ఆదివారం
24 మే 2026
65-0725E
ఆ పర్వతము మీద ఆకర్షణ ఏమిటి?
కూడిక ఇంత సమయంలో ప్రారంభమవుతుంది:
0
రోజులు
19
గంటలు
40
నిమిషములు
35
క్షణములు

Sun Apr 26, 2020 10:00 AM EDT

కూడుకొనుచున్న ప్రియమైన పక్షిరాజులారా,

ప్రపంచమంతటా చోటుచేసుకుంటున్న ఈ గొప్ప ఆకర్షణ ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు కూడుకొని, గొప్ప ఎదురుచూపుతో తమ గృహములలో మరియు తమ సంఘములలో కూర్చొని, దేవునియొక్క స్వరము తమతో మాట్లాడటాన్ని వినడానికి వేచియుంటున్నారు.

కేవలం టేపులను వినడం ప్రపంచానికి ఎంతో వింతగా మరియు అసంబద్ధంగా అనిపిస్తున్నది. మనం టేపులను ఏ సమయములోనైనా వినవచ్చు అని వారంటారు. ఒకే సమయములో వినడంలో విషయమేమీ లేదని అంటారు. మీరు టేపులను మాత్రమే కాదు గానీ, ఒక ప్రత్యక్ష పరిచర్యను, ఒక బోధకుడు ప్రసంగించుటను తప్పకుండా వినాలని అంటారు. వారు వారి ఆచారములలో చిక్కుకొనియున్నారు.

ప్రపంచ చరిత్రలో ఇటువంటిది ఎన్నడూ చోటుచేసుకోలేదు. ఆ స్వరము ఆయనయొక్క వధువును పిలువడాన్ని వినుటకు అందరూ ఒకే సమయములో ఐక్యమవ్వడానికి ఈ ప్రజలను ఆకర్షించినది ఏమిటి? అది దేవుడు లూకా 17:30 ని నెరవేర్చడమైయున్నది. అది దేవుడు ప్రకటన 10:7 ను నెరవేర్చడమైయున్నది. అది దేవుడు హెబ్రీ 13:8 ని బయలుపరచడమైయున్నది, ఆయన అబ్రాహామునకు చేసినట్లే, మెల్కీసెదెకు మానవ శరీరములో ఉండుటయైయున్నది.

ఆయన ఏమి చెప్తాడు? ఆయన మాట్లాడటం ప్రారంభించినప్పుడు ఏమి జరుగుతుంది? అని వారు వేచియుంటున్నారు మరియు ఆశ్చర్యపోతున్నారు. ఆయన చెప్పే దేనినైనా పొందుకోడానికి వారు అనుసంధానములో ఉండగోరుతున్నారు. వారికి అది కావాలి. వారు ప్రపంచవ్యాప్తముగానున్న వధువుతో కలిసి అందరూ ఒకే సమయములో దానిని వినగోరుతున్నారు. ఏలయనగా తన వధువును బయటకు పిలిచి మరియు ఆమెను నడిపించడానికి తనయొక్క స్వరముగా ఉండుటకు దేవుడు ఎన్నుకున్న స్వరము ఆయనేయని వారు నమ్ముచున్నారు.

కాలవ్యవధిలో వారు అనేక గంటల వ్యత్యాసములో ఉన్నారు, అయినను వారందరూ ఒక్కటిగా ఉన్నారు, అనుసంధానమైయున్నారు, ఆ స్వరము వారితో మాట్లాడటాన్ని తమ స్థానిక సంఘములోనుండి వింటున్నారు. వారు కుమారుని సన్నిధిలో కూర్చొనియున్నారు, పరిపక్వము చెందుతూ మెస్సీయా యొక్క రాకడ కొరకు వేచియుంటున్నారు.

వారి గుండెలు వేగముగా కొట్టుకుంటున్నాయి. ఏమి జరుగుతున్నదో పరిశుద్ధాత్మ వారికి బయలుపరుస్తున్నాడు. ఆయనయొక్క వాక్యమును ప్రత్యక్షపరచడానికి మరియు ఆయనయొక్క వధువును సమకూర్చడానికి దేవుడు ఈ దినము వరకు వేచియున్నాడు. అది సంభవించుచున్నది, మరియు వారు దానిలో భాగమైయున్నారు. సంభవించుచున్నదానియొక్క వాస్తవికత వారి హృదయములలో నాటబడుచున్నది. శతాబ్దాలుగా వారు దాని గురించి లేఖనములలో చదివారు, కానీ ఇప్పుడు అది ఒక వాస్తవమైయున్నది. వాక్యముయొక్క ప్రత్యక్షత వారిలో ప్రత్యక్షపరచబడుచున్నది. ప్రవక్తయొక్క ప్రవచనాలు నెరవేర్చబడుచున్నవి.

ఆయనయొక్క బలిష్ఠమైన స్వరముయొక్క గొప్ప అభిషేకము క్రింద వారు కూర్చుండగా, సిద్ధపడమని ఆయన వారికి చెప్తాడు; ఏలయనగా ఈ రాత్రి ఆయన వారిలో ప్రతియొక్కరి కొరకు ప్రార్థించబోవుచున్నాడు. వారెక్కడున్నా గాని: టెక్సాస్ లో ఉన్నా, క్యాలిఫోర్నియాలో ఉన్నా, పైన ఆరిజోనాలో ఉన్నా, దక్షిణ అమెరికాలో ఉన్నా, చివరకు ప్రపంచముయొక్క అవతలి వైపున అడవులలోని గుడిసెలలో ఉన్నా గానీ, అంతటా వ్యాపించియుండే దేవుని సన్నిధి వారితో కూడా ఉంటుంది గనుక, ఆయన ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు, వెళ్ళి రోగుల మీద చేతులుంచమని ఆయన మనకు చెప్తాడు. ఎక్కడనుండి అనుసంధానమై వింటున్నాగాని, మనము ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు ఒకరిపై ఒకరు చేతులుంచండి, మరియు వారు నమ్మినట్లైతే దేవుడు వారిలో ప్రతీ ఒక్కరిని స్వస్థపరుస్తాడు, ఏలయనగా అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నది.

