ఆదివారం
11 అక్టోబర్ 2026
62-1014M
సంపూర్ణ మనుష్యుని యొక్క పరిపూర్ణ ఎదుగుదల
కూడిక ఇంత సమయంలో ప్రారంభమవుతుంది:
0
రోజులు
19
గంటలు
40
నిమిషములు
35
క్షణములు

Sun Apr 26, 2020 10:00 AM EDT

ప్రియమైన పరిపూర్ణ మానవుని స్వరూపమా,

మనము ఎటువంటి ఒక తర్ఫీదు పొందుతూ ఉన్నాము కదా. దేవుని స్వరము మాట్లాడుతూ, శత్రువును సరిగ్గా ఎలా ఓడించాలన్నది, వాక్యము వెంబడి వాక్యముగా మనకు తర్ఫీదునిస్తూ ఉన్నది. మనము వాక్యమైయున్నాము అని ఆయన మనకు బయలుపరచి మరియు మన హృదయములో లంగరువేశాడు. తద్వారా, మనము ఓడించబడజాలము.

శత్రువు మన వెంబడిపడినప్పుడు, మనము కేవలం మనలో జీవిస్తూ మరియు మనలో నివసిస్తున్నట్టి, పలుకబడిన దేవుని వాక్యము అనే మన అణుబాంబుతో, వాడిని కొడతాము మరియు మరలా కొడతాము మరియు మరలా కొడతాము.

నిజంగా, పోరాటము తీవ్రంగా సాగుతున్నది, కానీ ఇప్పుడు మనకు ఇక ఎటువంటి భయమూ లేదు; ఇక ఎటువంటి చింతలు లేవు. మనము మన స్వంత బుద్ధికి చెవియొగ్గడంలేదు. మనము మన జ్ఞాపకముకు చెవియొగ్గడంలేదు. మనము మన యిచ్ఛలకు చెవియొగ్గడంలేదు. మనము వీటికి మన మనస్సులను మూసివేసి మరియు మన హృదయములోను అంతరంగములోను ఆయన వాక్యముయొక్క ఆత్మను స్థిరపరచుకున్నాము. ఆయనయొక్క వాక్యమునకు వ్యతిరేకమైన ప్రతిదానిని మనము బయటకు ఎగురగొట్టాము.

ప్రతీ సందేహము తొలగిపోయినది. ప్రతీ భయము వెడలిపోయినది. ప్రతీ సందేహపు స్పర్శ తొలగిపోయినది. ప్రతీ అనుభూతి తొలగిపోయినది. దేవుని వాక్యము మనలో జీవిస్తూ మరియు నివసిస్తూ ఉండటం తప్ప అక్కడ మరేమియు లేదు, మరియు సాతానుడు దానికి వ్యతిరేకముగా పోరాడలేడు.

మనము సజీవ దేవునియొక్క సజీవ ఆలయముగా మారుతున్నాము. దేవుడే మనలో నివసిస్తూ, మనల్ని స్వయంగా ఆయనవలె ఉండునట్లు చేస్తూ, మనలో ఆయనయొక్క ఉనికిని ప్రతిబింబిస్తున్నాడు.

మనము క్రీస్తుయొక్క పరిచర్యను కొనసాగిస్తూ, ఆయన స్థానమును తీసుకుంటున్నాము. ఆయన మనలో తననుతాను ప్రతిబింబించుకొనుచుండగా ఆయన ఒక మానవుని రూపములో నివసిస్తున్నాడు. ఇప్పుడు మనము ఆయనతో పరిపూర్ణ ఆరాధనను కలిగియుంటున్నాము! మనము ఆయనయొక్క ఆలయమైయుండగా, అది దేవుడు తననుతానే మనలో ప్రత్యక్షపరచుకోవడమైయున్నది.

ఈ కార్యములను నమ్మడానికి మన కదల్చబడని పునాది ఏమిటి? విశ్వాసము. మరియు మన విశ్వాసమునకు ఏమీ అవసరములేదు; ఏలయనగా మన విశ్వాసము దేవుని వాక్యమును నమ్ముతుంది. ఏలయనగా వినుటవలన, మరియు దేవుని వాక్యమును వినుటవలన విశ్వాసము కలుగుతుంది, మరియు దేవుని వాక్యము ప్రవక్త యొద్దకు మాత్రమే వస్తుంది, మరియు ప్లే ను నొక్కడం ద్వారా మాత్రమే ప్రవక్త మాటలను వినగలుగుతారు…ఫట్!!

ఆయన స్వరమును వినడం ద్వారా, మనము ఖాళీ చేయబడి ఆయనయొక్క శక్తితో నింపబడి మరియు మన స్వంత ఆలోచనకు మృతులమవుతున్నాము. మన విశ్వాసము అసలైన విశ్వాసముగా మారినది, మరియు మనము ఖాళీ చేయబడి ఆయనయొక్క జీవముతో నింపబడ్డాము. మనము దేవునియొక్క జీవించు ప్రాణులమయ్యాము, పరిశుద్ధాత్మ మన ద్వారా తన తేజోమయమైన ఆశీర్వాదములను క్రిందకు పంపడానికి మనము ఒక నివాసస్థలముగా మారినాము.

టేపులలో ఉన్న ఆ స్వరము ఏమి చేస్తున్నది?

