Sun Apr 26, 2020 10:00 AM EDT
ప్రియమైన నిత్యజీవపు వధువా,
టేపులలో మనతో మాట్లాడుచున్న ఆ స్వరము ఎవరు?
దేవునియొద్ద నుండి వచ్చే ప్రత్యక్షత ద్వారా మాత్రమే మనం ఆ ప్రశ్నకు జవాబును తెలుసుకోగలము. ఆయనయొక్క ముందుగా నిర్ణయించబడిన వధువు మాత్రమే ఆ ప్రత్యక్షతను కలిగియుంటుంది. కావున, మనము: ఆయన వాక్యముయొక్క ఏకైక అనువాదకుడు ఎవరు? ఏడు ముద్రలను బ్రదలుచేసి వాటిని బయలుపరిచేది ఎవరు? బైబిలు గ్రంథముయొక్క ఈ దాచబడిన మర్మములన్నిటినీ బయలుపరిచేది ఎవరు? ఆయనయొక్క వధువును బయటకు పిలిచి మరియు ఆమెను నడిపించేది ఎవరు? విఫలమవ్వజాలని స్వరమును కలిగియుండేది ఎవరు అని ఆయన చెప్పాడో గ్రహించడానికి, ఆయనయొక్క వాక్యమును పరిశోధించవలసియున్నాము.
వాక్య ప్రకారముగా, అది మరెవరో కాదు గానీ, స్వయంగా మెల్కీసెదెకుయేయై యున్నాడు. తండ్రియైనా లేదా తల్లియైనా లేనటువంటి ఒక వ్యక్తి, జీవితకాలమునకు ఆదియైనను అంతమైనను లేనివాడు. శరీరధారియై మరియు మాంసమును మరియు మొక్కజొన్న రొట్టెను తిని, మజ్జిగను త్రాగి, మరియు అబ్రాహాముతో మాట్లాడినది, దేవుడేయైయున్నాడు. ఆయన వ్యక్తిత్వమును కలిగియున్న ఒక వ్యక్తియైయున్నాడు, మానవ శరీరములో జీవించినవాడైయున్నాడు.
ఆ మెల్కీసెదెకు, ఆ వ్యక్తి, ఆ వ్యక్తిత్వము, సరిగ్గా తాను అబ్రాహాము వద్ద చేసినట్లే, పిదప ఇంకొకసారి యేసుక్రీస్తులో చేసినట్లే, మరలా మానవశరీరములో నివసించి తననుతాను బయలుపరచుకుంటాడని అదే వాక్యము చెప్పినది; అయితే ఈనాడు, అది ప్రకటన 10:7 లోని ఆయనయొక్క ఏడవ దూత వర్తమానికునిలోయైయున్నది.
ఆయన తన వధువుతో మాట్లాడి మరియు ఆమెకు తననుతాను బయలుపరచుకోగలుగుటకు ఆయన ఆ భూసంబంధమైన గుడారమును పూర్తిగా తనతోనే నింపివేస్తాడు. దేవుడు తానే మానవ శరీరములో నివసించుచు మరియు మాట్లాడుచున్నాడు. ఆయనయొక్క సంపూర్ణముగా పునరుద్ధరించబడిన మొదటి విత్తనము పూర్తి పరిపక్వతకు వచ్చినది. దేవునియొక్క పూర్తి ప్రణాళిక వచ్చియున్నది; దేవుడు మరియు మానవుడు ఒక్కటైయున్నారు. దేవుడు అబ్రాహాముతో మాట్లాడినట్లుగా తన వధువుతో నేరుగా మాట్లాడుచున్నాడు.
ఆయన వచ్చి మరియు దానిలో జీవించాడు, మెల్కీసెదెకు అనే వ్యక్తిలో నివసించాడు, పిదప ఆ తర్వాత మనము మెల్కీసెదెకు గురించి మరెన్నడూ వినలేదు, ఎందుకనగా ఆయన యేసుక్రీస్తుగా మారినాడు, మెల్కీసెదెకు యాజకుడైయున్నాడు అయితే ఆయన యేసుక్రీస్తుగా మారినాడు, ఇప్పుడు, మీరు దానిని దాటివేసి వచ్చారు, ఎందుకనగా ఆ స్థితిలో ఆయన సమస్తమును ఎరిగియున్నాడు, మరియు మీరు ఇప్పటివరకు దానిని తెలుసుకోగలిగే స్థితిలో ఎన్నడూ లేరు.
