ఆదివారం
14 సెప్టెంబర్ 2025
63-0630E
Is Your Life Worthy Of The Gospel?
కూటము ఇంత సమయంలో ప్రారంభమగును:
0
రోజులు
19
గంటలు
40
నిమిషాలు
35
క్షణములు

Sun Apr 26, 2020 10:00 AM EDT

ప్రియమైన సహోదరులు మరియు సహోదరీలారా,

నేను ప్రభువును, దేవుని వాక్యమును, ఈ వర్తమానమును, ఆయనయొక్క స్వరమును, ఆయనయొక్క ప్రవక్తను, ఆయనయొక్క వధువును, ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నాకు అవన్నియు ఒక్కటే. దేవుడు తన వాక్యములో వ్రాసినదానిలో లేదా తన ప్రవక్త ద్వారా మాట్లాడినదానిలో ఒక్క మాట విషయములోనైనా, ఒక్క పొల్లు విషయములోనైనా, లేదా ఒక్క సున్న విషయములోనైనా నేను ఎన్నడూ రాజీపడగోరడంలేదు. నాకైతే, అదంతయు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నది.

దేవుడు దానిని తలంచాడు, పిదప ఆయనయొక్క ప్రవక్తలతో దానిని చెప్పాడు, మరియు వారు ఆయనయొక్క వాక్యమును వ్రాశారు. తర్వాత ఆయన అబ్రాహామునకు చేసినట్లే, మరొకసారి తననుతాను మానవ శరీరములో బయలుపరచుకోగలుగునట్లు, ఆయనయొక్క బలమైన దూతయైనట్టి విలియమ్ మారియన్ బ్రెన్హామ్ గారిని, మన దినములో భూమి మీదకు పంపించాడు. పిదప లోకమునకు దేవునియొక్క స్వరమైయుండుటకును, జగత్తుపునాది మొదలుకొని దాచబడిన మర్మములన్నిటినీ ముందుగా నిర్ణయించబడిన ఆయనయొక్క వధువునకు బయలుపరచుటకును మరియు అనువదించుటకును ఆయన తన ప్రవక్త ద్వారా మాట్లాడినాడు.

ఇప్పుడు, ఆయనయొక్క వధువు, మీరు, శరీరధారియైన వాక్యముగా మారుచున్నారు; ఆయనతో ఒక్కటగుచున్నారు, సంపూర్ణముగా పునరుద్ధరించబడిన ఆయనయొక్క వాక్య వధువుగా మారుచున్నారు.

నేను చెప్పేవాటి విషయములో మరియు నేను వ్రాసేవాటి విషయములో నేను అపార్థము చేసుకోబడుతున్నానని నాకు తెలుసు. మన ప్రవక్త చెప్పినట్లే నేను దీనముగా చెప్పుచున్నాను, నేను విద్యావంతుడను కాను మరియు నా హృదయములో అనిపించినదానిని నేను సరిగ్గా వ్రాయలేనని లేదా చెప్పలేనని నాకు తెలుసు. నేను కొన్నిసార్లు చాలా కఠినముగా వ్రాస్తున్నట్లు అగుపిస్తుందని నేను ఒప్పుకుంటున్నాను. నేను అలా వ్రాసినప్పుడు, అది అమర్యాదను వ్యక్తపరచడానికో, లేదా తప్పుడు వైఖరిని కలిగియుండుటకో లేదా ఎవరికో తీర్పుతీర్చడానికో కాదు గాని, దానికి వ్యత్యాసమైన భావనతోనే వ్రాసాను. దేవుని వాక్యము కొరకు నా హృదయములో ఉన్న ప్రేమనుబట్టి నేను దానిని చేస్తాను.

