ఆదివారం
09 నవంబర్ 2025
64-0614E
The Oddball
కూడిక ఇంత సమయంలో ప్రారంభమవుతుంది:
0
రోజులు
19
గంటలు
40
నిమిషములు
35
క్షణములు

Sun Apr 26, 2020 10:00 AM EDT

పైన శరీరమును ధరించియున్న ప్రియమైన దేవా,

మనము ఇక ఎంతమాత్రమూ తెర వెనుక లేము, చిన్నవారలారా, దేవుడు మనకు పూర్తి దృశ్యములోనికి వచ్చాడు. భూమ్యాకాశముల యొక్క బలిష్ఠుడైన దేవుడు, తననుతాను దేవుని నుండి వచ్చిన ఒక అగ్నిస్తంభముగా ఎల్లప్పుడూ ప్రజలకు ముసుగు ధరించుకొని మరియు యేసు అని పిలువబడిన భూసంబంధమైన శరీరములో నివసించి; పిదప తిరిగి అగ్నిస్తంభములోనికి వెళ్ళి మరియు దమస్కు మార్గములో పౌలును కలుసుకున్నాడు, ఆయనే ఇప్పుడు పూర్తి దృశ్యములోనికి మరలా వచ్చి మరియు మరలా ఆయనయొక్క వర్తమానికుడైన దూతయైన, విలియమ్ మారియన్ బ్రెన్హామ్ యొక్క మానవ శరీరములో నివసించాడు, తన వధువు తనయొద్దకు పిలచుకుంటున్నాడు.

ఆ గొప్ప తెలియబడని సహజాతీతమైనవాటిలోనికి వెళ్ళునట్లు ఆయన యొక్క నియమించబడిన రాయబారిగా స్వయంగా తనకే ప్రతినిధిగా ఉండటానికి దేవుడు తన దూతను భూమి మీద పెట్టాడు. సహజమైన మనస్సు గ్రహించలేని సంగతులను ఆయన వివేచించి బయటకు తెస్తాడు. దేవునియొక్క మర్మమును బయటకు తెచ్చుటకు మరియు ఉన్నవాటిని, ఉండియున్నవాటిని, మరియు రాబోవువాటిని ముందుగా చెప్పుటకు ఆయన పంపబడ్డాడు. వధువుకు ఆయనే దేవునియొక్క స్వరమైయున్నాడు.

అది ఏమిటి? దేవుడు, దేవుడు శరీరముల వెనుక, మానవ శరీరము వెనుక ఉండుటయైయున్నది. అది ఖచ్చితంగా నిజము.

నిజమైన అసలైన విశ్వాసులమైయున్న మనల్ని ఈనాడు అనేకమంది విమర్శకులు అర్థం చేసుకోలేరు. వారికి, మనము వెఱ్ఱివారిగా ఉన్నాము. మనము దైవత్వమును నమ్మేవారమని మరియు ప్రవక్తను ఆరాధిస్తున్నామని వారు అంటారు…

కొన్ని రోజుల క్రితం, దిగువన టూసాన్ లో, ఒక విమర్శకుడు, నాతో ఇట్లన్నాడు. అతడు ఇట్లన్నాడు, “నీకు తెలుసా, కొంతమంది ప్రజలు నిన్ను ఒక వెఱ్ఱివాడని అంటున్నారు, మరియు ఇతరులు నిన్ను దేవునిగా చేస్తున్నారు.” నేను ఇట్లన్నాను, “మంచిది, అది సరిగ్గానే ఉన్నది.” అతడు నన్ను విమర్శించడానికి ప్రయత్నిస్తున్నాడని నాకు తెలుసు. చూశారా? అతడు ఇట్లన్నాడు, “ప్రజలు నీవు ఒక దేవుడివని అనుకుంటున్నారు.”

యేసు ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు అది ఉన్నట్లుగానే, ఈనాడు ఆయనయొక్క ప్రవక్త విషయములో అది సరిగ్గా అదే విధంగా ఉన్నది. ప్రజలు తెర వెనుక లేరు; వారు సత్యము పట్ల గ్రుడ్డివారయ్యారు. మనకు ఈ దినమునకై దేవుడు ఏర్పాటు చేసిన మార్గము తప్ప మరేదియు వద్దు: అది స్వయంగా శరీరములో ముసుగు ధరించుకున్న ఆయనేయైయున్నాడు, రికార్డుచేయబడి మరియు వధువు కొరకు భద్రపరచబడిన దేవునియొక్క స్వరమైయున్నది.

