ఆదివారం
08 జూన్ 2025
62-1014E
మార్గదర్శి

గుమిగూడుతున్న ప్రియమైన వధువా,

ఇప్పుడు దేవుడెల్లప్పుడూ తన మార్గదర్శులను పంపించాడు, కాలములన్నిటిలోను, ఆయన ఒక మార్గదర్శి లేకుండా ఎన్నడూ లేడు. అన్ని కాలములలోను, ఈ భూమి మీద తనకు ప్రాతినిధ్యం వహించినట్టి ఎవరో ఒకరిని దేవుడు ఎల్లప్పుడూ కలిగియున్నాడు.

మనం మన అవగాహన మీద గానీ లేదా ఎటువంటి మానవ-కల్పిత ఆలోచనల మీద గానీ ఆధారపడాలని దేవుడు కోరడంలేదు. అందునుబట్టియే ఆయన తన వధువు కొరకు ఒక మార్గదర్శిని పంపిస్తాడు; ఏలయనగా అతడు ఎలా వెళ్ళాలి మరియు ఏమి చేయాలి అనే అవగాహనను కలిగియుంటాడు. దేవుడు తన ప్రణాళికను ఎన్నడూ మార్చుకోలేదు. ఆయన తన ప్రజల వద్దకు ఒక మార్గదర్శిని పంపడంలో ఎన్నడూ విఫలమవ్వలేదు, అయితే మీరు ఆ మార్గదర్శిని స్వీకరించవలసియున్నారు.

ఆయన తన మార్గదర్శి ద్వారా చెప్పే ప్రతీ మాటను మీరు నమ్మవలసియున్నారు. ఆయనయొక్క మార్గదర్శి వెళ్ళమని చెప్పే దారిలో మీరు వెళ్ళవలసియున్నారు. మీకు మార్గదర్శిగా మీరు ఇతర స్వరములను వింటూ మరియు నమ్ముతూ ఉన్నట్లైతే, మీరు కేవలం తప్పిపోబోవుచున్నారు.

ఆయన మనతో చెప్పడానికి మరియు మనకు బయలుపరచడానికి ఆయన అనేక సంగతులను కలిగియున్నాడని, తద్వారా మనకు మార్గదర్శకత్వము చేయడానికి మరియు మనకు చెప్పడానికి ఆయన తన పరిశుద్ధాత్మను పంపుతాడని, పరిశుద్ధ. యోహాను 16 చెప్పుచున్నది. ప్రతీ కాలమునకు పరిశుద్ధాత్మయే ప్రవక్తయైన మార్గదర్శియని ఆయన చెప్పాడు. తద్వారా, ఆయనయొక్క వధువును నడిపించుటకై పరిశుద్ధాత్మకు ప్రతినిధులుగా ఉండటానికి ఆయనయొక్క ప్రవక్తలు పంపబడినారు.

ఏదో ఒక గుంపు వ్యక్తులను కాదు గానీ, సంఘమును నడిపించడానికి పరిశుద్ధాత్మ పంపబడ్డాడు. పరిశుద్ధాత్మయే సమస్త-జ్ఞానమైయున్నాడు. మనుష్యులు బిగుసుకుపోయిన వారిగాను, నిర్లక్ష్యవైఖరి గలవారిగాను మారతారు.

విషయం మనిషి కాదు గానీ, ఆ మనిషి లోపల ఉన్న పరిశుద్ధాత్మయే. తనకు ప్రాతినిథ్యం వహిస్తూ మరియు మనయొక్క పరలోక మార్గదర్శిచేత నడిపించబడుతూ భూమి మీద మనకు మార్గదర్శిగా ఉండుటకు ఆయన ఎన్నుకున్న మనిషియైయున్నాడు. మనం ఆ మార్గదర్శిని వెంబడించాలని వాక్యము మనకు చెప్తున్నది. మనం ఏమి తలంచినప్పటికినీ, ఏది హేతుబద్ధంగా అనిపించినప్పటికినీ, లేదా ఇతరులు ఏమీ చెప్పినప్పటికినీ, దానిని ఉపదేశించుటకు మనము బాధ్యులము కాము, మార్గదర్శి మాత్రమే దానిని చేస్తాడు.

దేవుడు ఒక మార్గదర్శిని పంపిస్తాడు, మరియు అతడు ఆయనచేత నియమింపబడిన మార్గదర్శి అనే విషయమును మీరు గుర్తుంచుకోవాలని దేవుడు కోరుతున్నాడు.

ఆయనయొక్క వాక్యమును పలుకడానికి మన ప్రవక్తయైన మార్గదర్శి దేవునిచేత నియమించబడ్డాడు. ఆయన మాట దేవుని మాటయైయున్నది. ప్రవక్తయైన మార్గదర్శి, మరి అతడు మాత్రమే, వాక్యముయొక్క దైవీకమైన అనువాదమును కలిగియున్నాడు. దేవుడు ఆయనయొక్క వాక్యమును నేరుగా అతనితో మాట్లాడినాడు. అందునుబట్టి, మీ మార్గదర్శియొక్క మాటతో మీరెన్నడూ వివాదించలేరు, దానిని మార్చలేరు, లేదా హేతువాదము చేయలేరు.