దేవుడు తన వధువును బయటకు పిలువడానికి పంపిన ఈ వర్తమానమును అందరూ స్వీకరించాలని నేను కోరతాను. సేవకులు ఇక ఎంతమాత్రమూ బోధించకూడదని నా హృదయములోగాని లేదా నా మనస్సులో గాని నేను ఎన్నడూ భావించలేదు; అలా చేస్తే దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా వెళ్తున్నట్లు అవుతుంది. నేను కేవలం టేపులలో ఉన్న దేవుని స్వరము విషయమై ఆసక్తి కలిగియున్నాను. పరిచర్యలన్నీ మొదటిగా ప్రజలయెదుట ఉంచవలసిన అత్యంత ముఖ్యమైన స్వరము అదేనని నేను నమ్ముతున్నాను. దీని అర్థం వారు బోధించకూడదని కాదు, ప్రజలు ఆ అభిషేకము క్రింద కూడివచ్చినప్పుడు వారి సంఘములలో వారు టేపులను ప్లే చేయాలని మాత్రమే నేను వారిని ప్రోత్సహించగోరాను.

అవును, ప్రపంచవ్యాప్తంగా ఒకే సమయములో ప్రపంచమంతా ఒకే వర్తమానమును వినుచుండడం నాకు ఎంతో ఇష్టం. “నేను” అలా చెప్పినందుకు కాదు, లేదా వినడానికి “నేను” టేపును ఎన్నుకుంటున్నందుకు కాదు, కానీ మన దినములో ఇది జరగడానికి దేవుడు ఎలా ఒక మార్గమును కలుగజేసాడన్నదానిని వధువు నిశ్చయంగా చూస్తుందని నేను భావిస్తున్నాను.

ఈనాడు మనము టేపులలో యేసు మాట్లాడే రికార్డింగులను కలిగియున్నట్లైతే, యేసు ఏమి చెప్పాడన్నదాని గురించి మత్తయి, మార్కు, లూకా, లేదా యోహాను వ్రాసినవి కాదు (ఏలయనగా వారందరూ దానిని కొద్దిగా వ్యత్యాసముగా చెప్పారు), అయితే యేసుయొక్క స్వరమును, ఆయనయొక్క వక్తిత్వమును, ఆయనయొక్క కాలేదు, పూర్తిగా, మరియు మోసుకొనిపోవుట అనే పదములను మన స్వంత చెవులతో వినగలిగినట్లైతే, ఈనాడు ఉన్న పరిచర్య వారి సంఘముతో, “మన సంఘములో మనము యేసుయొక్క రికార్డింగును ప్లే చేయబోవడంలేదు. దానిని బోధించి, మరియు దానిని ఉటంకించుటకు నేను పిలువబడి అభిషేకించబడ్డాను. మీరు కేవలం ఇంటికి వెళ్ళినప్పుడు దానిని వినండి,” అని చెప్తుందా. ప్రజలు దానికి నిలబడతారా? చెప్పడానికి బాధాకరముగా ఉన్నది, కానీ ఈనాడు వారు ఖచ్చితంగా దానినే చేస్తున్నారు. వారు దానికి ఎంతగా సున్నం కొట్టినా గాని, ఎటువంటి వ్యత్యాసము లేదు.

నా ప్రకారమైతే, సహోదరుడు బ్రెన్హామ్ గారు మనకు ఒక ఉదాహరణను ఇచ్చారు. సంఘములన్నీ, గృహములన్నీ, లేదా వారెక్కడున్నను, అందరూ ఒకే సమయములో వర్తమానమును వినగలుగునట్లు వారు అనుసంధానమైనప్పుడు ఆయన ఇష్టపడ్డాడు. వారు టేపులను పొందుకోగలరని, మరియు పొందుకుంటారని, మరియు తర్వాత దానిని వినగలరని ఆయనకు తెలుసు, కానీ వారు ఐక్యమై మరియు అందరూ ఒకే సమయములో వర్తమానమును వినాలని ఆయన కోరాడు…నాకైతే అది మన దినములో ఏమి జరుగుతుందని మరియు ఏమి చేయాలని దేవుడు తన వధువుకు చూపించుటయైయున్నది.

