Sun Apr 26, 2020 10:00 AM EDT
ప్రియమైన ప్రవచనాత్మక తరగతి ప్రజలారా,
మనము వాక్యమును, ప్రత్యక్షతను ఎంతగా ప్రేమిస్తున్నాము కదా! ఒక విశ్వాసికి పరిశుద్ధాత్మ చేత ఇవ్వబడే సర్వసత్యముయొక్క ప్రాముఖ్యతను ఎంత చెప్పినా తక్కువే. ప్రత్యక్షత అనేది వధువుకు జీవముకంటే ఎక్కువైనది; ఏలయనగా ఈ బండ మీద, ప్రత్యక్షత మీద, నేను నా సంఘమును కట్టుదును, మరియు దేవునియొక్క కృప కనికరముల ద్వారా, మనము ఆయనయొక్క నిజమైన ప్రత్యక్షతను కలిగియున్న ఆయనయొక్క సంఘమైయున్నాము.
ప్రకటన గ్రంథము అందరికొరకు కాదు. దానిని గ్రహించగలిగేవారు ఎవ్వరూ లేరు. అది ఒక ప్రవచనాత్మకమైన గ్రంథమైయున్నది, అది ఒక ప్రవచనాత్మక తరగతి ప్రజల కొరకు మాత్రమే వ్రాయబడినది మరియు వారు మాత్రమే దానిని గ్రహిస్తారు: అది యేసుక్రీస్తు యొక్క వధువైనట్టి, మనమేయైయున్నాము.
బైబిలు మొత్తంలో స్వయంగా క్రీస్తు వ్రాసినట్టి గ్రంథము అది మాత్రమేయైయున్నది, అయితే ఆయన తన దూత ద్వారా దానిని పంపి తన దాసుడైన యోహానుకు దానిని సూచించాడు. వ్రాయబడిన ఈ సత్యములు శిష్యులకు తెలియదు. అవి వారికి ఇదివరకు బయలుపరచబడలేదు. దానిలో ఆయన స్థానము ఏమిటన్నది యేసు కూడా శిష్యులకు చెప్పలేకపోయాడు; ఏలయనగా తండ్రి దానిని ఆయనకు బయలుపరచలేదు.
కానీ ఇప్పుడు, ఆయనయొక్క మరణము మరియు పునరుత్థానము తర్వాత, ఈ నియమితమైన సమయములో, ఆయన తనను గూర్చిన ఈ ప్రత్యక్షతను యోహానుకు బయలుపరచగలిగాడు, సంఘములో ఆయన మహిమ మరియు ఆయన సన్నిధి ఎంత ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది మరియు ఏమి చేస్తుందన్నది తెలియజేయగలిగాడు.
కానీ ఇప్పుడు, రెండువేల సంవత్సరాల తర్వాత, లోకము ఆలోచించినది, వేదపండితులు పఠించారు మరియు క్షుణ్ణంగా పరిశీలించారు, కానీ ఆయనయొక్క ఎన్నుకోబడిన వధువైనట్టి మనకు, దానంతటినీ బయలుపరచడానికి దేవుడు అదే దూతను భూమి మీదకు పంపినట్టి ఈ దినము వరకును, ఈ సమయము వరకును, ఎవ్వరు కూడా ప్రకటన గ్రంథములో వ్రాయబడిన ఈ మర్మముల యొక్క సరియైన అనువాదమును మరియు ప్రత్యక్షతను కలిగిలేరు.
ఆయన వాక్యముయొక్క నిజమైన ప్రత్యక్షతను కలిగియుండటానికి దేవుడు, నన్ను మరియు నిన్ను ఎన్నుకోవడమనేది అసలు ఎంత గొప్ప విషయమో అర్థం చేసుకోడానికి ప్రయత్నించడం మానవ వివరణకు అతీతమైనది. వర్తమానమును వెంబడిస్తున్నామని ప్రకటించుకుంటూ మరియు దేవుడు ఒక ప్రవక్తను పంపాడని నమ్ముతున్నామని చెప్పుకునేవారు అనేకులు ఉండగా, మరి ఆయన స్వరమునే వారు తప్పకుండా వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరముగా చేసుకోకపోవడం వలన కలిగే పరిణామాలను ఎరిగియుండుటలో వారు సంపూర్ణ ప్రత్యక్షతను కలిగిలేరు. ఈ దినమున ఆయన స్వరమును గూర్చిన ఈ ప్రత్యక్షతను కలిగియుండటం నిజంగానే మిగుల వెలగల ముత్యము వంటిదైయున్నది.
ఆ నిజమైన ప్రత్యక్షతను బయలుపరచడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. తద్వారా, మనమే ఆయనయొక్క నిజమైన సంఘమైయున్నాము, సాతానుడు ఎవరి యెదుట శక్తిహీనుడైపోతాడో మరియు ఖచ్చితంగా ఓడించబడతాడో, అటువంటి జయింపశక్యముకాని ఆయన సైన్యము మనమేయైయున్నాము. మన జీవితాలలో ఆయనయొక్క నిజమైన ప్రత్యక్షత ఉండగా, పాతాళలోక ద్వారములు మన యెదుట నిలువనేరవు గానీ, మనమే వాటిని జయిస్తాము. మన ఎదుట నిలబడగలిగేది ఏదియు లేదు.
