
ప్రియమైన విశ్రాంతినొందుచున్న వారలారా,
ఇది నిజముగా మన జీవితములలోని అత్యంత ఉత్తమమైన శీతాకాలమైయున్నది. ప్రభువుయొక్క రాకడ అత్యంత సమీపముగా ఉన్నది. మనము ఇదివరకే పరిశుద్ధాత్మతో ముద్రించబడియున్నాము; అది క్రీస్తు దేనికొరకైతే మరణించాడో ఆ సమస్తమూ మనకు చెందియున్నది అనే దేవునియొక్క అంగీకారపు ముద్రయైయున్నది.
మనమిప్పుడు మన స్వాస్థ్యముయొక్క సంచకరువును, అనగా పరిశుద్ధాత్మను కలిగియున్నాము. అది నిశ్చయతయైయున్నది, మనము క్రీస్తులోనికి స్వీకరించబడ్డాము అనే, ముందస్తు చెల్లింపు అయ్యున్నది. మనము దేవునియొక్క వాగ్దానములలో విశ్రాంతి పొందుచున్నాము, ఆయనయొక్క స్వరమును వింటూ, ఆయన సూర్యరశ్మియొక్క వెచ్చదనములో; అనగా ఆయనయొక్క నిర్ధారించబడిన వాక్యములో పరుండియున్నాము.
అది మన రక్షణకు సంచకరువైయున్నది. మనము అక్కడికి వెళ్తున్నామా లేదా అని మనము చింతించడంలేదు, మనము వెళ్తున్నాము! మనకు అది ఎలా తెలుసు? దేవుడు దానిని చెప్పాడు! దేవుడు దానిని వాగ్దానము చేసాడు మరియు మనము సంచకరువును కలిగియున్నాము. మనము దానిని పొందుకొనియున్నాము మరియు క్రీస్తు మనల్ని స్వీకరించాడు.
దానినుండి దూరముగా పోవుటకు ఏ మార్గమూ లేదు…వాస్తవానికి, మనము అక్కడే ఉన్నాము! మనము చేయవలసినదంతా కేవలం వేచియుండడమే; ఆయన సరిగ్గా ఇప్పుడు బంధువుడగు విమోచకుని పనిని నిర్వర్తించుచుచున్నాడు. సరిగ్గా ఇప్పుడే మనము దానియొక్క సంచకరువును కలిగియున్నాము. మనం కేవలం ఆయన మనకొరకు తిరిగివచ్చే సమయము కొరకు వేచియుంటున్నాము. అప్పుడు, ఒక్క క్షణములో, కనురెప్పపాటున మనమంతా వివాహ విందుకు వెళ్ళిపోతాము.
మనకెదురుగా ఉన్నదానంతటి గురించి కేవలం ఆలోచించడానికే ఎలాగున్నది కదా. మన మనస్సు దానంతటినీ లోపలికి తీసుకోలేదు. దినము వెంబడి దినము ఆయన ఆయనయొక్క వాక్యమును మరింత ఎక్కువగా బయలుపరుస్తున్నాడు, ఈ గొప్ప వాగ్దానములు మనకు చెందియున్నవని నిశ్చయతను ఇస్తున్నాడు.
ప్రపంచము తునాతునకలైపోవుచున్నది; మంటలు, భూకంపములు, ప్రతిచోటా గందరగోళమున్నది, అయితే ప్రపంచమును కాపాడి, మరియు వారియొక్క సువర్ణయుగమును తీసుకొనివచ్చే ఒక క్రొత్త రక్షకుణ్ణి వారు కలిగియున్నారని వారు నమ్ముతున్నారు. మనమైతే ఇదివరకే మన రక్షకుడిని స్వీకరించాము మరియు మనయొక్క సువర్ణయుగములో జీవించుచున్నాము.
ఇప్పుడు మనము ప్రకటన గ్రంథముయొక్క 5వ అధ్యాయములోనికి ప్రవేశిస్తుండగా ఆయన మనల్ని ఇంకా అధికమైన ప్రత్యక్షత కొరకు సిద్ధపరచుచున్నాడు. ఏడుముద్రలు తెరవబడుటకు ఆయన ఇక్కడ ఒక దృశ్యాన్ని సిద్ధపరచుచున్నాడు. ఆయన సరిగ్గా ఏడు సంఘ కాలములకు మార్గమును కలుగజేస్తూ, ప్రకటన గ్రంథములోని 1వ అధ్యాయములో చేసినట్లే ఉన్నది.
వధువునకు ఈ మిగిలిన శీతాకాలం ఎలా ఉండబోవుచున్నది? మనము ఒక చిన్న ముందటి ప్రదర్శనను చూద్దాము:
ఇప్పుడు, నాకు సమయము లేదు. నేను దానిని వ్రాసియుంచాను, దానిపై ఇక్కడ కొంత పాఠ్యసందర్భమును వ్రాసియుంచాను, అయితే మనము దీనిలోనికి ప్రవేశించడానికి ముందు మన తదుపరి కూడిక…బహుశా నేను నా సెలవు గడువు నుండి తిరిగివచ్చినప్పుడు లేదా ఇంకే సమయములోనైనా వచ్చినప్పుడు, నేను ఈ దానియేలు యొక్క డెబ్బది వారములను తీసుకొని మరియు దానిని సరిగ్గా ఇక్కడ ముడివేయగోరుచున్నాను, మరియు అది దానిని ఎక్కడ పెంతెకొస్తు జూబిలీలోనికి తీసుకెళ్ళి, మరియు సరిగ్గా మనం వెళ్ళడానికి ముందు, దానిని నేరుగా ఆ ఏడు తె-...ఇక్కడ విప్పబడనైయున్న ఆ ఏడు ముద్రలవద్దకు తీసుకువస్తుందో చూపించగోరుచున్నాను, మరియు అది ముగింపు వద్దనైయున్నదని చూపించగోరుచున్నాను, ఈ…
దేవుడు ఆయనయొక్క వధువు కొరకు ఎటువంటి ఒక అద్భుతమైన సమయమును దాచియుంచాడు కదా. ముందెన్నడూ లేనివిధంగా ఆయనయొక్క వాక్యములో తననుతాను మనకు తేటపరచుకొనుచున్నాడు. ఆయన ఎవరి కొరకైతే వస్తున్నాడో అట్టి ఎన్నుకోబడినవారము మనమేనని మనల్ని ఉత్సాహపరచుచున్నాడు. మనము ఆయనయొక్క స్వరముతో, మరియు ఆయనయొక్క వాక్యముతో నిలిచియుండుటను బట్టి మనము ఆయనయొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉన్నామని మనకు చెప్పుచున్నాడు.
మనము ఏమి చేస్తున్నాము? ఏమియు చేయడంలేదు, కేవలం విశ్రాంతి పొందుచున్నాము! వేచియుంటున్నాము! ఇక ఎటువంటి శ్రమలు లేవు, ఎటువంటి నిస్పృహలు లేవు, మనము దానిపై విశ్రాంతి పొందుచున్నాము!
ఈ ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, దేవునియొక్క నిర్ధారించబడిన స్వరము ఈ వర్తమానమును అందించడాన్ని మేము వినుచుండగా, వచ్చి మాతో కలిసి విశ్రాంతి పొందండి:
61-0618 - "ప్రకటన గ్రంథము, ఐదవ అధ్యాయము భాగము II".
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్