Sun Apr 26, 2020 10:00 AM EDT
కూడుకుంటున్న ప్రియమైన పక్షిరాజులారా,
ఈ వారపు వర్తమానము పేరే వధువుకు పరిశుద్ధాత్మను గూర్చిన గొప్ప అవగాహనను బయలుపరుస్తుంది. మన ప్రవక్తపై ఉండిన అదే పరిశుద్ధాత్మయొక్క నిజమైన అభిషేకమును కలిగియుండి కూడా, తప్పైయ్యుండే నిజమైన అభిషిక్తులు, ఈ దినమున ఉద్భవిస్తారని ఆలోచించడానికే ఎట్లున్నది కదా.
అదే వర్షమును పొందుకోవడం ద్వారా, ఒక నిజమైన ప్రవక్తవలె అవే ఆశీర్వాదములను పొందుకోవడం ద్వారా, వారు సూచనలను మరియు అద్భుతకార్యములను చేస్తారని వాక్యము మనకు చెప్తున్నది. ప్రజలు ఈ దినముయొక్క నిర్ధారించబడిన నిజమైన వాక్యమునుండి తమ స్వంత కామముల తట్టునకు తిరుగుతారు, దురద చెవులుగలవారై, తమకు నచ్చిన బోధకులను ఏర్పరచుకుంటారు. అది నిజమైన వాక్యమునకు ఎంత దగ్గరగా ఉంటుందంటే అది దాదాపు ఎన్నుకోబడినవారిని సైతం మోసగించగలదు.
ఆ అభిషేకము అసలు ఎంత దగ్గరగా ఉంటుంది? సత్యమేదో అబద్ధమేదో వివేచించడం తేలికగా ఉంటుందా? రాజైన దావీదు, దేవుని స్వంత హృదయానుసారుడు, తనపై ఒక అభిషేకమును కలిగియుండి, ఒక ప్రత్యక్షతను పొందుకున్నాడు; కానీ అది తప్పైయున్నది అని ప్రవక్త మనకు చెప్పాడు.
ఏమిటి!! ఒక్క క్షణం దానిని మీ మనస్సులోతులోకి వెళ్ళనివ్వండి. దేవునియొక్క ఎన్నుకోబడిన రాజు ఒక నిజమైన అభిషేకమును మరియు ఒక నిజమైన ప్రత్యక్షతను కలిగియున్నాడు, కానీ తప్పైయున్నాడు! వారు వింటున్నది నిజమైన అభిషేకమా లేదా తప్పుడు అభిషేకమా అనేది తెలుసుకోడాని దేవుని గొర్రెపిల్లలు చాలా అప్రమత్తంగా ఉండాలి; ఏలయనగా వారి నిత్యమైన గమ్యము ఈ నిర్ణయముల మీద ఆధారపడియున్నది.
ఆయనయొక్క వధువుకు మార్గదర్శకత్వము చేసి మరియు ఆమెను వాక్యములో ఉంచడానికి సహాయపడుటకు దేవుడు నిజముగా అభిషేకించబడిన అనేకమంది సేవకులను నియమించాడని మనకు తెలుసు. ఆయనయొక్క వాక్యము దానిని చెప్తున్నది, మరియు వారిలో ప్రతియొక్కరి కొరకు మనము ప్రభువునకు కృతజ్ఞులమైయున్నాము. వారు తమ మందలపై కాపరులుగా ఉండటానికి పిలువబడ్డారు. వారు వారిని వాక్యములో ఉంచడం కొరకైయున్నారు. దానిని చేస్తున్నప్పుడు, వారి మందలకు దేవునియొక్క ఏకైక నిర్ధారించబడిన స్వరమును ప్లే చేసి వినిపించడంలో వారు విఫలమవ్వకూడదు.
నిజమైన అభిషేకమును మరియు నిజమైన ప్రత్యక్షతను కలిగియుండి కూడా, ప్రతీ మనిషి ఏ విధంగా తప్పులోకి వెళ్ళగలడో మనము ఈ మధ్యనే విన్నాము. కానీ వధువు నిశ్చయతతో ఉండవచ్చును, ఎందుకంటే వారు ఎల్లప్పుడు కూడా ఆ నిజమైన అభిషేకమును, నిజమైన ప్రత్యక్షతను, నిజమైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును వినడానికి దేవుడు ఒక పరిపూర్ణమైన మార్గమును ఏర్పాటుచేశాడు; కేవలం ప్లే ను నొక్కడమే.
“శరీరము ఎక్కడ ఉండునో,” ఆ మన్నా, ఆ వాక్యము ఎక్కడ ఉండునో, “అక్కడ పక్షిరాజులు పోగవుతాయి.”
