ఆదివారం
21 జూన్ 2026
65-0822M
క్రీస్తు తన సొంత వాక్యమునందు బయలుపరచబడెను
కూడిక ఇంత సమయంలో ప్రారంభమవుతుంది:
0
రోజులు
19
గంటలు
40
నిమిషములు
35
క్షణములు

Sun Apr 26, 2020 10:00 AM EDT

ప్రియమైన రాణి,

మరియు ఈనాడు వధువు క్రీస్తుయొక్క శరీరము నుండి బయటకు తీయబడినది, అది ఈ దినమున ఎలా చేస్తుందని ఆయన చెప్పాడో ఆమె సరిగ్గా అట్లే ప్రవర్తిస్తున్నది మరియు సరిగ్గా అట్లే క్రియచేస్తున్నది, ఆ వధువు, ఆ రాణి; రాజు మరియు రాణి.

యేసు ఆ పూర్తి వాక్యముగా మారినప్పుడు, అప్పుడు మనము అప్పుడు ఆయనలో భాగమైయున్నాము. దానిని మననుండి తీసివేయగల ఏ దయ్యము, ఏ శక్తులు, మరేదియు లేదు. అది అంతరాత్మయొక్క స్థిరమైన ఆధారమైయున్నది.

మనము వింటున్న ప్రతి వర్తమానముతో వధువు ఎటువంటి ఒక ఉజ్జీవమును కలిగియుంటున్నది కదా. వ్యక్తపరచడానికి అది మర్త్యమైన పదములకు మించియున్నది. దేవుడు మనల్ని ఎన్నుకొని మరియు ఈ దినము కొరకైన ఆయన వాక్యముయొక్క సత్యమైన ప్రత్యక్షతను మనకు ఇచ్చాడనుటలో, ఒక్క సందేహపు ఛాయయైనా లేదు. అందువలన, మనము ఎవరమో మనకు తెలుసు, ఆయనయొక్క రాణియైయున్నాము.

టేపులలో ఆయనయొక్క వధువుతో మాట్లాడుతున్న దేవుని స్వరము ఆయనయొక్క వధువును పరిపూర్ణము చేస్తున్నది. ఏ ఇతర పరిచర్య లేదు, ఏ ఇతర స్వరము లేదు; దేవుడు స్వయంగా తానే మానవ పెదవులగుండా నేరుగా ఆయనయొక్క వధువుతో మాట్లాడటం తప్ప వధువును పరిపూర్ణము చేయగలిగేది మరేదియు లేదు. ఇతరులు ఒక ప్రత్యామ్నయమును కోరుకోవచ్చును, కానీ ఆయనయొక్క వధువు ఆయనయొక్క స్వరము తప్ప, ఆయనయొక్క వధువు కొరకైన ఆయనయొక్క ప్రేమ లేఖ తప్ప మరిదేనితోనూ సంతృప్తి చెందదు; ఏలయనగా ఆయన గొర్రెలు ఆయన స్వరమును మాత్రమే వినగోరుతాయి.

మనము ప్రవక్తకు చాలా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తామని ప్రజలు అంటారు. ఆ గొప్ప పరలోకపు తండ్రి స్వయంగా తానే ఆయనయొక్క దూతకు సంబంధించిన ప్రతీ విషయముపై; అతని వస్త్రధారణ, అతని ప్రవర్తన, అతని గుణలక్షణము, అతని నడవడిపై ఎంతో ప్రాముఖ్యతను చూపేంతగా, అతని పట్ల ఎంతగానో శ్రద్ధవహించాడని ప్రజలు గుర్తించకపోవడం ఎంతో వింతగా ఉంది.

చివరికి ఆయన అతణ్ణి అతడు వేసుకున్నట్టి ఆ వస్త్రములతో వస్త్రధారణ కలిగియుండే విధంగా చేశాడు; అతని స్వభావము, అతని ఆశయము, ప్రతీది సరిగ్గా అతడు ఉండవలసిన విధంగానే ఉన్నది, మనకొరకు స్వయంగా దేవునిచేత పరిపూర్ణముగా ఎన్నుకోబడినాడు…పిదప మనము ప్రవక్తకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నామని అంటారు.

