ఆదివారం
04 అక్టోబర్ 2026
62-0311
ఏనాడూ పోరాడనటువంటి మహా గొప్ప యుద్ధము
కూడిక ఇంత సమయంలో ప్రారంభమవుతుంది:
0
రోజులు
19
గంటలు
40
నిమిషములు
35
క్షణములు

Sun Apr 26, 2020 10:00 AM EDT

ప్రియమైన మీకాయాలారా,

ఇప్పటివరకు ఎన్నడూ జరగని అతి గొప్ప పోరాటం ఇప్పుడు కార్యరంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉంది. దేవుడు ఆరు వేల సంవత్సరాలకు పైగా తన శ్రేష్ఠమైన సైనికులను ఎంపిక చేస్తూ వచ్చాడు, మరియు ఆయనయొక్క గొప్ప సైన్యంలో ఉండటానికి మీరు ముందుగా నిర్ణయించబడి మరియు ఎన్నుకోబడియున్నారు.

ఆయన మీకు ఆయుధ కవచాన్ని ధరింపజేస్తూ, మరియు మీకు తర్ఫీదును ఇస్తూ ఉన్నాడు, మరి ఇప్పుడు యుద్ధరంగం సిద్ధంగా ఉన్నది, యుద్ధం మొదలవ్వడానికి సమాయత్తమవుతుంది. ఆయన తన మహా సైన్యంలో ఉండటానికి మిమ్మల్ని ఎన్నుకోవడం మాత్రమే కాదు గానీ, తన సైన్యంలో ఒక ప్రవక్తయైన మీకాయావలె ఉండటానికి కూడా ఆయన మిమ్మల్ని ఎంపిక చేశాడు.

సమయం వచ్చియున్నది, ఆ దినము వచ్చియున్నది; మీరు ప్రతీ శత్రువును ఓడించడానికి నేరుగా అగ్నిస్తంభము నుండే తర్ఫీదును పొందుకోబోతున్నారు. ప్రతీ దుష్టాత్మను నాశనం చేయడానికి ఏమి చేయాలి అనేదాని గురించి, మీరు వాక్యము వెంబడి వాక్యముతో, ప్రత్యేకమైన సూచనలను పొందుకోబోతున్నారు. అది మీ ముందుకు వచ్చే ప్రతీ వ్యాధిని మరియు ప్రతీ దయ్యమును ఊడ్చిపారేస్తుంది. ఏదియు మీ మార్గంలో నిలబడలేదు.

ఈ ప్రత్యేకమైన తర్ఫీదు తర్వాత, మీరు ఆయన వాక్యముతో ఎంతగా బలపరచబడతారంటే మీరు ప్రతీ దుష్టత్వమును వెళ్ళగొడతారు. తర్కవితర్కములను పడద్రోస్తారు. మూఢనమ్మకాలను పడద్రోస్తారు. విచారములను పడద్రోస్తారు. వ్యాధులను పడద్రోస్తారు. పాపమును పడద్రోస్తారు. మీరు దానికంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నారని, క్రీస్తుయేసులో పునరుత్థానమయ్యారని, పరలోక స్థలములలో కూర్చున్నారని, ప్రతీ దయ్యము మీ పాదాల క్రింద ఉంచబడిందని మీరు గ్రహిస్తారు. మీరే వాక్యమైయున్నారని మీరు పూర్తిగా గ్రహిస్తారు మరియు నమ్ముతారు.

మీరు దేనిని గమనించుకోవాలని ఆయన మీకు శిక్షణ ఇస్తాడు. మీ ఆయుధము తగినంత బలమైనది కాదని మీ శత్రువు మిమ్మల్ని నమ్మించగలిగితే, వాడు మిమ్మల్ని నిరాయుధులుగా చేస్తాడని, ఆయన మీకు సూచనలు ఇస్తాడు.

అయితే సైనికులారా, మనము మన తర్ఫీదును గుర్తుంచుకుని, మరియు ఆ దయ్యముతో ఇట్లు చెప్తాము: అది మేము కాదు, మేము ఏమియు కాదు. మా ఆయుధము దేవుని వాక్యమైయున్నది మరియు అది ఏ సమయములోనైనా, ఏ స్థలములోనైనా, ప్రతీ దయ్యమును ఓడిస్తుంది, ఎందుకంటే అది ఆయనయొక్క వాక్యమైయున్నది, మరియు ఆయన మాకు తర్ఫీదునిచ్చి మరియు మేము ఇప్పుడు శరీరధారియైన ఆయనయొక్క వాక్యమైయున్నామని మాకు బయలుపరిచాడు. అందునుబట్టి, మేము ఓడించబడజాలము, మేము దేవునియొక్క విఫలమవ్వజాలని సైన్యమైయున్నాము.

ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్ప దినములలో ఒకటి ఈ ఆదివారం జరగబోతోంది. ఎక్కడైతే మనము ఒక్క సందేహపు ఛాయయైనా లేకుండా, ఏకమనస్సుతో ఒక్కటిగా సమకూర్చబడతామో, అట్టి గొప్ప సైన్యాధ్యక్షుని స్వరము క్రింద ప్రపంచమంతటి నుండి ఆయనయొక్క మీకాయాలు ఏకముగా కూడుకొనియుంటారు.

అప్పుడు, మనం కేవలం నమ్మినట్లైతే, మరి మనము నమ్ముతున్నాము, ప్రపంచమంతటా ఒక్క బలహీనమైన వ్యక్తి కూడా ఉండడు. ఆ ఒక్క విషయాన్ని మనం సరిగ్గా స్థిరపరచగలిగితే, పరిశుద్ధాత్మను కోరుకునే ఎవ్వరైనా దానిని పొందుకోకుండా ఉండరు, మరియు మనము గనుక మన స్థానాలలో నిలిచియున్నట్లైతే, అప్పటికప్పుడే ఆత్మకు మరియు శరీరానికి స్వస్థత కలుగుతుంది. ఇదే అనుకూల సమయము. మనమే ఆ ప్రజలము. దేవునియొక్క ఆత్మ ప్రతీ అపవాదికి వ్యతిరేకంగా ఒక ధ్వజమును ఎత్తాడు; మనం వారిలో ఒకరమైయున్నాము మరియు మనలను ఆపడం ఎవరి తరం కాదు!!

మనము మన ఇంద్రియములకు మృతమైపోయాము, మన హేతుబుద్ధికి మృతమైపోయాము, ఆ సంగతులన్నిటికీ మృతమైపోయాము. మన జీవము దాచబడినది మరియు మనము యేసుక్రీస్తు నామములో పాతిపెట్టబడ్డాము, మరియు ఆయనతో కూడ లేపబడియున్నాము. మరియు ఆయన ఎక్కడ ఉంటాడో, అక్కడ మనము ఉన్నాము.

అపవాదీ, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,” అనేదానితో నిన్ను పేల్చివేయడం ద్వారా మేము మా మార్గమున బయటకు పొడుచుకొని వచ్చాము. ఆఖరికి మేము కొంచెం తాజా గాలిని పీల్చుకుంటున్నాము. “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” అపవాదీ ఇదిగో మేము వస్తున్నాము, మేము మా తలలను బయటకు పెట్టాము. “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు ఓడించబడ్డావు.”

మనము అపవాదిని దేనితో ఓడించాము?

వాక్యముతో!
మనము దానిని చెప్పుదాము; వాక్యము! వాక్యము! వాక్యము!!

మరిన్ని తర్ఫీదు సూచనలు

ఇప్పుడు శత్రువు మీపై దాడిచేసి మరియు నీవు దీనిని చేయవలసియున్నావు, నీవు దానిని చేయవలసియున్నావు, నీవు ఏ మాత్రం పనికిరావు, నీకు అర్హత లేదు, నీవు స్వస్థపరచబడలేదు, నీవు ఇంకను అదే సమస్యలను కలిగియున్నావు అని చెప్పాడానికి ప్రయత్నించాడనుకోండి. మీరేమి చేయబోతున్నారు?

“నా నుండి తొలగిపో.” ఫట్! మీరు వాడిని వాక్యముతో నరికివేయండి. అది దయ్యమైనా, అది శత్రువైనా, అది అనారోగ్యమైనా, అది వ్యాధియైనా, అది ఏమైనా గానీ, ఆ వాక్యమును తీసుకొని మరియు ఆ ఖడ్గమును దూసి పోరాడండి. మరియు మీరు మొదటిసారి కొట్టినప్పుడు, అది కదలకపోతే, దానిని మరలా కొట్టండి, మరలా కొట్టండి, మరలా కొట్టండి.

“దేవుడు ఆలాగున చెప్పాడు,” అనేదాని ఆధారంగానే మనము వాక్యమును అంగీకరిస్తున్నాము, మరియు అదియే మనకు మరియు ఆయనకు మధ్య ఒక ప్రవాహమును స్థిరపరుస్తుంది. మన మధ్య ప్రతీ మార్గము తెరువబడినది. మనము ఇట్లు చెప్తాము, “నేను దానిని ఎప్పుడు పొందుకోబోతున్నానో నాకు తెలియదు, కానీ నేను దానిని పొందుకోబోతున్నాను. దేవుడు ఆలాగున చెప్పాడు. ప్రతీ సందేహము తొలగిపోయినది…అసలు మన సందేహాల పైనే మనకు సందేహము కలుగుతున్నది.”

