ఆదివారం
18 అక్టోబర్ 2026
62-1014E
మార్గదర్శి
కూడిక ఇంత సమయంలో ప్రారంభమవుతుంది:
0
రోజులు
19
గంటలు
40
నిమిషములు
35
క్షణములు

Sun Apr 26, 2020 10:00 AM EDT

ప్రియమైన శక్తికేంద్రమా,

దేవుడు ఆయనయొక్క కుమారుడైన యేసులో, భూమి మీదకు వచ్చినప్పుడు చేసినట్లే, తననుతాను శరీరములో ప్రత్యక్షపరచుకొనునట్లు ఈ అంత్యదినములలో ఒక మార్గదర్శకుడిని పంపిస్తాడని వాగ్దానము చేశాడు. తననుతాను మానవ శరీరములో ప్రత్యక్షపరచుకుంటున్న మనుష్యకుమారుడైయుండునట్టి, ప్రవక్తయైన ఏలీయాను ఆయన పంపిస్తాడని ఆయనయొక్క వాక్యములో ఆయన మనకు చెప్పాడు; ఏలయనగా ఆయన మనకు చెప్పవలసిన సంగతులు మరియు బోధించవలసిన ఇంకా సంగతులు అనేకమైనవి ఉన్నాయి.

ఆయన తనంతటతానే ఏమియు బోధించడు గాని; ఆయన వేటిని వింటాడో, వాటినే బోధిస్తాడు: మరియు సంభవింపబోవు సంగతులను ఆయన మీకు తెలియజేస్తాడు. ఏలయనగా, ఆయన నా వాటిలోనివి తీసుకొని, మరియు వాటిని మీకు తెలియజేస్తాడు గనుక: ఆయన నన్ను మహిమపరుస్తాడు.

ఆయనయొక్క వాక్యమును నెరవేర్చడానికి మరియు మనల్ని వ్యక్తులుగా యేసుక్రీస్తుయొక్క స్వరూపముగా ఉండునట్లు; ప్రతీ శత్రువును ఓడించే ఒక పరిపూర్ణమైన మానవుడిగా ఉండునట్లు, మరియు పరిశుద్ధాత్మ జీవించడానికి ఒక శక్తికేంద్రముగా ఉండునట్లు నిర్మించడానికి ఆయన విలియమ్ మారియన్ బ్రెన్హామ్ ను పంపించాడు.

దేవుడు తన ప్రజలకు ఎల్లప్పుడూ ఒక మార్గదర్శిని పంపడంలో ఎన్నడూ విఫలమవ్వలేదు. కానీ ఆయనయొక్క వధువుగా ఉండుటకు, మీరు ఆ మార్గదర్శిని అంగీకరించవలసియున్నారు. మీరు దానిని నమ్మవలసియున్నారు. ఆయన చెప్పిన మార్గములో మీరు వెళ్ళవలసియున్నారు లేదంటే మీరు తప్పిపోబోతున్నారు. మనము ఏమి ఆలోచించినా, ఏది ఎంత సమంజసముగా కనిపించినా, లేదా ఏది ఎంత విడ్డూరంగా అనిపించినా లెక్కలేదు, దానిని విశ్లేషించి తీర్పుతీర్చడం మన బాధ్యత కాదు, మార్గదర్శి మాత్రమే దానిని చేయవలసియున్నాడు.

సహోదరుడా జోసఫ్, మాకు మార్గదర్శకత్వము చేయాల్సినది పరిశుద్ధాత్మయైయున్నాడు, బ్రెన్హామ్ సహోదరుడు కాదు, అని మీరంటారు. ఆయన పలికిన మాటలు పరిశుద్ధాత్మయే గాని బ్రెన్హామ్ సహోదరుడు కాదు; అయితే ఆయనలో పరిశుద్ధాత్మను ప్రత్యక్షపరచి, మరియు మన భూలోకపు మార్గదర్శిగా ఉండటానికి దేవునిచేత ఎన్నుకోబడినది ఆయనేయైయున్నాడు.

మరియు ఇప్పుడు ఆయన ఎల్లప్పుడూ తన మార్గదర్శకులను పంపించాడు, కాలములన్నిటిగుండా, ఎల్లప్పుడూ ఆయన ఒక మార్గదర్శిని కలిగిలేకుండా ఎన్నడూ లేడు. కాలములన్నిటిలోను, దేవుడు ఎల్లప్పుడూ ఈ భూమి మీద తనకు ప్రాతినిథ్యం వహించే ఎవరో ఒకరిని కలిగియున్నాడు.

