ఆదివారం
22 జూన్ 2025
65-1126
విశ్వాసము తెలియపరచబడుటయే క్రియలు

ప్రియమైన శరీరధారియైన వాక్యమా,

హల్లెలూయ! వాక్యమును వినుట ద్వారా మన హృదయ గర్భము సిద్ధపరచబడినది మరియు మనము క్రీస్తుయొక్క గుణవతియైన వధువైయున్నామని అది మనకు బయలుపరచినది; ప్రశస్తమైనవాడును, యోగ్యుడునైన, పాపములేని దేవుని కుమారుడు, నిష్కల్మషమైనదియు, ఆయన స్వంత రక్తపు నీటితో కడుగబడినదియునైన, సంకరము లేని వాక్య-వధువుతో నిలబడియున్నాడు.

మనము ప్రత్యక్షపరచబడినట్టి శరీరధారియైన వాక్యమైనాము, తద్వారా జగత్తుపునాది వేయబడకముందే ఆయన ముందుగా ఏర్పరచుకున్నటువంటి మనలను, యేసు, తండ్రియొక్క రొమ్మునకు తీసుకొనివెళ్ళుటకైయున్నది.

మనము ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి మరియు మనము ఆయనయొక్క నిర్ధారించబడిన వాక్యముయొక్క నిజమైన ప్రత్యక్షతను దేవుని యొద్దనుండి పొందుకొనియున్నామని వ్యక్తపరచుటను బట్టి, మరియు మనము భయము లేనివారిగా ఉండుటను బట్టి, లోకము మన విశ్వాసముయొక్క భావవ్యక్తీకరణను చూడగలదు. ప్రపంచమంతా ఏమి చెప్తుందో లేదా దేనిని నమ్ముతుందో మనము లెక్కచేయము…మనము భయము లేనివారిగా ఉన్నాము. ప్లే ను నొక్కడమే యేసుక్రీస్తు యొక్క వధువునకు దేవుడు ఏర్పాటుచేసిన మార్గమైయున్నది.

తాము ఈ అంత్య-కాల వర్తమానమును నమ్ముతున్నారని చెప్పే అనేకులు ఉన్నారు, దేవుడు ఒక ప్రవక్తను పంపించాడని వారు నమ్ముతారు, విలియమ్ మారియన్ బ్రెన్హామ్ గారు ఏడవ దూత వర్తమానికుడని వారు నమ్ముతారు, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నే ఆయన పలికాడని వారు నమ్ముతారు, కానీ ఆ స్వరమే మీరు వినవలసిన అత్యంత ముఖ్యమైన స్వరమైయున్నదని వారు నమ్మరు. విఫలమవ్వజాలని మాటలను ఆయన పలికాడని వారు నమ్మరు. వారి సంఘములలో టేపులను ప్లే చేయాలన్నది వారు నమ్మరు.

దాని అర్థం ఏమిటి? అది వారికి బయలుపరచబడలేదని దాని అర్థము!

అది ఒక ప్రత్యక్షతైయున్నది. ఆయనయొక్క కృపచేత ఆయన దానిని మీకు బయలుపరిచాడు. అది మీరు చేసినదేదీ కాదు. మిమ్మల్ని మీరు విశ్వాసములోనికి తెచ్చుకోలేదు. మీరెన్నడైనా విశ్వాసమును కలిగియుంటే, దేవునియొక్క కృప ద్వారానే అది మీకు ఇవ్వబడినది. మరియు దేవుడే దానిని మీకు బయలుపరుస్తాడు, కావున విశ్వాసమనేది ఒక ప్రత్యక్షతైయున్నది. మరియు దేవునియొక్క సంఘమంతయు ప్రత్యక్షత మీదనే కట్టబడినది.

ఈ వర్తమానము, యేసుక్రీస్తు యొక్క వధువును పోషించుటకై మరియు పరిపూర్ణము చేయుటకై రికార్డు చేయబడి, మరియు భద్రపరచబడిన టేపులలో ఉన్నట్టి దేవునియొక్క స్వరమైయున్నదని, విశ్వాసము ద్వారా మనకు బయలుపరచబడినది.