దేవుడు లోకములో ప్రత్యక్షపరచబడినప్పుడు, ఆయన ఒక తెర వెనుక; యేసు అని పిలువబడిన ఒక వ్యక్తియొక్క చర్మము వెనుక దాగుకున్నాడు. ఆయన మోషే అని పిలువబడిన ఒక వ్యక్తియొక్క చర్మము వెనుక ముసుగు ధరించి మరియు దాగుకున్నాడు, మరియు వారు దైవములైయున్నారు, దేవుళ్ళు కాదు; కానీ వారు దేవుడైయున్నారు, ఆ ఒక్క దేవుడు, ప్రతీసారి అదే కార్యమును చేస్తూ, ఈ వాక్యమును తీసుకొనివస్తూ, కేవలం తన ముసుగును మార్చుకోవడమైయున్నారు. దేవుడు దానిని ఆ విధంగా చేశాడు.

మనము కేవలం వాక్యమునకు, ఈ ఘడియయొక్క వర్తమానమునకు బిగించబడియున్నాము. అది ఇప్పుడు మనల్ని మానవ శరీరము వెనుక ముసుగు ధరించిన వాక్యముగా చేసినది. పెండ్లికుమారుడు మరియు పెండ్లికుమార్తె ఒక్కటైయున్నారు. దేవుడు ఒక్కడేయైయున్నాడు, మరియు వాక్యము దేవుడైయున్నాడు! మనము వాక్యమునకు బిగించబడియున్నాము.

బాధాకరముగా, ఈనాడు విశ్వాసుల మధ్యన విభజనకు కారణం ఏమిటంటే మనం దేవునియొక్క నిర్ధారించబడిన ప్రవక్తకు చాలా ఎక్కువ ప్రాథాన్యతను ఇస్తున్నామని వారు భావిస్తున్నారు. దానికి వ్యతిరేకంగా, వారు ఆ నాయకత్వమును తమ సంఘకాపరులకు అప్పజెప్పాలనుకుంటున్నారు.

దేవుడు తన ప్రణాళికను మార్చుకొనడు; తన వధువును నడిపించడానికి ఆయన ఒక్క వ్యక్తిని పంపుతాడు. అగ్నిస్తంభము ద్వారా మనల్ని నడిపిస్తున్నది, మనలో ఒక్కొక్కరిలో ఉన్న పరిశుద్ధాత్మయైయున్నాడు.

వాక్యము ఒక్కరియొద్దకు వస్తుంది. ప్రతి కాలములోను, అంతే, చివరికి సంఘకాలములలో కూడా మొట్టమొదటి దానినుండి చివరి దానివరకు అంతే. ఇతరులు వారి స్థానములను కలిగియున్నారు, అది సరియే, గమనించండి, కానీ ఆ అగ్నిస్తంభము నుండి దూరంగా ఉండండి. చూశారా?

కానీ ఈ రోజు మనం ఏమి వింటున్నాము…అదే విషయమును వింటున్నాము.

దాతాను మరియు వారు బయట అక్కడ ఏమన్నారో మీకు గుర్తున్నదా? వారు ఇట్లన్నారు, “ఇప్పుడు, మోషే, కేవలం ఒక్క నిమిషం ఇక్కడ ఆగుము! నీవు నీ మీదనే ఎంతో బాధ్యత ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నావు, చూడు. ఇప్పుడు, దేవుడు పిలచిన ఇతర వ్యక్తులు కూడా ఇక్కడున్నారు.”

మనము ఆ పరిచర్యకు వ్యతిరేకులము కాదు; దేవుడు వారిని పిలిచాడు, కానీ సహోదరులారా మరియు సహోదరీలారా, మీ సంఘకాపరి మీ సంఘములో టేపులను ప్లే చేయడం ద్వారా సాక్షాత్తు దేవునియొక్క స్వరమును మీరు వినవలసిన అత్యంత ముఖ్యమైన స్వరముగా ఉంచనియెడల, అతడు మిమ్మల్ని దేవుడు ఏర్పాటుచేసిన మార్గమునొద్దకు నడిపించడంలేదు.