ఇప్పటివరకు...!! అలాగైతే మనము ఎవరము?
మన కన్నులు, మన రూపము, మనము ఏమైయున్నామో అదంతా కూడా, మనము ఆదిలోనే ఆయనయొక్క ఆలోచనలో ఉన్నాము. ఒక్క దూతయైనా, నక్షత్రమైనా, కెరూబుయైనా, లేదా మరేదైనా లేకముందే మనము ఆయన ఆలోచనలో ఉన్నాము. ఆయన దానిని ఆలోచించాడు, ఆయన దానిని పలికినాడు, మరియు ఇదిగో మనము ఇక్కడ ఉన్నాము.
అది పరిమితులు లేనిదైయున్నది. మన మెదడులలో మనము దానిని అర్థం చేసుకోలేము, కానీ అదే దేవుడైయున్నాడు. దేవుడు, పరిమితులు లేనివాడైయున్నాడు!
మనము ఆదియందు ఆయనలో ఉన్నాము గనుక, ఇక్కడ భూమి మీద ఈ మర్త్యమైన శరీరము ముగిసిన తర్వాత మనకు ఏమి జరుగుతుంది?
ఈ శరీరమనే వస్త్రము విడువబడినప్పుడు, మనము వెళ్ళునట్టి, ఒక సహజమైన శరీరము, అనగా థియోఫనీ, హస్తములతో చేయబడనిది, తల్లి నుండియైనను జన్మించనిదియైన ఒక శరీరము ఉంటుంది. పిదప ఆ శరీరము తిరిగి వచ్చి మరియు మహిమ శరీరముగా మారుతుంది.
ఆయనయొక్క వధువు కొరకు ఎటువంటి అద్భుతమైన సంగతులు సిద్ధపరచబడియున్నవి కదా. ముందెన్నడూ లేనివిధంగా ఆయన మనకు తన వాక్యమును బయలుపరుస్తుండగా సరిగ్గా ఇప్పుడు ఏమి జరుగుతున్నదో చూడండి. ఆయనయొక్క వధువు కొరకైన ప్రేమలేఖ గురించి మాట్లాడండి! మనము ఎటువంటి ఒక దినములో జీవిస్తున్నాము కదా.
మనము ప్రత్యక్షతను కలిగియుండి మరియు టేపులలో మనతో మాట్లాడుచున్నది, మెల్కీసెదెకుయేనని, దేవునియొక్క స్వరమేనని ఎరిగియున్నాము. అది ఈ దినము కొరకు దేవునిచేత ఏర్పాటు చేయబడిన పరిపూర్ణమైన చిత్తమైయున్నది అనే ప్రత్యక్షతను మనము కలిగియున్నాము. కావున, ఆయన ఎవరో మనకు తెలుసు మరియు మనము ఆయనయొక్క వధువైయున్నాము.
ప్రతీ రోజు ప్రత్యక్షత మరింత గొప్పగా మరియు మరింత గొప్పగా మారుచున్నది. గడుచుచున్న ప్రతి దినము మనకు మరింత సంతోషమును, మరింత ప్రత్యక్షతను తీసుకువస్తున్నది. మనము ఎవరమైయున్నాము, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, మనతో కలిసి ఉండుటకు ఆయన ఎంతగా ఆత్రుతపడుచున్నాడు అనేది ఆయన మనతో చెప్తుండగా, వధువు ఆయన స్వరముయొక్క సన్నిధిలో కూర్చొని తననుతాను సిద్ధపరచుకుంటున్నది!!!
మనము మెల్కీసెదెకు స్వరమును వినుచుండగా, ఏమి జరుగబోవుచున్నదో దానికొరకు, వచ్చి, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయముకల్లా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానము: 65-0221E "ఈ మెల్కీసెదెకు ఎవరు?"
చదువవలసిన లేఖనములు:
ఆదికాండము18వ అధ్యాయము
నిర్గమకాండము 33:12-23
పరిశుద్ధ. యోహాను 1:1
రోమా 8:1
2 కొరింథీ 5:1
1 థెస్సలొనీక 4:13-18
మొదటి తిమోతి 3:16 / 6:15
హెబ్రీ 7:1-3 /13:8
ప్రకటన 10:1-7 / 21:16