Sun Apr 26, 2020 10:00 AM EDT
ప్రియమైన అపురూపమైన వధువా,
ఘడియ మించిపోయినది. సమయం ఆసన్నమైనది. తప్పక నిర్ణయము తీసుకోబడవలసియున్నది. దేవుడు తన పిల్లలను హెచ్చరిస్తున్నాడు. ప్రభువైన మన దేవుడు ఆయనయొక్క వాక్యము ద్వారా, మరియు ఆయనయొక్క ఆత్మ ద్వారా సత్యము ఏమిటన్నదానిని మనకు ప్రకటించాడు మరియు నిర్ధారించాడు. శక్తిచేత కాదు, బలముచేత కాదు, కానీ నా ఆత్మచేతనైయున్నది, మరియు నీ వాక్యమే సత్యమైయున్నది.
యేసుక్రీస్తు నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటేరీతిగా ఉన్నాడని ఆయన తన వధువుకు క్షుణ్ణంగా నిర్ధారించాడు. ఈ ఘడియయొక్క వర్తమానము మరియు వర్తమానికుడు ఒక్కటేనని ఆయన మనకు చూపించి మరియు బయలుపరిచాడు. వాక్యములో దాచబడియున్న మర్మములన్నిటినీ ఆయన మనకు బయలుపరిచాడు. ఆయనయొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనకు దానిని ఋజువుచేశాడు. మన మనస్సులలో, హృదయములలో లేదా అంతరాత్మలలో ఒక్క ప్రశ్నయైనా లేదు. టేపులలో ఉన్న ఆయనయొక్క స్వరము ఆయనయొక్క వధువునకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నది.
దేవుడు తన వద్దకు రావడానికి ఎల్లప్పుడూ అనేక మార్గములను అనుమతించాడు. ఆయన తన అనుమతిపూర్వకమైన చిత్తమును తన పరిపూర్ణమైన చిత్తములోనికి పనిచేసేవిధంగా చేస్తాడు. అయితే ఆయన ఎల్లప్పుడూ ఆయనయొక్క పిల్లల కోసం ఒక పరిపూర్ణమైన చిత్తమును మరియు పరిపూర్ణమైన మార్గమును కూడా ఏర్పాటుచేశాడు. అది ఆయనయొక్క పరిపూర్ణమైన చిత్తము కాకపోయినా అనేకులు దేవునికి ఒక సేవచేయడం ద్వారా వేరొక మార్గములో రావడానికి ప్రయత్నిస్తారు. అది చూడటానికి మరియు వినడానికి ఆయనయొక్క పరిపూర్ణమైన చిత్తములాగా అనిపించవచ్చును, కానీ అది వాక్య ప్రకారముగా ఉండదు.
చివరికి ఒక గొప్ప వ్యక్తి, తాజాగా అభిషేకించబడినవాడు, సాక్షాత్తు దేవుని సన్నిధినుండే వస్తున్నవాడు, దేవుని కొరకు ఒక కార్యమును చేయాలని ప్రత్యక్షత పొందుకున్నాడు, మరియు దేవుని కొరకు దానిని చేయగోరాడు; కానీ అతడు కలిగియున్న ప్రత్యక్షత తప్పైయున్నది.
మనలో ప్రతియొక్కరమూ ఆయనచేత ఏర్పాటుచేయబడిన పరిపూర్ణమైన మార్గమును కనుగొనవలసియున్నాము. నిజముగా అభిషేకించబడి, సాక్షాత్తు దేవుని సన్నిధినుండే తాజాగా వస్తూ, ఒక ప్రత్యక్షత కలిగియున్న ఒక వ్యక్తియే, దేవునియొక్క పరిపూర్ణమైన చిత్తములో లేనప్పుడు, మనము ఆయనయొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉన్నామా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది?
దానిని ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఒకేఒక్క మార్గమున్నది, మరియు దేవుడు ఆ మార్గమును తన వధువు కొరకు ఏర్పాటుచేశాడు.
