ఆదివారం
19 ఏప్రిల్ 2026
65-0429E
పెళ్లికుమార్తెను ఎన్నుకొనుట
కూడిక ఇంత సమయంలో ప్రారంభమవుతుంది:
0
రోజులు
19
గంటలు
40
నిమిషములు
35
క్షణములు

Sun Apr 26, 2020 10:00 AM EDT

ప్రియమైన ఎన్నుకోబడిన వధువా,

వధువును ఎన్నుకొనుట అనే ఈ వర్తమానమును, మనము వినుచుండగా, ప్రవక్త కేవలం ఒక పురుషుడు తన భార్యగా ఉండటానికి ఒక స్త్రీని ఎన్నుకుంటున్నప్పుడు అతడు ఎటువంటి గుణలక్షణము కొరకు మరియు ఎటువంటి ఆత్మసంబంధమైన స్వరూపము కొరకు వెదకాలి అనేదాని గురించి మనతో మాట్లాడుతూ మరియు మనకు సూచనలిస్తున్నాడని కొందరు అనుకుంటారు. అది నిజమే, ఆయన దానిని చెప్తున్నాడు, అయితే ఆయన మాటల్లో ఒక నిజమైన దాచబడిన ప్రేమ లేఖ ఉన్నది. ఆయన తన వధువుకు బయలుపరచుచున్న విషయం ఇంకా చాలా లోతైనది. దేవుడు నేరుగా ఆమెతో మాట్లాడి, ఆయన ఆమెలో దేని కొరకు వెదకుచున్నాడో ఆమెకు చెప్తున్నాడు, మరియు ఆదినుండి ఆయన ఆమెను ఎందుకు ఎన్నుకున్నాడో ఆమెకు చెప్తున్నాడు. ఆయన తన నిత్యత్వమును ఎవరితో పంచుకోవాలనుకున్నాడో, అట్టి ఆయనయొక్క అత్యంత ప్రియమైన వధువుగా ఉండటానికి ఆయన ఆమెను ఎన్నుకున్నాడన్న విషయమును ఆమె తెలుసుకోవాలని ఆయన కోరాడు.

ఆదిలో, దేవుడు సరిగ్గా ఆయనయొక్క గుణలక్షణమును కలిగియుండే ఒక వధువు కొరకు వెదుకుచూ ఉన్నాడు. సరిగ్గా ఆయనయొక్క ఆత్మయే ఆమెలో ప్రత్యక్షపరచబడుతుంది. సరిగ్గా ఆయనలో ఉన్న మనస్సే ఆమెలో ఉండేంతగా, ఆయనకు, మరియు ఆయనయొక్క వాగ్దాన వాక్యమునకు కట్టబడియుండే ఒక వధువును ఆయన కోరుకున్నాడు. ఆయన మలచబడినట్లే ఆమె మలచబడవలసియున్నది.

ఆమె ఆయనయొక్క అదే శరీరము, అదే ఎముకలు, అదే ఆత్మ, అదే సమస్తము అయ్యుండాలని, సరిగ్గా ఆయనవలె ఉండాలని ఆయన కోరాడు. వారిరువురూ ఒక్కటవుతారు.

ఆమె వంకర చూపును కలిగియుండదు. ఆమె వేరే ఏ స్వరముతోను సరసమాడుతూ తిరుగదు. ఎవరు ఏమి చెప్పినా గాని, ఆమె ఆయనకు నమ్మకముగాను విశ్వాసనీయముగాను ఉంటుంది. ఆమె ఆయనను ఆయనయొక్క వాక్యము వద్దనే తీసుకుంటుంది. ఆయన ఏమి చెప్తాడో, ఆ ప్రతీ మాటను ఆమె నమ్ముతుంది, అది నెరవేరడానికి ఎంత సమయము పట్టినా గానీ, ఆమె దానిని నమ్ముతుంది. ఆమె ఆయనయొక్క వాక్యముతో నిలిచియుంటుంది.

ఆమె ఆయనను, మరియు ఆయనను మాత్రమే ప్రేమిస్తుంది. ఆయన ఆమెకు గొప్ప ధనసంపదలను ఇవ్వాల్సిన అవసరంలేదు, ఆమె అమూల్యమైన ముత్యమును కలిగియున్నది, ఆయనను గూర్చిన సత్యమైన ప్రత్యక్షతను కలిగియున్నది. వారు ఏకమైయున్నారని మరియు ఒక్కటైయున్నారని, ఆమె ఎరిగియుంటుంది. ఆయనయొక్క ఆత్మ ఆమెలో నివసిస్తుంది. ఆమెకు అవసరమున్న ప్రతిదానిని, ఆయన ఆమెకు ఇస్తాడు; ఆమె చేయవలసిందల్లా అడిగి మరియు నమ్మడమే, మరియు ఆయన దానిని చేస్తాడు.

ప్రతీది సరిగ్గా ఆమె స్పర్శకు మరియు ఆమె ఇష్టానికి తగినట్లుగా ఉండే ఒక ఇల్లును కట్టడానికి ఆయన వెళ్ళి చాలా కాలం వరకు దూరంగా ఉంటాడని ఆమెకు తెలుసు. ఆయన సరిగ్గా ఆమెకు నచ్చే విధంగా దానిని నిర్మిస్తున్నాడు. ఆయన వాగ్దానము చేసిన విధంగా, ఒక రోజు ఆయన తిరిగి వస్తాడని ఆమెకు తెలుసు, అప్పుడు వారు వెయ్యి సంవత్సరాలు ఒక గొప్ప పెండ్లి విందును కలిగియుంటారు. పిదప, నిత్యత్వమును గడపడానికి ఆయన ఆమె కొరకు కట్టినట్టి ఆ అందమైన గృహానికి వారు కలిసి వెళ్తారు.

ఆమెకు మిగతాదేదియు ముఖ్యము కాదు. ఆమె మిగతాదేనినీ కోరదు. ఆయన ఎవరు, మరియు ఆమె ఎవరు అని ఎరిగియుండే ప్రత్యక్షతను కలిగియుండి ఆమె ఎంతో తృప్తిచెంది మరియు సంతృప్తి కలిగియుంటుంది. ఆయన తన మాటను నిలబెట్టుకుంటాడని ఆమె ఎరిగియుంటుంది. ఆయనయొక్క వధువుగా ఉండటానికి ఆయన ఎన్నుకున్నది ఆమెనే అని ఎరిగియుండి, ఆమె పరిపూర్ణముగా తృప్తి చెందియుంటుంది.

నా సహోదరులారా మరియు సహోదరీలారా, భూమ్యాకాశములయొక్క బలవంతుడగు దేవుడు నిత్యత్వము గుండా చూసి మరియు ఆయనయొక్క ఎన్నుకోబడిన ప్రియమైన వధువుగా ఉండటానికి మిమ్మల్ని...నిన్ను ఎన్నుకున్నాడు.

ఆయన తనయొక్క బలిష్ఠుడైన దూత ద్వారా మాట్లాడి మరియు మనము ఆయనయొక్క ఎన్నుకోబడిన వధువైయున్నామని మనకు చెప్తుండగా, ఈ ఆదివారము వచ్చి నాతో మరియు ఆయనయొక్క వధువులోని ఒక భాగముతో చేరడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

వర్తమానము: 65-0429E / వధువును ఎన్నుకొనుట

సమయము: జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటలకు

 

లేఖనములు:

ఆదికాండము24:12-14
యెషయా 53:2
ప్రకటన 21:9