అది సత్యము. వారు, ప్రతీ ఒక్కరూ, వారు కొనసాగినంతకాలం బాగుగానే వెంబడిస్తూ ఉన్నారు, కానీ ఒకరు ముందుకు వచ్చి మరియు ఆ పనికొరకు ముందుగా నిర్ణయించబడి మరియు అభిషేకించబడిన మోషేకి ఆయన ఇచ్చినటువంటి దేవునియొక్క స్థానమును తీసుకొనుటకు ప్రయత్నించినప్పుడు మాత్రం, దానిని తీసుకొనుటకు ప్రయత్నించినప్పుడు మాత్రం, అగ్ని వచ్చి మరియు భూమిని తెరచినది మరియు అది వారిని నేరుగా దానిలోనికి మ్రింగివేసినది. చూశారా? చూశారా? జాగ్రత్తగా ఉండండి. చూశారా?

పలుకబడి మరియు టేపులలో ఉంచబడిన ఆ వాక్యమునకు మనమందరమూ బిగించబడవలసియున్నాము. అది దేవునియొక్క సంపూర్ణతయైయున్నది. వధువు ఏకీభవించగల వాక్యము అది మాత్రమేయైయున్నది. పరిచర్య ఎన్నడూ వధువును ఐక్యము చేయదు, కేవలం టేపులలో ఉన్న దేవుని స్వరము మాత్రమే దానిని చేస్తుంది.

మీరు లేకుండా నేను ఏమియు చేయలేను; నేను లేకుండా మీరు ఏమియు చేయలేరు; దేవుడు లేకుండా కూడా ఏమియు చేయలేము. కావున, కలిపి అది ఒక మొత్తముగా చేస్తుంది, ఒక అనుసంధానమును చేస్తుంది. దేవుడు నన్ను ఆ ఉద్దేశము కొరకు పంపించాడు; మీరు దానిని నమ్ముతారు; మరియు అది జరుగుతుంది. అది సరిగ్గా అంతే, చూడండి, పరిపూర్ణముగా నిర్ధారించబడినది.

కలిపి మాత్రమే అది ఒక మొత్తముగా చేస్తుంది, ఆ అనుసంధానమును చేస్తుంది. దేవుడు విలియమ్ మారియన్ బ్రెన్హామ్ గారిని ఆ ఉద్దేశము కొరకే పంపించాడు. పిదప, మీరు దానిని నమ్మినప్పుడు మాత్రమే, అది జరుగుతుంది; పరిపూర్ణముగా నిర్ధారించబడుతుంది.

సహోదరులారా మరియు సహోదరీలారా, దానిని చెప్తున్నది నేను కాదు. అది దేవుడే తన ప్రవక్త గుండా దానిని చెప్పడమైయున్నది. మీకు వేరే విధంగా చెప్పడానికి ఏ వ్యక్తికీ అనుమతించకండి లేదా మీకు దానిని భిన్నముగా వివరించుటకు అనుమతించకండి. టేపులలో ఉన్న దేవునియొక్క స్వరము మాత్రమే వధువును ఐక్యపరచి పరిపూర్ణము చేస్తుంది. వేరే ఏ విధంగానైనా, మీరు వధువైయుండరు.

కావున పెద్దవారైన మనలో చాలామంది అలాగే తలంచుతారని నేను అనుకుంటున్నాను. దేవుడు, పైన చర్మమును కప్పుకొనియుండుట! దేవుడు పైన చర్మమును కప్పుకొనియుండుట! అది లోకమునకు, వినడానికి వెఱ్ఱితనముగా అనిపించవచ్చును, కానీ అది మనుష్యులందరినీ ఆయనయొద్దకు లాగుచున్నది.

ఇప్పుడే ఆయన ఏమి చెప్పాడో మీరు విన్నారా? దేవుడు పైన చర్మమును కప్పుకొనియుండటం మనుష్యులందరినీ ఆయనయొద్దకు లాగుచున్నది.

లోకము వెఱ్ఱితనముకు బిగించబడియుండగా, మనము దేవునియొక్క స్వరమునకు బిగించబడి మరియు వధువుగా పిలువబడుచున్నాము. అది మనల్ని ఈ గందరగోళమునుండి బయటకు లాగుచున్నది, దేవునియొక్క సన్నిధిలోనికి తీసుకొనివెళ్ళుచున్నది. మనము దేవుని వాక్యమునకు-బిగించబడిన వెఱ్ఱివారమైయున్నాము.

ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహన్నం 12:00 గంటల సమయమప్పుడు, వచ్చి మాతోపాటు దేవునియొక్క స్వరమునకు బిగించబడండి, అది మనుష్యులందరినీ ఆయనయొద్దకు లాగుచుండగా అట్లు చేయండి.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

వర్తమానము: వింతవ్యక్తి. 64-0614E

లేఖనములు: I కొరింథీ 1:18-25. / II కొరింథీ 12:11