ఆదివారం
06 జులై 2025
65-1127E
నేను వింటిని గాని ఇప్పుడు నేను చూచుచున్నాను

అనుసంధానమైయున్న-ప్రియమైన వధువా,

దేవుడు తన ఏడవ దూత వర్తమానికుని ద్వారా మాట్లాడిన ఈ మాటలు ఇంకను మన ద్వారా, అనగా యేసుక్రీస్తు యొక్క వధువు ద్వారా నెరవేర్చబడుచున్నవి.

సంఘమునకు వెళ్ళుటను నేను నమ్మనియెడల, నేను ఒక సంఘమును ఎందుకు కలిగియున్నాను? మేము వారిని దేశవ్యాప్తంగా అంతటా కలిగియున్నాము, ఈ మధ్యనే ఒక రాత్రి అనుసంధానం అయ్యాము, ప్రతి ఐదువందల మైళ్ళలో నా సంఘమొకటి ఉన్నది.

వారు సంఘములలో ఉన్నారు, గృహములలో ఉన్నారు, చిన్న భవనములలో ఉన్నారు, మరియు చివరికి పెట్రోల్ బంకులలో కూడా ఉన్నారు; అమెరికా అంతటా వ్యాపించియున్నారు, సరిగ్గా వాక్యము బయలువెళ్ళుచున్న అదే సమయములో అందరూ, వినుచూ ఉన్నారు.

మరియు ఈ రోజు, మనము ఇంకను ఆయనయొక్క సంఘములలో ఒకటైయున్నాము. ఆయన ఇంకను మన కాపరియైయున్నాడు. ఆయన వాక్యమునకు ఇంకను ఎటువంటి అనువాదము అవసరంలేదు, మరియు మనము ఇంకను ప్రపంచవ్యాప్తంగా కూడుకొని, అనుసంధానమైయుండి, దేవునియొక్క స్వరము యేసుక్రీస్తు యొక్క వధువును పరిపూర్ణము చేయడాన్ని వినుచున్నాము.

ఈ దినము, ఈ వాక్యము ఇంకను నెరవేర్చబడుచున్నది.

ఆ వెనుక వారు దానిని ఎందుకని చేసారు? సరిగ్గా అప్పుడే వర్తమానమును వినడానికి సంఘకాపరులు ఎందుకని తమ సంఘములను మూసివేసారు? వారు కేవలం టేపులను పొందుకునేంతవరకు వేచియుండి, పిదప తర్వాత స్వయంగా వారే తమ ప్రజలకు ఆ వర్తమానమును బోధించియుండవచ్చును కదా; మరియు ప్రత్యక్షత లేకుండా అనేకులు ఆ విధంగా చేసారని నేను నిశ్చయంగా చెప్పగలను.

లేదా కొందరు తమ సంఘసమాజములతో ఈ విధంగా చెప్పియుండవచ్చును, “ఇప్పుడు వినండి, సహోదరుడు బ్రెన్హామ్ గారు దేవుని ప్రవక్త అని మనము నమ్ముచున్నాము, కానీ మన సంఘములలో మనము ఆయనను వినవలసియున్నామని ఆయన చెప్పలేదు. ఈ ఆదివారము, మరియు ప్రతి ఆదివారము నేనే బోధిస్తాను; కేవలం ఆ టేపులను తెచ్చుకొని మరియు మీ గృహములలో వాటిని వినండి.”

ఇప్పటి వధువువలెనే, అప్పటి వధువు కూడా, ఒక ప్రత్యక్షతను కలిగియుండి, మరియు స్వయంగా తామే నేరుగా దేవుని స్వరమును వినాలనుకున్నారు. దేవుని స్వరము బయలు వెళ్ళుచుండగా దానిని వినడానికి వారు దేశవ్యాప్తంగానున్న వధువుతో ఐక్యమవ్వగోరినారు. వారు ఆయనయొక్క సంఘములలో ఒకదానిగా, గృహముగా, లేదా వారెక్కడున్నను, ఆ వర్తమానముతో, ఆ స్వరముతో గుర్తించబడగోరినారు, మరి ఇప్పుడు, టేపులతో గుర్తించబడగోరుచున్నారు.

ఈ దినము, ఈ వాక్యము ఇంకను నెరవేర్చబడుచున్నది.

వారు/మనము దానిని చూసియుండగా మరియు ఇతరులు ఎందుకని చూడలేడు? దీనిని చూడటానికి, ముందుజ్ఞానముచేత మనము నియమించబడ్డాము. అయితే నియమించబడనివారు, మీరు దానిని ఎన్నడూ చూడరు. గోధుమ దానిని చూచుచున్నది మరియు వేరైపోవడం మొదలుపెట్టినది.

దాని అర్థం మీరు మీ సంఘమునకు వెళ్ళడం ఆపివేయాలని కాదు. లేదా మీ సంఘకాపరి పరిచర్య చేయడం ఆపివేయాలని కూడా దాని అర్థం కాదు. దాని అర్థం కేవలం ఏమిటంటే అనేక పరిచర్యలు మరియు సంఘకాపరులు ముఖ్యమైనదానిని మర్చిపోయారు, మరియు మీరు వినవలసిన అత్యంత ముఖ్యమైన స్వరము టేపులలో ఉన్న దేవుని స్వరమేనని తమ ప్రజలకు చెప్పడంలేదు.

