ఆదివారం
25 జనవరి 2026
64-0823M
Questions And Answers #1
కూడిక ఇంత సమయంలో ప్రారంభమవుతుంది:
0
రోజులు
19
గంటలు
40
నిమిషములు
35
క్షణములు

Sun Apr 26, 2020 10:00 AM EDT

ప్రియమైన బ్రెన్హామ్ ఆలయమా,

బ్రెన్హామ్ ఆలయము అనేది, దేవునియొక్క స్వరము అనేది, క్రీస్తుయొక్క వధువు కొరకు భద్రపరచబడి మరియు దాచబడిన మన్నాతో తాము ఆత్మీయంగా పోషించబడే గృహ సంఘమైయున్నదని నమ్ముతూ ప్రపంచవ్యాప్తంగానున్న యేసుక్రీస్తు యొక్క వధువుకు శుభములు,

ఇదే నా ప్రధాన కేంద్రము; ఇదే నా ప్రధాన కార్యాలయము; ఇక్కడే మనం స్థాపించబడియున్నాము. ఇప్పుడు, ఏమి జరిగినా గాని దానిని మీ మనస్సులో ఉంచుకోండి. ఇప్పుడు, మీరు గనుక బుద్ధిగలవారైతే, మీరు దేనినో పట్టుకుంటారు. ఏమి జరిగినా గాని, ఇదే మన ప్రధాన కార్యాలయమైయున్నది, సరిగ్గా ఇదేయైయున్నది!

చాలామంది విశ్వాసులు ఇక్కడ ప్రవక్త చెప్పినదానిని ఎల్లప్పుడూ అపార్థం చేసుకున్నారు లేదా దానికి తమ స్వంత ఆలోచనను లేదా అనువాదమును పెట్టారు, కానీ ఆయన వధువుతో నేరుగా ఇట్లు చెప్పుచున్నాడు, “మీరు గనుక బుద్ధిగలవారైతే, మీరు దేనినో పట్టుకుంటారు, ఇదే మన ప్రధాన కేంద్రమైయున్నది, సరిగ్గా ఇదే!

దాని ద్వారా ఆయన చెప్పినది ఏమిటి?

సహోదరుడు బ్రెన్హామ్ గారు ఇక్కడ ఉన్నప్పుడు, అనేకులు ఆయనను అపార్థము చేసుకొని మరియు ఎత్తబడుటలో ఉండాలంటే వధువు ఆరిజోనాకు వెళ్ళి మరియు ఆయనను వెంబడించాలని అనుకున్నారు. సహోదరుడు బ్రెన్హామ్ గారు వారికి స్పష్టంగా సమాధానమిచ్చారు: ఇక్కడే ఉండండి, ఇదే ఆ స్థలము.

ఒక పెద్ద గుంపంతా అటుగా వెళ్ళిపోయారు, మరియు అక్కడే ఉండండి అని నేను వారితో చెప్పిన తర్వాత కూడా వారు ఇటు వెళ్ళి మరియు దానిని చేయగోరారు. అక్కడే ఉండండి, సరిగ్గా ఇక్కడే ఉండండి; ఇదే ఆ స్థలము.

అమెరికా సంయుక్త రాష్ట్రములన్నిటి నుండి ప్రజలు బయలుదేరి ఆరిజోనాకు వెళ్ళారు, కానీ ఆయన వారికి స్పష్టంగా ఇట్లు చెప్పాడు: సరిగ్గా ఇక్కడే ఉండండి, ఇదే ఆ స్థలము!

జఫర్సన్విల్ లోనే ఉండండి అనియా? ఆయన చెప్పింది అదేనా!

నా ప్రత్యక్షత ఏమిటంటే, అది దేవుడే, తన ప్రవక్తగుండా మాట్లాడుతూ మరియు, “టేపులతో నిలిచియుండండి,” అని ప్రజలకు చెప్పడమైయున్నది. అదియే ఆ స్థలము!

ఆయన ఎంతో విచారపడి మరియు ఆ ప్రజల విషయంలో తాను ఏదో ఒకటి చేయాల్సివచ్చిందని ఆయన చెప్పాడు. ఆయన ఏమి చేయాలి? ఆయన వారిని ఏ సంఘానికి పంపిస్తాడు? వారు ఎక్కడికి వెళ్ళాలి? సహోదరుడు బ్రెన్హామ్ గారు తాను ఏమి చేయవలసియున్నదని చెప్పారు?

కావున ఇప్పుడు, ఏదైనా తినడానికి నేను ఆ పిల్లలను తిరిగి ఇక్కడికి తీసుకురావలసియున్నది. వారు అక్కడ ఆ ఎడారిలో ఆకలితో అలమటిస్తున్నారు.

