ఆదివారం
25 అక్టోబర్ 2026
60-0515E
దత్త పుత్రత్వము మొదటి భాగము
కూడిక ఇంత సమయంలో ప్రారంభమవుతుంది:
0
రోజులు
19
గంటలు
40
నిమిషములు
35
క్షణములు

Sun Apr 26, 2020 10:00 AM EDT

క్రీస్తుయేసునందు ప్రియమైన విశ్వాసనీయులారా,

మనము ఎటువంటి ఒక మహిమకరమైన సమయమును కలిగియుంటున్నాము కదా. మనము ఆయనయొక్క స్వరము చుట్టూ ఐక్యమవుతుండగా ప్రతి వారము మనము గొప్ప ఎదురుచూపుతో ఉంటున్నాము. మన ఆత్మసంబంధమైన మనస్సు ఎటువంటి గందరగోళము-లేకుండా ఉన్నది. ఖచ్చితంగా ఆయన ఎవరో మనకు తెలుసు. ఖచ్చితంగా ఆయన ఏమైయున్నాడో మనకు తెలుసు. ఖచ్చితంగా మనము ఎవరమో మనకు తెలుసు; ఆయనతో ఒక్క పెద్ద కుటుంబమైయున్నాము!

“ఆయన మానవుడిని ఒక చిన్న దేవునిగా ఉండుటకు చేశాడు.” ఎందుకంటే ఆయన తండ్రియైన దేవుడైయున్నాడు, మరియు ఆయన మానవుడిని ఒక చిన్న దేవునిగా చేశాడు, తద్వారా ఆయన ఇక ఎంతమాత్రము స్వయంభువుడు కాదు గానీ, ఆయన తన కుటుంబముతో ఉంటున్నాడు. ఎలాహ్, ఎలాహ్, ఎలోహిం. ఇప్పుడు, ఇప్పుడు ఆయన యెహోవా అయ్యున్నాడు. యెహోవా, అంటే అర్థము, “తన కుటుంబముతో ఉన్నవాడు.”

ఆయనయొక్క వధువు కుటుంబము స్వయంగా యెహోవా యొక్క స్వరము చేతనే పరిపూర్ణము చేయబడుతున్నది. మనపై దాడి చేసే ప్రతీ శత్రువుకు వ్యతిరేకముగా ఎలా పోరాడాలి అనేది; ఆయనయొక్క వాక్యము మనలో జీవిస్తూ మరియు నివసిస్తున్నది గనుక, వాక్యముతో మనము ఏ విధంగా వాడిని ఓడించి మరియు జయించగలము అనేది ఆయన మనకు బోధించాడు. “మనము వాక్యమైయున్నాము” అని, ఆయన మనకు మరొకసారి నిశ్చయతనిచ్చాడు. అందునుబట్టి మనము ఆయన నామమున దేనిని అడిగినను, మనము నమ్మినట్లైతే మనము దానిని పొందుకోవచ్చును…మరియు మనము నమ్ముతున్నాము!

మనము ఆయన జీవించునట్టి నివాస స్థలముగా ఉండటానికి పరిపూర్ణమైన పురుషులయొక్క మరియు పరిపూర్ణమైన స్త్రీలయొక్క స్వరూపములుగా ఎలా మారాలి అనేది ఆయన మాట్లాడి మరియు మనకు బయలుపరిచాడు. ఆయనే మన మార్గదర్శియని, మరియు ఆయన తన భూసంబంధమైన దూత మార్గదర్శియైనట్టి విలియమ్ మారియన్ బ్రెన్హామ్ ద్వారా మనల్ని నడిపిస్తూ మరియు మనకు మార్గదర్శకత్వము చేస్తున్నాడని మనకు తెలియజేయడానికి ఆయన తనయొక్క ప్రియమైన వధువును సమకూర్చుటకు ఆయన స్థిరముగా కేక వేశాడు.

