ఆదివారం
13 ఏప్రిల్ 2025
63-0322
అయిదవ ముద్ర

విశ్రాంతినొందుచున్న ప్రియమైన వారలారా,

మనమిక్కడ ఉన్నాము. మనము వచ్చేసాము. ఈ వర్తమానముయొక్క మన ప్రత్యక్షత దేవుని యొద్దనుండి వస్తుందని వాక్యముయొక్క నిర్థారణ ఋజువు చేసినది. టేపులలో ఉన్న దేవునియొక్క స్వరముతో నిలిచియుండుట ద్వారా మనము ఆయనయొక్క పరిపూర్ణ చిత్తములో ఉన్నాము.

ప్లేను నొక్కడం ఎంత ప్రాముఖ్యము? మనము టేపులలో వినుచున్న మాటలు ఎంతో గుర్తించదగినవి, ఎంతో పవిత్రమైనవి, ఎంతగా అంటే స్వయంగా దేవుడే వాటిని ఒక దేవదూతకు అప్పగించుటకు నమ్మికయుంచలేదు…ఆయనయొక్క పరలోకపు దేవదూతలలో ఒకరికి ఇవ్వడానికైనా నమ్మికయుంచలేదు. అది ప్రత్యక్షపరచబడి మరియు ఆయనయొక్క ప్రవక్తచేత ఆయనయొక్క వధువునకు తీసుకొనిరాబడవలసియున్నది, ఎందుకనగా దేవునియొక్క వాక్యము వారియొద్దకే, అనగా, ఆయనయొక్క ప్రవక్తయొద్దకు మాత్రమే వస్తుంది.

దేవుడు ముద్రలను చీల్చివేసి, వాటిని ఆయనయొక్క భూమి మీదనున్న ఏడవ దూత వర్తమానికుడికి అందించాడు, మరియు ప్రత్యక్షత గ్రంథమంతటినీ ఆయనకు బయలుపరిచాడు. పిదప, దేవుడు భూమి మీదనున్న ఆయనయొక్క దూత ద్వారా మాట్లాడి మరియు ఆయనయొక్క వధువునకు సమస్తమును బయలుపరిచాడు.

ప్రతి చిన్న వివరము పలుకబడి మరియు మనకు బయలుపరచబడినది. దేవుడు మన కొరకు ఎంత ఎక్కువగా శ్రద్ధవహించాడంటే ఆయన మనకు కాలము ఆరంభమైనప్పటినుండి ఏమి జరిగినదో చెప్పడం మాత్రమే కాదు గాని, ఆయన తనయొక్క దూత ద్వారా మాట్లాడి మరియు పరదైసువంటి స్థలములో సరిగ్గా ఇప్పుడు ఏమి జరుగుతున్నదో కూడా మనకు చెప్పాడు.

మనము ఈ భూసంబంధమైన గుడారమును విడిచిపెట్టినప్పుడు భవిష్యత్తు మన కొరకు ఏమి పట్టుకొనియుంటుంది అనుదాని విషయములో మనము చింతించాలని గాని, లేదా నిశ్చయత లేకుండా ఉండాలని గాని ఆయన కోరలేదు. కావున, ఆయనయొక్క బలమైన ఏడవ దూత, దానిని చూడగలుగుటకు, దానిని అనుభూతి చెందగలుగుటకు, ఇంకా ఆ ఆవలిన ఉన్నవారితో మాట్లాడగలుగుటకు సైతం స్వయంగా దేవుడే ఆయనను కాలమనే తెర ఆవలికి తీసుకొనివెళ్ళాడు. అది ఒక దర్శనము కాదు, ఆయన అక్కడ ఉన్నాడు.