మన దినమునకు దేవుని స్వరముయొక్క ప్రాముఖ్యతను గుర్తించడమే ఈ దినమునకు నిజమైన సంపూర్ణ ప్రత్యక్షతయైయున్నది. దేవుడు కోరుచున్నదంతా, సంఘానికి వెళ్ళడం, సంఘానికి చెందియుండటం, బల్యర్పణలు అర్పించడం, ప్రార్థించడం, మరియు దేవుడిని ఆరాధించడం మాత్రమేయైతే, అప్పుడు సరిగ్గా దేవుడు చేయమని చెప్పినదానినే కయీను చేసియుండగా అతణ్ణి ఖండించినందుకు దేవుడు అన్యాయస్థుడవుతాడు.
టేపులలో ఉన్న స్వరము మనకు ఏమైయున్నదంటే:
ఆ పూర్తి విషయముయొక్క ప్రత్యక్షత దానిని చదువువారి కొరకు మరియు దానిని వినేవారి కొరకు ఒక ఆశీర్వాదముతో, దానికి దేనినైనా కలిపేవారికి లేదా దానినుండి దేనినైనా తీసివేసేవారికి ఒక శాపముతో, ఈ వెనుక ఇక్కడ ఉంచబడినది. అది ఒక సంపూర్ణ గ్రంథమైయున్నది, ఓ, అంతిమమైయున్నది. దానికి ఏదియు కలపబడజాలదు. మరియు ఒక వ్యక్తి దానినుండి దేనినైనా తీసివేయడానికైనా, లేదా దానికి ఏదైనా కలపడానికైనా ప్రయత్నిస్తే, అతని భాగమును ఆయన జీవగ్రంథము నుండి తీసివేస్తాడని దేవుడు చెప్పాడు. చూశారా? అతడు దానికి కలిపినట్లైతే, ఆయన అతని భాగమును గ్రంథము నుండి తీసివేస్తాడు.
ఆయన వాక్యమునకు దేనిని కలపకుండా లేదా దానినుండి దేనిని తీసివేయకుండా ఉండునట్లు, ముందెన్నడూ లేని విధంగా, దేవుడు ఒక పరిపూర్ణమైన మార్గమును ఏర్పాటుచేశాడు. ఆయన మాట్లాడుతూ మరియు ఆయనయొక్క వాక్యమును మనకు బయలుపరుస్తుండగా ఆయన స్వరమును వినే అవకాశమును ఆయన మనకు ఇచ్చాడు. దానికంటే గొప్ప విషయం అసలు ఏదియు ఉండజాలదు.
ఇది ఈ దినమునకైన నిజమైన ప్రత్యక్షతయైయున్నది.
మనము ఏడు సంఘకాలములను వినుచుండగా, చదువుతుండగా, మరియు అధ్యయనం చేస్తుండగా ప్రభువు మన కొరకు దాచియుంచిన దానంతటి కొరకు నేను ఎంతో ఉత్సాహభరితుడనైయున్నాను మరియు గొప్ప ఎదురుచూపుతో ఉన్నాను. దేవుడే దానిని వ్రాశాడు, దానిని యోహానుకు సూచించడానికి తన దూతను పంపించాడు, పిదప ఈ క్షణములో మనము ఇక్కడ భూమి మీదకు వచ్చేవరకు వేచియున్నాడు, తద్వారా ఆయన అదే దూతను మనకు పంపించి దానిని బయలుపరచగలుగుటకై యున్నది!
ఈ దినముకంటే మహిమకరమైన సమయము ప్రపంచ చరిత్రలోనే ముందెన్నడూ లేదు. స్వయంగా తామే దేవుని స్వరమును వినే అవకాశమును కలిగియుండటం కంటే మానవుడికి ఇవ్వబడిన గొప్ప ఘనత మరేదియు లేదు. ఆయనయొక్క వధువు ఆయనయొక్క స్వరము ద్వారా అందరూ ఒకే సమయములో ఐక్యము చేయబడటం సాధ్యమైన కాలము ముందెన్నడూ లేదు.
సిద్ధంగా ఉండండి, దేవుడు స్వయంగా ఆయన గురించి మరియు: ఆయనయొక్క జయింపశఖ్యముకాని సైన్యము, ఆయనయొక్క ఏర్పరచుకోబడిన, ఎన్నుకోబడిన గౌరవప్రదమైన స్త్రీ, కాలముయొక్క ఆరంభము నుండి ఆయన ఎవరి కొరకైతే ఎదురుచూశాడో అటువంటి తన ప్రియురాలైన మనము ఎవరమైయున్నాము అనేదాని గురించి ఇంకా అధిక ప్రత్యక్షతను ఇవ్వబోతున్నాడు.
ఏది కూడా దానిని మన నుండి తీసివేయలేదు. అది ముందెన్నడూ లేనివిధంగా మన హృదయములలో మరియు అంతరాత్మలలో లంగరువేయబడియున్నది. అది ఇప్పుడు మనకు ఎత్తబడు విశ్వాసమును ఇస్తున్న ఒక వాస్తవికతయైనది.
మనము ఈ ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, మొదటి వర్తమానమును: 60-1204M యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ను వినుచుండగా మన గొప్ప ప్రయాణమును ప్రారంభిస్తాము.
మీరు మీ సంఘకాల పుస్తకమును తీసుకొని, మరియు మీ నిశబ్ధమైన గదిలో దానిని చదవాలని మరియు ప్రతివారం, అధ్యాయము వెంబడి అధ్యాయము, దానిని అధ్యయనము చేయాలని నేను మిమ్మల్ని ప్రోత్సహించగోరుతున్నాను. మనము ఆయన స్వరమును వినుచు, పిదప ఆయనయొక్క వాక్యమును అధ్యయనము చేస్తూ ఐక్యమవ్వబోవుచున్నాము.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్