మీరు ఆయనను, మరియు ఆయనను మాత్రమే వెంబడించవలసియున్నారు. మీరు వెంబడించకపోతే, మీరు తప్పిపోతారు. గుర్తుంచుకోండి, మీరు అతడిని, అనగా దేవుడు నియమించిన మార్గదర్శిని విడిచిపెట్టినప్పుడు, మీరు మీయంతట మీరే వెళ్తున్నారు, కావున మనము ఆయన ఎన్నుకున్న మార్గదర్శికి దగ్గరగా ఉండి, మరియు ఆయన అతనిగుండా చెప్పే ప్రతీ మాటను విని మరియు దానికి విధేయులమవ్వగోరుతున్నాము.

పాత నిబంధన క్రొత్త నిబంధనకు ఛాయ అయ్యున్నదని మన మార్గదర్శి మనకు బోధించినాడు.

నిర్గమకాండము 13:21 లో, ఇశ్రాయేలు వాగ్దాన దేశము కొరకు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు, వారు ఇదివరకెన్నడూ ఆ మార్గముగుండా ప్రయాణించలేదని దేవుడు ఎరిగియున్నాడు. అది నలభై మైళ్ళ దూరం మాత్రమే ఉన్నది, కానీ అయినను వారితో వెళ్ళడానికి వారికి ఒకటి అవసరమైనది. వారు మార్గమును తప్పిపోతారు. కావున, ఆయన, అనగా దేవుడు, వారికి ఒక మార్గదర్శిని పంపించాడు. నిర్గమకాండము 13:21, ఈ విధంగా ఉంటుంది, “మిమ్మల్ని మార్గములో ఉంచడానికి, నేను మీకు ముందు నా దూతను, అగ్నిస్థంభమును పంపిస్తున్నాను,” వారిని ఈ వాగ్దాన దేశమునకు నడిపించడానికైయున్నది. మరియు ఇశ్రాయేలీయులు ఆ మార్గదర్శిని, (రాత్రివేళ) అగ్నిస్తంభమును, పగటివేళ మేఘస్తంభమును వెంబడించారు. అది ఆగినప్పుడు, వారు ఆగిపోయారు. అది ప్రయాణమైనప్పుడు, వారు ప్రయాణమయ్యారు. మరియు ఆయన వారిని దేశమునకు సమీపముగా తీసుకొనివచ్చినప్పుడు, మరియు వెళ్ళడానికి వారు తగిన స్థితిలో లేనప్పుడు, ఆయన వారిని మరలా తిరిగి అరణ్యములోనికి నడిపించాడు.

అది ఈనాడు సంఘమని ఆయన చెప్పాడు. మనము కేవలం మనల్ని మనం సరిచేసుకొని మరియు క్రమపరచుకున్నట్లైతే మనము ఈపాటికి వెళ్ళియుండేవారము, అయితే ఆయన మనల్ని చుట్టూరా తిప్పి నడిపించాల్సివస్తుంది.

వారియొక్క మార్గదర్శి అగ్నిస్తంభమును వెంబడించి మరియు దానినుండి వినినట్లే వారు కూడా కేవలం అతడిని వెంబడించవలసియున్నారు. దేవుడు చెప్పినదానినే అతడు వారికి చెప్పాడు మరియు అతడు చెప్పిన ప్రతీ మాటకు వారు విధేయులవ్వవలసి యున్నారు. ఆయన మార్గదర్శియొక్క స్వరమైయున్నాడు. కానీ వారు దేవుడు నియమించిన మార్గదర్శిని ప్రశ్నించి మరియు అతనితో వాదించారు, తద్వారా వారు 40 సంవత్సరాలు అరణ్యములోనే తిరుగులాడారు.

మోషే దినములలో ఎంతో మంది సేవకులున్నారు. మోషే ఒక్కడే మొత్తం చేయలేడు గనుక, ప్రజలకు సహాయము చేయడానికి దేవుడు వారిని నియమించాడు. అయితే మోషే ఏమీ చెప్పాడో ప్రజలకు తిరిగి దానిని చూపించడమే వారి పనైయున్నది. ఆ మనుష్యులు పలికిన దేనిని కూడా బైబిలు గ్రంథము చెప్పడంలేదు, మోషే పలికినది ప్రజలను నడిపించుట కొరకైన వాక్యమయ్యున్నదని మాత్రమే అది చెప్తుంది.

దేవుడు మోషేను రంగము మీద నుండి తీసివేసినప్పుడు, ప్రజలను నడిపించడానికి యెహోషువా అభిషేకించబడినాడు, అది ఈనాడు పరిశుద్ధాత్మను సూచిస్తుంది. యెహోషువ క్రొత్తది ఏమీయు బోధించలేదు, లేదా అతడు మోషే స్థానమును తీసుకోవడానికైనా ప్రయత్నించలేదు, లేదా అతడు మార్గదర్శి చెప్పినదానిని అనువదించడానికైనా ప్రయత్నించలేదు; అతడు కేవలం మోషే చెప్పినదానిని చదివి మరియు ప్రజలకు, “వాక్యముతో నిలిచియుండండి. మోషే చెప్పినదానితో నిలిచియుండండి,” అని చెప్పాడు. అతడు మోషే చెప్పినదానిని మాత్రమే చదివాడు.

