Sun Apr 26, 2020 10:00 AM EDT
ప్రియమైన దేవునియొక్క సజీవ వాక్యమా,
ఇన్ని సంవత్సరాలుగా నేను దానిని నా హృదయములో దాచుకున్నాను, అదేమిటనగా క్రీస్తుకు ముసుగుగా ఉండి, అదే అగ్నిస్తంభము వాగ్దానము చేయబడినట్లుగా, వాక్యమును అనువదించుచున్నది.
ఇది అనేకమంది ప్రజలకు కఠినముగా అనిపించబోతున్నదని నాకు తెలుసు, కానీ మీరు గనుక కొన్ని నిమిషాలు దేవునియొక్క వర్తమానికుడైన దూతను సహించి, మరియు అధికమైన ప్రత్యక్షత కొరకు దేవుడిని అడిగినట్లైతే, దేవుని సహాయముతో మరియు ఆయనయొక్క వాక్యముతో, మరియు ఆయనయొక్క వాక్య ప్రకారముగా, అతడు ఆయనను సరిగ్గా ఇక్కడ మీ యెదుటకు తీసుకొనివస్తాడని నేను నమ్ముతున్నాను. దేవుడు, తన వాక్యమును అనువదిస్తూ మరియు బయలుపరుస్తూ, ముసుగు తొలగించుకుంటూ మరియు తననుతాను ప్రత్యక్షపరచుకొనుచున్నాడు.
గడిచిన ఈ నెలలో యేసుక్రీస్తు యొక్క వధువులో ఎటువంటి ఒక ఉజ్జీవము చోటుచేసుకుంటున్నదో. దేవుడు, ముందెన్నడూ లేనివిధంగా తనకుతాను ముసుగు తొలగించుకుంటున్నాడు, తన ప్రియురాలితో మాట్లాడుచున్నాడు, ఆమెతో ప్రేమ వ్యవహారము జరిగించుచున్నాడు, ఆమెకు మరలా నిశ్చయతను ఇస్తున్నాడు, మనము ఆయనతో ఒక్కటైయున్నాము.
ఎటువంటి సంకోచము లేదు, ఎటువంటి అనిశ్చయత లేదు, ఎటువంటి అనుమానము లేదు, కనీసం ఒక్క సందేహపు ఛాయయైనా లేదు; దేవుడు మనకు దీనిని బయలుపరిచాడు: టేపులలో మాట్లాడుచున్న దేవునియొక్క స్వరమే ఈ రోజు ఆయనయొక్క వధువు కొరకై దేవుడు ఏర్పాటుచేసిన పరిపూర్ణమైన మార్గమైయున్నది.
మనము ఎన్నడూ దానిని వడకట్టి, స్పష్టము చేసి, వివరించి, లేదా ఏ విధంగానైనా మానవ సవరణలు చేయాల్సిన అవసరము లేకుండా ఆయన ఈ మార్గమును ఏర్పాటుచేశాడు; కేవలం దేవునియొక్క స్వచ్ఛమైన స్వరము నేరుగా మనలో ప్రతి ఒక్కరితో మాట్లాడటాన్ని వినండి.
ఈ దినము వచ్చుచున్నదని ఆయన ఎరిగియున్నాడు. ఆయనయొక్క వధువు ఆ దాచబడిన మన్నాను, ఆయనయొక్క గొర్రెల ఆహారమును మాత్రమే తినగలుగుతుందని ఆయనకు తెలుసు. స్వయంగా దేవునియొద్ద నుండి వస్తున్న దేవుని స్వరమును తప్ప మనం మరిదేనినీ వినగోరము.
మనము ఆ తెరగుండా షెకినా మహిమలోనికి చొచ్చుకొని వెళ్ళాము. లోకము దానిని చూడలేదు. మన ప్రవక్త తన పదములను సరిగ్గా ఉచ్ఛరించకపోవచ్చును. ఆయన సరిగ్గా వస్త్రధారణ చేసుకోకపోవచ్చును. ఆయన యాజక వస్త్రములను ధరించకపోవచ్చును. కానీ ఆ మానవ చర్మము వెనుక, ఆ లోపల షెకినా మహిమ ఉన్నది. ఆ లోపల శక్తి ఉన్నది. ఆ లోపల వాక్యము ఉన్నది. ఆ లోపల సముఖపు రొట్టె ఉన్నది. ఆ లోపల షెకినా మహిమ ఉన్నది, మరదే వధువును పరిపక్వము చేసే వెలుగైయున్నది.
మరియు మీరు ఆ సముద్రవత్సల తోలు వెనుకకు వచ్చేంతవరకు అంతే, మీరు మీ పాత చర్మము, మీ పాత ఆలోచనలు, మీ పాత మతాచారములనుండి బయటకు వచ్చి, మరియు దేవుని సన్నిధిలోనికి వచ్చేంతవరకు అంతే; అప్పుడు వాక్యము మీకు ఒక సజీవమైన వాస్తవముగా మారుతుంది, అప్పుడు మీరు షెకినా మహిమకు మేల్కొల్పబడతారు, అప్పుడు బైబిలు ఒక నూతన గ్రంథముగా మారుతుంది, అప్పుడు యేసుక్రీస్తు నిన్నా, నేడు, మరియు నిరంతరమూ ఒక్కటేరీతిగా ఉన్నవాడిగా కనిపిస్తాడు. మీరు ఆయన సన్నిధిలో బ్రతుకుతున్నారు, ఆ దినమున విశ్వాసులకు, యాజకులకు మాత్రమే అనుగ్రహించబడిన సముఖపు రొట్టెను మీరు తింటున్నారు. “మరియు మనము యాజకులమైయున్నాము, రాజులైన యాజక సమూహమైయున్నాము, ఒక పరిశుద్ధ జనమైయున్నాము, ప్రత్యేకమైన ప్రజలమైయున్నాము, దేవునికి ఆత్మసంబంధమైన బలులను అర్పించుచున్నాము.” అయితే ముసుగుతీయబడిన దేవుడిని చూడటానికి, మీరు లోపలికి, ఆ తెర వెనుకకు రావలసియున్నారు. మరియు దేవుడు ముసుగు తొలగించబడినాడు, మరదే ఆయనయొక్క వాక్యము ప్రత్యక్షపరచబడుటయైయున్నది.