రికార్డు చేయబడి మరియు టేపులలో పెట్టబడిన, దేవుని స్వరముయొక్క అభిషేకము క్రింద కూర్చోవడం కంటే గొప్పది ఏదియు లేదని వర్తమానమును-నమ్మే ప్రతి నిజమైన సేవకుడు అంగీకరిస్తాడు. వధువు నమ్ముతుంది, మరియు ఈ వర్తమానము ఈ దినము కొరకైన దేవుని వాక్యమైయున్నది అనే ప్రత్యక్షతను కలిగియుంటుంది. నేను వాక్యము ద్వారా మాత్రమే తీర్పు తీర్చగలను, అయితే ఈ వర్తమానము వారి సంపూర్ణత అని చెప్పని ఎవరైనా ఈ దినము కొరకైన వాక్య ప్రత్యక్షతను ఎంతమాత్రమూ కలిగిలేరు, కావున, వారు ఆయనయొక్క వధువు ఎలా అవ్వగలరు?

అది దానిని ఉటంకించడము కాదు, దానిని బోధించడము లేదా ఉపదేశించడము కాదు, కానీ నేను ప్రతీ మాటను నమ్ముతున్నాను అని వధువు చెప్పగల ఒకే ఒక్క స్థలము టేపులలో దానిని వింటున్నప్పుడు మాత్రమేయైయున్నది. ఈ వర్తమానము యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నది. నేను బోధించేది లేదా ఉపదేశించేది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు కాదు, కానీ టేపులలో ఉన్న దేవునియొక్క స్వరము చెప్పేది అయ్యున్నది…అగ్నిస్తంభముచేత నిర్ధారించబడిన ఏకైక స్వరము అదేయైయున్నది.

”బ్రెన్హామ్ టెబర్నికల్ పెట్టే వర్తమానములను మీరు వినకపోతే, పక్షిరాజులు కూడుకొనుచున్నవి అనే లేఖలను చదువకపోతే, మరియు అదే సమయములో మీ గృహములలో వినకపోతే మీరు వధువు కారు,” లేదా, “సంఘమునకు వెళ్ళడం తప్పు, మీరు ఇంటివద్దనే ఉండాలి,” అని చెప్తూ మరియు ఆ విధంగా భావించే సహోదరులు మరియు సహోదరీలు ఉన్నారని నాకు తెలుసు. అది చాలా తప్పు. నేను ఎన్నడూ దానిని ఆలోచించలేదు, దానిని చెప్పలేదు, లేదా దానిని నమ్మలేదు. అది ఇంకా ఎక్కువ వేరుపాటులను, కఠిన భావములను, వధువు మధ్య సహవాసము లేకపోవుటను కలుగజేసినది మరియు ప్రజలను వేరుచేయడానికి శత్రువు దానిని ఉపయోగించుకుంటున్నాడు.

నేను ఎన్నడూ వధువును వేరుచేయాలని కోరలేదు, మనము ఒక్కటిగా ఐక్యమైయ్యుండాలని వాక్యము చెప్తున్న విధంగా నేను వధువును ఐక్యము చేయాలని కోరుతున్నాను. మనము ఒకరితోనొకరము తగువులాడకూడదు, అయితే టేపులలో ఉన్న దేవునియొక్క స్వరము తప్ప మనల్ని ఐక్యపరిచేది మరేదియు లేనే లేదు.

మనము వాదిస్తూ మరియు ప్రజలు తప్పక ఏమి చేయాలని గాని లేదా చేయకపోతే వారు వధువు కారని గాని వారికి చెప్తూ ఉండకూడదు, కేవలం ప్రభువు మిమ్మల్ని నడిపించిన విధంగా చేయండి. వారింకను మన సహోదరులు మరియు సహోదరీలైయున్నారు. మనము ఒకరినొకరము ప్రేమించుకొనుచు గౌరవించుకోవడం అవసరమైయున్నది.

ఇప్పుడు, తగువులాడకండి. చూశారా? కోపము కోపమును పుట్టిస్తుంది. మొదటి విషయమేమిటో మీకు తెలుసా, మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచి మీ నుండి దూరంగా వెళ్ళిపోవునట్లు చేస్తారు, మీరు తిరిగి తగువులాడుతూ ఉంటారు. అప్పుడు పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు. కోపము కోపమును పుట్టిస్తుంది.