వారు ఒక స్థానిక సంఘానికి వెళ్ళి మరియు వారు పోషించబడటానికి వారికి దొరికే ఏవో చిన్న చిన్న ముక్కలను పొందుకోవాలని ఆయన చెప్పలేదు. ఏదైనా తినడానికి ఆయన వారిని తిరిగి ఇక్కడికి తీసుకురావాలని ఆయన చెప్పాడు, లేదా వారు ఆకలితో మరణిస్తారు.

స్నేహితులారా, నా ప్రత్యక్షత.

ఇప్పుడు, మరొకసారి ఆయనను అపార్థము చేసుకోడానికో, లేదా, “వధువైయ్యుండటానికి అందరూ జఫర్సన్విల్ కు తరలిరావాలని సహోదరుడు బ్రెన్హామ్ గారు కొరియున్నారు,” అని చెప్పడం ద్వారా ఆయన చెప్పని ఏదో ఒక విషయాన్ని చెప్పడానికో కాదు. ఆ ప్రజలందరూ, మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ విశ్వాసి, తరలి వచ్చి జఫర్సన్విల్ లో నివాసముండలేరని సహోదరుడు బ్రెన్హామ్ గారికి తెలుగు. అది అసాధ్యము. కావున ఆయన భావము ఏమిటి? వధువు పోషించబడటానికి రికార్డు చేయబడి మరియు భద్రపరచబడిన టేపుల చుట్టూ ఆయన క్రీస్తుయొక్క వధువును ఐక్యపరుస్తున్నాడు.

ఈ వర్తమానము, ఈ స్వరము, ఈ దినమునకైన దేవునియొక్క పలుకబడిన మాటాయైయున్నది మరియు అది యేసుక్రీస్తుయొక్క వధువును ఐక్యము చేసి మరియు పరిపూర్ణము చేస్తుంది.

శరీరము మీదనే పక్షిరాజులు పోషించబడతాయి. ఇప్పుడు, బైబిలు గ్రంథములో ఒక పక్షిరాజు, ఒక ప్రవక్తగా పరిగణించబడినది. ప్రవక్త ఒక పక్షిరాజైయున్నాడు. దేవుడు—దేవుడు తననుతాను ఒక పక్షురాజు అని పిలుచుకున్నాడు, మరియు అలాగైతే మనము, అనగా విశ్వాసులము “పక్షిరాజు పిల్లలమైయున్నాము”. మీరు చూశారా? మరియు వారు పోషించబడే ఆ శరీరము ఏమిటి? వాక్యమైయున్నది. వాక్యము ఎక్కడ ఉంటుందో, అక్కడ పక్షియొక్క అసలైన స్వభావము దానినదే తెలియజేసుకుంటుంది.

ఈ దినమునకై స్వచ్ఛమైన, నిర్ధారించబడిన, అపార్ధములు లేనట్టి, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయ్యున్న వాక్యము ఎక్కడున్నది? ఒకే ఒక్క స్థలమున్నది, అది టేపులే.

నేను కొటేషన్ వెంబడి కొటేషన్ ఇస్తూ, అలాగే కొనసాగవచ్చును, కానీ ఈ వర్తమానముకు మరియు సహోదరుడు బ్రెన్హామ్ గారు చెప్పినదానికి దేవునియొద్ద నుండి ప్రత్యక్షత అవసరం. మనము ప్రత్యక్షత ద్వారా ఆ పదముల వెనుక అర్థాన్ని గ్రహించాలి, అయితే ఆయన చెప్పినదానిని మాత్రమే చెప్పాలి. ఏలయనగా అది స్వచ్ఛమైన వాక్యమైయున్నది.

ఈ దినమునకు ప్రశ్నలు, మరియు జవాబులు మరియు నేను నమ్మేది.

గృహ టేపు సంఘమును కలిగియుండటం ద్వారా మనము వాక్యమునకు మరియు సహోదరుడు బ్రెన్హామ్ గారు ఏమి చేయమని చెప్పారో దానికి వెలుపల ఉన్నామని, ఈనాడు చాలామంది సేవకులు ప్రజలకు చెప్తున్నారు. వారు దేనిని సంఘమని అంటారో మరియు దేనిని సంఘముగా పరిగణిస్తారి మనము అక్కడికి వెళ్ళాలని వారు భావిస్తున్నారు.

సహోదరుడు బ్రెన్హామ్ గారు దీనిని చెప్తున్నట్టి కొటేషన్లు, నిజంగా చాలా చాలా ఉన్నాయి.