ఆయన తిరిగివచ్చి మరియు మనకు ఇట్లు చెప్పడానికి దేవుడు ఆయనను అక్కడికి తీసుకొనివెళ్ళాడు: “నేను అక్కడ ఉన్నాను, నేను దానిని చూసాను. అది సరిగ్గా ఇప్పుడు జరుగుచున్నది…వెళ్ళిపోయిన మన తల్లులు, మన తండ్రులు, సహోదరులు, సహోదరీలు, కుమారులు, కుమార్తెలు, భార్యలు, భర్తలు, అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు, మోషే, ఏలీయా, ఇంకా పరిశుద్ధులందరు అక్కడ తెల్లని వస్త్రములు ధరించుకొని, విశ్రాంతి తీసుకొనుచు మరియు మన కొరకు ఎదురుచూస్తున్నారు”.

మనము ఇక ఎంతమాత్రము ఏడ్వము, ఎందుకనగా ఇక అంతా ఆనందమే ఉంటుంది. మనము ఇక ఎంతమాత్రము విచారముతో ఉండము, ఎందుకనగా ఇక అంతా సంతోషమే ఉంటుంది. మనమెన్నడూ మరణించము, ఎందుకనగా అదంతా జీవమైయున్నది. మనము వృద్ధులముగా మారలేము, ఎందుకనగా మనమందరము ఎప్పటికీ యవ్వనస్థులమైయుంటాము.

అది పరిపూర్ణత…మరియు పరిపూర్ణత…మరియు పరిపూర్ణతైయున్నది, మరియు మనము అక్కడికి వెళ్ళుచున్నాము!! మరియు మోషే వలె, మనము కనీసం ఒక్క డెక్కనైనా విడిచిపెట్టము, మనమందరము…మన కుటుంబమంతా వెళ్ళుచున్నాము.

ఆ బలమైన ఏడవ దూతను ప్రేమించడం ఎంత ప్రాముఖ్యము?

మరియు అది కేక వేసి, ఇట్లన్నది, “నీవు ప్రేమించిన వారందరినీ…” మరి నా సేవకు బహుమానమైయున్నది. అయితే నాకు ఎటువంటి బహుమానము అవసరములేదు. ఆయన ఇట్లన్నాడు, “నీవు ప్రేమించిన వారందరినీ, మరియు నిన్ను ప్రేమించిన వారందరినీ, దేవుడు నీకు అనుగ్రహించాడు.

దయచేసి మనము దానిని మరలా చదువుదాము: ఆయన ఏమి చెప్పాడు?…దేవుడు నీకు!! అనుగ్రహించాడు.

మరియు మనము వారితో చేరి మరియు ఇట్లు కేక వేస్తాము, “మేము దానిపై విశ్రాంతినొందుచున్నాము”

మనము మనయొక్క నిత్యమైన గమ్యమును దేనిపై ఆనబెట్టుచున్నాము? టేపులలో పలుకబడిన ప్రతి మాటపై ఆనబెట్టుచున్నాము. వధువు చేయవలసిన అత్యంత ప్రాముఖ్యమైన సంగతి ప్లేను నొక్కడమే అన్న నిజమైన ప్రత్యక్షతను అయన మనకు ఇచ్చినందుకు నేను ప్రభువునకు ఎంతో కృతజ్ఞుడనైయున్నాను.

మాతో పాటు విశ్రాంతినొందుటకు మీరు ఇష్టపడుచున్నారా? ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, దేవునియొక్క స్వరము మాతో మాట్లాడి మరియు: ఐదవ ముద్ర 63-0322 తెరుస్తున్నప్పుడు, భవిష్యత్తు ఏమి కలిగియున్నది, మనము ఎక్కడికి వెళ్ళుచున్నాము, మరియు అక్కడికి ఎలా చేరుకోవాలి అనేదాని గురించి మేము వినుచుండగా వచ్చి మాతో చేరండి.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

 

వర్తమానమును వినడానికిముందు చదువవలసిన లేఖనములు:

దానియేలు 9:20-27
అపొస్తలుల కార్యములు 15:13-14
రోమా 11:25-26
ప్రకటన 6:9-11 / 11:7-8 / 22:8-9