వ్యక్తులను యేసుక్రీస్తుయొక్క స్వరూపములోనికి నిర్మించడానికి క్రీస్తు నన్ను పంపాడు, తద్వారా వారు, ఆయనయొక్క వాక్యము ద్వారా, ఆత్మకు శక్తికేంద్రముగాను నివాసస్థలముగాను ఉండుటకైయున్నది. ఆయనయొక్క వాక్యము ద్వారా, చూడండి, ఒక వ్యక్తిని ఆ స్థాయికి నిర్మించవలసియున్నది.

ఆయనయొక్క స్వరమును వినడం ద్వారా, మరియు ఆయనయొక్క వాక్యమును నమ్మి మరియు దానిని వెంబడించడం ద్వారా, అది మనల్ని యేసుక్రీస్తుయొక్క స్వరూపములుగా మారునట్లు నిర్మించినది; ఆయనయొక్క ఆత్మకు ఒక నివాసస్థలముగా నిర్మించినది. మనము సజీవమైన సద్గుణము, సజీవమైన జ్ఞానము, సజీవమైన సహనము, సజీవమైన దైవత్వము, ఒక సజీవమైన శక్తియునైయున్నాము, అది సజీవ దేవునినుండి వచ్చుచున్నది, అది మనల్ని, దేవుని స్వరూపములో జీవిస్తున్న ఒక సజీవ వ్యక్తిగా, ఒక సజీవ రూపముగా చేస్తుంది.

కానీ నీవు నాకొక శరీరమును అమర్చితివి,” దేవుడు దానిలో నివసించగలిగి, దేవుడు దానిలో నడవగలిగి, దేవుడు దానిలో చూడగలిగి, దేవుడు దానిలో పనిచేయగలిగేటటువంటి ఒక శరీరము. ఆమేన్! దేవునియొక్క సజీవమైన సాధనమైయున్నది, దేవుడు మీలో, రెండు పాదముల మీద నడుస్తున్నాడు. మహిమ! “నీతిమంతుని అడుగులు యెహోవాచేత స్థిరపరచబడును,” దేవుడు మీలో ఉండి నడవడం. “ఏలయనగా మీరు మనుష్యులందరు చదువుకొనుచున్న, వ్రాయబడిన పత్రికలైయున్నారు.”

మహిమ…!!! కాబట్టి, మనము ఒక డేరాలో నివసిస్తున్నామా లేదా ఒక కుటీరములో నివసిస్తున్నామా, బ్రతుకుతామా లేదా చస్తామా, మునిగిపోతామా లేదా తేలుతామా అన్నది మనము లెక్కచేయము. ఈ ఒక్కదానిలో మాత్రమే, ఈ వర్తమానము, ఈ స్వరము, దేవునియొక్క వాక్యములో మాత్రమే మనము ఆసక్తి కలిగియున్నాము. అది దేవుని రాజ్యమైయున్నది. అది ఈ దినము కొరకు దేవుడు ఏర్పాటుచేసిన మార్గమైయున్నది. అది ఒక పరిపూర్ణ మానవుని స్వరూపమును నిర్మిస్తున్నది, అది మనమేయైయున్నాము!

మనము కూడివచ్చి, మరియు దేవునియొక్క ప-రి-పూ-ర్ణ-మై-న కుమారులుగా మరియు కుమార్తెలుగా మారడానికి మనము ఏమి చేయాలి, మరియు మనము ఎలా జీవించాలి అని మన శిక్షకుడు మనకు సూచనలిస్తుండగా మన జీవితాలను సరిచూసుకుందాము.

ఆయన కోరినవాటిలో ప్రతియొక్కటి మన రూపములో ప్రవహిస్తున్నదని మనకు అనిపించేవరకు, ఆయనయొక్క సహాయము ద్వారా మరియు ఆయనయొక్క కృప దారా, మనము అనుదినము ఎడతెగక ప్రార్థిస్తూ ఆయనను వెదకుతామని మనము ప్రభువుకు ప్రమాణము చేద్దాము. మనము సజీవ క్రీస్తుయొక్క కార్యరూపణగా మారేవరకు మనము అక్కడే నిలిచియుందాము.

ప్రతి వారము ప్రభువు ఏమి చేయబోతున్నాడు మరియు మనకు ఏమి బయలుపరచబోతున్నాడు అనే ఉత్సాహమును మరియు ఎదురుచూపును మాటలలో వ్యక్తపరచడం అసాధ్యము. దేవుని స్వరముయొక్క సన్నిధిలో కూర్చొని మరియు ఆయనయొక్క పరిపూర్ణ వాక్య వధువుయొక్క పరిపూర్ణ స్వరూపముగా మారడంకంటే గొప్ప విషయము, లేదా అంతకంటే పరిపూర్ణమైన విషయము మరొకటి లేనందున, ప్రపంచము మనతో చేరాలని నేను ఎంతగానో కోరుతున్నాను.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

వర్తమానము: ఒక పరిపూర్ణ మానవుని స్వరూపము 62-1014M

సమయము: జఫర్సన్విల్, ఇండియానా కాలమానం ప్రకారంగా, మధ్యాహ్నం 12:00 గంటలకు

లేఖనములు:
పరిశుద్ధ. మత్తయి 5:48
పరిశుద్ధ. లూకా 6:19
పరిశుద్ధ. యోహాను 1:1 / 3:3 / 3:16 / 5:14 / 14:12
అపొస్తలుల కార్యములు 2:38 / 7:44–49 / 10వ అధ్యాయము / 19:11 / 28:19
ఎఫెసీ 4:11-13
కొలస్సీ 3వ అధ్యాయము
హెబ్రీ 10:5 / 11:1 / 11:32-40
యాకోబు 5:14
2 పరిశుద్ధ. పేతురు 1:1-7
యెషయా 28:19