ఇప్పుడు, మీరు ఏదో ఒక మంచి సంపూర్ణ సువార్త సంఘానికి వెళ్ళి మరియు మీ కొరకు ఒక స్థిరసంఘాన్ని ఏర్పాటు చేసుకోండి.

మరియు ఆయన అట్లు చెప్పాడు గనుక, నేను దానిని నా హృదయమంతటితో నమ్ముతున్నాను. అయితే మనము దానిని గృహ టేపు సంఘమును కలిగియుండుట ద్వారా చేస్తున్నామని నేను నమ్ముతున్నాను. ప్రభువుకు ప్రాముఖ్యమైనది మన ప్రదేశము కాదు. అది కేవలం ఒక భవనమైయున్నది. అయితే ఒక ప్రదేశమో లేదా ఒక భవనమో కాదు కానీ ప్రభువు కొరకు మన విధి నిర్వహణ ఏమిటంటే ఆయన వాక్యముతో నిలిచియుండటమే. ప్రదేశము వధువును రక్షించదు మరియు పరిపూర్ణముగా చేయదు కానీ వాక్యము చేస్తుంది.

నేను ఒక సంఘ భవనము వద్దకు వెళ్తే, మరి వారు ముఖ్యమైన దానిని మరచిపోయినట్లైతే: అనగా ప్లే ను నొక్కి దేవుని స్వరమును వినడాన్ని మరచిపోయి, మరియు దాని స్థానములో కేవలం సేవకులు వర్తమానమును బోధించడాన్ని వినుటను మాత్రమే ఉంచినట్లైతే, అది మీ అంతరాత్మను పూర్తిగా తృప్తిపరచి పోషిస్తుందా? నా సహోదరుడా సహోదరీ, అది మీ అంతరాత్మను తృప్తిపరచవచ్చును, కానీ అది వధువును తృప్తిపరచదు.

సరిగ్గా ఇక్కడే ఆపి నన్ను దీనిని చెప్పనివ్వండి, వెళ్ళడానికి ఎటువంటి సంఘ భవనము లేని ప్రజలు వేలకొలదిగా ఉన్నారు. వారు తప్పిపోయినట్లేనా? వారికి ఒక సంఘకాపరి గాని లేదా ఒక సంఘము గాని లేకపోతే, దాని అర్థం వారు వధువు అయ్యుండలేరనా? మీరు ఒక సంఘ భవనమునకు 100 మైళ్ళ పరిధిలో ఉన్నట్లైతే, మీరు ఆ సంఘమునకే వెళ్ళాలా? కానీ నేను దూరంగా నివసిస్తున్నట్లైతే, నేను వెళ్ళనక్కర్లేదా? నేను ఒక సేవకుడు చెప్పేదాన్ని ఇంటర్నెట్ ప్రసారం ద్వారా వినాలి, కానీ నేను టేపులను ఇంటర్నెట్ ద్వారా వినకూడదా? మనము భౌతికమైన భవనముకు వెళ్ళడమే అత్యంత ప్రాముఖ్యమైన విషయమని ప్రవక్త చెప్తున్నాడా?

ప్రవక్త వధువును ఎక్కడికి తీసుకురావాలని కోరాడు?

మీరు ఇక్కడ ఆలయము వద్దకు రాలేనియెడల, ఎక్కడైనా ఒక సంఘమును చూసుకొని; అక్కడికి వెళ్ళండి.

మరొకసారి, ప్రజలను పంపడానికి ఆయన మొదట ఎన్నుకున్నది ఏమిటి? బ్రెన్హామ్ ఆలయమునకు, వాక్యమునొద్దకు, టేపుల వద్దకైయున్నది. ఈ అంత్యకాలములో ఆయనయొక్క వధువు చేయడానికి దేవుడు ఏర్పాటు చేసినది అదేయైయున్నది, మరియు మనము దానిని ప్రతి దినము మరియు ప్రతి ఆదివారము చేస్తున్నాము.

కావున నేను అపార్థం చేసుకోబడుటలేదు. వధువైయ్యుండటానికి మీరు బ్రెన్హామ్ ఆలయముతో కలిసి ఇంటర్నెట్ ద్వారా టేపులను వినాలని నేను చెప్పడంలేదు. మీరు సంఘానికి వెళ్ళకూడదని నేను చెప్పడంలేదు. సేవకులు చెప్పేదానిని మీరు వినకూడదని నేను చెప్పడంలేదు. మీరు దానిని నమ్ముచున్నట్లైతే, మీరు వాక్య వరుసలో లేనట్లే. టేపులలో ఉన్న దేవుని స్వరమును వినడమే మీరు వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరమని నేను చెప్తున్నాను, మరియు ప్రతి సంఘకాపరి ఆ స్వరమును, ఆ టేపులను, తమ సంఘములలో ప్లే చేయాలని నేను నమ్ముతాను. కానీ టేపులను ప్లే చేయకుండా ఉండటానికి దొరికిన ప్రతి సాకును వారు చెప్పారు. అదే మీ సంఘమైనట్లైతే, మీరు వాక్యం మీద పోషించబడటంలేదు.

