర్గమము 63-0630M ను వినుచుండగా, వచ్చి మరియు మాతో కలిసి దేవునియొక్క పరిపూర్ణమైన వాక్యమును వినడం ద్వారా మన గొప్ప నిర్గమము కొరకు సిద్ధపడండి.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్