ప్రతీ కాలములోను మరియు గతంలో వచ్చినట్టి లేదా భవిష్యత్తులో రాబోవునట్టి ప్రతీ ప్రవక్త ద్వారానూ, ఆ వర్తమానమును వినడానికి ముందుగా నిర్ణయించబడిన కొంతమంది ప్రజలు ఉంటారని, మరియు వారు దానిని వెంబడిస్తారని ఇప్పుడు వారు గ్రహిస్తారు. వారు గుంపులను లెక్కచేయరు. అది తప్పు లేదా అది దేవుడు ఏర్పాటుచేసిన మార్గము కాదు అని చెప్పే అవిశ్వాసియొక్క విమర్శను వారు లెక్కచేయరు. వారు వారితో ఎటువంటి వాదన పెట్టుకోరు. వారు తప్పకుండా చేయవలసిన ఒకే ఒక్కటి ఉన్నది, అదేమిటనగా నమ్మికయుంచి మరియు దానిలో వారు పొందుకోగల ప్రతిదానిని పొందుకోవడమైయున్నది, యేసు పాదముల దగ్గర కూర్చున్న మరియవలె అంతరంగములో పూర్తిగా దానితో నిండిపోవాలి. వారు సిగ్గుపడరు, వారు ప్లే ను నొక్కే టేపు అబ్బాయి లేదా టేపు అమ్మాయి అని చెప్పుకోడానికి వారు ఎంతో అతిశయిస్తారు.

అంత్యకాలములో ఒక గొప్ప అభిషేకమును, పరిశుద్ధాత్మను కలిగియుండే అభిషిక్తులు ఉంటారని ఆ స్వరము వారిని ఇదివరకే హెచ్చరించినది. వారు ప్రవక్తను మరియు ఈ ఘడియయొక్క వర్తమానమును ఉల్లేఖిస్తారు; విశ్వాసులని చెప్పుకుంటారు, కానీ అబద్ధపు అభిషిక్తులైయుంటారు.

వారు అసలైన అభిషేకమునకు ఎంత దగ్గరగా ఉంటారంటే సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సైతం అది మోసపరుస్తుంది, కానీ వారు మోసపరచబడలేరని వారికి తెలుసు, ఏలయనగా వారు వాక్యమైయున్నారు. వారు దేవుని స్వరముతో నిలబడిన అసలైన వధువైయున్నారు.

ఈ దినమున అది ఒక నిమ్మకాయనో, లేదా ఒక దబ్బనారింజనో అయ్యుండదని ఆ స్వరము వారికి ప్రకటిస్తుంది. వాటి మధ్య వ్యత్యాసమును గుర్తుపట్టడటం తేలికగా ఉంటుంది. అయితే అది ఒక సంకరజాతి నారింజయై యుంటుంది, అది సగం నిమ్మకాయ, సగం నారిజయై యుంటుంది, అది కలగలుపు చేయబడిన జాతియైయున్నది. అది చూడటానికి సరిగ్గా నారింజ వలెనే ఉంటుంది, కానీ అది కాదు, ఏలయనగా ఆ క్రొత్త కొమ్మ 100% అసలైనదాని వలెనే ఉంటుంది. వారు ఆ అసలైన వాక్యస్వరముతో నిలిచియుంటారు. వారు నిర్లక్ష్యంగా ఉండరు. వారు ఒక్క దేవునితో నిలిచియుంటారు, ఆయనయొక్క స్వరమైయున్నాడని, అగ్నిస్తంభము ద్వారా నిర్ధారించబడిన ఆయనయొక్క వాక్యమైయున్నాడని ఆయన స్వయంగా తానే ప్రకటించాడు.

ఏమి జరుగుతున్నది?

దేవునియొక్క ముందుగా నిర్ణయించబడిన విత్తనము దానిని వెంబడిస్తూ మరియు ఆ స్వరమును వినడం తప్ప మరొకటి చేయలేదు, ఏలయనగా అది వారికి జీవముకంటే విలువైనది. మీరు వారి ప్రాణములను తీసుకోవచ్చు, కానీ మీరు ఆ స్వరమును తీసుకోలేరు.

ఆకర్షణ ఏమిటి?

దేవుడు, ఎప్పటిలాగానే, ఆయనయొక్క వాక్యమును నెరవేరుస్తున్నాడు.

ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, లేఖనము ప్రత్యక్షపరచబడటాన్ని మేము వినుచుండగా, వచ్చి మాతో చేరి ప్రవక్త ప్రవచనముయొక్క నెరవేర్పులో భాగము కండి.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

వర్తమానము: 65-0725E "ఆ పర్వతము మీద ఆకర్షణ ఏమిటి?"

లేఖనములు:

పరిశుద్ధ. మత్తయి 21:1-4
జెకర్యా 9:9 / 14:4-9
యెషయా 29:6
ప్రకటన 16:9
మలాకి 3:1 / 4వ అధ్యాయము
పరిశుద్ధ. యోహాను 14:12 / 15:1-8
పరిశుద్ధ. లూకా 17:22-30