ఆదివారం
12 ఏప్రిల్ 2026
65-0418E
ఆయన వాక్యమును గూర్చి దేవుడు ఎప్పుడైనా తన మనస్సు మార్చుకొనునా?
కూడిక ఇంత సమయంలో ప్రారంభమవుతుంది:
0
రోజులు
19
గంటలు
40
నిమిషములు
35
క్షణములు

Sun Apr 26, 2020 10:00 AM EDT

ప్రియమైన పురిగొల్పబడినవారలారా,

ఈ ఈస్టరు వారాంతమున మన హృదయములు పక్షిరాజుల వలె ఏ విధంగా ఎగిరాయి కదా. దినము వెంబడి దినము, ఆయనయొక్క అభిషేకము ఇంకా ఇంకా అధికమైనది. ప్రభురాత్రి భోజనము, భూస్తాపితము, పరిపూర్ణత, పిదప ఆయన మనల్ని దేనికొరకైతే కట్టినాడో అట్టి అంతిమ ఘట్టము: అది సూర్యోదయము...మహిమా, ఆయన తిరిగి లేచాడు మరియు మనలో ప్రతియొక్కరిలో సజీవుదైయున్నాడు. మనము ముందెన్నడూ వినని విధంగా ఆయన తన వాక్యమును మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ అభిషేకము మన హృదయాలను నింపివేసినది, ఆయనయొక్క సన్నిధి అంతటా నిండిపోయినది; ఎత్తబడుట అత్యంత సమీపముగా ఉన్నట్లు అగుపించినది.

2000 సంవత్సరాల క్రితం ఏమి జరిగినదో ఆయన మనకు చెప్పాడో, మరియు పిదప ఇప్పుడు 2026 లో ఏమి జరుగుతున్నదో చెప్పాడు. యేసు మృతులలో నుండి లేపబడిన దేవుని గోధుమలోని మొదటి గింజయైయున్నాడు. ఆయన దేవునియొక్క పురిగొల్పే శక్తి ద్వారా లేపబడ్డాడు. దేవుడు ఆయన జీవమును పురిగొల్పాడు, ఆయనను మృతులలోనుండి పైకి లేపాడు, మరియు ఆయన నిద్రించినవారిలో ప్రథమఫలమైయున్నాడు. ఆయన మొట్టమొదట పరిపక్వము చెందినదైయున్నాడు, తక్కిన మనమందరమూ వస్తామని నమ్ముతూ, దేవునికి కృతజ్ఞతార్పణ జ్ఞాపకార్ధముగా అల్లాడించబడిన దేవుని పనయైయున్నాడు. ఆది ఒక గురుతైయున్నది.

పిదప ఈనాడు ఏమి జరిగినదో ఆయన మనకు బయలుపరిచాడు. పెంతెకొస్తు దినమున పరలోకము నుండి అల్లాడించబడుచున్నట్లు ఒక శబ్దము వచ్చి, వేగముగా వీచు బలమైన గాలి ప్రజల మీద అల్లాడించబడినప్పుడు ఆయన అల్లాడించబడినట్లే జరుగుచున్నది. లూకా 17:30 మరియు మలాకీ 4 లో ఆయన వాగ్దానము చేసినట్లే, మనుష్య కు-మా-రు-డు ప్రత్యక్షపరచబడి తిరిగి మరలా ప్రజల మీద అల్లాడించబడినప్పుడు, అది మరలా ప్రజల ఎదుట అల్లాడించబడుచున్నది.

ఇప్పుడు, మనుష్యకుమారుడు ఎవరు? “ఆదియందు వాక్యముండెను, మరియు వాక్యము దేవుని యొద్ద ఉండెను, మరియు వాక్యము దేవుడైయుండెను. మరియు ఆ వాక్యము శరీరధారియై, మన మధ్య నివసించెను.” మరియు దేవుని వాక్యము ద్వారా, సూచకక్రియల ద్వారా, అద్భుతముల ద్వారా, మనము కలిగియున్న ఉపదేశమంతటినీ, మరియు దేవుని వాక్యముయొక్క నిర్ధారణను మనము కలిగియుండగా, ఇక్కడ మనమిప్పుడే దేనినుండైతే చదివామో, అట్టి ఈ—ఈ లూకా సువార్తలో, లేదా లూకా 17వ అధ్యాయము 30వ వచనములో; మరియు మలాకీ 4 లో, మరియు మనము ఎరిగియున్న వివిధమైన లేఖనములలో మనమిట్లు చూస్తున్నాము, అదేమిటంటే ఈనాడు వాక్యము మరలా ప్రజల పైన అల్లాడించబడినది, మనుష్యునియొక్క మృతమైన ఆ ఆచారములు చచ్చిపోయియున్నవి, మరియు దేవుని కుమారుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మముతో మరలా మన మధ్య సజీవుడిగా ఉన్నాడు, మరియు మనకు జీవమును ఇస్తున్నాడు.

పరిశుద్ధాత్మ మన మీద మరలా మరలా అల్లాడుతూనే ఉన్నాడు, మరలా మరలా ఆయనయొక్క వాక్యమును బయలుపరుస్తూనే ఉన్నాడు... క్రియాశీలకమైనది, యాంత్రికమైనది, పురిగొల్పే శక్తి...