ఇది జరుగకూడదనే ఆయన స్పష్టంగా కోరాడు మరియు ప్రజలు దానిని చేస్తూ ఉన్నారు.

మరియు మీరు సంఘానికి వెళ్ళండి; ఆదివారమున ఇంట్లో కూర్చోకండి, చేపలు పట్టడానికి, మరియు వేటాడటానికి, మరియు అటువంటివి చేయడానికి వెళ్ళకండి.

మనము అటువంటివి చేయడంలేదు. వధువును ఐక్యపరిచే ఒకేఒక్క విషయము చుట్టూ, అనగా ఈ వర్తమానము, ఈ స్వరము చుట్టూ మనము ఐక్యమవుతున్నాము.

మరొకసారి చెప్తున్నాను, సంఘానికి వెళ్ళడాన్ని నేను నమ్ముతాను. వారి పులిపిట్ల మీద టేపులను మొదట ఉంచుతున్న సంఘాలు ప్రపంచవ్యాప్తంగా అనేకములు ఉన్నాయి, దేవునికి స్తుతి కలుగును గాక. మీరు ఇంటి వద్దనే ఉండాలి లేదంటే మీరు వధువు కాదు అని నేను నమ్ముతానా? లేదు, లేదు, లేదు....నేను ఎన్నడూ అలా అనుకోలేదు, నేను ఎన్నడూ దానిని నమ్మలేదు. మీరు ఎక్కడున్నా గానీ లేదా మీరు ఏ సంఘానికి వెళ్ళినా గానీ మీరు ప్లే ను నొక్కాలని మాత్రమే నేను కోరుతున్నాను.

ఆయన చెప్తున్నవాటిని గూర్చిన ప్రత్యక్షత మీకు లేకపోతే, అప్పుడు మీరు స్పష్టంగా ఇట్లు చెప్పగలరు, “నేను బ్రెన్హామ్ సహోదరుడు చెప్పేది వినవలసిన అవసరంలేదు లేదా ఆయన చెప్పే ప్రతిదానితో ఏకీభవించాల్సిన అవసరంలేదు. దేవునిచేత పిలువబడిన ఇతర పురుషులు అనేకులు ఉన్నారు, అని కూడా ఆయన చెప్పాడు.”

అలాగే వెళ్ళండి. మనమిక్కడ గమనిస్తాము, ఇట్లడిగారు, “నీతో ఏకీభవించని వేరొక సంఘానికి మేము వెళ్ళాలా?” నిశ్చయంగా, నేను...సముద్రతీరాన్న ఉన్న నునుపు రాయి నేనొక్కడినే కాను, మీకు తెలుసు కదా. ఇతర దైవికమైన వ్యక్తులు అంతటా ఉన్నారు; వారిలో నేను ఒకడినని నేను ఆశపడుతున్నాను.

టేపులలో ఉన్న దేవుని స్వరమే నా నునుపు రాయి, నా బండ అయ్యున్నది. నేను వినే స్వరము అదే మరియు బ్రెన్హామ్ ఆలయము కూడా ఆ స్వరమును వినాలనే నేను కోరుతాను.

మీరు గనుక మాతో చేరాలనుకుంటే, నా సహోదరులారా మరియు సహోదరీలారా, మీకు హృదయ పూర్వకంగా స్వాగతం. దేవుని స్వరము మాట్లాడి మరియు బహుశా మీరు మీ హృదయములో కలిగియుండే ప్రశ్నలకు సమాధానమిచ్చుటను వినుచుండగా, ఆదివారము జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, వచ్చి మాతో చేరండి. మరియు ఈ లేఖలో నేను చెప్పిన సంగతులు వాక్యానుసారంగా లేవేమోనని మరియు దేవుడు తన వధువుకు ఏమి చెప్తున్నాడనేదానిని నేను తప్పుగా అర్థం చేసుకున్నానేమోనని స్వయంగా మీరే వినండి.

టేపులలో ఆయన చెప్పేది యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు అయ్యున్నది. ఆయన ఏమి చెప్తున్నాడని నేను చెప్తున్నది కాదు, లేదా ఆయన ఏమి చెప్తున్నాడని నేను నమ్ముచున్నది కాదు, మరియు దేవుడు మాత్రమే మీకు నిజమైన ప్రత్యక్షతను ఇవ్వగలడు.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్