ప్రతి వారములోని ప్రతి రోజు సంఘమునకు వెళ్ళడం మిమ్మల్ని వధువుగా చేయదు; దేవుడు కోరినది అది కాదు. పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు ఆ బోధనను కంఠస్థం చేసుకున్నారు. వారు ప్రతి వాక్యములోని ప్రతి అక్షరమును ఎరిగియున్నారు, కానీ సజీవమైన వాక్యము మానవ శరీరములో సరిగ్గా అక్కడే నిలబడియున్నది, అయితే వారు ఏమి చేసారు? ఈనాడు అనేకమంది అదే కార్యమును చేస్తున్నారు.

వారు ఇట్లంటారు, “ఆయన మాట్లాడుచున్నది సంఘశాఖల గురించియైయున్నది. ప్రసంగించడానికి వారు సహోదరుడు బ్రెన్హామ్ గారిని వారి సంఘములలోనికి అనుమతించరు, కానీ మేమైతే వాక్యమును బోధించి మరియు సరిగ్గా ఆయన చెప్పినదానినే చెప్పుచున్నాము.”

అది అద్భుతము. ప్రభువునకు స్తుతి కలుగును గాక. మీరు చేయవలసినది అదేయైయున్నది. కానీ పిదప, ఈ రోజు అది భిన్నముగా ఉన్నది, మీ సంఘములలో సహోదరుడు బ్రెన్హామ్ గారి టేపులను ప్లే చేయడం తప్పు అని చెప్తారు. మీకు మరియు పరిసయ్యులు, సద్దూకయ్యులు లేదా సంఘశాఖలకు మధ్య ఎటువంటి తేడా లేదు.

మీరు ఒక వేషధారియైయున్నారు.

అప్పటివలెనే, నేరుగా తన సంఘముతో మాట్లాడుటకై లోపలికి వచ్చుటకు ప్రయత్నిస్తూ, ద్వారమునొద్ద నిలబడి తట్టుచున్నది, యేసేయైయున్నాడు, మరియు వారు తమ తలుపులను తెరువరు, మరియు వారి సంఘములలో టేపులను ప్లే చేయరు. “అతడు మా సంఘములోనికి వచ్చి మరియు బోధించడానికి మేము ఒప్పుకోము”.

శత్రువు వాడు బహిర్గతం చేయబడుటను ద్వేశిస్తాడు గనుక వాడు దానిని మలచి మరియు అనేక దిశలలోనికి త్రిప్పబోవుచున్నాడు, కానీ ఏది ఏమైనను, అది సరిగ్గా మన కన్నులయెదుట ప్రత్యక్షపరచబడుచున్నది మరియు అనేకులు విడిచిపెట్టుచున్నారు.

“ఆదియందు” [“వాక్యముండెను,” అని సంఘము చెప్పుచున్నది,—సంపా.] “మరియు వాక్యము” [“దేవుని వద్ద ఉండెను.”] “మరియు వాక్యము” [“దేవుడైయుండెను.”] “మరియు ఆ వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను.” అది సరియేనా? ఇప్పుడు లూకా లో, మలాకీ లో, చెప్పబడిన అదే వాగ్దాన వాక్యము, ఈ దినము కొరకైన ఈ ఇతర వాగ్దానములన్నీ, శరీరధారియై, మన మధ్య నివసించడాన్ని మనము చూచుచున్నాము, మన వినికిడిచేత విన్నదానిని; ఆయన తన స్వంత వాక్యమును అనువదించడాన్ని, ఇప్పుడు (మన కన్నులార) చూచుచున్నాము, మనకు మనుష్యునియొక్క ఏ అనువాదము అవసరములేదు. ఓ జీవముగల దేవుని సంఘమా, ఇక్కడ మరియు ఫోన్లలో వినుచున్నవారలారా, ఎంతో ఆలస్యమైపోకముందే, త్వరగా మేల్కొనండి!

ఆయనయొక్క సమస్త సంఘములారా, దేవుడు ఇప్పుడే మీతో ఏమి చెప్పాడో మీ హృదయములను తెరచి వినండి. ఆయన తన స్వంత వాక్యమును అనువదించడాన్ని, ఇప్పుడు మనం, మన కన్నులార చూచుచున్నాము. మనకు మనుష్యునియొక్క ఏ అనువాదము అవసరంలేదు!! ఎంతో ఆలస్యమైపోకముందే మేల్కొనండి!!

అంత్య దినములలో ఏమి జరుగబోవుచున్నదని ఈ సంగతులను మనము మన జీవితకాలమంతా విన్నాము. మరియు ఇప్పుడు అవి నెరవేరడాన్ని మన కన్నులతో చూస్తున్నాము.

ఒకే ఒక్క మార్గమున్నదని, మరది దేవుడు తన వధువు కొరకు ఏర్పాటుచేసిన మార్గమైయున్నదని ఆయన మనకు చెప్పాడు. మీరు తప్పక టేపులలో ఉన్న దేవుని స్వరముతో నిలిచియుండవలసియున్నారు.

ఈ ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారముగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు వచ్చి మాతో చేరి, మరియు ఈ దినమునకై దేవుడు ఏర్పాటు చేసిన మార్గమును వినమని నేను ప్రపంచమును ఆహ్వానిస్తున్నాను. అప్పుడు మీరు కూడా, “నేను వింటిని కానీ ఇప్పుడు నేను చూచుచున్నాను,” అని చెప్పగలరు.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

వర్తమానము: 65-1127E నేను వింటిని కానీ ఇప్పుడు నేను చూచుచున్నాను

 

 

లేఖనములు

ఆదికాండము 17
నిర్గమకాండము 14:13-16
యోబు 14వ అధ్యాయము మరియు 42:1-5
ఆమోసు 3:7
మార్కు 11:22-26 మరియు 14:3-9
లూకా 17:28-30