పిదప, ఇది ఇక ఇంతకంటే గొప్పగా మారలేదన్నట్లు అగుపించినప్పుడు, ఆయన మనతో ఇట్లు చెప్పాడు:

ఆయన నన్ను ఆ తెరను దాటి చూడనిచ్చాడు, మరియు నేను అక్కడ మీ అందరినీ చూశాను...నీవు ప్రేమించిన వారందరినీ, మరియు నిన్ను ప్రేమించిన వారందరినీ, వారిని నీకు ఇచ్చాను.” చూశారా? నేను వారందరినీ అక్కడ ఆ విధంగా చూశాను. అది ఏమిటి? పురిగొల్పే శక్తి.

ఆయన మనల్ని అక్కడ చూశాడు!! కాలమనే తెర వెలుపల....మనము అక్కడ ఆయనతో ఉన్నాము; మనకు ముందుగా వెళ్ళిన మన ప్రియులందరూ...తండ్రులు, తల్లులు, పిల్లలు అక్కడ ఉన్నాము. మనము వారితో అక్కడ ఉన్నాము మరియు మనము ఎన్నడూ కలువనటువంటి: మోషే, ఏలీయా, పేతురు, పౌలు మొదలగువారందరూ.... అక్కడ మనమందరము కలిసి ఉన్నాము.

పిదప, ఆయన ఎంతో ప్రేమామయుడైన పరిశుద్ధాత్మ గనుక, వ్యాధి కలిగి, కృంగిపోయి మరియు కొట్టబడిన మనల్ని ఆయన మర్చిపోవాలనుకోలేదు, కావున మనకు ఉన్న ప్రతీ అవసరతను బట్టి మనము స్వస్థపరచబడునట్లు ఆయన మరొకసారి తననుతాను మన మీద అల్లాడించుకున్నాడు.

ఈ ప్రజలు, రాజ్యములో సహపౌరులైయున్నారు, పురిగొల్పే శక్తిని కలిగియున్నవారై యున్నారు, ప్రభువా, సరిగ్గా ఇప్పుడే, వారికి దానిని పురిగొల్పము. మరియు మేము ఒకరి మీద ఒకరము చేతులుంచుకొనుచుండగా, భౌతికముగానైనా, ఆత్మసంబంధముగానైనా, లేదా వారు కలిగియున్న ఏ అవసరత కొరకైనా గానీ, యేసుక్రీస్తు యొక్క సర్వపరిపూర్ణత ప్రతియొక్క శరీరములో ప్రత్యక్షపరచబడేంతగా, ఆత్మ పక్షిరాజు నుండి పక్షిరాజునకు, వాక్యము నుండి వాక్యమునకు కదలాడును గాక. యేసుక్రీస్తు నామములో.

ఆ వాక్యము. ఆ స్వరము. వధువా, మనకు అవసరమైయున్న ప్రతీది టేపులలో ఉన్నది. దేవుడు తన వాక్య విషయములో తన మనస్సు మార్చుకోడు. ఒక్క పొల్లైనను లేదా ఒక్క సున్నైనను మార్చబడజాలదు, కావున ఆయన తన వధువుకు ఏమి చెప్పగోరుతున్నాడో సరిగ్గా దానిని వారు తమ స్వంత చెవులతో వినగలిగేలా ఆయన ఒక మార్గమును ఏర్పాటు చేశాడు.

దేవుడు తన వధువుతో మాట్లాడి మరియు సమస్తమును బయలుపరిచాడు. అది రికార్డు చేయబడినది. పెండ్లికుమార్తె పెండ్లికుమారుని యొద్దకు రావలసియున్నది; అది ఈ దినమునకు ఆయన ఏర్పాటు చేసిన పరిపూర్ణమైన మార్గమైయున్నది. అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్నది.

దేవుడు తన వాక్య విషయములో ఎన్నడైనా తన మనస్సు మార్చుకుంటాడా? మార్చుకోడు. ఆయన ఒక పరిపూర్ణమైన చిత్తమును మరియు ఒక అనుమతిపూర్వకమైన చిత్తమును కలిగియుంటాడు. వధువు ఆయనయొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉండవలసియున్నది. నేరుగా దేవునియొద్ద నుండే దేవునియొక్క స్వరమును వినడం కంటే పరిపూర్ణమైన చిత్తము, లేదా పరిపూర్ణమైన స్థలము మరేదియు లేదు.

ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, దేవునియొక్క స్వరము మనకు స్వచ్ఛమైన వాక్యమును అందించడాన్ని వినడానికి మాతో చేరండి అన్నదే మీలో ప్రతీ ఒక్కరికీ నా ఆహ్వానమైయున్నది. ఎటువంటి అంచనాలు వేయడం అవసరము లేదు, కేవలం కూర్చొని మరియు ప్రతీ మాటకు ఆమేన్ చెప్పడమే....ఆ విధంగా చేయడం వేరే ఏ స్థలములోనూ సాధ్యపడదు, ప్లే ను నొక్కినప్పుడే సాధ్యపడుతుంది.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్.

 

వర్తమానము: 65-0418E — దేవుడు తన వాక్య విషయములో ఎన్నడైనా తన మనస్సు మార్చుకుంటాడా?

మనము 61 వ పేరా నుండి ప్రారంభించుకుందాము.

 

వర్తమానమును వినడానికిముందు చదువవలసిన లేఖనములు:

నిర్గమకాండము 19వ అధ్యాయము
సంఖ్యాకాండము22:31
పరిశుద్ధ. మత్తయి 28:19
లూకా 17:30
ప్రకటన 17వ అధ్యాయము