మనకైతే, టేపులలో ఉన్న స్వరము మనుష్యునియొక్క మాట కాదు, ఇంకా అది ఒక మనుష్యుని ద్వారా పలుకబడలేదు, మనుష్యుని ద్వారా తీసుకురాబడలేదు, లేదా అది ఒక మనుష్యుని ద్వారా బయపరచబడజాలదు. అది స్వయంగా దేవునిచేత బయలుపరచబడిన దేవుని వాక్యమైయున్నది, తన స్వంత అనువాదకుడు, క్రీస్తు తననుతాను తన స్వంత వాక్యములో బయలుపరచుకుంటున్నాడు.

కొందరు వినగలుగుతారు, కానీ పూర్తిగా గుర్తించరు. మీరు వారికి చెప్పవచ్చును, వారికి చూపించవచ్చును, కానీ వారు చూడలేరంతే. మనము వారిని ప్రేమిస్తున్నాము, వారి కొరకు ప్రార్థిస్తున్నాము, అయితే దేవుడు మనకు బయలుపరచినది ఆయనయొక్క పరిపూర్ణతయైయున్నది.

ఈనాడు తాము ఈ గొప్ప అంత్య-కాల వర్తమానము యొక్క సత్యమైన ప్రత్యక్ష్యతను కలిగియున్నారని చెప్పుకునే క్రీస్తుయొక్క వధువు మధ్యనున్న గొప్ప విభాగమునకు లిట్మస్ పరీక్ష ఇది.

లిట్మస్ పరీక్షకు నిర్వచనం: ఏదైనా ఒక విషయముయొక్క (లేదా ఒక వ్యక్తి) యొక్క నిజమైన స్వభావాన్ని, నాణ్యతను, లేదా స్థితిని త్వరగా బయలుపరిచే ఒకే ఒక్క, నిర్ణయాత్మకమైన అంశము, ప్రశ్న, లేదా సంఘటన.

మొదటిగా నన్ను మరొకసారి దీనిని చెప్పనివ్వండి, దేవునిచేత-పిలువబడిన నిజమైన పరిచర్యను నేను నమ్ముతాను. ప్రతీ కార్యాలయము కొరకు ఒక అవసరత, మరియు ఒక స్థానము ఉన్నది. ఈ వ్యక్తుల పరిచర్య పరిశుద్ధులను పరిపూర్ణము చేయడం కొరకని లేఖనము చెప్తున్నది, కానీ ప్రతీ 5-విధముల పరిచర్య పరిశుద్ధులను పరిపూర్ణము చేస్తుందని అది చెప్పడంలేదు. ప్రతీ కాలములోను పరిచర్య మార్గము తప్పి వెళ్తుందని సహోదరుడు బ్రెన్హామ్ గారు మనకు స్పష్టంగా చెప్తున్నారు, కాబట్టి వారు వధువును ఎలా పరిపూర్ణము చేయగలుగుతారు?

తాము ఈ అంత్య-కాల వర్తమానమును నమ్ముతున్నారని మరియు సహోదరుడు బ్రెన్హామ్ గారు ప్రకటన 10:7 లోని స్వరమని నమ్ముతున్నారని బోధించిన బోధకులు, ఉపదేశకులు, అపొస్తలులు మరియు ప్రవక్తలు అనేకులు, అనేకులు ఉన్నారు, వారు ఇప్పుడు అది అబద్ధమని, అతడు ఒక మోసపరిచేవాడని, మనము మతోన్మాదులమని చెప్తున్నారు.

వీరు పెద్ద సంఘసమూహములను కలిగియుండి ప్రపంచమంతటకు ప్రయాణము చేసి మరియు పరిచర్య చేసినట్టి గొప్పగా పరిగణించబడిన సేవకులైయున్నారు. వారు సమావేశములలో మరియు అమెరికాలోని సంఘములలో బోధిస్తూ, 5-విధముల పరిచర్యలో గొప్ప నాయకులుగా ఎంచబడ్డారు. ప్రజల దృష్టిలో వారు ఒక గొప్ప పరిచర్యను కలిగియున్నారు, మరియు వారు వారిని వెంబడించి మరియు వారు దేవునియొక్క గొప్ప వ్యక్తులని నమ్మారు.

