ఆదివారం
22 డిసెంబర్ 2024
60-1225
చుట్టబడిన దేవుని కానుక

ప్రియమైన శ్రీమతి. యేసు,

ఓ దేవుని గొర్రెపిల్లా, ఈ లోకమునకు నీవే దేవునియొక్క చుట్టబడిన గొప్ప కానుకయైయున్నావు. ఇవ్వబడినటువంటి అత్యంత గొప్ప కానుకను నీవు మాకు అనుగ్రహించావు, మరది స్వయంగా నీవేయైయున్నావు. నీవు మొట్టమొదటి నక్షత్రమును సృష్టించడానికిముందే, నీవు భూమిని, చంద్రుడిని, సౌర కుటుంబమును సృష్టించడానికిముందే, నీవు మమ్మల్ని ఎరిగియుండి మరియు నీ వధువుగా ఉండుటకు మమ్మల్ని ఎన్నుకున్నావు.

అప్పుడు నీవు మమ్మల్ని చూసినప్పుడే, నీవు మమ్మల్ని ప్రేమించావు. మేము నీ మాంసములో మాంసమైయున్నాము, నీ ఎముకలో ఎముకయైయున్నాము; మేము నీలో భాగమైయున్నాము. నీవు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మరియు మాతో సహవాసము కలిగియుండాలని ఎంతగానో కోరావు. నీవు నీయొక్క నిత్యజీవమును మాతో పంచుకోవాలని కోరావు. మేము నీయొక్క శ్రీమతి. యేసు అవుతాము అని అప్పుడు మేము ఎరిగియున్నాము.

మేము విఫలమవుతామని నీవు చూశావు, కావున మమ్మల్ని తిరిగి విమోచించడానికి నీవు ఒక మార్గమును ఏర్పాటు చేయవలసివచ్చినది. మేము తప్పిపోయి నిరీక్షణ లేనివారిగా ఉన్నాము. ఒకే ఒక్క మార్గము ఉన్నది, నీవే ఒక “నూతన సృష్టిగా” మారవలసివచ్చినది. దేవుడు మానవుడు ఒకటి అవ్వవలసివచ్చినది. మేము నీవలె మారునట్లు, నీవు మావలె మారవలసివచ్చినది. కావున, వేల సంవత్సరాల క్రితమే ఏదెను తోటలో నీవు నీ ప్రణాళికను కార్యనిర్వహణలో పెట్టియున్నావు.

నీయొక్క పరిపూర్ణ వాక్య వధువైయున్న మాతో ఉండాలని, నీవు ఎంతగానో పరితపించావు, అయితే మొదటిగా ఆదిలో కోల్పోయినదానంతటికీ మమ్మల్ని తిరిగి విమోచించవలసియున్నదని నీవు ఎరిగియున్నావు. నీ ప్రణాళికను పూర్తి చేయడానికి ఈ దినమువరకు నీవు ఎంతగానో వేచియున్నావు.

ఆ దినము వచ్చియున్నది. ఆదిలో నీవు చూసిన ఆ చిన్న గుంపు ఇక్కడున్నది. దేనికంటెను నిన్ను మరియు నీ వాక్యమును ప్రేమించే నీ ప్రియమైనది ఇక్కడున్నది.

నీవు అబ్రాహాముతో చేసినట్లే, మరియు నీవు ఒక నూతన సృష్టియైనప్పుడు నీవు చేసినట్లే, మానవ శరీరములో వచ్చి మరియు నిన్ను నీవు బయలుపరచుకోడానికి సమయమైనది. జగత్తుపునాది నుండి దాచబడియున్న నీయొక్క గొప్ప మర్మములన్నిటినీ నీవు మాకు బయలుపరచగలుగునట్లు నీవు ఈ దినము కొరకు ఎంతగానో పరితపించావు.

నీవు నీ వధువు విషయమై ఎంతో అతిశయపడుతున్నావు. ఆమెను చూపించి మరియు సాతానుడితో ఇట్లు చెప్పడానికి నీవు ఎంతగానో ఇష్టపడతావు, “నీవు వారికి ఏమి చేయడానికి ప్రయత్నించినా గాని, వారు కదలరు; నా మాట విషయంలో, నా స్వరము విషయంలో వారు రాజీపడరు. వారు నాయొక్క పరిపూర్ణ వాక్య వధువైయున్నారు.” వారు నాకు ఎంతో అందముగా కనబడుచున్నారు. కేవలం వారిని చూడుము! వారియొక్క శోధనలు మరియు పరీక్షలన్నిటిగుండా, వారు నా వాక్యమునకు నిజాయితీగా నిలబడతారు. నేను వారికి ఒక నిత్యమైన కానుకను ఇస్తాను. నేను ఏమైయున్నానో దానంతటినీ, నేను వారికి ఇస్తాను. మేము ఒక్కటైయుంటాము.

మనము చెప్పగలిగేదంతా ఏమిటంటే: “యేసూ, మేము నిన్ను ప్రేమిస్తున్నాము. మా గృహములోనికి నిన్ను ఆహ్వానించనిమ్ము. నిన్ను అభిషేకించి మరియు మా కన్నీటితో నీ పాదములను కడిగి మరియు వాటిని ముద్దుపెట్టుకోనిమ్ము. మేము నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నామో నీకు చెప్పనిమ్ము.”

యేసూ, మేము ఏమైయున్నామో దానంతటినీ మేము నీకు ఇస్తున్నాము. యేసూ అదియే నీకు మేము ఇచ్చే కానుకయైయున్నది. మేము నిన్ను ప్రేమిస్తున్నాము. మేము నిన్ను ఎంతగానో గౌరవిస్తున్నాము. మేము నిన్ను ఆరాధిస్తున్నాము.

ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా, మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు మాతో కలిసి, మరియు మీ గృహములోనికి, మీ సంఘములోనికి, మీ కారులోని, మీరు ఎక్కడుంటే అక్కడికి యేసును ఆహ్వానించి, మరియు మానవునికి ఇవ్వబడిన అత్యంత గొప్ప కానుకను స్వీకరించాలని కోరుచున్నాను; అది మరేమిటో కాదు గాని దేవుడు తానే మీతో మాట్లాడుచు మరియు మీతో సహవాసము చేయుటయైయున్నది.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

60-1225 చుట్టబడిన దేవుని కానుక