ఇక్కడ భూమి మీద ఆయనకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆ భూలోకపు మార్గదర్శి ఎవరో మనము గుర్తించాలి; అక్కడే ఆయన వాక్యముయొక్క నిజమైన ప్రత్యక్షత ఉంటుంది.

ఆయనయొక్క వధువును నడిపించడానికి తండ్రి పంపినట్టి ప్రధాన మార్గదర్శకుడు పరిశుద్ధాత్మయే అని మనకు తెలుసు, కానీ స్వయంగా తనకు ప్రాతినిధ్యం వహించి మరియు తన వధువును నడిపించడానికి మార్గదర్శిగా ఉండుటకు ఆయన ఎల్లప్పుడూ ఒక మానవుడిని పంపిస్తాడని దేవుడు చెప్పాడు.

కొర్నేలీ సంఘములను నిర్మించినటువంటి ఒక గొప్ప గౌరవప్రదమైన వ్యక్తి అని మన మార్గదర్శి మనకు చెప్పాడు. అతడు ధర్మకార్యములను చేశాడు మరియు అనుదినము ప్రార్థించాడు. కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మాత్రం, అతనికి ఒక మార్గదర్శి అవసరమయ్యాడు.

దేవుడు అతనికి పరిశుద్ధాత్మను పంపించాడు. ఆయన దానిని పేతురు అనే వ్యక్తిలో పంపించాడు, “ఏలయనగా పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా, పరిశుద్ధాత్మ అతని మీదికి దిగెను.” దేవుడు పేతురు ద్వారా ఆ మార్గదర్శిని వాడుకున్నాడు. ఆయన దానిని వాడుకున్నాడు, ఎందుకంటే ఆయన కొర్నేలును సరియైన మార్గమునకు నడిపించాడు.

పేతురు ఇంక మాట్లాడుచుండగా, పరిశుద్ధాత్మ వారి మీదికి దిగెను. పేతురు ఇట్లన్నాడు,

“వీరు బాప్తిస్మము పొందకుండ, ఎవడైనను నీళ్ళకు ఆటంకము చేయగలడా?” చూడండి, ఇంకను మార్గదర్శియే మాట్లాడుచున్నాడు, పేతురు కాదు.

మనము ఒక మనుష్యునిచేత నడిపించబడటంలేదు; మనము, మన భూలోకపు మార్గదర్శిగా ఉండటానికి దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తిలోనుండి మాట్లాడుతున్న పరిశుద్ధాత్మచేత నడిపించబడుతున్నాము.

ఆయనయొక్క దూత మార్గదర్శిలోనుండి మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ వాక్యమునే పలుకుతాడు. ఆయన మనతో ఇట్లు చెప్పాడు, “నేను మీతో చెప్పవలసినవి ఇనకను అనేక సంగతులు కలవు. ఇప్పుడు మీరు వాటిని గ్రహింపలేరు, అయితే ఆయన వచ్చినప్పుడు, ఆయన మిమ్మల్ని వాటియొద్దకు నడిపిస్తాడు.”

యోహాను ప్రకటన గ్రంథము వ్రాసినప్పుడు అతడు నడిపించబడ్డాడు. అతడు మార్గదర్శిచేత నడిపించబడ్డాడు. “దీని నుండి ఒక్క మాటను తీసివేసినా, లేదా దీనికి ఒక్క మాటను కలిపినా, జీవగ్రంథములోనుండి అతని పాలు తీసివేయబడును,” అని చెప్పడానికి కూడా అతడు నడిపించబడ్డాడు.

మనము టేపులలో ఉన్నదానిని మాత్రమే చెప్పాలని; దానికి దేనిని కలపకూడదని లేదా దానినుండి దేనిని తీసివేయకూడదని చెప్పునట్లు సహోదరుడు బ్రెన్హామ్ గారిని కూడా పరిశుద్ధాత్మ నడిపించాడు. మరియు మనము ఏమి చేయాలని ఆయన మనకు సూచన ఇచ్చాడో దానిని చేయగలుగునట్లు ఆయన మనకు ఒక మార్గమును ఏర్పాటుచేశాడు, ప్లే ను నొక్కడమే.