ఇప్పుడు ఆయన మనకు ఉపదేశించి మరియు మనకు బయలుపరచాలని కోరుతున్నట్టి మరొక ప్రత్యేకమైన పాఠమును ఆయన కలిగియున్నాడు. మనము ఆయనయొక్క దత్తపుత్రులమని ఆయన ప్రకటించగోరుతున్నాడు. ఆయన నామము ఎంతో ఇక మన నామము అంతే. మనము కనాను నుండి బయటకు వచ్చాము, లోకము నుండి బయటకు వచ్చాము, మరియు ఇప్పుడు కలిసి పరలోకస్థలములలో కూర్చొనియుంటున్నాము, భద్రపరచబడిన, దాచబడిన మన్నాను భుజిస్తున్నాము.

ఇప్పుడు ఆయనయొక్క తదుపరి వర్తమానము కొరకు సిద్ధపడియుండటానికి మనము ఏమి చేయాలి అనేది, మరియు మనము సిద్ధపడియున్నట్లైతే ఏమి జరుగుతుంది అనేది ఆయన మనకు చెప్పబోతున్నాడు.

వర్తమానము కొరకు మనము ప్రార్థించుకొని మరియు సిద్ధంగా ఉండవలసియున్నాము; ఆయనయొక్క స్వరమును వినడానికి మనము పరిశుద్ధులుగా ఏకముగా కూడుకోవలసియున్నాము, పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొంది, దేవునియొక్క ఆశీర్వాదములతో నింపబడవలసియున్నాము; ఎటువంటి దుష్ట ఆలోచనలను కలిగియుండక; ఒకరికొకరు ఎటువంటి విరోధములు కలిగియుండక; ప్రేమా సమాధానములతో మాట్లాడుకొనుచు; ఏకమనస్సుతో, ఒక్క స్థలములో కూడుకొని పరలోకస్థలములలో ఒక పరలోకసంబంధమైన వాతావరణము క్రింద ఉండవలసియున్నాము; మన పాపములన్నీ రక్తము క్రింద ఉండవలసియున్నవి, పరిపూర్ణమైన ఆరాధనలో ఉండవలసియున్నాము; మన చేతులు మరియు మన హృదయములు దేవుని తట్టు ఎత్తబడి, పరలోకస్థలములలో కలిసి ఆరాధిస్తూ ఉండవలసియున్నాము.

మనము ఈ కార్యములను చేసినట్లైతే, ఈ ఆదివారము ఈ విధంగా జరుగుతుంది:

• దైవిక స్వస్థత
• ముందుజ్ఞానము
• ప్రత్యక్ష్యత
• దర్శనములు
• శక్తులు
• భాషలు
• అనువాదములు
• జ్ఞానము
• తెలివి
• పరలోక ఆశీర్వాదములు
• చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషము

ప్రతీ హృదయము ఆత్మతో నింపబడుతుంది. పిదప అకస్మాత్తుగా పరలోకము నుండి బలముగా వీచు బలమైన గాలివంటి ఒక శబ్దము వస్తుంది మరియు ఆత్మసంబంధమైన ఆశీర్వాదములన్నిటితో ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు.

ఈ ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా, మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు జరుగబోతున్నది అదేయైయున్నది, ఎక్కడైతే దేవునియొక్క స్వరమును వినడానికి వధువు ఏక మనస్సుతో, ఒక్క చోట ఏకముగా కూడుకొని, మన చేతులు మరియు మన హృదయములు దేవుని తట్టుకు ఎత్తబడి, పరలోకపు వాతావరణములో ఏకముగా ఆరాధిస్తూ ఉంటామో అట్టి దేవుడు ఏర్పాటుచేసిన ప్రత్యేకమైన స్థలములో ఆ విధంగా జరుగుతుంది.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

వర్తమానము: పుత్రస్వీకారము #1 60-0515E

లేఖనము:
యోవేలు 2:28
ఎఫెసీ 1:1-5
I కొరింథీ 12:13
I పేతురు 1:20
ప్రకటన 17:8
ప్రకటన 13