మనము అపవాదిని ఎదిరిస్తాము మరియు దేవుని వాక్యమును తీసుకుంటాము. నేను ఒక భావోద్వేగమును అనుభూతిచెందినా, లేదా ఏ భావోద్వేగమును అనుభూతిచెందకపోయినా, లేదా ఏమి జరిగినా, దేవుడు ఆలాగున చెప్పాడు. అది దానిని స్థిరపరుస్తుంది.

సైనికులారా, ఈ సూచనలను, ఉన్నది ఉన్నట్లుగా వెంబడించండి. శత్రువు దాడి చేసినప్పుడు ఈ వాక్యములను ఉటంకించండి. అవి మీ మాటలు కావు, అవి ఆయన మాటలైయున్నవి, మరియు ఆయన మాటలు విఫలమవ్వజాలవు. మనల్ని ఆయనయొక్క వాక్యముగా చేయడం ద్వారా ఆయనయొక్క వాక్యమును ఉపయోగించడానికి ఆయన మనకు సంపూర్ణ అధికారమునిచ్చాడు. సాతానుడు దాడి చేసినప్పుడు, వాడికి మీ ఆజ్ఞలను చదివి వినిపించండి.

మన సర్వసేనాధిపతి సూచనలు

ఇదిగో మీరు సరిగ్గా వీటిని చేయాలని నేను కోరుతున్నాను.

ఈ ప్రమాణమును ఉటంకించండి మరియు సంపూర్ణ విడుదల కొరకు ప్రతీ వాక్యమును నమ్మండి.

సాతాన, తొలగిపో! నేను ఇక్కడనుండి బయటకు వస్తున్నాను.

నేను ఇకమీదట ఎంతమాత్రము, ఇక్కడ పడియుండటంలేదు. నేను ఇకమీదట ఎంతమాత్రము, ఇక్కడ కూర్చోవడంలేదు. నేను ఇక ఎంతమాత్రము ఈ పాత దయ్యపు నేల మీద ఉండటంలేదు. ఈ ఉదయమున, నేను నా మార్గమున బయటకు చొచ్చుకొని వస్తున్నాను.

నేను ఒక పక్షిరాజును. ఆమేన్! హల్లెలూయా!

పిదప మీరు ఇలా చేయాలని నేను కోరుతున్నాను:

“యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,” తో దానిని పేల్చివేయండి.

మీ మనస్సును తెరిచి, “నీ వాక్యము సత్యమైయున్నది,” అని చెప్పండి.

ప్రభువా, నాకు ఎలా అనిపిస్తున్నది అనేదానిని, ఎవరైనా, నేనైనా ఏమి చెప్తున్నామనేదానిని నేను ఎంతమాత్రము పట్టించుకోబోవడంలేదు. నేను నా ద్వారములన్నిటినీ మూసివేస్తున్నాను, నాకు ఎన్నడైనా కలిగినట్టి ఆందోళనలు, సందేహాలు, మరియు అవిశ్వాసమంతటినీ నేను బయటకు నెట్టివేస్తున్నాను. నాకు కలిగిన ప్రతి భావనను, నాకు కలిగిన ప్రతి అనారోగ్యమును, నాకు కలిగిన మిగతా ప్రతిదానిని, వాటన్నిటినీ నేను బయటకు నెట్టివేస్తున్నాను. నేను వాటన్నిటినీ దాటివేస్తున్నాను. నేను నేరుగా నా ఆత్మలోకి వస్తున్నాను.

మీ విశ్వాసము అధికముగా మరియు ఇంకా అధికముగా ఎదగడం మొదలవుతుంది. అప్పుడు ఆయనతో ఇట్లు చెప్పండి, “ఓ ప్రభువా, దిగి రమ్ము. నీవు నన్ను స్వయం నిర్ణయాధికారము గల స్వతంత్రుడిగా చేశావని నీవు చెప్పావు.”

“నీవు, నా కుమారుడవు.”

సరి, నేను నా హృదయమును మరియు నా మనస్సును తెరుస్తున్నాను.

“ప్రభువైన యేసూ, లోపలికి రమ్ము.”

ఆ విశ్వాసాన్ని పట్టుకోండి, ఆ ఆత్మ ఖడ్గమును, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును పట్టుకోండి.

ఇట్లు కేకవేయండి, “హల్లెలూయా!” ఆమేన్.

