ఆదివారం
22 మార్చి 2026
65-0221M
వివాహము మరియు పరిత్యాగము
కూడిక ఇంత సమయంలో ప్రారంభమవుతుంది:
0
రోజులు
19
గంటలు
40
నిమిషములు
35
క్షణములు

Sun Apr 26, 2020 10:00 AM EDT

ప్రియమైన ఎంపిక చేయబడిన, ఎన్నుకోబడిన, & ముందుగా నిర్ణయించబడిన వధువా:

ఒక యవనస్థుడిగా ఎదుగుతున్నప్పుడు, వినడానికి ఒక టేపును ఎన్నుకొనుటకు ప్రయత్నించడం నాకు గుర్తున్నది. వాటి పేర్లను చదివేటప్పుడు, దానితో నాకు ఎటువంటి సంబంధము లేదు గనుక, నేను వివాహము మరియు పరిత్యాగము అనే వర్తమానమును ఎన్నడూ వినను; అది కేవలం వివాహితుల కొరకు మాత్రమే అని నేనెళ్ళప్పుడు అనుకునేవాణ్ణి.

పిదప ఒక రోజు, వివాహము మరియు పరిత్యాగమును వినుచుండగా, తండ్రి నాకు ఆ వర్తమానముయొక్క ప్రత్యక్షతను ఇచ్చాడు. ఆయనయొక్క అభిషేకము నా హృదయములోనికి వచ్చినది. ఆయన నాతో మాట్లాడుతున్నాడు. ఈ వర్తమానము నా కొరకేయైయున్నది. ఆయన నన్ను జగత్తుపునాది వేయబడకముందే ఎన్నుకున్నాడని ఆయన నాతో చెప్తున్నాడు. ఇది నా వివాహ వేడుకయైయున్నది. నాకు ఆయన తప్ప మరెవ్వరూ వద్దు. నేను ఆయనకే, మరియు ఆయనయొక్క వాక్యమునకే, మరియు ఆయనయొక్క స్వరమునకే, నమ్మకముగాను మరియు విశ్వాసనీయముగాను ఉన్నాను. మేము ఒక్కటైయున్నాము.

నిజముగానే ఈ వర్తమానము వివాహము జరిగి మరియు ఇప్పుడు పరిత్యాగమైపోయిన అనేక సహోదరులు మరియు సహోదరీల కొరకైయున్నది, మరియు వారేమి చేయాలని ఆయన వారితో చెప్పుటయైయున్నది; కానీ అందులో ఇంకా చాలా పరిపూర్ణమైనదియు మరియు ఉన్నతమైనదియునైన అర్థము ఉన్నది, ఇంకా చాలా గొప్పదియు, ఇంకా చాలా శక్తివంతమైనదియునైన అర్థము ఉన్నది.

ఒక్క భర్త ఉన్నాడు, మరియు ఆయన తనయొక్క అనేకమైన, ఎన్నుకోబడిన వధువును పిలచుచు మరియు వారితో మాట్లాడుచున్నాడు. దేవునియొక్క స్వరము తనయొక్క స్వచ్ఛమైన, సంకరములేని, కన్య వాక్య వధువును పిలచుచున్నది. ఆమె మనుష్యునిచేత తాకబడనిది లేదా చెరపబడనిదైయున్నది. ఆయనకు మరియు ఆయనయొక్క వాక్యమునకే నమ్మకముగాను మరియు విశ్వాసనీయముగాను ఉన్నదైయున్నది. ఆయనతో మరియు ఆయనయొక్క స్వరముతో పూర్తిగా తృప్తిచెందినదైయున్నది.

ఆయనయొక్క కృపా మరియు కనికరము ద్వారా, మనము ఆయనయొక్క కన్య వాక్య వధువైయున్నామని, ఒక్క సందేహపు ఛాయయైనా లేకుండా, ఈనాడు మనము చెప్పగలము. మహిమ!!

ఆయనయొక్క వధువును పిలిచే విషయానికి వచ్చినప్పుడు ఆయన ఏ కార్యము కూడా అసంపూర్ణముగా వదిలిపెట్టబడకుండా సరిచూసుకోవాలనుకున్నాడు, కావున ఆయన స్వయంగా తానే వచ్చాడు మరియు తన వాక్యమును బయలుపరిచి మరియు తన వధువును తనయొద్దకు పిలుచుకోడానికి మానవ శరీరములో నివసించాడు. ఆయన తన స్వంత వధువును ఎన్నుకునే ఎలీయెజెరుయై యున్నాడు.