ఇప్పుడు, మీరు దేవుని వాక్యముయొక్క స్థానములో వేరే దేనినో పెట్టి, మరియు ఇంకను మీరు పరిశుద్ధాత్మచేత నడిపించబడుతున్నారని మీరు ఎలా చెప్పబోతున్నారు.

మనము పరిశుద్ధాత్మచేత నడిపించబడుతున్నాము, ఆయన ఎవరు, ఆయనయొక్క వధువును బయటకు పిలువడానికి ఆయనయొక్క భూలోకపు మార్గదర్శిగా ఆయన ఎవరిని పంపించాడు అనే ప్రత్యక్షతను, మరియు ఇప్పుడు ఆ తలరాయి గురించి: మనము ఎవరము అనే ప్రత్యక్షతను ఆయన మనకు ఇచ్చాడు. వ్యక్తపరచడానికి అది మానవ పదములకు మించిన విషయమైయున్నది.

కేవలం ఈ చివరి కొన్ని వారములలోనే, ఆయన మన కొరకు ఏమి చేశాడో చూడండి. మన యెదుటకు వచ్చే ప్రతీ శత్రువును ఎలా ఓడించాలో ఆయన మనకు నేర్పించాడు; ఏ విధంగా మన విశ్వాసపు ఖడగమును తీసి మరియు ఏ విధంగా వాడిని మరణదెబ్బ కొట్టాలో నేర్పించాడు. మనము దేనికి భయపడాల్సిన అవసరము లేదు. మన యెదుట ఏదీ నిలబడజాలదు.

ఆయనయొక్క వధువు తినడం కొరకు ఆయన ఆహారమును ఎలా భద్రపరిచాడు కదా. ఆయనయొక్క వర్తమానికుడు ఎంతో దూరములో ఉన్నాగాని, మనమింకను లోకమునకు ఏమియు తెలియనటువంటి ఒక మార్గదర్శిని కలిగియున్నాము; అయితే ఆయనయొక్క వధువుకు మాత్రం అది ఋతువునకు తగిన ఆత్మీయ ఆహారమైయున్నది, మనము అనుదినము విందారగిస్తున్న దాచబడిన మన్నాయైయున్నది.

ఆయన మనలో ప్రతియొక్కరిలో జీవించి నివసించునట్లు ఆయన మనల్ని పరిపూర్ణ మానవుని స్వరూపములుగా నిర్మించాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం చేసినట్లే, ఆయనయొక్క భూలోకపు మార్గదర్శిలో జీవిస్తూ మరియు ఆయనలోనుండి మాట్లాడుతూ, మనకు మార్గదర్శిగా ఉండటానికి, ఆయన మనకు తన పరిశుద్ధాత్మను పంపించి మరియు తననుతాను శరీరములో ప్రత్యక్షపరచుకున్నాడు.

మీరు వచ్చి మరియు ఆయనయొక్క “హాంక్-హాంక్, హాంక్-హాంక్!” ను వినాలని నేను మీలో ప్రతియొక్కరిని ఆహ్వానిస్తున్నాను, మరి ఆయనయొక్క వధువు నేరుగా ఆ హాంక్ వద్దకు వస్తుంది. ఆయన, “హాంక్-హాంక్, హాంక్-హాంక్!” అని అంటాడు మరియు ప్రపంచమంతటా ఒక మహా జూబిలీ ఉంటుంది. ఎందుకు? వధువు తమ మార్గదర్శియొక్క స్వరమును ఎరుగును.

మీరు తప్పిపోకూడదు అనుకుంటే, ఈ ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు ఆయనయొక్క నియమించబడిన భూలోకపు మార్గదర్శి ద్వారా మన మార్గదర్శి మాట్లాడుతుండగా వచ్చి వినండి.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

వర్తమానము:

62-1014E — ఒక మార్గదర్శి

 

లేఖనములు:

పరిశుద్ధ. మార్కు 16:15-18
పరిశుద్ధ. యోహాను 1:1 / 16:7-15
అపొస్తలుల కార్యములు 2:38
ఎఫెసీ 4:11-13 / 4:30
హెబ్రీ 4:12
2 పేతురు 1:21
నిర్గమకాండము 13:21