అది దేవుడు సత్యము అని చెప్పినదానిలోగల నిజమైన, సంకరములేని విశ్వాసమైయున్నది. మరియు అది మన హృదయములో మరియు అంతరాత్మలో లంగరు వేయబడియున్నది మరియు దానిని కదల్చునది ఏదియు లేదు. ఆయనయొక్క ప్రవక్త మనల్ని మన ప్రభువునకు పరిచయం చేసేవరకు అది సరిగ్గా అక్కడే ఉండబోవుచున్నది.

మనంతట మనము ఏమియు చేయలేము. దానిని స్వీకరించి మరియు దానిని నమ్మడానికై జగత్తుపునాది వేయబడకముందే ఆయన మనల్ని సిద్ధపరిచాడు. ఈ కాలములో మనము ఆయనయొక్క స్వరమును స్వీకరిస్తామని ఆయన ఎరిగియున్నాడు. ఆయన మనల్ని ముందుగా ఎరిగియుండి మరియు స్వీకరించడానికి మనల్ని నియమించాడు.

పిదప, ఎన్నడూ విఫలము కానటువంటి ఈ దర్శనముల ద్వారా, ఎన్నడూ విఫలము కానటువంటి వాగ్దానముల ద్వారా, పరిశుద్ధాత్మ ఈనాడు చేయుచున్న కార్యములు, బైబిలు గ్రంథములో వాగ్దానము చేయబడిన అపొస్తలుల సూచలనలన్నీ, మలాకీ 4, మరియు, ఓ, ప్రకటన 10:7, అవన్నియు నెరవేర్చబడుచున్నవి; మరియు విజ్ఞానశాస్త్రపరముగాను, ప్రతి ఇతర విధానములోను ఋజువుచేయబడుచున్నవి. మరియు నేను మీకు సత్యమును చెప్పనియెడల, ఈ కార్యములు జరిగేవి కావు. అయితే నేను మీకు సత్యమును చెప్పియున్నయెడల, నేను మీకు సత్యమును చెప్పియున్నానని అవియే సాక్ష్యమిస్తాయి. ఆయన ఇంకను నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు, మరియు ఆయనయొక్క ఆత్మ ప్రత్యక్షపరచబడుటయే వధువును పట్టుకొనిపోవుచున్నది. “ఇదియే ఆ ఘడియ అయ్యున్నది” అనే ఆ విశ్వాసమును, ప్రత్యక్షతను, మీ హృదయములో పడనివ్వండి.

ఇదియే ఘడియ అయ్యున్నది. ఇదియే వర్తమానమైయున్నది. ఇదియే యేసుక్రీస్తు యొక్క వధువును పిలచుచున్న దేవుని స్వరమైయున్నది. ఓ సంఘమా, విశ్వాసమును కలిగియుండుటకై దేవుడు మీ హృదయ గర్భములను సిద్ధపరచును గాక మరియు టేపులలో ఉన్న ఈ స్వరమును వినడమే, యేసుక్రీస్తు యొక్క వధువును పరిపూర్ణము చేసి మరియు ఐక్యపరుస్తుందని, మీకు బయలుపరచును గాక.

ఆయనయొక్క త్వరితమైన రాకడ కొరకు దేవునియొక్క స్వరము మనల్ని సిద్ధపరచుటను మేము వినుచుండగా మీ విశ్వాసమును ఎత్తైన స్థలములకు తీసుకొనివెళ్ళి, మరియు మాతో కలిసి పరలోక స్థలములలో కూర్చొనుటకై, ఆదివారం జఫర్సన్విల్ కాలమానం ప్రకారముగా, మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు వచ్చి మాతో చేరమని నేను మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

మేము మాయొక్క మొదటి స్టిల్ వాటర్స్ క్యాంపును ప్రారంభిస్తుండగా వచ్చే వారం దయచేసి మా కొరకు ప్రార్థనలో ఉండండి.

వర్తమానము: క్రియలనగా విశ్వాసమును వ్యక్తపరచుటయే 65-1126

 

 

చదువవలసిన లేఖనములు:

ఆదికాండము 15:5-6, 22:1-12
అపొస్తలుల కార్యములు 2:17
రోమా 4:1-8, 8:28-34
ఎఫెసీ 1:1-5
యాకోబు 2:21-23
పరిశుద్ధ. యోహాను 1:26, 6:44-46