పిదప నిజమైన 5-విధముల సేవకులుగా విస్తృతంగా గుర్తింపు పొందిన సేవకులు కొందరు ఈనాడు ఉన్నారు, వారు ఈ వర్తమానమును ఉటంకించడం ద్వారా మరియు దానిని బోధించడం ద్వారా దానిని నమ్ముతున్నామని చెప్పుకుంటున్నారు కానీ వారు ఈ వర్తమానము సంపూర్ణత కాదని కూడా చెప్తారు. ఒక్క-మనుష్యుని వర్తమానపు దినములు గతించిపోయినవని చెప్తారు. 5-విధముల పరిచర్యనే ఇప్పుడు వధువును పరిపూర్ణము చేయవలసియున్నదని, మరియు సంఘములో టేపులను ప్లే చేయడం తప్పని చెప్తారు, కొన్ని వాక్యాలను ఉటంకించడం తప్పని చెప్తారు.

అంత్య కాలములో అబద్ధపు అభిషిక్తులు ఉంటారని మనకు తెలుసు; వారిని కనిపెట్టమని ప్రవక్త మనల్ని హెచ్చరించాడు. వారి పరిచర్య అభిషేకించబడియుంటుంది. వారు పరిశుద్ధాత్మను కలిగియుంటారు, తద్వారా వారు ఘడియయొక్క వర్తమానమును ఉటంకిస్తారు. వారు దానికి ఎంత దగ్గర పోలికలో ఉంటారంటే అది సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సైతం మోసపరుస్తుంది.

అది సంఘశాఖలు కాదు. వారు ఏర్పరచబడినవారిని అసలు మోసం చేయలేరు. కాబట్టి, అది వాటికంటే దగ్గర పోలికను కలిగినదైయుండాలి. దాని అర్థం ప్రతీ సేవకుడు మార్గం తప్పిపోయాడని కాదు, అస్సలు కాదు. సత్యమును బోధించి ఉపదేశించే గొప్ప దేవుని వ్యక్తులు ఉన్నారు, అయితే ప్రతీ విశ్వాసి గుర్తించవలసిన మరియు తననుతాను ప్రశ్నించుకోవలసిన విషయం ఒకటి ఉన్నది:

మీరు వెంబడిస్తున్న సేవకుడు పొరపాటు చేయగలడా?
అతడు బోధించే ప్రతీ మాటకు మీరు ఆమేన్ చెప్పగలరా?
అతడు ఉపదేశించే ప్రతీ మాట యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నదని మీరు నమ్ముతున్నారా?
మీరు వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరము అతని స్వరమేనా?
అతడు తప్పైన సంగతిని బోధించగలడా?
30 సంవత్సరాలుగా వర్తమానమును బోధించిన తర్వాత కూడా అతడు తప్పుగా వెళ్ళగలడా? అతడు విఫలమవ్వగలడా?
అతడు మీకు తప్పుడు సంగతులను చెప్పగలడా?
అతడు మోసపరచబడగలడా?

ఇప్పుడు మీరు టేపులలో వినగల దేవునియొక్క నిర్ధారించబడిన స్వరము గురించి మీకు మీరు అవే ప్రశ్నలను వేసుకోండి.

టేపులలో ఉన్న వర్తమానము పొరపాట్లు చేయగలదా: లేదు
మీరు అతడు చెప్పే ప్రతీ మాటను నమ్మి మరియు వాటికి ఆమేన్ చెప్పగలరా? అవును
అది విఫలమవ్వగలదా? లేదు
అతడు తప్పుడు సంగతులను బోధించగలుగుతాడా? లేదు
అది మీకు తప్పైన సంగతిని చెప్పగలుగుతుందా? లేదు
మీరు వినే ప్రతీ మాట మీద మీరు మీ నిత్యమైన గమ్యమును ఆధారము చేసుకోగలరా...అవును!!!
అది దేవుని స్వరమా: అవును

నేను ఎందుకని ఈ సంగతులను చెప్తున్నాను? మనుష్యులందరూ పొరపాట్లు చేయగలరు, మరియు చేస్తారు కూడా, కానీ టేపులలో ఉన్న దేవుని స్వరము మాత్రము పొరపాటు చేయలేదు అని చూపించుటకైయున్నది. అందువలనే అది మీరు వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరమైయున్నది. అందువలనే పరిచర్యలు తమ సంఘములకు టేపులను ప్లే చేయాలి. అది దేవుడు తన వధువు కొరకు కలుగజేసినట్టి ఆయనయొక్క పరిపూర్ణమైన ఏర్పాటు చేయబడిన మార్గమైయున్నది.

