
ప్రియమైన అయ్యలారా,
ఇది, సూచనయైయున్నది. ఇది, సమయమైయున్నది. ఇది, వర్తమానమైయున్నది. ఇది, వాక్యమైయున్నది. ఇది, దేవుని స్వరమైయున్నది. ఇది, మనుష్యకుమారుడై యున్నాడు. ఇది, దేవుడు ఏర్పాటు చేసిన మార్గమైయున్నది. ఇది, కాలముయొక్క ముగింపైయున్నది.
మనమిప్పుడు జీవిస్తున్నటువంటి కాలములో, ఏ ప్రవక్త, ఏ అపొస్తలుడు, ఎన్నడూ, ఏ సమయములోను జీవించలేదు. ఇది ఆకాశములలో వ్రాయబడినది, ఇది భూమి మీద వ్రాయబడినది. ఇది ప్రతీ వార్తాపత్రికలో వ్రాయబడినది. మీరు గనుక చేతివ్రాతను చదవగలిగితే, ఇది అంతమైయున్నది.
దేవుడు మాట్లాడి, రికార్డు చేపించినదానిని, చెవిగలవాడు వినును గాక, తద్వారా అది నా మాట, నా తలంపులు, నా ఆలోచన కాకుండా, ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఆయనయొక్క ఏకైక పరిపూర్ణమైన మార్గమేదని తన వధువునకు సూచనలిస్తున్న దేవుని స్వరమైయ్యుంటుంది.
ఆయన మనతో మాట్లాడి మరియు లేఖనముల ద్వారా, దర్శనముల ద్వారా, కలలయొక్క అనువాదము ద్వారా, వర్తమానముతో నిలిచియుండమని, టేపులతో నిలిచియుండమని చెప్తుండగా వచ్చి వినండి. టేపులలో ఉన్నదానిని మాత్రమే చెప్పండి అని చెప్తుండగా వచ్చి వినండి.
దేవునియొక్క స్వరమును స్వయంగా దేవుని యొద్దనుండే వినడం కంటే, మరి శ్రేష్ఠమైన మార్గము, లేదా మరి నిశ్చయమైన మార్గము ఏదియు లేదు. దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడి మరియు ప్లేను నొక్కుము, అంతే, అని మనకు చెప్పడం ద్వారా తన వధువునకు ఆజ్ఞాపించాడు.
దానిని పలకండి, దానిని ప్రకటించండి, దాని గురించి సాక్ష్యమివ్వండి, మరియు లోకానికి దాని గురించి చెప్పండి, అయితే వధువును పరిపూర్ణము చేయుటకు ఏర్పాటు చేయబడిన పరిపూర్ణమైన మార్గము ఒకే ఒక్కటి ఉన్నదని ఆయన మనకు చెప్తున్నాడు: అదేమిటనగా టేపులలో ఉన్న దేవుని స్వరమును వినడమే. మీకు ఏదైనా చిక్కుముడిలాగా ఉన్నయెడల, టేపును ప్లే చేయండి. అదియే మీరు వినవలసిన మొట్టమొదటి, ప్రాముఖ్యమైన స్వరమైయుండవలసి యున్నది. అది ఆయన టేపులో పెట్టినట్టి ఆయనయొక్క పరిపూర్ణమైన వాక్యమైయున్నది.
ఇప్పుడు దానిని ఆ ఇతరమైనవాటితో, ఆ కలలతో కూడా పోల్చండి. ఇది ఒక దర్శనమైయున్నది. ఆ ఆహారము, అది ఇక్కడే ఉన్నది. ఇదియే ఆ స్థలమైయున్నది.
వినండి, కలలు మరియు దర్శనముల ప్రకారంగా, వధువు కొరకైన ఆహారము ఎక్కడున్నది? ఆ స్థలము ఎక్కడున్నది? వధువు కొరకైన వర్తమానము టేపులలో ఉన్నది.
మరియు ఇది నాకు, గృహమువలె అనిపిస్తుంది. ఇదియే ఆ స్థలమైయున్నది. మరియు మీరు గమనించినట్లైతే, ఆహారము ఎక్కడున్నదనే విషయమై, ఆ కలలు కూడా అదే సంగతిని పలికాయి, చూడండి.
మనకు అది ఖచ్చితంగా అర్థమవ్వడానికి, టేపులే వధువు కొరకైన ఆహారమైయున్నవని, ఆయన మరొకసారి మనకు చెప్తున్నాడు.