మనల్ని ప్రేమతో ఆకర్షిస్తున్నది ఎవరు అనే విషయములో మనము ఏ విధంగాను గందరగోళమవ్వకుండా చూసుకోడానికి, ఆయన ఒక చెట్టులో వ్రేలాడుతున్న ఒక సుడిగాలి నుండి అతనితో మాట్లాడటం ద్వారా, ఆయన స్వయంగా తానే తనయొక్క ఎన్నుకోబడిన పాత్రను నిర్ధారించాడు. పిదప వేలమంది ప్రజల ఎదుట ఓహియో నది వద్ద ఆయన దృశ్యముగా అతనితో మాట్లాడినాడు.

ఆయన ప్రపంచానికి చూపించి మరియు ఇట్లు చెప్పడానికి అతనితో ఆయనయొక్క ఫోటోను కూడా తీయబడనిచ్చాడు, నేను మరలా వచ్చి శరీరములో నివసిస్తానని మీతో చెప్పాను. నా వధువుగా ఉండుటకు మిమ్మల్ని బయటకు పిలుచునట్లు, నేను నివసించడానికి ఎన్నుకున్న వ్యక్తి అతడేయైయున్నాడు. అది అతడు కాదు; అది నేనే అతనిగుండా మాట్లాడుటయైయున్నది. మీకు నా స్వరముగా ఉండడానికి నేను కేవలం అతని స్వరమును ఉపయోగించుకుంటున్నాను. మిమ్మల్ని బయటకు పిలిచి మరియు నా పరిపూర్ణమైన వధువుగా ఉండుటకు మిమ్మల్ని పరిపూర్ణము చేసేదే నేనే.

ఈ వర్తమానముయొక్కయు, ఆయన వాక్యముయొక్కయు, ఆయన స్వరముయొక్కయు, మరియు ఇప్పుడు మనము ఎవరైయున్నాము అనేదానియొక్కయు ప్రత్యక్షతను వ్యక్తపరచడానికి ప్రయత్నించుటకు అది మానవ పదములకు మించినదైయున్నది. నేను సరిగ్గా ఏమి చెప్తున్నానో మీకు తెలుసని నాకు తెలుసు. ఎత్తబడు విశ్వాసము చోటుచేసుకుంటున్నది. వధువు స్వయంగా దేవునియొక్క సన్నిధిలోనే కూర్చొని, పరిపూర్ణము చేయబడుతూ తననుతాను సిద్ధపరచుకుంటున్నది.

ప్రపంచము దేవునియొక్క స్వరము తమతో మాట్లాడటాన్ని వినుటకు ఎటువంటి ఒక అవకాశమును కలిగియున్నది కదా; ఆయన మాట్లాడుతూ మరియు తన వాక్యమును బయలుపరుస్తూ మరియు మనమెవరన్నది మనతో చెప్తుండగా కూర్చొని మాట వెంబడి మాట వినడం ఎటువంటి అవకాశము కదా. ఆయనయొక్క సన్నిధిలో కూర్చొనియుండడం వంటిది ఏదియు లేదు, కాబట్టి ఈ ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, ఆయన తన వధువుతో, "వివాహము మరియు పరిత్యాగము" 65-0221M అనే వర్తమానమును మాట్లాడుటను మేము వినుచుండగా, వచ్చి మాతో చేరండి.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

వర్తమానము వినడానికిముందు చదువవలసిన లేఖనములు:

పరిశుద్ధ. మత్తయి 5:31-32 / 16:18 / 19:1-8 / 28:19
అపొస్తలుల కార్యములు 2:38
రోమా 9:14-23
మొదటి తిమోతి 2:9-15
మొదటి కొరింథీ 7:10-15 / 14:34
హెబ్రీ 11:4
ప్రకటన 10:7
ఆదికాండము 3 వ అధ్యాయము
లేవీయకాండము 21:7
యోబు 14:1-2
యెషయా 53
యెహెజ్కేలు 44:22