ఆదివారం
15 జూన్ 2025
65-1125
క్రీస్తు పెళ్లికుమార్తె యొక్క అదృశ్యమైన ఐక్యత

దేవునియొక్క ప్రియమైన ఎన్నుకోబడిన యువతి,

దానిని నిరాకరించడానికి ఏ దారి లేదు, నీవు దేవునియొక్క ఆత్మసంబంధమైన జన్యువు అయ్యున్నావు, ఆయన తలంపులయొక్క గుణలక్షణములయొక్క భావవ్యక్తీకరణయైయున్నావు, మరియు జగత్తుపునాది వేయబడకముందే ఆయనలో ఉండియున్నావు.

మనము ఇక ఎంతమాత్రము ముందుకు వెళ్ళలేము, మనము సరిగ్గా భూమిలోనికి వెళ్ళిన అదే విత్తనమువలె ఉన్నాము. మనము వధువు రూపములో ఉన్న, అదే యేసుయైయున్నాము, అదే శక్తిని కలిగియున్నాము, అదే సంఘమైయున్నాము, అదే వాక్యము మనలో జీవించుచు మరియు నివసించుచుండగా ఒక శిరస్సులోనికి రూపించబడుతూ, ఎత్తబడుటకు సిద్ధముగా ఉన్నాము.

మనము ఆత్మసంబంధమైన మరణము ద్వారా, మనయొక్క మొదటి ఐక్యత నుండి వేరుచేయబడ్డామని ఆయన మనకు చెప్పాడు, మరియు ఇప్పుడు తిరిగి జన్మించియున్నాము, లేదా మనయొక్క ఆత్మసంబంధమైన నూతన ఐక్యతకు, మరలా వివాహము గావించబడ్డాము. మనయొక్క పాత భౌతికమైన జీవితము మరియు లోకసంబంధమైన కార్యములు ఇక ఎంతమాత్రము లేవు గాని, నిత్యజీవ సంబంధమైన సంగతులున్నవి. ఆదిలో మనయందున్న ఆ కణము, మనలను కనుగొన్నది!

దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏమిటనగా మన పాత ఐక్యతతో మన పాత గ్రంథము వెళ్ళిపోయినది, అది బదిలీ చేయబడినది. అది ఇప్పుడు దేవునియొక్క “క్రొత్త గ్రంథములో” ఉన్నది; జీవ గ్రంథములో కాదు… కాదు, కాదు, కాదు… కానీ గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఉన్నది. గొర్రెపిల్ల విమోచించినదైయున్నది. అది మనయొక్క నిజమైన నిత్యమైన కణము పట్టు తీసుకునేటటువంటి మనయొక్క వివాహ ధృవీకరణ పత్రమైయున్నది.

మీరు సిద్ధంగా ఉన్నారా? ఇదిగో విషయం వస్తున్నది. మీరు మిమ్మల్ని మీరు గిచ్చుకొని మరియు అరచి మరియు మహిమా, హల్లెలూయ, ప్రభువునకు స్తోత్రం అని కేకలు వేయడానికి సిద్ధపరచుకోవడం మంచిది, ఇది రెండు గొట్టములు కలిగి మరియు పరలోక సంబంధమైనవాటితో నింపబడియున్నది.

“నా పొరపాట్లు, నా వైఫల్యములన్నిటితో నిండియున్న నా పాత గ్రంథము అని నీవు నాకు చెప్పాలనుకుంటున్నావా…”

దేవుడు దానిని తనయొక్క మరచిపోవుట అనే సముద్రములో పడవేశాడు, మరియు మీరు క్షమించబడటం మాత్రమే కాదు గాని, మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు…మహిమ! “నీతిమంతులుగా తీర్చబడ్డారు.”

మరియు దాని అర్థం ఏమిటి? మీరు దేవుని దృష్టిలో దానిని ఎన్నడూ చేయలేదు అని దాని అర్థము. మీరు దేవునియెదుట పరిపూర్ణులుగా నిలబడతారు. మహిమ! వాక్యమైయున్న, యేసు, మీ స్థానమును తీసుకున్నాడు. ఒక మురికి పాపియైన మీరు, వాక్యమైయున్న, ఆయనవలె మారునట్లు, ఆయన మీవలె మారాడు. మనము వాక్యమైయున్నాము.

అదియే మనలను ఆదినుండే నిర్ణయించబడిన ఆయనయొక్క చిన్న కణముగా చేస్తుంది. మనము వాక్యము మీద వాక్యము, మీద వాక్యము, మీద వాక్యము, మీద వాక్యము వచ్చుటయైయున్నాము, మరియు ఆయనయొక్క వధువుగా ఉండుటకై, ఆయన వచ్చి మనల్ని తీసుకొనుటకు క్రీస్తుయొక్క సంపూర్ణ స్వరూపములోనికి వచ్చుచున్నాము.

ఇప్పుడు ఏమి జరుగుచున్నది?

ఇది ప్రపంచమంతటినుండి, వాక్యము చుట్టు కూడివచ్చుచున్న క్రీస్తు వధువుయొక్క అదృశ్యమైన ఐక్యతయైయున్నది.

