
టేపును వినే ప్రియమైన వారలారా,
Q: మనము టేపును ప్లే చేయుటద్వారా ఆయనయొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉన్నామా?
A: అవును.
Q: టేపులలో చెప్పబడినదాని కంటే వధువుకు ఇంకా ఎక్కువైనది అవసరమా?
A: లేదు.
Q: టేపులను మాత్రమే వినుటద్వారా మనము దేనినైనా కోల్పోతున్నామా?
A: లేదు.
Q: టేపులను మాత్రమే వినుటద్వారా మనము వధువుగా ఉండగలమా?
A: ఎంతో దృఢమైన, అవును!
ఇప్పుడు గుర్తుంచుకోండి, “బయలుపరచబడటానికి ఏమియు లేదు; మొదటిగా, తన సేవకులైన ప్రవక్తలకు దానిని బయలుపరచకుండా, అసలు, దేవుడు ఏమియు చేయడు.”
అందునుబట్టి, మనకు అవసరమైనది అంతా పలుకబడి మరియు ఆ టేపులలో ఉన్నది; లేదా, ఆయనయొక్క ఏడవ దూత భూమి మీదికి తిరిగి వచ్చినప్పుడు, అప్పుడు ఆయన మనకు చెప్తాడు.
ఓ వధువా, ప్రపంచమంతటా క్రీస్తుయొక్క వధువుతో ఏమి జరుగుతుందో మనము ఊహించుదాము. తండ్రి ఆయనయొక్క స్వరముతో తన వధువును సమకూర్చుచున్నాడు మరియు, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు” అని ఉరుముతున్నాడు.
గుర్తుంచుకోండి, ఆ ఉరుములు ఏమిటన్నది ఆయన మనకు చెప్పాడు: “ఒక పెద్ద ఉరుమువంటి శబ్ధము దేవునియొక్క స్వరమైయున్నది”. మరియు వధువునకు దేవునియొక్క స్వరము అనగా ఏమిటి? దేవునియొక్క ఏడవ దూత వర్తమానికుడైన, విలియమ్ మారియన్ బ్రెన్హామే.
అసలు వ్రాయబడనటువంటి ఏడు మర్మయుక్తమైన ఉరుములు వచ్చుచున్నవని ఆయన చెప్పాడు. మరియు ఆ ఏడు ఉరుముల ద్వారా, అది ఎత్తబడు విశ్వాసమునకై వధువును సమకూర్చుతుంది అని చెప్పాడు.
దేవుని వాక్యము ఆయనయొక్క ప్రవక్తల వద్దకు వస్తుంది. అంతకన్నా మంచి విధానము ఆయన కలిగియున్నయెడల, ఆయన దానిని ఉపయోగించేవాడే. ఆరంభములోనే ఆయన ఉత్తమమైన విధానమును ఎన్నుకున్నాడు, మరియు ఆయన మార్చలేడు, మరియు మార్చడు.
కావున, ఆయనయొక్క ఏడవ దూత ద్వారా మాట్లాడుతున్న, దేవుని స్వరము, ఆయనయొక్క వధువును సమకూర్చుతూ మరియు మనకు ఎత్తబడు విశ్వాసమును ఇచ్చుచున్నది.
విలియమ్ మారియన్ బ్రెన్హామ్, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,” అని ఉరుముతున్న దేవునియొక్క స్వరమైయున్నాడని, మరియు వధువును పిలిచి, సమకూర్చి, మరియు నడిపించడానికి పిలువబడ్డాడు అనే విషయమై, 1933 లో, ఆ నది వద్ద ఆ దినము నుండి సంఘము ఎన్నడూ సందేహపడలేదు.
మన ప్రభువు ఆ గ్రంథమును తెరచి, ముద్రను చీల్చి, మరియు మనకు దానిని బయలుపరచుటకై, దానిని భూమి మీదకు, ఆయనయొక్క ఏడవ దూత వద్దకు పంపుతుండగా, ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, వచ్చి మాతో కలిసి వినడానికి మిమ్మల్ని ఆహ్వానించుటకు నేను ఇష్టపడుతున్నాను!
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
తేదీ: ఆదివారము, మార్చి 23, 2025
వర్తమానము: రెండవ ముద్ర 63-0319
సమయము: 12:00 P.M., జఫర్సన్విల్ కాలమానం
వర్తమానమును వినడానికి ముందు చదువవలసిన లేఖనములు:
పరిశుద్ధ. మత్తయి 4:8 / 11:25-26 / 24:6
పరిశుద్ధ. మార్కు 16:16
పరిశుద్ధ. యోహాను 14:12
2 థెస్సలొనిక 2:3
హెబ్రీ 4:12
ప్రకటన 2:6 / 6:3-4 / 17వ అధ్యాయము / 19:11-16
యోవేలు 2:25
ఆమోసు 3:6-7