స్వయంగా దేవునియొక్క స్వరమే ఈ సంఘమునకు, మరియు టేపులలో వింటున్న మీ అందరికీ, మరియు అప్పుడును ఇప్పుడును, ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రాంతములలో అనుసంధానము ద్వారా వింటున్న ప్రజలకు దీనిని చెప్పినది. ఆయన చెప్పేదానిని చాలా జాగ్రత్తగా వినమని, మరియు దానిని అస్సలు తప్పిపోవద్దని ఆయన మనకు చెప్పాడు.
ఆ ప్రకారమే నేను, యేసుక్రీస్తు నామములో దీనిని చెప్తున్నాను: మీరు ఒక్కదానినైనా కలపకండి, తీసివేయకండి, మీ స్వంత ఆలోచనలను దానిలో పెట్టకండి, ప్రభువైన దేవుడు ఏమి చేయమని ఆజ్ఞాపించాడో సరిగ్గా దానినే మీరు చేయండి, దానికి ఏదీ కలపకండి!
ప్రసంగించేవారు వాక్యమును ప్రసంగించకూడదని, బోధకులు వాక్యమును బోధించకూడదని, లేదా సంఘకాపరులు లేక ప్రవక్తలు తాము దేనిని చేయడానికి పిలివబడ్డారో దానిని చేయకూడదని ఆయన చెప్పలేదు, మరియు దాని భావము అది కాదు; వారు దానిని చేయవలసియున్నారు, నేను దానిని చేయవలసియున్నాను. దానిని చేయడానికి మనము పిలువబడి మరియు నియమించబడ్డాము. అయితే మనము ప్రజలకు ఈ వర్తమానమును మరియు వర్తమానికుణ్ణి చూపించవలసియున్నాము మరియు నొక్కిచెప్పవలసియున్నాము, ఏలయనగా ఇది మన దినము కొరకైన వాక్యమైయున్నది.
అయితే మనమందరమూ ఒక నిజమైన అభిషేకముతో, అభిషేకించబడి, ఆయనయొక్క పరిశుద్ధాత్మతో, ఒక తాజా ప్రత్యక్షతతో నింపబడి, మరియు ఆయనయొక్క చిత్తమునకు వెలుపల ఉండటమనేది జరుగగలదని ఆయన మనకు స్పష్టంగా చెప్తున్నాడు. మన దినములో, మనము స్వయంగా దేవునియొద్ద నుండి వస్తున్న దేవుని స్వరమును వింటున్నామని ఖచ్చితంగా ఎరిగియుండుటకు ఆయన ఒక పరిపూర్ణమైన మార్గమును ఏర్పాటుచేశాడు. అదియే ఏకైక పరిపూర్ణమైన మార్గమైయున్నది.
పరిచర్యవారు కేవలం ఈ వర్తమానమును నొక్కిచెప్పి మరియు ప్రసంగించడం మాత్రమే కాదుగానీ, మనము టేపులలో ఉన్న దేవుని స్వరమును ప్రజల కొరకు ప్లే చేయవలసియున్నాము. దేవుని స్వరమును వినడంకంటే మరింత గొప్ప అభిషేకము ఏదియు లేదు. మనము వినేది ఖచ్చితంగా దేవుడు మాట్లాడినదే అని ఒక్క సందేహపు ఛాయయైనా లేకుండా తెలుసుకోడానికి వేరే ఏ మార్గము లేదు.
మీరు గనుక ఆయనయొక్క ముందుగా నిర్ణయించబడిన వధువైయ్యుంటే, దానిని తప్పిపోవుటను అసాధ్యముగా చేయునట్టి ఒక మార్గమును, ప్రపంచ చరిత్రలో ఏ దినమున లేనట్లుగా, ఈ దినములో దేవుడు ఏర్పాటుచేశాడు. అది స్వయంగా దేవునియొక్క స్వరమే నేరుగా తన సంఘముతో మాట్లాడుటయైయున్నదని స్వయంగా అగ్నిస్తంభముచేత నిర్ధారించబడి మరియు బయలుపరచబడినది.