ఇది దేశవ్యాప్తంగా అంతటా వెళ్తుంది. న్యూ యార్క్ లో, ఇప్పుడు పదకొండు ఇరువై-ఐదు నిమిషములవుతుంది. ఆ పైన ఫిలదెల్ఫియలో మరియు ఆ చుట్టుప్రక్కల, అంతటా సంఘములలో, ఆ ప్రియమైన పరిశుద్ధులు అక్కడ కూర్చొని, సరిగ్గా ఇప్పుడు, వింటున్నారు. ఆ పైన, దిగువున మెక్సికో చుట్టు, ఆ పైన కెనెడాలో మరియు చుట్టూ, అంతటా వింటున్నారు. ఇక్కడ ఉత్తర అమెరికా ఖండములో, దాదాపు, రెండువందల మైళ్ళలో ఎక్కడైనా, ప్రజలు సరిగ్గా ఇప్పుడు, దానిని వింటున్నారు. వేలకు వేలమంది, వింటున్నారు.

మరియు మీకు, అనగా సంఘమునకు, ఒక ఐక్యత అయ్యున్న మీకు, వాక్యము ద్వారాయైన ఆత్మసంబంధమైన ఐక్యతయైయున్న మీకు, అదియే నా వర్తమానము,

అది క్రీస్తు మరియు ఆయన సంఘముయొక్క ఆత్మసంబంధమైన ఐక్యత అయ్యున్నదని ఆయన చెప్పాడు, మరియు అది సరిగ్గా ఇప్పుడు జరుగుచున్నది. శరీరము వాక్యమగుచున్నది, మరియు వాక్యము శరీరమగుచున్నది. మనము ప్రత్యక్షపరచబడ్డాము, మరియు నిర్ధారించబడ్డాము; సరిగ్గా బైబిలు గ్రంథము ఈ దినములో ఏమి జరుగుతుందని చెప్పినదో అదేయైయున్నది, మరియు అది ఇప్పుడు, దినదినము మనలో జరుగుచున్నది.

దేవుడు ఒక గుణవతియైన సంఘమును కలిగియుండబోవుచున్నాడు. ఆయనయొక్క నిజాయితీగల, విశ్వాసనీయురాలైన, వాక్య వధువైయున్నది. మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క ఎన్నుకోబడిన గౌరవప్రదమైన స్త్రీ మనమేయైయున్నాము.

అయ్యా, ఎంత వేళయైనది?

ప్రభువైన దేవునియొక్క వర్తమానము ఆయనయొక్క వధువును ఏకముగా సమకూర్చుటకు తగిన ప్రత్యక్షతను, ఈ అంత్య దినములలో మనము కలిగియున్నాము. వేరే ఏ కాలమునకైనా ఇది వాగ్దానము చేయబడలేదు. ఈ కాలమునకే ఇది వాగ్దానము చేయబడినది: మలాకీ 4, లూకా 17:30, పరిశుద్ధ యోహాను 14:12, యోవేలు 2:38. ఆ వాగ్దానములు సరిగ్గా బాప్తిస్మమిచ్చు యోహాను లేఖనములో తననుతాను గుర్తించుకున్నట్లుగానే ఉన్నవి.

ఈ లేఖనములను ఎవరు నెరవేర్చారు?

ఆయనయొక్క బలమైన ఏడవ దూతయైన, విలియమ్ మారియన్ బ్రెన్హామ్ గారు. ఆయన దానిని ఎల్లప్పుడూ నమూనా ప్రకారముగా చేసాడు. ఆయన ప్రతీసారి దానిని నమూనా ప్రకారమే చేసాడు. ఆయన మరలా మన దినములో కూడా దానిని చేస్తున్నాడు, ఈ చివరి దినములో ఆయనయొక్క ప్రవక్త ద్వారా ఆయనయొక్క గుణవతియైన వధువును బయటకు పిలచుచు సమకూర్చుచున్నాడు.

వధువు ఎంతో గొప్ప సమయమును కలిగియుంటుంది. ప్రతి కూడిక గొప్పగా మరియు మరింత గొప్పగా మరియు మాధుర్యముగా మరియు మరింత మాధుర్యముగా మారుతుంది. ఇటువంటి ఒక సమయము ఎన్నడూ లేదు. సందేహములన్నీ మాయమైపోయినవి.

మన దినమునకైన వాగ్దాన వాక్యము మాట్లాడి, మరియు మనము ఎవరమనేది మరియు మన దినములో ఏమి జరుగుతుంది అనేది మనకు చెప్పడాన్ని వినుచుండగా వచ్చి మాతో చేరండి. క్రీస్తు వధువుయొక్క అదృశ్య ఐక్యత 65-1125.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

 

లేఖనములు:

పరిశుద్ధ. మత్తయి 24:24
పరిశుద్ధ. లూకా 17:30 / 23:27-31
పరిశుద్ధ యోహాను 14:12
అపొస్తలుల కార్యములు 2:38
రోమా 5:1 / 7:1-6
2 తిమోతి 2:14
1 యోహాను 2:15
ఆదికాండము 4:16-17 / 25-26
దానియేలు 5:12
యోవేలు 2:28
మలాకీ 4