పిదప మీ ఎదుటనున్న ప్రతీ శత్రువును నరికివేయండి. ఆమేన్. విషయం అదేయైయున్నది. ప్రతీ శత్రువును నరికివేయండి. ఒక—ఒక పాత భయకరమైన ఆత్మ ఏదో విధమైన భావనను మీకు కలిగిస్తున్నట్లైతే…ప్రభువుయొక్క వాక్యముతో, దానిని నరికివేయండి.

సైనికుడా నీకు చివరి సూచనలు.
శత్రువుతో ఇట్లు చెప్పు:

“నా నుండి తొలగిపో.” ఫట్!

మీరు వాడిని వాక్యముతో నరికివేయండి. అది దయ్యమైనా, అది శత్రువైనా, అది అనారోగ్యమైనా, అది వ్యాధియైనా, అది ఏమైనా గానీ, ఆ వాక్యమును తీసుకొని మరియు ఆ ఖడ్గమును దూసి పోరాడండి. మరియు మొదటిసారి మీరు దానిని కొట్టినప్పుడు, అది కదలకపోతే, దానిని మరలా కొట్టండి, మరియు దానిని మరలా కొట్టండి, మరియు దానిని మరలా కొట్టండి. మరియు ఒక చిన్న కోడిపిల్ల; లేదా మీరు ఏమైయున్నారో, అట్టి ఒక పక్షిరాజు పిల్ల దానంతట అది చొచ్చుకొని బయటకు వస్తున్నట్లు, మీరు ఒక రంధ్రమును చేసేవరకు దానిని కొడుతూనే ఉండండి. అనారోగ్యమని ఆ పాత పెంకులోనుండి మీయంతట మీరు చొచ్చుకొని రండి. మీ మార్గమును చొచ్చుకొని బయటకు రండి, మరియు ఇట్లు చెప్పండి, “హల్లెలూయా! తర్వాతివాడు ఎక్కడ?” ఆమేన్. పోరాటమంటే అది. సైనికుడంటే అది. సిలువ సైనికుడంటే అది. అవును, అయ్యా. ప్రతి శత్రువును పడగొట్టండి. ఎందుకు? ఎందుకు?

మనము, ముందుగా నిర్ణయించబడిన, అబ్రాహాముయొక్క రాజ సంతానమైయున్నాము.

మహిమ, ప్రతీ శత్రువు ఓడించబడ్డాడు. దేవుని వాక్యము ఎదుట నిలబడగలిగేది ఏదియు లేదు, మరియు మనము దేవుని వాక్యమైయున్నాము. మనము ఆయనయొక్క రాజ సంతానమైయున్నాము మరియు ప్రతీ వాగ్దానము మనకు చెందియున్నది.

ఆ దినము వచ్చియున్నది, వధువు ప్రతీ వాక్యమును నమ్ముతూ దానిపై క్రియ చేస్తున్నది. ఆయనయొక్క వాక్యమును విని మరియు దానిని నమ్మడం ద్వారా మనల్ని మనము సిద్ధపరచుకున్నాము.

మీకు ఏదైనా అవసరమున్నట్లైతే, మీరు పరిశుద్ధాత్మతో నింపబడగోరితే, మీరు స్వస్థత పొందుకొనగోరితే, ప్రతీ దయ్యము వెళ్ళగొట్టబడాలని మీరు కోరితే, మీరు క్రీస్తుయొక్క వధువైయుండగోరితే, ఇదే అనుకూల సమయమైయున్నది, ఆయన స్వరమును విని నమ్మడమే ఆ స్థలమైయున్నది.

మీరు ఈ సంగతుల కొరకు ఆశిస్తూ మరియు ముందెన్నడూ లేనంత సమీపముగా, ప్రభువుయొక్క సన్నిధిలో ఉండాలని కోరుచున్నట్లైతే, ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా, మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, వచ్చి మాతో చేరండి, స్వతంత్రులై, పరిశుద్ధాత్మతో నింపబడి, ఆయనయొక్క త్వరితమైన రాకడ కొరకు సిద్ధంగా ఉండటానికి, ప్రతీ అపవాదిని, ప్రతీ శత్రువును ఎలా ఓడించాలి అని మన అత్యున్నత-స్థాయి సైన్యాధ్యక్షుడు ఆయనయొక్క మహా మీకాయా వధువుకు సూచనలిస్తాడు.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

వర్తమానము: పోరాడబడిన అత్యంత గొప్ప పోరాటము. 62-0311

లేఖనములు:

1 పేతురు 5: 8-10
ఎఫెసీ 6:10-17
దానియేలు 12: 1-7