శరీరము ఎక్కడ ఉండునో, అక్కడే పక్షిరాజులమైన మనము కూడుకుంటాము. ఆ తాజా మాంసము, ఋతువునకు తగిన వాక్యము, ఘడియయొక్క వర్తమానము ఎక్కడున్నదో అక్కడే కూడుకుంటాము. మరియు స్వయంగా దేవునియొక్క స్వరమే మాట్లాడటాన్ని వినడంకంటే ఆ మన్నాను తినడానికి తాజా స్థలము వేరేదేదియు లేదు.
అది ఆయనయొక్క వాక్యమైయున్నది. “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు, కానీ ప్రతీ మాటవలన బ్రతుకును.” చూశారా? ముందుగా నిర్ణయించబడినవారు దీనిని ఎరిగియుంటారు. “ఒక భిన్నమైన మాటను, లేదా ఒక భిన్నమైన స్వరమును, వారు వెంబడించరు.”
మనము మోసపరచబడము, మరియు మోసపరచబడలేము అనడానికి కారణమేమిటంటే, మనము ఈ ప్రత్యక్షతను కలిగియున్న వాక్యమైయున్నాము. మనము వేరే దేనిగా ఉండలేము. మనము వేరే దేనినీ వినలేము. మనకు వేరేది ఏదియూ తెలియదు.
“నేను ఉన్నవాడను!” “నేను ఇదివరకు ఉన్నవాడను, లేదా ఉండబోవువాడను” కాదు. “నేను ఉన్నవాడను,” వర్తమానకాలము, ఇప్పుడున్న వాక్యము. ఇదివరకున్న వాక్యము కాదు, రాబోవు వాక్యము కాదు; ఇప్పుడున్న వాక్యము. చూశారా? మీకు అది అర్థమైందా? “నేను ఉన్నవాడను!” “నేను ఉన్నవాడను” అనువాడు వాక్యమైయున్నాడు. “ఆదియందు వాక్యముండెను, మరియు వాక్యము దేవునియొద్ద ఉండెను.” అది సరియేనా? “నేను ఉన్నవాడను.” “ఇది సత్యమని నిర్ధారించడానికి, దేవుడు నన్ను తన ప్రవక్తగా పంపించాడు. ఈ వాక్యమునకు నేను జవాబునైయున్నాను, ఇక్కడికి వచ్చి మరియు దీనిని చేయమని నాతో చెప్పాడు.”
మరియు అతడు దానిని చేసినప్పుడు, “మంచిది, దానిని చేయగల కుర్రవాళ్ళు మా గుంపులో కూడా, అనేకమంది ఉన్నారు,” అని ఫరో అన్నాడు, అనుకరణకర్తలు.
యేసు ఇట్లు చెప్పాడు, “ఇప్పుడు, అది మరలా అంత్యదినములలో పునరావృతం అవ్వబోతుంది,” చూడండి, అదే విషయమును చెప్పుకుంటూ వస్తారు.
ప్రభువునకు స్తోత్రం. వధువు కొరకైన ఒక నిశ్చయతను గూర్చి మాట్లాడండి. మీరు ఈ ప్రత్యక్షతను కలిగియున్నప్పుడు, అప్పుడు మీరు ఆయనయొక్క ఎన్నుకోబడిన, ముందుగా నిర్ణయించబడిన, ప్రియమైన వధువైయున్నారని మీకు తెలుస్తుంది.
టేపులలో ఉన్న దేవుని స్వరమును వినడం ద్వారా, క్రీస్తైయున్న మనుష్యుకుమారుని మాటను, మనము వింటున్నాము. మనము పోషించబడుతున్నది ఆయన మీదేయైయున్నది. మనము ఒక మనుష్యుని మీద పోషించబడటంలేదు; ఒక మనుష్యుడు, అతని మాటలు విఫలమవుతాయి. కానీ మనము మనుష్యకుమారుని యొక్క విఫలమవ్వని వాక్య-దేహముపై పోషించబడుతున్నాము.
మీరు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును వింటున్నారని 100% నిశ్చయతను కలిగియుండాలనుకుంటే, అంత్యకాలమందు అభిషిక్తుల గురించి సమస్తమును దేవుని స్వరము మాకు బయలుపరచడాన్ని మేము వినుచుండగా, ఈ ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు వచ్చి వధువులోని ఒక భాగముతో చేరండి.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
వర్తమానము: అంత్యకాలమందు అభిషిక్తులు 65-0725M
లేఖనములు:
పరిశుద్ధ. మత్తయి 5:44-45 / 7:21 / 24:15-28
పరిశుద్ధ. లూకా 17:30 / 18:1-8
పరిశుద్ధ. యోహాను 14:12
ఎఫెసీ 1:5
II తిమోతి 3:1-8
హెబ్రీ 6:1-8 / 11:4
ప్రకటన 10:1-7 / 16:13-14
మలాకి 4:5
I రాజులు 22:1-28
యిర్మియా: 27 & 28 అధ్యాయములు