నిశ్చయంగా, మీరు ఇతరులు చెప్పేది వినవచ్చని నేను నమ్ముతాను, అయితే మీరు తప్పకుండా విని మరియు ప్రతీ మాటను నమ్మవలసిన ఏకైక స్వరము టేపులలో ఉన్న స్వరమేయైయున్నది. ప్రతీ మాటకు మనం ఆమేన్ చెప్పగల ఏకైక స్వరము అది మాత్రమేయైయున్నది.

అది దేవునియొక్క ఆజ్ఞయైయున్నది, మీరు ప్రతీ మాటను నమ్మవలసియున్నారు, మరియు అగ్నిస్తంభము ద్వారా సత్యమని ఋజువు చేయబడిన ఏకైక మాట మీరు టేపులలో వింటున్న మాటయేయైయున్నది. విలియమ్ మారియన్ బ్రెన్హామ్ మాత్రమే ఆయన వాక్యముయొక్క దైవిక అనువాదకుడని దేవుడు చెప్పాడు, ఎందుకంటే అది అతని వాక్యము కాదు, అది దేవుని వాక్యమైయున్నది.

ఒక్క సున్ననైనా లేదా ఒక్క పొల్లునైనా మార్చకండి. ఏ మనుష్యుడు కూడా అంత పరిపూర్ణుడు కాడు; దేవునియొక్క స్వరము మాత్రమే అంత పరిపూర్ణమైనది. మనము వినేది మనకు అర్థం కానప్పుడు కూడా, మనము కేవలం అది ఆయనయొక్క వధువునకు దేవునియొక్క నిర్ధారించబడిన స్వరమని నమ్మవలసియున్నాము.

నిజముగా, పరిశుద్ధాత్మ దేవుని వ్యక్తులను నడిపిస్తున్నాడు. నిజముగా, సంఘకాపరులుగా మరియు బోధకులుగా మరియు ఉపదేశకులుగా ఉండటానికి పరిశుద్ధాత్మ వారిని పిలిచాడు; అది నిజమే, కానీ వారు పరిపూర్ణులు కాదు. అయితే మీరు కూడుకున్న ప్రతీసారి మీరు పరిపూర్ణమైన వాక్యమును వినగలుగుటకు దేవుడు ఒక మార్గమును ఏర్పాటుచేశాడు.

ఈనాడు పరిచర్యతో పాటు, ప్రజలు కూడా, ప్రత్యామ్నయములను కోరుకుంటున్నారు. వారు సహోదరుడు బ్రెన్హామ్ గారి పట్ల ఏమి చేస్తున్నారో దానిని ఒక సేవకుని పట్ల చేయడాన్ని మీరు ఊహించగలరా?...“నేను నీకు 30 నిమిషాలు ఇస్తాను పిదప నీవు ఆపివేయాలి, నేను అందించవలసిన ఒక వర్తమానమును నేను కలిగియున్నాను. మీరు ఏ సమయములోనైనా టేపులను వినవచ్చును. ఈ దినమునకు తగినట్లుగా సంఘము ఏమి వినవలసిన అవసరమున్నదో నాకు తెలుసు.” చాలామంది టేపులో కనీసం కొంత భాగమునైనా ప్లే చేయరు, మరియు తమ సంఘములలో దేవుని స్వరమును ప్లే చేయడం తప్పని చెప్తారు.

ఒక సేవకుడు తాను బోధించవలసియున్నాడని నమ్ముతున్నాడు గనుక దేవుని స్వరమును తన సంఘములో ప్లే చేయకుండా ఉండడానికి ఒక సాకును, అసలు ఏ సాకునైనా చెప్పడాన్ని తమ సరియైన మతిస్థిమితంలో ఉన్న ఎవరైనా ఊహించగలరా? వారు దానిని చెప్తారు, కానీ అది దేవుని స్వరమని వారు నమ్మరు, లేదంటే టేపులను ప్లే చేయకుండా ఉండడానికి వారు ఎన్నడూ ఏ సాకును చెప్పలేరు.

ఒకరు ఇది దేవుని స్వరమని నమ్ముతున్నానని చెప్పుకుంటూ మరియు తమ సంఘములో దానిని ప్లే చేయడానికి ఇష్టపడకుండా ఎలా ఉండగలరు? ఇది దేవుని స్వరమే మాట్లాడుటయైయున్నది అని నమ్ముతున్నామని చెప్పుకుంటున్న ప్రజలు తమ సంఘములలో దానిని ప్లే చేయమని తమ సంఘకాపరులను అడుగకపోవడమనేది ఎలా జరుగుతుంది? ఎందుకంటే వారు అదే ఆత్మను కలిగియున్నారు.