ఈ రోజుకు అది ఎటువంటి ఒక పరిపూర్ణమైన మాదిరిగా ఉన్నది కదా. దేవుడు ఒక అగ్నిస్తంభము చేత మోషేని నిర్ధారించాడు. మన ప్రవక్త కూడా అదే అగ్నిస్తంభము చేత నిర్ధారించబడ్డాడు. మోషే పలికిన మాటలు దేవునియొక్క వాక్యమైయున్నది మరియు అది మందసములో పెట్టబడినది. మన దినములో దేవునియొక్క ప్రవక్త పలికాడు మరియు అది టేపులో పెట్టబడినది.

మోషే రంగము మీదనుండి తీసివేయబడినప్పుడు, మోషే పలికిన మాటలను వారి యెదుట ఉంచుట ద్వారా ప్రజలను నడిపించడానికి యెహోషువ నియమించబడ్డాడు. దేవునియొక్క మార్గదర్శి పలికిన ప్రతీ మాటను నమ్మి మరియు దానితో నిలిచియుండమని అతడు వారికి చెప్పాడు.

యెహోషువా ఎల్లప్పుడూ మోషే వ్రాసినదానిని గ్రంథపు చుట్టలలో నుండి ఉన్నది ఉన్నట్లుగా చదివాడు. అతడు ఎల్లప్పుడూ వాక్యమునే వారి యెదుట ఉంచాడు. మన దినము కొరకైన వాక్యము వ్రాయబడలేదు, కానీ పరిశుద్ధాత్మ ఆయనయొక్క వధువును, ప్లేను నొక్కడం ద్వారా ఆయన పలికినదానిని ఉన్నది ఉన్నట్లుగా వినులాగున చేయగలుగుటకు అది రికార్డు చేయబడినది.

దేవుడు ఎన్నడూ తన ప్రణాళికను మార్చుకోడు. ఆయనే మన మార్గదర్శియైయున్నాడు. ఆయన స్వరమే ఈనాడు ఆయనయొక్క వధువుకు మార్గదర్శకత్వము చేస్తూ మరియు ఆమెను ఐక్యపరచుచున్నది. మన మార్గదర్శియొక్క స్వరము అగ్నిస్తంభము ద్వారా మనల్ని నడిపిస్తుండగా మనము దానిని మాత్రమే వినగోరుతున్నాము. ఇది క్రీస్తు వధువుయొక్క అదృశ్యమైన ఐక్యతయైయున్నది. మనము ఆయన స్వరమును ఎరిగియున్నాము.

మన మార్గదర్శి ప్రసంగవేదిక మీదకు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ అతడిని తాకుతాడు మరప్పుడు అది ఇక ఎంతమాత్రము అతడు కాదు గాని, అది మన మార్గదర్శియైయున్నాడు. అతడు తన తలను పైకెత్తి మరియు ఇట్లు కేక వేస్తాడు, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు!” మరియు ప్రపంచవ్యాప్తంగానున్న క్రీస్తుయొక్క వధువు నేరుగా అతనియొద్దకు వస్తుంది. ఎందుకని? ఆయన మాట్లాడేదానిని బట్టి మనము మన నాయకుణ్ణి ఎరిగియున్నాము.

మన మార్గదర్శి = వాక్యము
వాక్యము = ప్రవక్త యొద్దకు వస్తుంది
ప్రవక్త = దేవునియొక్క ఏకైక దైవీకమైన అనువాదకుడు; భూమి మీదనున్న ఆయనయొక్క మార్గదర్శి.

వాక్యము వెనుక నిలిచియుండండి! ఓ, అవును, అయ్యా! ఆ మార్గదర్శితో నిలిచియుండండి. సరిగ్గా దాని వెనుకనే నిలిచియుండండి. దాని ముందుకు రాకండి, మీరు దాని వెనుక నిలిచియుండండి. మీరు దానిని నడిపించకండి, దానినే మిమ్మల్ని నడిపించుటకు అనుమతించండి. దానిని ముందు వెళ్ళనివ్వండి.

మీరు తప్పిపోకూడదనుకుంటే, ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, మన మార్గదర్శి భూమి మీద నియమించబడిన ఆయనయొక్క మార్గదర్శి ద్వారా మాట్లాడుతుండగా వచ్చి ఆయన చెప్పేదానిని వినండి.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

 

వర్తమానము:
62-1014E — ఒక మార్గదర్శి

లేఖనములు:
పరిశుద్ధ. మార్కు 16:15-18
పరిశుద్ధ. యోహాను 1:1 / 16:7-15
అపొస్తలులు కార్యములు 2:38
ఎఫెసీ 4:11-13 / 4:30
హెబ్రీ 4:12
2 పేతురు 1:21
నిర్గమకాండము 13:21