వేలకొలది సంవత్సరాలుగా, దేవుని పిల్లలు స్వయంగా తామే దేవుని స్వరమును వినాలని పరితపించారు మరియు ఆకలిగొన్నారు. ఆ కొండ మీద యేసు వేలకొలది మందికి బోధించినప్పుడు తాము అక్కడ ఉండియుంటే బాగుండునని వారు ఎంతగానో కోరుకున్నారు. ఆయన ఏ విధంగా తన వాక్యమును ప్రేమతోనూ కనికరముతోనూ మాట్లాడినాడో వినగోరినారు. ఆయన ప్రతీ మాటను ఏ విధంగా నొక్కిచెప్పాడో వినగోరినారు. అది మాట్లాడి మరియు ఏ విధంగా వారి హృదయములను ప్రోత్సాహపరుస్తుందో వినగోరినారు.
ఇప్పుడు మనము సజీవులమైయుండి మరియు దేవుని సన్నిధిలో దేవుని స్వరమును వినుచున్నాము.
అతి త్వరలో ఒకానొక దినమున మనమిక ఇటువంటి జీవితమునకు ఎన్నడూ తిరిగిరాము. మనము ఒక అమర్త్యమైన జీవిగా తిరిగివస్తాము. పాపము ఇక ఉండదు. వెయ్యి సంవత్సరాలు సాతానుడు బంధించబడియుంటాడు మరియు ప్రభువైన మన దేవుడు మనకు అనుగ్రహించినట్టి ఈ భూమి మీద మనము జీవిస్తాము.
మనము 100% పరిపూర్ణులమైయున్నాము. మనము ఇంతకంటే సంతోషముగా మరియు ఇంతకంటే తిరుగులేనివారిగా ముందెన్నడూ లేము. మనము ఆయనతోను ఆయనయొక్క వాక్యముతోను ఒక్కటైయున్నాము. మనము ఆయనయొక్క వాక్యమైయున్నాము. ఆయనయొక్క స్వరముతో, ఆయనయొక్క వాక్యముతో నిలిచియుండటం ద్వారా మనము ఆయనయొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉన్నాము. మనల్ని ఆయనతో కూడ తీసుకెళ్ళడానికి ఇప్పుడు ఆయన ఏ రోజైనా తిరిగివస్తాడు.
ప్రభువైన యేసూ నీకు కృతజ్ఞతలు!
సత్యమేమిటో ప్రభువైన మీ దేవుడు మీకు ప్రకటించాడు. సత్యము ఏమిటో, ప్రభువైన మీ దేవుడు ఆయనయొక్క వాక్యము ద్వారా మరియు ఆయనయొక్క ఆత్మ ద్వారా నిర్ధారించాడు. “శక్తిచేత కాదు, బలముచేత కాదు, కానీ నా ఆత్మ ద్వారానే జరుగును.” మరియు, ఆ ఆత్మ, “దేవుడు ఆత్మతోను, సత్యముతోను ఆయనను ఆరాధించేవారిని వెదకుతాడు.” “నీ వాక్యమే సత్యము.” మరియు యేసుక్రీస్తు నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటేరీతిగా ఉన్నాడని ఆయన క్షుణ్ణంగా ఋజువుచేశాడు. సాయంకాలపు విత్తనాలను ఆయన మీకు చూపించాడు. వాక్యములో, ఆయన దానిని మీకు బయలుపరిచాడు. ఆయన తన ఆత్మచేత, దానిని మీకు ఋజువుచేశాడు.
ఆయనయొక్క స్వరము ఆయనయొక్క ఏడవ దూత వర్తమానికునిగుండా మాట్లాడి మరియు మనకు: దేవుని చిత్తము కాకుండా దేవునికి ఒక సేవ చేయడానికి ప్రయత్నించుట 65-0718M అనే వర్తమానమును అందించడాన్ని వినడానికి, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు ప్రపంచవ్యాప్తంగా మేము ఐక్యమవుతుండగా వచ్చి మాతో చేరమని మీలో ప్రతీ ఒక్కరిని నేను నా హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానము వినడానికి ముందు చదువవలసిన లేఖనములు:
ద్వితియోపదేశకాండము 4:1-4 / 4:25-26
1 దినవృత్తాంతములు 13
1 దినవృత్తాంతములు 15:15
కీర్తనలు 22
పరిశుద్ధ. మార్కు 7:7
యోవేలు 2:28
ఆమోసు 3:7
మాలాకి 3
పరిశుద్ధ. మత్తయి 11:1-15
1 కొరింథీ 13:1