ఒక నీకొదేము వలె ఉండి మరియు ఇట్లనకండి, “నేను దానిని చూస్తున్నాను మరియు నేను దానిని నమ్ముతున్నాను. అది మనుష్యకుమారుడు తానే మానవశరీరములో తననుతాను బయలుపరచుకోవడమైయున్నది. అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నది. అది ఒక పరిపూర్ణమైన వర్తమానమైయున్నది. టేపులలో ఉన్నది దేవుని స్వరమైయున్నది, కానీ నేను కేవలం నా పరిచర్యను తగ్గించుకొని మరియు నా సంఘము వినడానికి ఆ స్వరమే ఎక్కువ ప్రాముఖ్యమైనది అని చెప్పలేను.”

సహోదరులరా మరియు సహోదరీలారా, మీరు ఈ విషయంలో నాతో ఖచ్చితంగా ఏకీభవించకపోవచ్చును. ఏకీభవించమని నేను మిమ్మల్ని అడగను. ఒకే ఒక్కటి ఏమిటంటే, మీరు కేవలం దానిని పరిగణించండి. మీరు నాకు ఏమి చెప్తారో, నేను దానిని పరిగణిస్తాను. సేవకులు వారి సంఘములలో టేపులను ప్లే చేయడం వారు నమ్మరని వారి సంఘమునకు చెప్పుకుంటే, నా సహోదరుడా, అది పర్వాలేదు. మీరు వారికి మీకు నచ్చినదానిని తినిపించండి.

నేను సరిగ్గా వాక్యముతో నిలిచియుండటానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను, ఎందుకంటే గొర్రెలు గొర్రెల ఆహారము తప్ప మరొకదానిని కోరుకోవు మరియు టేపులలో ఉన్న స్వరము మన గొర్రెల ఆహారమని మనము నమ్ముతున్నాము. మనము జీవించేది దానివలనేయై యున్నది: వచ్చు ప్రతీ మాటవలన…అప్పుడప్పుడు కేవలం ఒక మాట కాదు; కానీ టేపులలో పలుకబడి దేవుని నోటనుండి వచ్చు ప్రతీ మాట; మనము జీవించేది దానివాలనేయై యున్నది.

నేను మిమ్మల్ని అభ్యంతరపరచినా లేదా ఏదైనా తప్పుగా మాట్లాడినా దేవుడు నన్ను క్షమించును గాక మరియు మీరును నన్ను క్షమించుదురు గాక. ఇది కేవలం మేము సత్యమని నమ్ముచు మరియు సత్యముగా పరిగణిస్తూ మరియు దాని ప్రకారముగా జీవిస్తున్న విషయమైయున్నది. ఆయన స్వరమును వినడానికి దేవుడు మాకు ఒక పరిపూర్ణమైన మార్గమును ఇచ్చాడు మరియు మేము దానిని ప్రేమిస్తున్నాము.

ఎప్పటిలాగానే, ఒకే సమయములో ఆ స్వరమును వినడానికి మాతో చేరాలనుకుంటున్న ప్రతీ ఒక్కరినీ, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా, మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు మాతో చేరమని నేను ఆహ్వానిస్తున్నాను, అప్పుడు మనం దీనిని వినుచున్న ఒక్క మొత్తమువలె ఐక్యమైయుంటాము: 65-0822M క్రీస్తు తన స్వంత వాక్యమందు బయలుపరచబడెను.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్

 

వర్తమానమును వినడానికిముందు చదువవలసిన లేఖనములు:

నిర్గమకాండము 4:10-12
యెషయా 53:1-5
యిర్మియా 1:4-9
మలాకీ 4:5
పరిశుద్ధ. లూకా 17:30
పరిశుద్ధ. యోహాను 1:1 / 1:14 / 7:1-3 / 14:12 / 15:24 / 16:13
గలతి 1:8
2 తిమోతి 3:16-17
హెబ్రీ 1:1-3 / 4:12 / 13:8
2 పేతురు 1:20-21
ప్రకటన 1:1-3 / 10:1-7 / 22:18-19