ఇక్కడ ప్రవక్త చెప్పినదానితో, నేను ఎన్నడూ పరిశుద్ధాత్మను దుఃఖపరచగోరడంలేదు. నేను ఎన్నడూ తగువులాడగోరడంలేదు. మనము ప్రేమతో వివాదము తీర్చుకొనవచ్చు, కానీ తగువులాడకూడదు. నేను వ్రాసినవాటిలోనైనా లేదా మాట్లాడినవాటిలోనైనా ఎవరినైనా అభ్యంతరపరచినది ఏదైనా చెప్పియుంటే, దయచేసి నన్ను క్షమించండి, నా ఉద్దేశ్యము అది కాదు.

నేను ఇదివరకు వ్యక్తపరచినట్లుగా, ప్రజలను ఈ దినమునకైన దేవునియొక్క స్వరము వైపుకు త్రిప్పడానికి నా జీవితములో ప్రభువుయొద్ద నుండి నేను ఒక పిలుపును అనుభూతి చెందుతున్నాను. ఇతర సేవకులు ఇతర పిలుపులను కలిగియుంటారు మరియు బహుశా సంగతులను భిన్నముగా చూస్తుండవచ్చును, ప్రభువుకు స్తోత్రం, పరిశుద్ధాత్మచేత వారు ఏమి చేయడానికి నడిపించబడుచున్నారని వారికి అనిపించుచున్నదో వారు దానిని చేస్తున్నారు. నా పరిచర్య అయితే “ప్లేను నొక్కండి,” మరియు “మీరు వినగల అత్యంత ముఖ్యమైన స్వరము టేపులలో ఉన్న దేవుని స్వరమే” అని వధువుకు చెప్పడం మాత్రమైయున్నది. “పరిచర్య గలవారు వారి సంఘములలో టేపులలో ఉన్న దేవుని స్వరమును ప్లే చేయాలని నేను నమ్ముతాను.”

ప్రతి వారము నేను వ్రాసే లేఖలు తాము బ్రెన్హామ్ టెబర్నికల్ లో భాగమైయున్నారని భావించే వధువు భాగము కొరకైయున్నవి. ఇతరులు అనేకులు వాటిని చదువుతారని నాకు తెలుసు, కానీ మా సంఘము కొరకు ఏమి చేయడానికి నేను నడిపించబడుతున్నానో దానిని చేయడానికి మాత్రమే నేను బాధ్యుడనైయున్నాను. ప్రతి సంఘము దాని స్వంత అధికారమును కలిగియుంటుంది; వారు ఏమి చేయడానికి ప్రభువుచేత నడిపించబడుతున్నారని వారికి అనిపించుచున్నదో వారు దానిని చేయాలి, అది 100% వాక్యమైయున్నది. నేను వారికి వ్యతిరేకిని కాను, మేము కేవలం ఏకీభవించడంలేదు మాత్రమే. నేను మరియు బ్రెన్హామ్ టెబర్నికల్ మట్టుకైతే, మేము టేపులలో ఉన్న దేవుని స్వరమును వినగోరుతున్నాము.

ప్రతి వారము మాతో చేరమని నేను ప్రపంచమును ఆహ్వానిస్తుంటాను. వారు మాతో చేరలేనియెడల, ఒక టేపును, ఏ టేపునైనా ఎన్నుకొని, మరియు ప్లే ను నొక్కమని నేను వారిని ప్రోత్సహిస్తుంటాను. వారు ముందెన్నడూ లేనివిధంగా అభిషేకించబడతారు. అలాగే, ఈ వారము కూడా ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు మేము కూడుకొని మరియు దీనిని వినుచుండగా, మాతో చేరమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, 63-0630E నీ జీవితము సువార్తకు యోగ్యమైనదిగా ఉన్నదా?

సహోదరుడు జోసఫ్ బ్రెన్హామ్