మనము లోకమునకు వింత వ్యక్తులమైయున్నాము, కానీ మనము మన బోల్టు ఎవరన్నది ఎరుగుటనుబట్టి సంతృప్తి చెందియున్నాము మరియు ఆయనయొక్క టేపు నట్టులమైయున్నందుకు అతిశయపడుచున్నాము, ఆయనయొక్క వాక్యము మనల్ని ఆయనయొద్దకు లాగుచుండగా, దానికి బిగించబడియున్నాము.
మీరు టేపులకు బిగించబడియుండకపోతే, మీరొక వ్యర్థమైన గుంపు తప్ప మరేమియు కాదు!!!
ఇప్పుడు, ఇప్పుడు గమనించండి, దేవా! “వాక్యము ఎవరియొద్దకు వచ్చినదో, వారు ‘దైవములని’ పిలువబడినారు,” అని యేసు చెప్పాడు, మరి వారు ప్రవక్తలైయున్నారు. ఇప్పుడు, స్వయంగా ఆ మనిషి దేవుడని కాదు, యేసుక్రీస్తుయొక్క శరీరము ఎలాగైతే దేవుడు కాదో ఇది కూడా అంతే. ఆయన ఒక మనిషియైయున్నాడు, మరియు దేవుడు ఆయన వెనుక ముసుగు ధరించియున్నాడు.
దేవుడు, ఒక దినమందు సముద్రవత్సల తోళ్ళలో ముసుగు ధరించాడు. దేవుడు, ఒక దినమందు మెల్కీసెదెకు అని పిలువబడిన మానవ చర్మములో ముసుగు ధరించాడు. దేవుడు, యేసు అని పిలువబడిన మానవ చర్మములో ముసుగు ధరించాడు. దేవుడు, విలయమ్ మారియన్ బ్రెన్హామ్ అని పిలువబడిన మానవ చర్మములో ముసుగు ధరించాడు. దేవుడు, ఆయనయొక్క వధువు అని పిలువబడే మానవ చర్మములో ముసుగు ధరించాడు.
దీనిని గుర్తుంచుకోవడం ఎంతో ముఖ్యమైయున్నది, కానీ అనేకులు అలా చేయడంలో విఫలమై మరిదేనికొరకో ఎదురుచూస్తున్నారు. అబ్రాహాము చూసిన చివరి సంగతి, అగ్నికురిసి అన్యప్రపంచమునకు తీర్పుతీర్చడానికిముందు, వాగ్దాన కుమారుడు రంగం మీదకు రావడానికిముందు జరుగనైయున్న చివరి సంగతి, యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడేవరకు క్రైస్తవ సంఘము చూసే ఆఖరి సంగతి మెల్కీసెదెకుయైయున్నాడు, దేవుడు శరీరములో ప్రత్యక్షపరచబడి, తన వధువుకు తన వాక్యమును బయలుపరచుటయైయున్నది.
ఇంకా రావడానికి ఏమియు లేదు. ఆయనయొక్క వాక్యములో ఇంకేదియు వాగ్దానము చేయబడలేదు. వధువును పరిపూర్ణము చేయడానికి రావలసిన ఏ వ్యక్తియైనను, లేదా మనుష్యుల గుంపైనను లేదు.
లేదు! పరిపూర్ణము చేయబడటానికి వారు ఇక్కడ సంఘమునకు రాగోరతారు. చూశారా? ఇక్కడ సంఘము వద్ద మనము—మనము ఒకరితోనొకరము సహవాసము పొందుకుంటాము, కానీ పరిపూర్ణత దేవునికి మరియు మనకు మధ్య కలుగుతుంది. పరిశుద్ధాత్మయందు మనల్ని పరిపూర్ణము చేసేది క్రీస్తుయొక్క రక్తమైయున్నది.
ఈ వర్తమానము, ఈ స్వరము, దేవునియొక్క నిర్ధారించబడిన వాక్యము, యేసుక్రీస్తుయొక్క వధువును పరిపూర్ణము చేస్తున్నది.
ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా, మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, మేము: 64-0617 "అన్ని కాలములలో గుర్తించబడిన క్రీస్తు" అను వర్తమానమును వినుచుండగా దేవునియొక్క స్వరము తన వధువును పరిపూర్ణము చేస్తుండగా వచ్చి మాతో కలిసి దానిని వినడానికి మీలో ప్రతియొక్కరినీ నేను ఆహ్వానిస్తున్నాను.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానమునకు ముందు చదువవలసిన లేఖనములు:
ద్వితియోపదేశకాండము 18:15
జెకర్యా 14:6
మలాకీ 3: 1-6
పరిశుద్ధ. లూకా 17: 28-30
పరిశుద్ధ. యోహాను 1:1 / 4:1-30 / 8: 57-58 / 10:32-39
హెబ్రీ 1:1 / 4:12 / 13:8
ప్రకటన 22:19