“సమయము ఇక లేదు.” అది అలాగైతే, స్నేహితులారా, మన దేవుడిని కలుసుకోడానికి, మనల్ని మనము సిద్ధపరచుకుందాము.
అవును, ప్రభువా, నిన్ను కలుసుకోడానికి సిద్ధంగా ఉండటము, నీ వధువుగా ఉండటము, అదియే మా హృదయ వాంఛయైయున్నది. ప్రభువా మేము ఏమి చేయాలి? నీవు ఏర్పాటు చేసిన మార్గమేది? నీ ప్రణాళిక ఏమిటి? నీయొక్క పరిపూర్ణమైన మార్గమేమిటి? మాకు బోధపరచడానికి నీవు అతని గుండా మాట్లాడగలుగునట్లు నీవు మాకై ఒక ప్రవక్తను పంపించావు. దయచేసి మాకు సూచనలను ఇవ్వుము.
ఇప్పుడు విస్తారమైన ఆహారము ఉంచబడియున్నది. మనము దానిని ఉపయోగించుకుందాము. ఇప్పుడే మనము దానిని ఉపయోగించుకుందాము.
ఎవరైనా అసలు ఎలా అంధులు కాగలరు? ఏమి చేయాలో ఆయన మనకు చెప్తున్నాడు: టేపులలో భద్రపరచ-బడిన విస్తారమైన ఆహారము ఉన్నది; ఇప్పుడే వాటిని ఉపయోగించుకోండి. ఇదియే ఆయనయొక్క వధువునకు దేవునియొక్క సూచనైయున్నది.
మీరు ఈ వర్తమానము నమ్ముతున్నారని మీరు చెప్పుకుంటున్నయెడల, విలియమ్ మారియన్ బ్రెన్హామ్ గారు వధువును బయటకు పిలవడానికి పంపబడిన దేవునియొక్క ప్రవక్తయైన వర్తమానికుడని నమ్ముతున్నారనియు; తన గురించి లేఖనములు చెప్పినదానంతటినీ తన జీవితం నెరవేర్చిందని; ఈ దినమునకై అది దేవునియొక్క స్వరమని మీరు నమ్ముతున్నారనియు చెప్పుకుంటున్నయెడల, అటువంటప్పుడు ఆయన; అనగా దేవుడు, ఆయనయొక్క ప్రవక్తగుండా మాట్లాడుతూ, ఏమి చేయాలి అనేది తన వధువునకు స్పష్టమైన ఆంగ్లములో చెప్తున్నాడు.
మనము టేపులను మాత్రమే వింటున్న కారణంగా, మనల్ని ఎగతాళి చేసినను, హింసించినను, మరియు తక్కువగా చూసినను, ఏమి చేయవలెనని ఆయన మనకు చెప్పాడో మనము సరిగ్గా దానినే చేస్తున్నాము. ప్రభువా ప్రత్యక్ష్యత కొరకై నీకు కృతఙ్ఞతలు.
ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు మేము: “అయ్యా, ఇది అంతమునకు సూచనా?” అనుదానిని వింటుండగా ప్రపంచము మాతో చేరవలెనని నేను ఆహ్వానించగోరుచున్నాను. మనము దేనిని వింటామంటే:
ఉరుములు, ఏడు ముద్రలు, పిరమిడ్ బండ, ఆత్మీయ ఆహారము, నిత్యత్వము, దూతల సమూహము, నా ప్రధాన కార్యాలయము, దర్శనము, కలలు, ప్రవచనము, దాచబడిన మర్మములు, లేఖనము వెంబడి లేఖనమును వింటాము.
దేవుని స్వరమును విని మరియు దానికి లోబడుటకంటే మరి గొప్పదేదియు ఈ జీవితములో లేదు.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
లేఖనములు:
మలాకీ 4వ అధ్యాయము
పరిశుద్ధ మత్తయి 13:3-50
రోమా 9:33 / 11:25 / 16:25
1 కొరింథీ 14:8 / 15వ అధ్యాయము
గలతీ 2:20
ఎఫెసీ 3:1-11 / 6:19/ 5:28-32
కొలస్సీ 4:3
1 థెస్సలొనీకయులకు 4:14-17
1 తిమోతి 3:16
హెబ్రీ 13:8
2 పేతురు 2:6
ప్రకటన 1:20 / 3:14 / 5:1 / 6:1 / 10:1-7 / 17వ అధ్యాయము